నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. కాగా నవంబర్ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు లండన్ లోని కింగ్స్ కాలేజీలో నిర్వహించిన సెమినార్‌కు కవిత హాజరయ్యారు. పదవ తేదీ వరకు లండన్‌లో ఉన్న ఆమె అనంతరం స్కాట్లాండ్‌లో పర్యటించారు.