లూసాన్ డైమండ్ లీగ్‌లో స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. నిన్న జరిగిన పోటీలో నీరజ్ తన చివరి అవకాశంలో బల్లాన్ని 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఇది ఈ సీజన్‌లో అతనికి అత్యుత్తమ ప్రదర్శన. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ తన బల్లాన్ని 89.45 మీటర్ల దూరం విసిరాడు. నిన్న జరిగిన పోటీలో నీరజ్ నాలుగో రౌండ్ వరకు నాలుగో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో 85.58 మీటర్లు విసరగలిగాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో సీజన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Feeling so bad for Neeraj Chopra 💔
90m will come for sure .
Neeraj was nowhere close to his best in 1st 5 throws gave his all in at 6th throw with SB of 89.49m !!
Common Neeraj 90m will come for sure !!#NeerajChopra #DiamondLeague #Javelin pic.twitter.com/Omuoapm3gK— Ram kapoor🇮🇳 (@Ram1947_) August 22, 2024
ఈ పోటీలో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) తన బల్లాన్ని 90.61 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. బల్లాన్ని 87.08 మీటర్ల దూరం విసిరిన జర్మనీ త్రోయర్ జూలియన్ వెబర్ మూడో స్థానంలో నిలిచాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం జరిగిన పోటీ నీరజ్ చోప్రా పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment