
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పోటీ పడుతున్న క్రీడాంశాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు సాధించింది. అందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగం నుంచి రెండు రజతాలు.. బాడ్మింటన్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో కాంస్యాలు లభించాయి. కాగా ఒలింపిక్స్ రేపు మనకు ఆఖరిరోజు అయినా పతకాల ఆశలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా జావెలిన్ త్రోపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్లో కచ్చితంగా మెడల్ గెలుస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం తలపడనున్నాడు. అలాగే గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు రేపుతుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్
►జావెలిన్ త్రో ఫైనల్- నీరజ్ చోప్రా
►రెజ్లింగ్‌లో కాంస్య పతక పోరు- భజరంగ్ పునియా
►గోల్ఫ్ పతకం రేసులో భారత క్రీడాకారిణి అదితి అశోక్.. వాతావరణం అనుకూలించక గోల్ఫ్ ఆట రద్దయితే.. రెండోస్థానంలో ఉన్న అదితికి రజతం దక్కే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment