సాక్షి, అమరావతి: టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. '' పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు సుమిత్‌కు శుభాకాంక్షలు. నీ స్వర్ణంతో దేశానికి ఒకేరోజు రెండు బంగారు పతకాలు రావడం ఆనందం కలిగించింది. జావెలిన్ త్రోలో మూడు ప్రయత్నాల్లోనూ అద్బుత ప్రదర్శన చేసి కొత్త రికార్డు సృష్టించావు. నీ కెరీర్ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Congratulations Sumit Antil for adding another #Gold medal to India's count at #TokyoParalympics and setting a new world record for each of the three attempts in the same event.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021
@ParalympicIndia
ఇక టోక్యో పారాలింపిక్స్‌లో మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు.
చదవండి: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
పారాలింపిక్స్ పతక విజేతలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు
టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత పారాఅథ్లెట్లను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖారా, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా జావెలిన్ త్రోలో రెండవ స్వర్ణ పతకం సాధించినందుకు సుమిత్ ఆంటిల్, హైజంప్‌లో వెండి పతకం సాధించిన నిషద్ కుమార్, పురుషుల డిస్కస్ త్రోలో వెండి పతకం సాధించిన యోగేష్ కథునియా, జావెలిన్ త్రో లో రజత పతకం సాధించిన దేవేంద్ర జారియా, కాంస్య పతకం పొందిన సుందర్ సింగ్ గుర్జార్లకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment