భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఝఝారియా
న్యూఢిల్లీ: పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడడం పారిస్ పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపదని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 25 పతకాలు సాధించగలదని ఝఝారియా ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, యాంటీ డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గత ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత ప్రమోద్‌పై బీడబ్ల్యూఎఫ్ 18 నెలల నిషేధం విధించింది. ‘పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారి జాబితాలో ప్రమోద్ భగత్ పేరు ముందుండాల్సింది. కానీ అతడిపై నిషేధం పడింది. అయినా విశ్వ క్రీడల్లో మన అథ్లెట్లు 25 పతకాలు సాధించగలరు. పారాలింపిక్స్ చరిత్రలోనే ఈసారి భారత్ నుంచి అత్యధిక మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
2020 టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్లు 19 పతకాలు సాధించారు. ఇప్పుడు ఆ మార్క్ దాటడంతో పాటు.. పతకాల జాబితాలో టాప్–20లో నిలుస్తాం’ అని ఝఝారియా అన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు జరగనున్న ‘పారిస్’ పారా క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఇప్పటికే భారత అథ్లెట్ల బృందం క్రీడా గ్రామంలో అడుగుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment