కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జాతరను కొనసాగిస్తుంది. ఇప్పటికే భారత్ ఖాతాలో 46 పతకాలు ఉండగా.. తాజాగా మరో మెడల్ వచ్చి చేరింది. ప్రస్తుత క్రీడల్లో జావెలిన్ త్రోలో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల కేటగిరీలో అన్నూ రాణి జావెలిన్‌ను 60.03 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం గెలిచింది. కామన్‌వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా, ఓవరాల్‌గా (మహిళలు, పురుషులు) మూడవది. అన్నూ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య 47కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది.
ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్ క్రీడల పదో రోజు భారత్ పతకాల సంఖ్య ఏడుకు (3 స్వర్ణాలు, రజతం, 3 కాంస్యాలు) చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీ, పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్, మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాలు గెలిచారు.
చదవండి: అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్ వాక్‌లో మరో పతకం
Comments
Please login to add a commentAdd a comment