దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్ 42–64 కేటగిరీ) అంశంలో భారత క్రీడాకారులు సందీప్ చౌదరీ, సుమీత్ అంటిల్ (62.88 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత పొందారు. సందీప్ జావెలిన్‌ను 66.18 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
గత జూన్‌లో 65.80 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సందీప్ బద్దలు కొట్టాడు. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52 విభాగం)లో వినోద్ కుమార్ ఇనుప గుండును 19.29 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్–4లో నిలువడం ద్వారా వినోద్ టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment