
జగన్‌కు ఘనస్వాగతం
ప్రకృతి విపత్తులు, దుర్ఘటనల బాధితులను పరామర్శించేందుకు విశాఖ జిల్లా నుంచి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
తుని :ప్రకృతి విపత్తులు, దుర్ఘటనల బాధితులను పరామర్శించేందుకు విశాఖ జిల్లా నుంచి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తునిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం 4.45 గంటలకు వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ తుని జాతీయరహదారి కొట్టం సెంటర్‌లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. 15 నిమిషాలకు పైగా వారితో ముచ్చటించారు.
జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, తాడి విజయభాస్కరరెడ్డి, సంగిశెట్టి అశోక్, గుండా వెంకటరమణ, కొల్లి నిర్మల కుమారి, మిండగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయిన వేణు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గిరజాల వెంకటస్వామినాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, తోట సుబ్బారావునాయుడు, బొంతు రాజేశ్వరరావు, గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, యువజన విభాగం కార్యదర్శులు గిరజాల వీర్రాజు, గుత్తుల నాగభూషణం, పెంకే వెంకట్రావు, సుంకర చిన్ని, ఎం.మురళీకృష్ణ, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి సిరిపురపు శ్రీనివాసరావు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.