devendra jhajharia
-
‘25 పతకాలు పక్కా’
న్యూఢిల్లీ: పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడడం పారిస్ పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపదని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 25 పతకాలు సాధించగలదని ఝఝారియా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, యాంటీ డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గత ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత ప్రమోద్‌పై బీడబ్ల్యూఎఫ్ 18 నెలల నిషేధం విధించింది. ‘పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారి జాబితాలో ప్రమోద్ భగత్ పేరు ముందుండాల్సింది. కానీ అతడిపై నిషేధం పడింది. అయినా విశ్వ క్రీడల్లో మన అథ్లెట్లు 25 పతకాలు సాధించగలరు. పారాలింపిక్స్ చరిత్రలోనే ఈసారి భారత్ నుంచి అత్యధిక మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్లు 19 పతకాలు సాధించారు. ఇప్పుడు ఆ మార్క్ దాటడంతో పాటు.. పతకాల జాబితాలో టాప్–20లో నిలుస్తాం’ అని ఝఝారియా అన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు జరగనున్న ‘పారిస్’ పారా క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఇప్పటికే భారత అథ్లెట్ల బృందం క్రీడా గ్రామంలో అడుగుపెట్టింది. -
పార్లమెంట్ ఎన్నికల బరిలో దేవేంద్ర ఝఝరియా
న్యూఢిల్లీ: క్రీడారంగంలో సత్తా చాటి రాజకీయ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఆటగాళ్ల జాబితాలో మరొకరు చేరారు. అయితే ఈ సారి దీనికి మరింత ‘ప్రత్యేకత’ ఉండటం విశేషం. పారాలింపిక్స్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝరియా బీజేపీ పార్టీ తరఫున రాజస్తాన్‌లోని ‘చురూ’ నియోజకవర్గంనుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. పారాలింపిక్స్‌లో 2 స్వర్ణాలు సాధించిన తొలి అథ్లెట్‌గా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. 2004 ఏథెన్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు గెలిచిన 42 ఏళ్ల దేవేంద్ర 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్నాడు. ‘చురూ’లోనే పుట్టిన అతను ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కే క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో ఎడమ మోచేయి భాగం వరకు పోగొట్టుకున్నాడు. భారత ప్రభుత్వ క్రీడా పురస్కారాలు అర్జున్, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా ఝఝరియా అందుకున్నాడు. -
దేవేంద్ర ఝఝరియాకు పద్మభూషణ్.. నీరజ్ చోప్రాకు పద్మశ్రీ
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించగా.. క్రీడారంగంలో 9 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పారాఒలింపిక్ అథ్లెట్ దేవేంద్ర జజేరియా భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను పద్మశ్రీ వరిచింది. మిగతావారిలో సుమిత్ అంటిల్(పారాఅథ్లెట్), ప్రమోద్ భగత్(షూటింగ్), శంకర్‌నారాయణ్ మీనన్, ఫసల్అలీ దార్, వందన కటారియా(హాకీ), అవనీ లేఖరా(షూటింగ్), బ్రహ్మానంద్ సంక్వాల్కర్లను కూడా పద్మశ్రీ వరించింది. దేవేంద్ర ఝఝరియా: దేవేంద్ర ఝఝారియా ..2004 పారాలింపిక్స్‌లో స్వర్ణం...2021లో రజతం... ఈ రెండింటి మధ్య 2016లో మరో ఒలింపిక్ స్వర్ణం... ఇది అతని గెలుపు ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొనని ఒలింపిక్స్‌కు: సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది.అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. నీరజ్ చోప్రా: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
అదరహో... దేవేంద్ర, సుందర్
పారాలింపిక్స్ జావెలిన్ త్రోలోనే భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్ జావెలిన్ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్ సింగ్ గుర్జర్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్ సింగ్ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో, 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు. వినోద్‌కు నిరాశ మరోవైపు ఆదివారం పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. యోగేశ్ అద్భుతం... పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–56 విభాగంలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్ డిస్క్‌ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో భారత షూటర్ స్వరూప్ ఉన్హాల్కర్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన స్వరూప్ 203.9 పాయింట్లు స్కోరు చేశా>డు. -
అసాధారణం... దేవేంద్ర ప్రస్థానం
దేవేంద్ర ఝఝారియా గెలుపు ప్రస్థానమిది. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. ‘మా నాన్న చేసిన త్యాగాలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. కొద్ది రోజుల క్రితం ఒలింపిక్స్ కోసం నా శిక్షణ సాగుతున్న సమయంలోనే క్యాన్సర్‌తో ఆయన మరణించారు. ఈ పతకం నాన్నకు అంకితం.’ – దేవేంద్ర -
సర్దార్, దేవేంద్రలకు ‘ఖేల్‌రత్న’
- ముగ్గురికి ధ్యాన్‌చంద్, ఏడుగురికి ద్రోణాచార్య, 17 మందికి అర్జున పురస్కారాలు - అవార్డీలకు వైఎస్ జగన్ అభినందనలు న్యూఢిల్లీ:భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియాకు భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ దక్కింది. రియో పారా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా రెండు స్వర్ణాలు గెలుపొంది సత్తా చాటాడు. దాంతో ఖేల్ రత్న అవార్డుల సిఫారుసులో దేవెంద్ర తొలి ప్రాధాన్యత దక్కించుకున్నాడు. అయితే 25 ఏళ్ల చరిత్ర ఉన్న ఖేల్ రత్న అవార్డును ఓ పారాలింపియన్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు దశాబ్ద కాలానికిపైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ కూడా ఖేల్ రత్న దక్కింది. ఈ మేరకు 2017 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం క్రీడా పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాలు పొందిన క్రీడాకారులందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇందులో క్రీడాపురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దాదాపు ఆమోదం తెలిపింది. దాంతో అర్జున అవార్డుకు సిఫారుసు చేసిన 17 మందికి ఆ అవార్డు లభించింది. అయితే ద్రోణాచార్య నామినీ నుంచి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న పారా స్పోర్ట్స్ కోచ్ సత్యనారాయణను తప్పించారు. రియో పారాలింపిక్స్ చాంపియన్, హైజంపర్ మరియప్పన్ తంగవేలు కోచ్ అయిన సత్యనారాయణ (కర్ణాటక) క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. దాంతో అతని పేరును తొలుత నామినేట్ చేసిన తరువాత తొలగించారు.దాంతో ఏడుగురికి మాత్రమే ద్రోణాచార్య దక్కింది. ఈ అవార్డులతో పాటు ధ్యాన్ చంద్ అవార్డు కోసం అథ్లెట్ భూపేందర్ సింగ్, సయ్యద్ షాహిద్ హకీం (ఫుట్‌బాల్), సుమరాయ్ టకే (హాకీ ) ఎంపికయ్యారు. ఈనెల 29న రాష్ట్రపతి భవన్లో వీరంతా అవార్డులు అందుకోనున్నారు. అర్జున అవార్డీలు: జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్ రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డీలు: డా.ఆర్ గాంధీ(అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా(కబడ్డీ), జీఎస్వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోషన్ లాల్(రెజ్లింగ్),రాఫెల్,(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్) ధ్యాన్‌చంద్ అవార్డీలు: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్),సయ్యద్ షాహీద్ హకీం (ఫుట్ బాల్),సుమరాయ్ టకే(హాకీ) -
‘ఖేల్‌రత్న’మైన పారా అథ్లెట్
►జఝరియాకు అత్యున్నత క్రీడాపురస్కారం ►సురేఖ, సాకేత్‌లకు ‘అర్జున’ ►జాబితాలో పుజారా, హర్మన్‌ప్రీత్ ► సిఫార్సు చేసిన అవార్డు కమిటీ ఎట్టకేలకు ఓ పారా అథ్లెట్ అత్యున్నత క్రీడాపురస్కారానికి నామినేట్ అయ్యాడు. పాతికేళ్ల చరిత్ర వున్న ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డుకు పారాలింపిక్స్ చాంపియన్, జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా అర్హత సంపాదించాడు. 13 ఏళ్ల క్రితమే ఏథెన్స్ ఒలింపిక్స్‌లో... గతేడాది రియోలో అతను భారత్‌కు పసిడి కాంతులు తెచ్చాడు. దశాబ్ద కాలానికిపైగా భారత హాకీకి సేవలందిస్తున్న సర్దార్ సింగ్ కూడా ‘ఖేల్‌రత్న’కు ఎంపికయ్యాడు. న్యూఢిల్లీ: భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్‌రత్న కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు గెలుపొందాడు. దీంతో రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్రత్నలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు. 36 ఏళ్ల దేవేంద్ర జఝరియా ఏథెన్స్ (2004), రియో (2016) పారాలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ఈ రెండు సార్లు అతను కొత్త రికార్డులు నెలకొల్పడం మరో విశేషం. ఇన్నేళ్ల తర్వాతైన తను పడిన కష్టానికి తగిన మూల్యం దక్కుతున్నందుకు అతను హర్షం వ్యక్తం చేశాడు. క్రీడల్లో తనది సుదీర్ఘ ప్రయాణమని, ఇలాంటి పురస్కారంతో ప్రభుత్వం గుర్తించడం చాలా గర్వంగా ఉందన్నాడు. 31 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్ ఓ ఆటగాడిగా, మాజీ సారథిగా భారత హాకీకి విశేష సేవలందించాడు. ఆసియా గేమ్స్‌లో జట్టుకు రెండు పతకాలు సాధించిపెట్టాడు. 2010 గ్వాంగ్జౌలో కాంస్యం, 2014 ఇంచియాన్‌లో భారత్ స్వర్ణం గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజతాలు గెలిచిన భారత జట్టు సభ్యుడు కూడా. దీంతో 2015లో అతనికి ‘పద్మశ్రీ’ పౌర పురస్కారం లభించింది. సర్దార్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల అరోపణలను అవార్డు కమిటీ చర్చించింది. అయితే సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనవిజయాలు అందించిన అతన్ని ఈ ఒక్క కారణంతో అవార్డుకు దూరం పెట్టలేమని భావించింది. అర్జునకు నామినేట్ అయిన 29 ఏళ్ల పుజారా టెస్టుల్లో ‘ది వాల్’ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. ప్రస్తుతం లంకలో 50వ టెస్టు ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్ గత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కొంత కాలంగా భారత మహిళల క్రికెట్ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్మన్, ఇటీవల ప్రపంచకప్‌లో కూడా సత్తా చాటింది. మరో ఇద్దరు పారా అథ్లెట్లు మరియప్పన్ తంగవేలు (హైజంప్), వరుణ్ భటి (హైజంప్) అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఆశ్చర్యకరంగా సత్యవర్త్ కడియన్‌ను అర్జున కోసం నామినేట్ చేయడం క్రీడావర్గాలను విస్మయపరిచింది. ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మలిక్ భర్త అయిన సత్యవర్త్ కెరీర్లో 2014 కామన్వెల్త్ క్రీడల్లో రజతం మినహా చెప్పుకోదగ్గ ఘనతలేవీ లేవు. ⇒‘నిజానికి నేను ఈ అవార్డును 12 ఏళ్ల క్రితం అందుకోవాల్సింది. ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన నాకు ఈ అవార్డు అప్పుడే ఎందుకు రాలేదో ఇప్పటికీ అర్థం కాలేదు. ఏదేమైనా మొత్తానికి నా కష్టాన్ని గుర్తించారు. అత్యున్నత క్రీడాపురస్కారం కోసం నన్ను ఎంపిక చేసిన కమిటీకి, క్రీడాశాఖకు థ్యాంక్స్’ – దేవేంద్ర జఝరియా ⇒టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్న సాకేత్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సానియాతో కలిసి బంగారు పతకం, పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో కలిసి రన్నరప్‌గా నిలిచి రజతం నెగ్గాడు. భారత డేవిస్ కప్ జట్టుకు రెగ్యులర్ ఆటగాడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ⇒ ‘గత 15–20 ఏళ్లుగా హాకీనే ప్రాణంగా భావిస్తున్న నాకు ఇన్నాళ్లకు అత్యున్నత పురస్కారం దక్కనుండటం చాలా ఆనందంగా ఉంది. నా జట్టు సహచరుల వల్లే నాకు ఈ గౌరవం దక్కింది. ఈ క్రెడిట్ అంతా వాళ్లదే. వాళ్లే లేకుంటే నేనింతగా ఎదిగే వాణ్నే కాదు’ – సర్దార్ సింగ్ జ్యోతి సురేఖ అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో అద్భుతంగా రాణిస్తోంది. గతేడాది ఆసియా కప్ స్టేజ్–2 (తైపీ) టోర్నీలో టీమ్ ఈవెంట్లో స్వర్ణం, రజతం గెలిచింది. స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో వ్యక్తిగత రజతం, టీమ్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గింది. గత నెల ప్రపంచకప్ స్టేజ్–1 (చైనా), స్టేజ్–2 (అంటా ల్యా)లో నాలుగో స్థానంలో నిలిచింది. అర్జున అవార్డు నామినీల జాబితా జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, అరోకిన్ రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్‌సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ (షూటింగ్), అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). -
అ 'ద్వితీయం'
జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డుతోపాటు అగ్రస్థానం ఒలింపిక్స్ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి భారతీయుడిగా గుర్తింపు ‘రియో’లో భారత జాతీయ గీతం మళ్లీ వినిపించింది. మువ్వన్నెల పతాకం పైపైకి ఎగిరింది. మూడు వారాల క్రితం రియోలోనే ముగిసిన ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో పసిడి పతకం లేని లోటును తీర్చుతూ... అదే వేదికపై జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం లభించింది. ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్లో 35 ఏళ్ల దేవేంద్ర జజరియా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకై క భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. 2004 ఏథెన్‌స ఒలింపిక్స్‌లోనూ దేవేంద్ర ఇదే ఈవెంట్లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత అదే ఫలితాన్ని పునరావృతం చేసి ఔరా అనిపించాడు. రియో డి జనీరో: భారత క్రీడాభిమానులకు రియో నుంచి మరో ‘బంగారం’లాంటి శుభవార్త అందింది. పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్లో భారత అథ్లెట్ దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల దేవేంద్ర ఈటెను 63.97 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. దాంతో రియో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. పురుషుల హైజంప్‌లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం, వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గగా... మహిళల షాట్‌పుట్‌లో దీపా మలిక్ రజత పతకాన్ని గెల్చుకున్న సంగతి విదితమే. 12 ఏళ్ల క్రితం 2004 ఏథెన్‌స ఒలింపిక్స్‌లో దేవేంద్ర 62.15 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని సాధించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేవేంద్ర ఈవెంట్ లేకపోవడంతో అతను పాల్గొనలేకపోయాడు. రియోలో మళ్లీ అతని ఈవెంట్‌ను చేర్చడంతో దేవేంద్ర రెండోసారీ బంగారు పతకాన్ని నెగ్గి అద్వితీయ ఘట్టాన్ని లిఖించాడు. మొత్తం 13 మంది పాల్గొన్న ఫైనల్స్‌లో అందరికీ ఆరుసార్లు ఈటెను విసిరే అవకాశం లభించింది. భారత్ నుంచి దేవేంద్రతోపాటు రింకూ హుడా, సుందర్‌సింగ్ గుర్జర్ పాల్గొన్నారు. రింకూ హుడాకు (54.39 మీటర్లు) ఐదో స్థానం లభించగా... సుందర్ సింగ్ మాత్రం వైదొలిగాడు. చున్లియాంగ్ గువో (చైనా-59.93 మీటర్లు) రజతం గెలుపొందగా... ముదియన్సెల్ హెరాత్ (శ్రీలంక-58.23 మీటర్లు) కాంస్యం సాధించాడు. దేవేంద్ర తొలి ప్రయత్నంలో ఈటెను 57.25 మీటర్లు, రెండో ప్రయత్నంలో 60.70 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మూడు ప్రయత్నాల్లో అతను వరుసగా 57.35 మీ., 59.99 మీ., 61.61 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఆరింటిలో అత్యధిక దూరమైన 63.97 మీటర్లకు దేవేంద్రకు పసిడి పతకం ఖాయమైంది. 2013 అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్‌సలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ దేవేంద్రకు స్వర్ణం లభించడం విశేషం. ఓవరాల్‌గా పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు లభించిన పసిడి పతకాలు. దేవేంద్ర రెండు స్వర్ణాలు సాధించగా... మురళీకాంత్ పేట్కర్ (1972 హిడెల్‌బర్గ్-స్విమ్మింగ్), తంగవేలు మరియప్పన్ (2016 రియో-అథ్లెటిక్స్) ఒక్కో బంగారు పతకాన్ని గెలిచారు. మొత్తంగా ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు 12 పతకాలు లభించారుు. ఇందులో నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. ఒకే పారాలింపిక్స్‌లో అత్యధికంగా నాలుగు పతకాలు నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 1984 స్టోక్ మాండివిలి-న్యూయార్క్క్రీడల్లోనూ భారత్‌కు నాలుగు పతకాలు వచ్చారుు. ‘సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. 12 ఏళ్ల తర్వాత మళ్లీ నా రికార్డును నేనే బ్రేక్ చేసుకోవడం గర్వంగా ఉంది. ఫిన్లాండ్లో రోజుకు ఏడు గంటల పాటు శిక్షణలో పాల్గొన్నాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. పారాలింపిక్స్ గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఈసారి భారత్‌కు వచ్చిన పతకాల తర్వాత ఈ క్రీడలకు కూడా ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నాను. భవిష్యత్ గురించి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవు. కానీ నా అనుభవాన్ని దేశంలోని చిన్నారులకు అందిస్తాను.’ - దేవేంద్ర దేవేంద్ర జజరియాపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని దగ్గరి నుంచి సాధారణ పౌరుడి దాకా పలువురు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పారాలింపిక్స్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన దేవేంద్రకు అభినందనలు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం’ - ప్రధాని నరేంద్ర మోదీ ‘జజరియా యావత్ జాతి గర్వించే విజయాన్నిచ్చాడు. భారత్‌కు చిరస్మరణీయ పతకాన్ని అందించాడు’ - కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ‘దేవేంద్ర అంకితభావం అద్భుతం. అసాధారణ ప్రదర్శనతో పసిడి పతకం నెగ్గాడు. దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు’ - కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ -
కూతురు చెప్పిందని.. గోల్డ్ కొట్టాడు!
పారాలింపిక్స్‌లో భారతదేశానికి రెండో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తన ఆరేళ్ల కూతురితో చేసుకున్న చిన్న డీల్ వల్లే తాను తొలిసారి స్వర్ణ పతకం సాధించిన 12 ఏళ్ల తర్వాత మళ్లీ స్వర్ణం సాధించగలిగానన్నాడు. రాజస్థాన్‌లో ఝఝారియా శిక్షణకు వెళ్లేటప్పుడు అతడితో పాటు ఆరేళ్ల కూతురు జియా కూడా వెళ్లేది. ఆమె ఎల్కేజీ పరీక్షలలో క్లాస్ టాపర్‌గా నిలిచింది. ఆ విషయం తన తండ్రికి చెప్పింది. ''నేను క్లాసులో టాపర్‌గా వచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా టాపర్ అవ్వాలి'' అని ఆమె చెప్పిందట. ఒలింపిక్ స్టేడియంలోకి ప్రవేశించగానే తన చెవుల్లో ఆ మాటలే పదే పదే వినిపించాయని.. ఆమెను నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతోనే తాను పూర్తిస్థాయిలో కష్టపడి రికార్డుతో పాటు బంగారు పతకం సాధించానని ఝఝారియా అన్నాడు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషించేది తన కూతురే అవుతుందని, ఆమె ఎప్పుడు నిద్రలేస్తుందా.. ఎప్పుడు మాట్లాడతానా అని ఉత్సుకతతో ఉన్నానని తెలిపాడు. 2004లో ఏథెన్స్లో తాను నెలకొల్పిన సొంత రికార్డును అతడు రియోలో బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. బంగారు పతకం సాధించిన తర్వాత దేవేంద్ర రాత్రంతా మేలుకునే ఉండి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో తెల్లవారుజామున 5 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. 'ఇక నిద్రపోవడం ఎందుకు.. ఇప్పుడు నాకు ఏమీ కాదు. నేను జాతీయ పతాకంతో సంబరాలు చేసుకుంటా' అని అన్నాడు. తనకు మద్దతిచ్చినందుకు భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. -
రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
-
రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
రియో డి జెనీరో: పారాలింపిక్స్-2016లో మరో భారత అథ్లెట్ మంగళవారం పసిడి సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా.. అంతకుముందు తన పేరిట ఉన్నప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి.. 62.15 మీటర్ల గత రికార్డును తిరగరాశాడు. 2004 అథెన్స్ పారాలింపిక్స్ లో దేవేంద్ర ఈ ఘనతను సాధించాడు. రియో పారాలింపిక్స్ లో దేవేంద్ర పసిడి గెలవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈవెంట్స్ ముందురోజు దేవేంద్రతో మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వర్ణం గెలుస్తావని చెప్పానని, అలాగే జరిగిందని ఆయన భార్య మంజు మీడియాకు తెలిపారు. పారాలింపిక్స్ లో రెండుసార్లు పసిడి గెలిచిన తొలి భారతీయుడిగా దేవేంద్రకు గుర్తింపు లభించడం ఆనందాన్ని మరింత రెట్టింపు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పారాలింపిక్స్-2016లో ఇప్పటివరకూ పురుషుల హై జంప్ లో తంగవేలు మరియప్పన్, మహిళల షాట్ పుట్ లో దీపా మాలిక్ లు పసిడి, వెండి పతకాలను సాధించిన విషయం తెలిసిందే. Devendra Jhajharia is now the only player in our @Paralympics/@Olympics history to have two individual #GOLD medals. pic.twitter.com/IyvoiMFzf7 — PCCAI (@pccai_in) September 13, 2016