ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో రజతం సాధించిన కిషోర్ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్, కిషోర్ ఇద్దరు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
కాగా, జావెలిన్ త్రోలో రెండు పతకాలతో (గోల్డ్, సిల్వర్) భారత్ పతకాల సంఖ్య 80కి (17 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 312 పతకాలతో (168 గోల్డ్, 93 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 144 మెడల్స్‌తో (36, 51, 57) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 145 పతకాలతో (33, 44, 68) మూడో స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment