రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
రియో డి జెనీరో: పారాలింపిక్స్-2016లో మరో భారత అథ్లెట్ మంగళవారం పసిడి సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా.. అంతకుముందు తన పేరిట ఉన్నప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి.. 62.15 మీటర్ల గత రికార్డును తిరగరాశాడు. 2004 అథెన్స్ పారాలింపిక్స్ లో దేవేంద్ర ఈ ఘనతను సాధించాడు.
రియో పారాలింపిక్స్ లో దేవేంద్ర పసిడి గెలవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈవెంట్స్ ముందురోజు దేవేంద్రతో మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వర్ణం గెలుస్తావని చెప్పానని, అలాగే జరిగిందని ఆయన భార్య మంజు మీడియాకు తెలిపారు. పారాలింపిక్స్ లో రెండుసార్లు పసిడి గెలిచిన తొలి భారతీయుడిగా దేవేంద్రకు గుర్తింపు లభించడం ఆనందాన్ని మరింత రెట్టింపు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
పారాలింపిక్స్-2016లో ఇప్పటివరకూ పురుషుల హై జంప్ లో తంగవేలు మరియప్పన్, మహిళల షాట్ పుట్ లో దీపా మాలిక్ లు పసిడి, వెండి పతకాలను సాధించిన విషయం తెలిసిందే.
Devendra Jhajharia is now the only player in our @Paralympics/@Olympics history to have two individual #GOLD medals. pic.twitter.com/IyvoiMFzf7
— PCCAI (@pccai_in) September 13, 2016