'టోక్యో ఒలింపిక్స్ పతకంపైనే గురి'
న్యూఢిల్లీ:2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా స్సష్టం చేశాడు. ఇటీవల జరిగిన అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్సిన నీరజ్.. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించడంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.
'నేను రియో ఒలింపిక్స్ కు ఎంపిక కాకపోవడం చాలా నిరాశకు గురి చేసింది. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోవడానికి నా వెన్నునొప్పి కూడా కారణం. ఇటీవల జరిగిన ట్రయల్స్‌లో ఒలింపిక్స్ అర్హత ప్రమాణామైన 80 మీటర్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రియోకు పంపడానికి ఫెడరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అది లభిస్తే సంతోషం. లేకపోతే 2020 ఒలింపిక్సే లక్ష్యంగా ఇప్పట్నుంచీ సాధన చేస్తా'అని నీరజ్ తెలిపాడు.
ఇటీవల పొలాండ్ లో జరిగిన అండర్-20 పోటీలో నీరజ్ 86.48 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 84.69 మీటర్లతో జిగిస్‌ముండ్స్ సిర్మాయిస్ (లాత్వియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును నీరజ్ బద్దలు కొట్టాడు. సీనియర్ లేదా జూనియర్ విభాగంలో ఓ భారత అథ్లెట్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.