Paralympics
-
చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
గతేడాదిలో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని చిరంజీవి అభినందించారు. ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.'ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ప్లేయర్‌ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా క్రీడాకారులకు చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్స్పిరేషన్తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను.' అని ఆయన అన్నారు.దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు రూ. కోటి2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆమె విజయంలో పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆపై దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.కూతురి కోసం పొలం అమ్మేసిన తండ్రిజీవాంజీ దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మిల శ్రమ ఆమె విజయంలో ఎక్కువగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో చాలా ఇబ్బందులు పడింది. మేధోపరమైన బలహీనత ఉండడంతో ఆమె కోసం తండ్రి యాదగిరి చాలా తల్లడిల్లిపోయారు. చిన్నతనంలో కూతురుకు ఫిట్స్ వస్తే వారు విలవిలలాడిపోయేవారు. అయితే, దీప్తి క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేది. దీంతో ఆమె సంతోషం కోసం ఆ తండ్రి డబ్బులకు వెనకాడలేదు. తనకున్న ఎకరం పొలాన్ని కూతురి కోసం అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించింది. -
పారాలింపిక్స్ పతక విజేతలకు సన్మానం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రోత్సాహకాల్ని అందించింది. స్వర్ణ పతక విజేతకు రూ. 75 లక్షలు... రజత పతకం నెగ్గిన వారికి రూ. 50 లక్షలు... కాంస్య పతకం గెలిచిన వారికి రూ. 30 లక్షలు నజరానా ఇచ్చినట్లు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ 2028 పారాలింపిక్స్ లక్ష్యంగా అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘పారాలింపిక్స్‌లో భారత్ దూసుకెళుతోంది. రియో (2016)లో 4 పతకాలు, టోక్యో (2020)లో 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు పారిస్‌లో అత్యధికంగా 29 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అథ్లెట్లకు అధునాతన సదుపాయాలు, కిట్లు అందజేస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు 29 పతకాలు నెగ్గారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలున్నాయి. -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
ప్యారిస్ వీధుల్లో పతక సంబరం!
ప్యారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత హై జంపర్ నిషాద్ కుమార్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ విశ్వక్రీడల్లో నిషాద్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్స్‌లో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానంలో నిలిచి.. రెండో పారాలింపిక్స్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.నిషాద్ సూపర్ డ్యాన్స్..ఇక పారాలింపిక్స్ ముగిసిన తర్వాత నిషాద్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. ప్యారిస్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నిషాద్ అద్బుతంగా డ్యాన్స్ చేస్తూ.. తన మెడల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిషాద్ తన ఆరేళ్ల వయస్సులోనే ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోయాడు. అయినప్పటకి తన పట్టుదలతో విశ్వవేదికపై సత్తాచాటుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సైతం అతడు సిల్వర్ మెడల్ సాధించాడు. Paralympics Silver Medalist Nishad Kumar amazing dance moves at Paris 🕺🗼Nishad is totally enjoying it 🤩pic.twitter.com/EkND79OoBk— The Khel India (@TheKhelIndia) September 9, 2024 -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
ప్రవీణ్ ‘పసిడి’ వెలుగులు
టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు ఐదు స్వర్ణాలు సాధించారు. ఇప్పుడు దానిని మన బృందం అధిగమించింది. 21 ఏళ్ల భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి ఆరో పసిడి పతకాన్ని అందించాడు. హైజంప్‌లో అతను ఈ మెడల్‌ను గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత్‌కు స్వర్ణానందం దక్కగా.. ఇతర ఈవెంట్లలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకంతో సత్తా చాటిన భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ ఈ సారి మరింత బలంగా పైకి లేచాడు. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ – టి64 ఈవెంట్లో ప్రవీణ్‌కు స్వర్ణపతకం దక్కింది. 2.08 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఆసియా రికార్డుతో అతను పసిడిని గెలుచుకున్నాడు. అమెరికాకు చెందిన డెరెక్ లాసిడెంట్ (2.06 మీ.) రజతం గెలుచుకోగా, తెమూర్బెక్ గియాజోవ్ (ఉజ్బెకిస్తాన్ – 2.03 మీ.)కు కాంస్యం దక్కింది. ముందుగా 1.89 మీటర్ల ఎత్తుతో మొదలు పెట్టిన ప్రవీణ్ తన ఏడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. పారిస్ పారాలింపిక్స్‌లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు తర్వాత భారత్ తరఫున హైజంప్‌లో పతకం సాధించిన మూడో అథ్లెట్‌గా ప్రవీణ్ నిలిచాడు. కస్తూరికి ఎనిమిదో స్థానం... మహిళల పవర్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో భారత ప్లేయర్ కస్తూరి రాజమణికి నిరాశ ఎదురైంది. మూడు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ కాగా, అత్యుత్తమంగా 106 కిలోల బరువు మాత్రమే ఎత్తిన కస్తూరి ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల కనోయింగ్ ‘వా’ సింగిల్ 200 మీ. హీట్స్‌లో రాణించిన ప్రాచీ యాదవ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. కనోయింగ్ ‘కయాక్’ సింగిల్ 200 మీ. కూడా భారత ప్లేయర్ పూజ ఓఝా సెమీస్‌కు చేరింది. పురుషుల ‘కయాక్’ సింగిల్ 200 మీ.లో యష్ కుమార్ కూడా సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్ 54 కేటగిరీలో భారత అథ్లెట్ దీపేశ్ కుమార్ అందరికంటే చివరగా ఏడో స్థానంతో ముగించాడు. అతను జావెలిన్‌ను 26.11 మీటర్ల దూరం విసిరాడు.పురుషుల 400 మీ. – టి47 ఈవెంట్ తొలి రౌండ్ హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి దిలీప్ గవిట్ ముందంజ వేశాడు. మహిళల 200 మీ.–టి12 పరుగు సెమీ ఫైనల్లో రాణించిన సిమ్రన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల జావెలిన్ త్రో –ఎఫ్ 46లో భావనాబెన్ చౌదరి 39.70 మీటర్లు జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంలో నిలిచింది. బరిలోకి దిగితే పతకం ఖాయమే!ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ పుట్టుకతోనే వికలాంగుడు. అతని ఎడమ కాలు పూర్తిగా ఎదగకుండా చిన్నగా ఉండిపోయింది. చిన్నతనంలో కొందరు హేళన చేయడం అతడిని తీవ్రంగా బాధపెట్టేది. దీనిని మర్చిపోయేందుకు అతను ఆటలపై దృష్టి పెట్టాడు. వైకల్యం ఉన్నా సరే దానిని పట్టించుకోకుండా మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడేవాడు. అయితే అనూహ్యంగా ఒక సారి సాధారణ అథ్లెట్లు పాల్గొనే హైజంప్‌లో అతనికీ అవకాశం దక్కింది. దాంతో అథ్లెటిక్స్‌తో తనకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్‌కు అర్థమైంది. సత్యపాల్ సింగ్ అనే పారా అథ్లెటిక్స్ కోచ్ అతనిలో ప్రతిభను గుర్తించి హైజంప్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేశాడు. అన్ని రకాలుగా ప్రవీణ్‌ను తీర్చిదిద్దాడు.అనంతరం పారా క్రీడల్లో పాల్గొంటూ అతను వరుస విజయాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం, ఇప్పుడు స్వర్ణంలతో పాటు ప్రవీణ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో ఒక రజతం, ఒక కాంస్యం కూడా గెలిచాడు. పారిస్ క్రీడలకు ముందు గజ్జల్లో గాయంతో బాధపడిన అతను సరైన సమయానికి కోలుకొని సత్తా చాటాడు. -
ధరమ్వీర్ ధమాకా
భారత సీనియర్ పారాలింపియన్లలో అమిత్ కుమార్ సరోహా కూడా ఒకడు. పారా ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో రెండు రజతాలతో పాటు క్లబ్ త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన రికార్డు అతని సొంతం. దీంతో పాటు క్లబ్ త్రోలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ రజతాలు కూడా అమిత్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి ఒలింపిక్ పతక అంచనాలతో అతను బరిలోకి దిగాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక క్లబ్ త్రో ఈవెంట్ జరిగింది. అయితే 10 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో అమిత్ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచాడు. కానీ కొద్ది సేపటికే అతను ఆనందంగా, ఆత్మ సంతృప్తిగా ఆ పోటీల వేదిక నుంచి వెనుదిరిగాడు. ఎందుకంటే ఇందులో స్వర్ణ, రజతాలు సాధించిన అథ్లెట్లు ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా అమిత్ శిష్యులు కావడం విశేషం. వారిద్దరు పాల్గొన్న ఈవెంట్లోనే తానూ పోటీ పడ్డాడు. తాను గెలవకపోతేనేమి... తన శిష్యులిద్దరూ గెలిచి గురుపూజోత్సవం రోజున గురుదక్షిణ అందించారని అమిత్ చెప్పడం విశేషం. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ‘క్లబ్ త్రో–ఎఫ్51’ ఈవెంట్లో భారత్‌కు చెందిన ధరమ్వీర్ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్వీర్ పసిడి పతకాన్ని గెలుచుకోగా... 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు. తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్వీర్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈవెంట్లో దిమిత్రిజెవిచ్ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్‌కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్వీర్ ప్రకటించాడు. క్లబ్ త్రో ఈవెంట్‌కు మన దేశంలో పెద్దగా ఆదరణ, గుర్తింపు లేని వేళ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ శ్రమించాడు. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్‌గా ఆయన తీర్చిదిద్దిన అథ్లెట్లలో ధరమ్వీర్, ప్రణవ్ ఉన్నారు. ‘క్వాడ్రిప్లెజిక్’ బాధితులు ఈ ఎఫ్51 కేటగిరీలో పాల్గొంటారు. ఈ సమస్య వల్ల మెడ కింది భాగం మొత్తం పని చేయకుండా పోతుంది. దాంతో చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జూడోలో కపిల్‌కు కాంస్యం... పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్లో భారత ప్లేయర్ కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కపిల్ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్ (బ్రెజిల్)పై విజయం సాధించాడు. ఆర్చరీలో చేజారిన కాంస్యం... భారత ఆర్చరీ మిక్స్డ్ జోడీ హర్విందర్–పూజ జత్యాన్ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్రింక్–ఫ్యాబ్‌సిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో మోనా అగర్వాల్30వ స్థానంలో, సిద్ధార్థ బాబు 22వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. మహిళల 100 మీటర్ల టి12 ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సిమ్రన్ 12.11 సెకన్లలో రేసు పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో భారత ప్లేయర్ అశోక్ ఆరో స్థానంతో ముగించాడు. హరియాణాలోని సోనేపట్ ధరమ్వీర్ స్వస్థలం. సహచర కుర్రాళ్లతో కలిసి కాలువలోకి దూకి ఈత కొట్టే సమయంలో అతను లోతును సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో దిగువన ఉన్న రాళ్లను ఢీకొనడంతో శరీరానికి బాగా దెబ్బలు తగిలి పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. 25 ఏళ్ల వయసులో అతను పారా క్రీడల వైపు మళ్లాడు. రెండేళ్లు తిరిగే లోపే అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాడు. వరల్డ్ పారా చాంపియన్íÙప్లో కాంస్యం గెలిచిన ధరమ్వీర్ ఆసియా పారా క్రీడల్లో రెండు రజతాలు సాధించాడు. ప్రణవ్ సూర్మాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు విషాదం ఎదురైంది. అనుకోకుండా సిమెంట్ షీట్ అతనిపై పడటంతో వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతను భవిష్యత్తులో నడవలేడని డాక్టర్లు తేల్చేశారు. ఆ తర్వాత పూర్తిగా వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. మరోవైపు పారా క్రీడల వైపు ఆకర్షితుడై సాధన చేశాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతను వరల్డ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ కాగా ఐదుగురు సంతానంలో అతను ఒకడు. చిన్నప్పుడు తన అన్న జూడో పోటీల్లో పాల్గొనడం చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే పొలంలో వాటర్ పంప్ వద్ద కరెంట్ షాక్‌కు గురై ఆరు నెలల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోలుకున్నా చూపు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆరి్థక సమస్యలతో అతను, సోదరుడు కలిసి టీ స్టాల్ కూడా నడిపారు. పారాలింపిక్స్‌లో ‘విజన్ ఇంపెయిర్మెంట్’ కేటగిరీలోనే అతను పోటీ పడ్డాడు. -
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో 25వ పతకం
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పురుషుల జూడో 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్ జూడోలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో పర్మార్.. బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్ డి ఒలివియెరాపై విజయం సాధించాడు. Kapil paaji tussi chha gaye! 💯🙌Defeating WR 2 Elielton De Oliveira, Kapil Parmar secures India's first-ever Paralympic medal in Judo! 🔥#ParalympicGamesParis2024 #ParalympicsOnJioCinema #JioCinemaSports #Judo pic.twitter.com/HrnycLbP4I— JioCinema (@JioCinema) September 5, 2024కపిల్ ఒలివియెరాపై కేవలం 33 సెకెన్లలో విజయం సాధించడం విశేషం. కపిల్ కాంస్యంతో భారత్ కాంస్య పతకాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు భారత్ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్‌లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్‌పుట్‌లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్‌లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్‌కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్‌ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్‌లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్‌లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్‌హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్‌లోనే విఫలమైన ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. -
కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా... మా దీప్తి ’బంగారం’!
పారాలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా... మంగళవారం కాంస్యం రూపంలో ఒక పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 రేసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది. మరిన్ని మెడల్ ఈవెంట్స్‌లో మన క్రీడాకారులు పోటీపడాల్సి ఉండటంతో ఈసారి భారత్ పతకాల సంఖ్య 20 దాటే అవకాశముంది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజి కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూలియా షులియర్ (ఉక్రెయిన్; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా... టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది. ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్’లో పునరావృతం చేయలేకపోయింది. ఒకవేళ ఇదే టైమింగ్‌ను దీప్తి ‘పారిస్’లో నమోదు చేసి ఉంటే ఆమెకు స్వర్ణ పతకం లభించేది. ఫైనల్ రేసు ఆరంభంలో చివరి వరకు రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖరి పది మీటర్లలో వెనుకబడిపోయి మూడో స్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన హీట్స్‌లో 54.96 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ చివరి పది మీటర్లలో వేగంగా పరుగెత్తి దీప్తిని దాటేసి రజత పతకాన్ని ఖరారు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన మహిళల బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్6 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్ (ఇండోనేసియా)పై గెలిచింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్34 కేటగిరీలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాధవ్ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అవనికి ఐదో స్థానం తన పారాలింపిక్స్ కెరీర్లో మూడో పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 ఈవెంట్ ఫైనల్లో 22 ఏళ్ల అవని ఐదో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అవని 1159 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ముగిసిన పూజ పోరు మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ పూజ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో పూజ 4–6 (28–23, 25–24, 27–28, 24–27, 24–27)తో వు చున్యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు సెట్లు గెలిచిన పూజ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సెట్లో స్కోరును సమం చేసినా పూజ సెమీఫైనల్‌కు చేరుకునేది. కానీ పూజ తడబడి మూడు సెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో పూజ 6–0 (27–24, 26–22, 272–6)తో యాగ్ముర్ (టరీ్క)పై నెగ్గింది.కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా...పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు. ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ టోర్నీలో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన స్నేహితుడి ద్వారా రమేశ్‌కు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి దీప్తికి ఆర్థికంగా సహకారం అందించారు. కెరీర్ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్‌లో మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది. -
పారిస్ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 (క్వాలిఫికేషన్): నిహాల్ సింగ్–రుద్రాన్‡్ష (మధ్యాహ్నం గం. 1:00 నుంచి)అథ్లెటిక్స్ పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 (పతక పోరు): యాసిర్, రోహిత్, సచిన్ (మధ్యాహ్నం గం. 1:35 నుంచి), మహిళల షాట్‌పుట్ ఎఫ్46 (పతక పోరు): అమిషా రావత్ (మధ్యాహ్నం గం. 3:17 నుంచి), పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (పతక పోరు): ధరమ్వీర్, ప్రణవ్, అమిత్ కుమార్ (రాత్రి గం. 10:50 నుంచి), మహిళల 100 మీటర్ల టి12 (హీట్): సిమ్రన్ (రాత్రి గం. 11:03 నుంచి)సైక్లింగ్ పురుషుల సి2 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక పోరు): అర్షద్ షేక్ (రాత్రి గం. 11:57 నుంచి), మహిళల సి1–3 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక పోరు): జ్యోతి గడేరియా (మధ్యాహ్నం గం. 12:32 నుంచి)పవర్ లిఫ్టింగ్ పురుషుల 49 కేజీలు (పతక పోరు): పరమ్‌జీత్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి), మహిళల 45 కేజీలు (పతక పోరు): సకీనా ఖాతూన్ (రాత్రి గం. 8:30 నుంచి)టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్ 4 (క్వార్టర్ ఫైనల్స్): భవీనా పటేల్ ్ఠ జో యింగ్ (చైనా) (మధ్యాహ్నం గం. 2:15 నుంచి)ఆర్చరీ పురుషుల రికర్వ్ (ప్రిక్వార్టర్ ఫైనల్): హర్విందర్ సింగ్ ్ఠ సెంగ్ లుంగ్ హుయి (చైనీస్ తైపీ) (సాయంత్రం గం 5:49 నుంచి) -
తనొక అద్భుతం: ఆమె ఆత్మవిశ్వాసం ముందు విధి చిన్నబోయింది (ఫొటోలు)
-
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
రుబీనా అదుర్స్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు మన గన్ గర్జించడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత పారా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యంతో సత్తా చాటింది. చెదరని గురితో పోడియంపై చోటు దక్కించుకుంది. ఇతర క్రీడల్లోనూ శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో నితీశ్ కుమార్, సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. పారిస్: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. శుక్రవారం రైఫిల్ విభాగంలో అవనీ లేఖరా, మోనా అగర్వాల్ పతకాలతో సత్తా చాటితే... శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో మెరిసింది. ఈ విభాగంలో పారాలింపిక్స్ పతకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. తుదిపోరులో 25 ఏళ్ల రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాతాలో వేసుకుంది. వైల్డ్‌కార్డ్ ద్వారా పారిస్ పారాలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఇరాన్ షూటర్ జవాన్మార్డీ సారా 236.8 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. సారాకు ఇది వరుసగా మూడో పారాలింపిక్ పసిడి కావడం విశేషం. అజ్గాన్ అయ్సెల్ (టర్కీ) 231.1 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. స్థిరమైన గురితో సత్తాచాటిన రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్ కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి పోడియంపై నిలిచింది. తుది పోరులో తొలి పది షాట్ల తర్వాత రుబీనా 97.6 పాయింట్లతో నిలిచింది. 14 షాట్ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న రుబీనా తదుపరి రెండు షాట్లలో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానానికి చేరింది. కాంస్యం గెలిచిన రుబీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. గొప్ప సంకల్పం, అసాధారణమైన గురితో పతకం సాధించిన రుబీనా దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. గగన్ నారంగ్ స్ఫూర్తితో.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన మెకానిక్ కూతురైన రుబీనా... పుట్టుకతోనే కుడి కాలు లోపంతో జన్మించింది. తండ్రి స్నేహితుల ప్రోద్బలంతో షూటింగ్ కెరీర్ ప్రారంభించిన రుబీనా... ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. జబల్పూర్ అకాడమీలో షూటింగ్ ఓనమాలు నేర్చుకున్న ఫ్రాన్సిస్... ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ ఘనతలు చూసి షూటింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుంది. కెరీర్ ఆరంభంలో షూటింగ్ రేంజ్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రుబీనా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగి 2017లో గగన్ నారంగ్ అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’లో అడుగుపెట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్ సెమీస్‌లో నితీశ్, సుకాంత్ పారిస్ పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితీశ్ కుమార్, ఎస్ఎల్4లో సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శనివారం క్వార్టర్ ఫైనల్లో నితీశ్ 21–13, 21–14తో మాంగ్ఖాన్ బున్సన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్ ప్లేస్ దక్కించుకొని సెమీస్‌కు చేరాడు. గ్రూప్ నుంచి రెండో స్థానంలోనిలిచిన బున్సన్ కూడా సెమీస్‌కు చేరాడు. ఎస్ఎల్4 క్లాస్‌లో సుకాంత్ 21–12, 21–12తో టిమార్రోమ్ సిరిపాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3లో సుహాస్ యతిరాజ్–పాలక్ కోహ్లీ జంట 11–21, 17–21తో హిక్మత్–లియాని రాట్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో నితీశ్ కుమార్–తులసిమతి ద్వయం కూడా పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో సరిత ఓటమి భారత పారా ఆర్చర్ సరితా కుమారి క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం మహిళల కాంపౌండ్ క్వార్టర్స్‌లో సరిత 140–145తో టాప్ సీడ్ ఓజు్నర్ కూర్ గిర్డి (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ఎలిమినేషన్ రెండో రౌండ్లో సరిత 141–135తో ఎలెనోరా సార్టీ (ఇటలీ)పై గెలిచింది. తొలి రౌండ్లో సరిత 138–124తో నూర్ అబ్దుల్ జలీల్ (మలేసియా)పై గెలిచింది. మరోమ్యాచ్‌లో భారత ఆర్చర్, రెండో సీడ్ శీతల్ దేవి 137–138తోమిరియానా జునీగా (చిలీ)పై చేతిలో ఓడింది. రోయింగ్ రెపిచాజ్లో మూడో స్థానం రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె జంట రెపిచాజ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ ‘బి’లో అడుగుపెట్టింది. శనివారం పోటీలో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఉక్రెయిన్ (7 నిమిషాల 29.24 సెకన్లు), బ్రిటన్ (7 నిమిషాల 20.53 సెకన్లు) జోడీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫైనల్ ‘బి’లోని రోవర్లు 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనున్నారు. సైక్లింగ్‌లో నిరాశ పారిస్ పారాలింపిక్స్‌లో భారత సైక్లిస్ట్‌లకు నిరాశ ఎదురైంది. అర్షద్ షేక్, జ్యోతి గడేరియా తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగారు. పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 విభాగంలో బరిలోకి దిగిన అర్షద్ శనివారం క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి స్థానంతో రేసును ముగించాడు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో అర్షద్ 1 నిమిషం 21.416 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి గడేరియా 49.233 సెకన్లలో లక్ష్యాన్ని చేరి చివరి స్థానంలో నిలిచింది. -
పారిస్ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్ (ఫైనల్ ‘బి’): భారత్ (అనిత, నారాయణ కొంగనపల్లె) (మధ్యాహ్నం గం. 2:00 నుంచి) షూటింగ్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రొన్ ఎస్‌హెచ్1 (క్వాలిఫికేషన్): భారత్ (సిద్ధార్థ బాబు–అవని లేఖరా) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి), మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్2 (క్వాలిఫికేషన్): శ్రీహర్ష (మధ్యాహ్నం గం. 3:00 నుంచి) ఆర్చరీ పురుషుల కాంపౌండ్ (క్వార్టర్ ఫైనల్): రాకేశ్ కుమార్ X కేన్ స్వగుమిలాంగ్ (ఇండోనేసియా) (రాత్రి గం. 7:17 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 (సెమీఫైనల్): నితీశ్ కుమార్ X ఫుజిహరా (జపాన్) (రాత్రి గం. 8:10 నుంచి)టేబుట్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్ 4 (ప్రిక్వార్టర్‌ఫైనల్): భవీనా పటేల్ X మార్థా వర్డిన్ (మెక్సికో) (రాత్రి గం. 9:15 నుంచి), మహిళల సింగిల్స్ క్లాస్ 3 (ప్రిక్వార్టర్‌ఫైనల్): సోనాల్‌బెన్ పటేల్ X అన్డెలా విన్సెటిచ్ (క్రొయేíÙయా) (అర్ధరాత్రి గం. 12:15 నుంచి)అథ్లెటిక్స్మహిళల 1500 మీటర్ల టి11 (హీట్): రక్షిత రాజు (మధ్యాహ్నం గం. 1:57 నుంచి), పురుషుల షాట్ పుట్ ఎఫ్40 (పతక పోరు): రవి రంగోలీ (మధ్యాహ్నం గం. 3:12 నుంచి), పురుషుల హై జంప్ టీ47 (పతక పోరు): నిషాద్ కుమార్, రామ్‌పాల్ (రాత్రి గం. 10:40 నుంచి), మహిళల 200 మీటర్లు టి35 (పతక పోరు): ప్రీతి పాల్ (రాత్రి గం. 11:27 నుంచి) -
అవని అద్వితీయం
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్‌కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్‌లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
పారిస్ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 (క్వాలిఫికేషన్): స్వరూప్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి), మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్మెచ్1 (క్వాలిఫికేషన్): రుబీనా (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).ట్రాక్ సైక్లింగ్ మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 (క్వాలిఫయింగ్): జ్యోతి (మ. గం. 1:30 నుంచి). పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 (క్వాలిఫయింగ్) అర్షద్ షేక్ (మధ్యాహ్నం గం. 1:49 నుంచి). ఆర్చరీ మహిళల కాంపౌండ్ (ఎలిమినేషన్): సరితా దేవి X ఎలెనోరా సార్టీ (ఇటలీ) (రాత్రి గం. 7:00 నుంచి), మహిళల కాంపౌండ్ (ఎలిమినేషన్): శీతల్ దేవి – మిరియానా జునీగా (చిలీ) (రాత్రి గం. 8:59 నుంచి). అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్57 (పతక పోరు): ప్రవీణ్ కుమార్ (రాత్రి గం. 10:30 నుంచి). -
పారిస్‌లో పారాలింపిక్స్ షురూ.. ఉప్పొంగిన ఉత్సాహం (ఫొటోలు)
-
శీతల్ దేవి శుభారంభం
పారిస్: పారా ఆర్చరీలో గత కొంత కాలంగా సంచలన విజయాలు సాధిస్తున్న భారత ప్లేయర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లోనూ శుభారంభం చేసింది. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 703 పాయింట్లతో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు 700 పాయింట్లు దాటిన భారత తొలి మహిళా పారా ఆర్చర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఈ నెలలోనే ఫోబ్ పేటర్సన్ (బ్రిటన్) 698 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శీతల్ బద్దలు కొట్టింది. అయితే కొద్ది సేపటికే 704 పాయింట్లతో ఈ రికార్డును సవరిస్తూ ఒజ్నర్ క్యూర్ (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ఆ తర్వాత పారా వరల్డ్ చాంపియన్íÙప్లో కూడా పతకం సాధించింది. కశీ్మర్‌కు చెందిన శీతల్ పుట్టుకతోనే ‘ఫొకెమెలియా సిండ్రోమ్’ వ్యాధి బారిన పడటంతో ఆమె రెండు చేతులూ పని చేయకుండా ఉండిపోయాయి. సుకాంత్, సుహాస్, తరుణ్ ముందంజ... బ్యాడ్మింటన్ పోటీల్లో తొలి రోజు భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్‌కు చెందిన సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్, తరుణ్ గ్రూప్ దశలో తమ మొదటి రౌండ్లలో విజయాలు అందుకున్నారు. సుకాంత్ 17–21, 21–15, 22–20తో మొహమ్మద్ అమీన్ (మలేసియా)పై, సుహాస్ 21–7, 21–5తో హిక్మత్ రమ్‌దాని (ఇండోనేసియా)పై, తరుణ్ 21–17, 21–19తో ఒలీవిరా రోజరియో (బ్రెజిల్)పై గెలుపొందారు. అయితే మరో ఇద్దరు షట్లర్లు మన్దీప్ కౌర్, మానసి జోషిలకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మానసి 21–16, 13–21, 18–21తో ఇక్తియార్ (ఇండోనేసియా) చేతిలో, మన్దీప్ 8–21, 14–21తో మరియమ్ బొలాజి (నైజీరియా) చేతిలో పరాజయంపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో నితీశ్ కుమార్–తులసిమతి 21–14, 21–17తో భారత్‌కే చెందిన సుహాస్ యతిరాజ్–పలక్ కోహ్లిలను ఓడించి ముందంజ వేయగా... శివరాజన్–నిత్యశ్రీ ద్వయం 21–23, 11–21తో మైల్స్ క్రాజెస్కీ–జేసీ సైమన్ (అమెరికా) చేతిలో ఓడారు. తైక్వాండో భారత ప్లేయర్ అరుణ తన్వర్ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో టరీ్కకి చెందిన నూర్సిహన్ ఎకిన్సీ 19–0తో అరుణను చిత్తుగా ఓడించింది. సైక్లింగ్ 3000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్లో భారత్‌కు చెందిన జ్యోతి గడేరియా 10వ స్థానంలో నిలిచి ని్రష్కమించింది. జ్యోతి ఈ రేస్‌ను 4 నిమిషాల 53.929 సెకన్లలో ముగించింది. -
పారిస్ మళ్లీ మురిసె...
పారిస్: మొన్న రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఎంత వైభవంగా ఆరంభించారో... దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌ను కూడా అంతే అట్టహాసంగా అంగరంగ వైభంగా ప్రారంభించారు. దీంతో మరోసారి పారిస్ కలలు, కళాకారులు, నృత్యరీతులు, పాప్ గీతాలతో విశ్వక్రీడల శోభకు వినూత్న ‘షో’కులద్దింది. కనుల్ని కట్టిపడేసే వేడుకలు ఆద్యంతం అలరించాయి. పలు ఆటపాటలు, కళాకారుల విన్యాసాల అనంతరం ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని ఆరు ఫ్లయిట్లు ఆకాశానికి పూసినట్లుగా చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది. ఆ వెంటే మార్చ్‌పాస్ట్ మొదలైంది. ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పడవలపై మార్ప్పాస్ట్ సాగితే... పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్ పారిస్ రహదారిపై కేరింతగా రెగ్యులర్ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది. రేపటి నుంచి పోటీలు జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 4000 మందికి పైగా దివ్యాంగ అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో పోటీపడతారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఆదరించినట్లుగానే ఈ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. 2 మిలియన్ల (20 లక్షలు)కు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడమే ఆదరణకు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ మాట్లాడుతూ మరోమారు పారిస్‌ను ప్రేక్షకుల సమూహం ముంచెత్తనుందన్నారు. మూడేళ్ల క్రితం టోక్యోలో కోవిడ్ మహమ్మారి కారణంగా పారా అథ్లెట్లంతా ఖాళీ స్టాండ్ల (ప్రేక్షకులు లేక) ముందు తమ ప్రదర్శన కనబరిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య పారాలింపియన్లు పోటీలను పూర్తిచేస్తారని నిర్వాహకులు చెప్పారు. గురువారం ముందుగా తైక్వాండోలో పారాలింపియన్లు పతకాల బోణీ కొట్టనున్నారు. దీంతో పాటు పోటీల తొలిరోజు టేబుల్ టెన్నిస్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. -
Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్ తదితర వివరాలు
పారిస్‌లో విశ్వక్రీడలు ముగిసి రోజులు గడవక ముందే అదే చోట మరో మహాసంగ్రామం మొదలుకానుంది. ఆగస్ట్ 28 నుంచి పారిస్ వేదికగా 2024 పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్ తొలిసారి సమ్మర్ పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 8న జరిగే క్లోజింగ్ సెర్మనీతో ముగుస్తాయి.2021 టోక్యో పారాలింపిక్స్లా కాకుండా ఈసారి పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తారు. కరోనా కారణంగా గత పారాలింపిక్స్ జనాలు లేకుండా సాగాయి.ఈసారి పారాలింపిక్స్‌లో మొత్తం 22 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4400 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. భారత్ ఈసారి 84 సభ్యుల బృందాన్ని పారిస్‌కు పంపుతుంది.ఈసారి పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు రెగ్యులర్ ఒలింపిక్స్ తరహాలో స్టేడియం బయట జరుగనున్నాయి. పెరేడ్ సందర్భంగా అథ్లెట్లు పారిస్‌లోనే ఐకానిక్ ల్యాండ్‌మార్క్స్ చుట్టూ మార్చ్ చేస్తారు.తొలి రోజు పారాలింపిక్స్ పోటీలు ఆగస్ట్ 29న మొదలవుతాయి. ఆ రోజు మొత్తం 22 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి.పారిస్ పారాలింపిక్స్‌లోని క్రీడా విభాగాలు..బ్లైండ్ ఫుట్బాల్పారా ఆర్చరీపారా అథ్లెటిక్స్బోసియాగోల్బాల్పారా బ్యాడ్మింటన్పారా కనోయ్పారా సైక్లింగ్పారా ఈక్వెస్ట్రియాన్పారా తైక్వాండోపారా ట్రయథ్లాన్పారా టేబుల్ టెన్నిస్సిట్టింగ్ వాలీబాల్వీల్చైర్ బాస్కెట్బాల్వీల్చైర్ ఫెన్సింగ్వీల్చైర్ రగ్బీవీల్చైర్ టెన్నిస్పారా స్విమ్మింగ్షూటింగ్ పారా స్పోర్ట్పారాలింపిక్స్లో ఈసారి భారత్ నుంచి రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రితం ఎడిషన్‌లో భారత్ 54 మంది మాత్రమే విశ్వక్రీడలకు పంపింది. ఆ క్రీడల్లో భారత్ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) సాధించి ఆల్‌టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా కనీసం 25 పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.క్రీడాంశాల వారీగా 2024 పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత్ అథ్లెట్లు..పారా ఆర్చరీ (6)హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పారా అథ్లెటిక్స్ (38)దీప్తి జీవన్జీ - మహిళల 400మీ -టీ20సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్‌పుట్ - F46మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్‌పుట్ - F34మను - పురుషుల షాట్ పుట్ - F37పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57రవి రొంగలి - పురుషుల షాట్‌పుట్ - F40సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47సోమన్ రాణా - పురుషుల షాట్‌పుట్ - F57హొకాటో హొటోచే సేమా- పురుషుల షాట్ పుట్ - F57సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55రక్షిత రాజు- మహిళల 1500 మీటర్ల T11అమీషా రావత్: మహిళల షాట్‌పుట్ - F46భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53పారా బ్యాడ్మింటన్ (13)మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4తరుణ్ - పురుషుల సింగిల్స్ S4మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3మన్దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6పారా కనోయ్ (3)ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పారా సైక్లింగ్ (2)అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్బ్లైండ్ జూడో (2)కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1కోకిల: మహిళల -48కిలోల జె2పారా పవర్ లిఫ్టింగ్ (4)పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకుఅశోక్ - పురుషుల 63 కేజీల వరకుసకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళలకస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళలపారా రోయింగ్ (2)అనిత - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xనారాయణ కొంగనపల్లె - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xపారా షూటింగ్ (10)అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1అవని లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1నిహాల్ సింగ్: P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1సిద్ధార్థ బాబు: R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1పారా స్విమ్మింగ్ (1)సుయాష్ నారాయణ్ జాదవ్- పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై - S7పారా టేబుల్ టెన్నిస్ (2)సోనాల్‌బెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS3, మహిళల డబుల్స్- WD10భావినాబెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS4, మహిళల డబుల్స్- WD10పారా తైక్వాండో (1)అరుణ- మహిళల కే44- 47 కేజీలుపారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు 31 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. భారత్ గత పారాలింపిక్స్‌లోనే 19 పతకాలు సాధించింది.1. మురళీకాంత్ పెట్కర్ - హైడెల్బర్గ్ 1972 ( స్విమ్మింగ్‌లో స్వర్ణం, పురుషుల 50 మీ ఫ్రీస్టైల్ 3 )2. భీమ్రావ్ కేసర్కర్ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో రజతం)3. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో కాంస్యం)4. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల షాట్‌పుట్ L6లో రజతం)5. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల డిస్కస్ త్రో L6లో కాంస్యం)6. దేవేంద్ర ఝఝరియా - ఏథెన్స్ 2004 ( పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం F44/ 46)7. రాజిందర్ సింగ్ రహేలు - ఏథెన్స్ 2004 (పురుషుల 56 కేజీలలో కాంస్యం)8. గిరీషా ఎన్ గౌడ - లండన్ 2012 (పురుషుల హైజంప్ F42లో రజతం)9. మరియప్పన్ తంగవేలు - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో స్వర్ణం)10. వరుణ్ సింగ్ భాటి - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో కాంస్యం)11. దేవేంద్ర ఝఝరియా- రియో 2016 (పురుషుల జావెలిన్ త్రో F46లో స్వర్ణం)12. దీపా మాలిక్ - రియో 2016 (మహిళల షాట్‌పుట్ F53లో రజతం)13. భావినా పటేల్ - టోక్యో 2020 (మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో రజతం)14. నిషాద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T47లో రజతం)15. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్ SH1లో స్వర్ణం)16. దేవేంద్ర ఝఝరియా - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F46లో రజతం)17. సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో F46లో టోక్యో 2020 కాంస్యం)18. యోగేష్ కథునియా - టోక్యో 2020 (పురుషుల డిస్కస్ త్రో F56లో రజతం)19. సుమిత్ యాంటిల్ - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F64లో స్వర్ణం)20. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ SH1లో కాంస్యం)21. మరియప్పన్ తంగవేలు - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో రజతం)22. శరద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో కాంస్యం)23. ప్రవీణ్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T64లో రజతం)24. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో SH1లో కాంస్యం)25. హర్విందర్ సింగ్ - టోక్యో 2020 (పురుషుల వ్యక్తిగత రికర్వ్ - ఓపెన్ ఆర్చరీలో కాంస్యం)26. మనీష్ నర్వాల్ - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో స్వర్ణం)27. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో రజతం28. ప్రమోద్ భగత్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణం)29. మనోజ్ సర్కార్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో కాంస్యం)30. సుహాస్ యతిరాజ్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4లో రజతం)31. కృష్ణ నగర్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SH6లో కాంస్యం) -
Sumit Antil: ప్రపంచ రికార్డు... పసిడి పతకం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని భారత పారాథ్లెట్ సుమిత్ అంటిల్ పేర్కొన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు పారాలింపిక్స్ జరగనుండగా... ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ భారత బృందం పతాకధారిగా వ్యవహరించనున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్.. ఎఫ్64 విభాగంలో పోటీపడనున్నాడు. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల మూడుసార్లు బద్దలు కొట్టిన సుమిత్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్నాడు. పారా ప్రపంచ చాంపియన్సిప్లోనూ సుమిత్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సుమిత్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. ప్రాక్టీస్ లో నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నా. 80 మీటర్ల మార్క్ అందుకోవడం నా లక్ష్యం. డిఫెండింగ్ చాంపియన్ అనే ఒత్తిడి ఏం లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెడతా. 2019 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగంగా ఉన్నా. ప్రభుత్వ సహకారం వల్లే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఉద్దేశంతో ఇతర టోరీ్నల్లో ఎక్కువ పాల్గొనలేదు’ అని సుమిత్ అన్నాడు. పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. -
‘25 పతకాలు పక్కా’
న్యూఢిల్లీ: పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడడం పారిస్ పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపదని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 25 పతకాలు సాధించగలదని ఝఝారియా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, యాంటీ డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గత ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత ప్రమోద్‌పై బీడబ్ల్యూఎఫ్ 18 నెలల నిషేధం విధించింది. ‘పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారి జాబితాలో ప్రమోద్ భగత్ పేరు ముందుండాల్సింది. కానీ అతడిపై నిషేధం పడింది. అయినా విశ్వ క్రీడల్లో మన అథ్లెట్లు 25 పతకాలు సాధించగలరు. పారాలింపిక్స్ చరిత్రలోనే ఈసారి భారత్ నుంచి అత్యధిక మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్లు 19 పతకాలు సాధించారు. ఇప్పుడు ఆ మార్క్ దాటడంతో పాటు.. పతకాల జాబితాలో టాప్–20లో నిలుస్తాం’ అని ఝఝారియా అన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు జరగనున్న ‘పారిస్’ పారా క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఇప్పటికే భారత అథ్లెట్ల బృందం క్రీడా గ్రామంలో అడుగుపెట్టింది. -
పారాలింపిక్స్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ
భువనేశ్వర్: పారాలింపిక్స్ ప్రారంభం కాకముందే భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తాడనుకున్న భారత పారా షట్లర్, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్‌పై నిషేధం పడింది. డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రమోద్‌పై 18 నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం వెల్లడించింది. దీంతో 2020 టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన ప్రమోద్.. ఈ నెల 28న ప్రారంభం కానున్న పారిస్ పారాలింపిక్స్‌కు దూరమయ్యాడు. పోటీలు లేని సమయంలో క్రీడాకారులు డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండేందుకు తాము ఎక్కడ ఉన్నామనే వివరాలు అందించాల్సి ఉంటుంది. మూడుసార్లు వివరాలు ఇవ్వని పక్షంలో ఆ క్రీడాకారుడిపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ప్రమోద్ విఫలమయ్యాడు. ఏడాది వ్యవధిలో ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలు ప్రమోద్ అందించని కారణంగా అతడిపై బీడబ్ల్యూఎఫ్ సస్పెన్షన్ విధించింది. ‘టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ ప్రమోద్ భగత్‌పై ఏడాదిన్నరపాటు సస్పెన్షన్ విధించాం. బీడబ్ల్యూఎఫ్ డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం. గత 12 నెలల్లో ఎక్కడ ఉన్నాడనే వివరాలు ఇవ్వకపోవడంతోనే నిషేధం విధించాం’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. ఎక్కడున్నానో చెప్పడంలో జరిగిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత ఏడాదిలో రెండుసార్లు టెస్టుకు అందుబాటులో లేను. మూడోసారి పూర్తి వివరాలు సమర్పించా. అయినా నా అప్పీల్‌ను స్వీకరించలేదు. పారిస్ పారాలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి అనూహ్య ఘటన ఎదురవడం చాలా బాధగా ఉంది. గుండె పగిలినట్లయింది. నా బృందం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్) నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’ అని ప్రమోద్ వివరించాడు. నిషేధం విషయంలో గత నెలలో సీఏఎస్‌లో ప్రమోద్ అప్పీల్ చేసుకోగా.. సీఏఎస్ డోపింగ్ నిరోధక విభాగం దాన్ని తాజాగా తోసిపుచ్చింది. ఈ ఏడాది మార్చి 1 నుంచే ఈ నిషేధం అమల్లోకి రాగా.. వచ్చే ఏడాది సెపె్టంబర్ ఒకటి వరకు కొనసాగనుంది. ఒడిశాకు చెందిన ప్రమోద్ కేంద్రం నుంచి 2021లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’... 2022లో ‘పద్మశ్రీ’ అందుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్ సింగిల్స్ ఎస్ఎల్ 3 విభాగంలో స్వర్ణం గెలిచిన ప్రమోద్... పారా ప్రపంచ చాంపియన్íÙప్లలో ఐదుసార్లు టైటిల్స్ గెలిచాడు. -
Tokyo 2020 Paralympics: వినోద్‌కుమార్‌కు మరో భారీ షాక్!
టోక్యో పారాలింపిక్స్-2020లో డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచినట్టే గెలిచి పతకాన్ని చేజార్చుకున్న భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్‌కు మరో భారీ షాక్ తగిలింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా ది బోర్డ్ ఆఫ్ అప్పీల్ ఆఫ్ క్లాసిఫికేషన్(బీఏసీ) నిషేధం విధించింది. పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో ఈవెంట్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2023 వరకు వినోద్ కుమార్‌పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు.. ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి.. పారా అథ్లెట్‌గా క్లాసిఫికేషన్‌లో పొందుపరిచిన వివరాలకు భిన్నంగా కుమార్ వ్యవహరించాడని తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ క్లాసిఫికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రమశిక్షణా రాహిత్యం కింద అతడిపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కాగా పారాలింపిక్స్‌లో కుమార్ ప్రవర్తనను గమనించిన తోటి పోటీదారులు అతడిపై ఫిర్యాదు చేయగా.. క్లాసిఫికేషన్‌కు విరుద్ధంగా అతడు వ్యవహరించినట్లు తేలింది. దీంతో ఎఫ్52 డిస్కస్ విభాగంలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందున కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అసలేం జరిగింది? పారా అథ్లెట్ల వైకల్యం రకం, తీవ్రతను బట్టి వర్గీకరణ చేస్తారు. అదే స్థాయిలో వైకల్యం ఉన్న ఇతర పారా అథ్లెట్లతో పోటీ పడేందుకు అనుమతినిస్తారు. డిస్కస్ త్రోలో ఎఫ్52 క్లాస్‌లో .. కండరాల శక్తి, వాటి కదలికల్లో అడ్డంకులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా కొంతమందికి వీల్‌చైర్‌లో కూర్చుని ఆడేందుకు అవకాశం ఇస్తారు. అయితే, ఈ విషయంలో వినోద్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పారాలింపిక్స్‌లో అతడిని అనర్హుడిగా పేర్కొన్నారు. ఇప్పుడు రెండేళ్ల పాటు నిషేధం విధించారు. చదవండి: Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు? -
ఒలంపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారుల వస్తువుల వేలం
-
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
-
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
పారాలింపిక్స్‌లో రజతంతో మొదలైన తమ పతకాల వేటను భారత క్రీడాకారులు స్వర్ణంతో దిగి్వజయంగా ముగించారు. ఈ క్రీడల ఆఖరి రోజు ఆదివారం భారత్ రెండు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో çకృష్ణ నాగర్ బంగారు పతకం... ఐఏఎస్ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్ రజత పతకం నెగ్గారు. ఓవరాల్‌గా భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. టోక్యో: ఆత్మవిశ్వాసమే ఆస్తిగా.... పట్టుదలే పెట్టుబడిగా... అనుక్షణం తమ పోరాట పటిమితో ఆకట్టుకున్న భారత పారాలింపియన్లు టోక్యో విశ్వ క్రీడలకు చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. చివరి రోజు ఒక స్వర్ణం, ఒక రజతం సాధించి యావత్ దేశం గర్వపడేలా చేశారు. తొలుత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం ఫైనల్లో సుహాస్ యతిరాజ్ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్ లుకాస్ మజూర్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి పారాలిం పిక్స్‌లో ఆడుతున్న 38 ఏళ్ల సుహాస్ తొలి గేమ్‌ను గెల్చుకున్నా ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయాడు. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన కృష్ణ నాగర్ 21–17, 16–21, 21–17తో చు మన్ కాయ్ (హాంకాంగ్)పై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం కాంస్య పతక పోరులో భారత ప్లేయర్ తరుణ్ ధిల్లాన్ 17–21, 11–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్–3/ఎస్ఎల్–5 కాంస్య పతక పోరులో ప్రమోద్ భగత్–పలక్ కోహ్లి (భారత్) ద్వయం 21–23, 19–21తో దైసుకె ఫుజిహారా–అకీకో సుగినో (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్–1 విభాగంలో బరిలోకి దిగిన భారత షూటర్లు సిద్ధార్థ బాబు, దీపక్, అవనీ లేఖరా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో సిద్ధార్థ బాబు 617.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... 612 పాయింట్లు స్కోరు చేసి అవని 28వ స్థానంలో... 602.2 పాయింట్లు సాధించి దీపక్ 46వ స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. దటీజ్ కృష్ణ... రెండేళ్లపుడే కృష్ణ నాగర్ వయసుకు తగ్గట్టుగా పెరగడని నిర్ధారించారు. కానీ అతనే ఇప్పుడు బంగారం గెలిచేంతగా ఎదిగిపోయాడు. జైపూర్ (రాజస్తాన్)కు చెందిన కృష్ణది ఎదగలేని వైకల్యం. కానీ దేన్నయినా సాధించే అతని పట్టుదల ముందు మరుగుజ్జుతనమే మరుగున పడింది. పొట్టొడే గట్టోడని టోక్యో పారాలింపిక్స్ స్వర్ణంతో నిరూపించాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పొట్టివాడే. కానీ పతకాలు కొల్లగొట్టేవాడు కూడా! తనకిష్టమైన బ్యాడ్మింటన్‌లో చాంపియన్. 14 ఏళ్ల వయసులో షటిల్ వైపు దృష్టి మరల్చిన ఈ పొట్టి కృష్ణుడు 2016 నుంచి గట్టి మేలే తలపెట్టాడు. ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటుకోవడం మొదలుపెట్టాడు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ నిలకడైన విజయాలతో ఎస్‌హెచ్–6 పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా ఎదిగాడు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం సాధించాడు. గతేడాది బ్రెజిల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో రన్నరప్‌గా (రజతం) నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్లో సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. పోటీల బరిలో అతని ఆత్మవిశ్వాసమే అతన్ని అందనంత ఎత్తులో నిలబెడుతోంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకానికి ఉండే ప్రత్యేకతే వేరు. ప్రతిష్టాత్మక ఈ విశ్వక్రీడల్లో ఏకంగా బంగారమే సాధిస్తే ఆ ఆనందం మాటలకందదు. మేం బ్యాడ్మింటన్‌లో ఐదారు పతకాలు సాధిస్తామనే ధీమాతో వచ్చాం. చివరకు నాలుగింటితో తృప్తిపడ్డాం. అనుకున్న దానికి ఒకట్రెండు తగ్గినా మా ప్రదర్శన ఎంతో మెరుగైందన్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ పతకాన్ని కరోనా వారియర్స్‌కు అంకితం ఇస్తున్నాను. –కృష్ణ నాగర్ -
పారా ఒలింపిక్స్ లో భారత్ కి స్వర్ణం
-
Paralympics 2021: చరిత్రకు చేరువలో...
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా) వ్యక్తిగత విభాగాలలో స్వర్ణ పతకాలు గెలిచారు. విశ్వ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించేందుకు టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్‌కు స్వర్ణావకాశం దక్కింది. టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 మహిళల సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనా ప్లేయర్ యింగ్ జౌతో నేడు జరిగే తుది పోరులో భవీనా గెలిస్తే బంగారు పతకంతో కొత్త చరిత్ర లిఖిస్తుంది. టోక్యో: ఏమాత్రం అంచనాలు లేకుండా టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగిన భారత మహిళా టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ పసిడి కాంతులు విరజిమ్మేందుకు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న 34 ఏళ్ల ఈ గుజరాతీ మహిళ తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను బోల్తా కొట్టిస్తూ ఏకంగా పసిడి పతకం పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన క్లాస్–4 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భవీనా 7–11, 11–7, 11–4, 9–11, 11–8 తో 2012 లండన్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 2014 ప్రపంచ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ మియావో జాంగ్ (చైనా)పై నెగ్గింది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే ఫైనల్లో చైనాకే చెందిన వరల్డ్ నంబర్‌వన్ యింగ్ జౌతో భవీనాబెన్ తలపడుతుంది. తుది పోరులో గెలిస్తే భవీనాబెన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో సెమీఫైనల్లో యింగ్ జౌ 11–4, 11–3, 11–6తో జియోడాన్ జు (చైనా)పై గెలిచింది. చదవండి: వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్ లెక్క సరిచేసింది... గతంలో మియావో జాంగ్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భవీనాబెన్ ఈసారి మాత్రం అదరగొట్టింది. తొలి గేమ్‌ను కోల్పోయినా నిరాశ చెందకుండా ఆడిన భవీనా రెండో గేమ్‌ను, మూడో గేమ్‌ను సొంతం చేసుకొని 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో మియావో గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో గేమ్‌లో భవీనాబెన్ ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. 9–5తో ఆధిక్యంలోకి వచ్చి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే మియావో వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. అయితే కీలకదశలో భవీనాబెన్ నిగ్రహం కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చదవండి: మూడో టెస్టులో భారత్‌కు పరాభవం రాకేశ్ ముందంజ... మరోవైపు పురుషుల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాకేశ్ కుమార్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... శ్యామ్ సుందర్ స్వామి రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆడిన రాకేశ్ కుమార్ 144–131తో కా చుయెన్ ఎన్గాయ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో శ్యామ్ 139–142తో మ్యాట్ స్టుట్జ్మన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రంజీత్ విఫలం... పురుషుల అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఎఫ్–57 కేటగిరీ లో భారత ప్లేయర్ రంజీత్ భాటి నిరాశపరిచాడు. రంజీత్ తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా సఫలం కాలేకపోయాడు. రంజీత్ ఆరు త్రోలూ ఫౌల్ కావడంతో ఫైనల్లో పాల్గొన్న 12 మందిలో అతను చివరి స్థానంలో నిలిచాడు. పతకం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతోనే నేను టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగాను. వందశాతం శ్రమిస్తే తప్పకుండా పతకం వస్తుందని భావించాను. ఇదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోనూ పోరాడితే స్వర్ణం గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను. పోలియో కారణంగా నా కాళ్లు అచేతనంగా మారిపోయినా ఏనాడూ నేను దివ్యాంగురాలిననే ఆలోచన మనసులోకి రానీయలేదు. చైనా క్రీడాకారిణులను ఓడించడం అంత సులువు కాదని చెబుతుంటారు. కానీ పట్టుదలతో పోరాడితే ఎంతటి మేటి క్రీడాకారిణులనైనా ఓడించగలమని నిరూపించాను. –భవీనా పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ మహిళల ఆర్చరీ కాంపౌండ్ ఎలిమినేషన్ రౌండ్: జ్యోతి X కెరీ (ఐర్లాండ్); ఉ. గం. 6:55 నుంచి మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్–4 సింగిల్స్ ఫైనల్: భవీనా X యింగ్ జౌ (చైనా); ఉ. గం. 7:15 నుంచి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ X థాయ్‌లాండ్; ఉదయం గం. 9 నుంచి అథ్లెటిక్స్ పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 ఫైనల్: వినోద్ కుమార్; మధ్యాహ్నం గం. 3:54 నుంచి. అథ్లెటిక్స్ పురుషుల హైజంప్ ఎఫ్–47 ఫైనల్: నిశాద్, రామ్‌పాల్; మధ్యాహ్నం గం. 3:58 నుంచి. దూరదర్శన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Tokyo Paralympics 2021: భారత్‌కు తొలి పతకం ఖరారు
గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్‌లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్‌గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్‌తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్‌లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది. టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్‌వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది. నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. పోలియో బారిన పడి... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. సకీనాకు ఐదో స్థానం పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్‌లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. షాట్‌పుట్‌లో నిరాశ పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్‌పుట్ ఈవెంట్లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్‌కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. శుభారంభం.... ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్: భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్: శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్‌మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్: రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి) పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్‌లో అథ్లెట్ దీపా మలిక్ షాట్‌పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది. -
నేటినుంచి టోక్యోలో మళ్లీ క్రీడా సంబరం
టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తొలిరోజు నుంచే పతకాన్ని, సంతోషాన్ని పంచింది. అలాగే పారాలింపిక్స్ కూడా ఈ సంతోషాన్ని, పతకాలను రెట్టింపు చేయాలని భారత పారాఅథ్లెట్ల బృందం గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా, హైజంపర్ మరియప్పన్ తంగవేలు రియో పారాలింపిక్స్‌కు రీప్లే చూపాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి పదికిపైగా పతకాలు సాధించాలని, స్వర్ణాల వేట కూడా పెరగాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది. టోక్యో: మరో విశ్వ క్రీడా వేడుకకు టోక్యో సిద్ధమైంది. రెగ్యులర్ ఒలింపిక్స్‌కు దీటుగా పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు సై అంటున్న జపాన్, మంగళవారం అట్టహాసంగా ఆరంభ సంబరాలు నిర్వహించనుంది. అనంతరం పారాథ్లెట్ల పోరాటం మొదలవనుంది. కరోనా మహమ్మారిని ఓ కంట కనిపెడుతూనే ఈ మెగా ఈవెంట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించాలని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ పగలురేయి శ్రమిస్తోంది. ప్రేక్షకులను ఈ పోటీలకు కూడా అనుమతించడం లేదు. క్రమం తప్పని కోవిడ్ టెస్టులు, ప్రొటోకాల్ తదితర పకడ్బంది చర్యలతో పోటీలు నిర్వహిస్తారు. చదవండి: Miguel Oliveira: సవతి సోదరితో నెల రోజుల కిందట పెళ్లి.. త్వరలోనే.. ఎవరికెవరూ తీసిపోరు... పారాలింపియన్ల పట్టుదల ముందు వైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. పారాలింపిక్ దిగ్గజం, బ్రెజిల్ స్విమ్మర్ డానియెల్ డియాస్ వరుసగా నాలుగో మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 24 పతకాలు గెలుచుకున్న డానియెల్ ఈ సారి ఆ సంఖ్యను 30కి చేర్చుతాడనే అంచనాలున్నాయి. అమెరికా మహిళా స్విమ్మర్లు జెస్సికా లాంగ్, మెకెంజీ కోన్లు కూడా టోక్యో కొలనులో రియో టైటిళ్లను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. జర్మనీ లాంగ్‌జంపర్, మార్కస్ రెమ్, ఇరాన్ ఆర్చర్ జహ్రా నెమటి, బ్రిటన్ వీల్‌చైర్ టెన్నిస్ ప్లేయర్ జోర్డాన్ విలీ, జపాన్ పారాథ్లెట్ సాటో తొమకి తదితర స్టార్లతో టోక్యో వేదిక మురిసిపోనుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. తంగవేలు పతాకధారి ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. పతాకధారి మరియప్పన్ తంగవేలు మన జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇరాన్ తర్వాత 17వ దేశంగా భారత్ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్‌లో అథ్లెట్లకు పరిమితులేమీ లేవు. అయితే టోక్యోకు భారత్ నుంచి ఇప్పటివరకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. ఇందులో ఇద్దరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సోనల్ పటేల్, భవిన పటేల్‌లకు మరుసటి రోజు (బుధవారం) పోటీలున్నాయి. దీంతో వారిని మినహాయించి ఐదుగురు అథ్లెట్లకు జతగా ఆరుగురు అధికారులు మార్చ్‌పాస్ట్ చేస్తారని భారత పారాలిం పిక్ కమిటీ కార్యదర్శి, చెఫ్ డి మిషన్ గుర్శరణ్ చెప్పా రు. మువ్వన్నెల పతాకధారి మరియప్పన్ తంగవేలుతో పాటు వినోద్ కుమార్ (డిస్కస్ త్రో), టెక్ చంద్ (జావెలిన్ త్రో), జైదీప్, సకీనా ఖాతూన్ (పవర్ లిఫ్టర్లు)లు ప్రారంభోత్సవంలో కవాతు చేయనున్నారు. చదవండి: హాకీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం అఫ్గాన్ జెండా రెపరెపలు అఫ్గానిస్తాన్‌లో పౌర ప్రభుత్వం కూలి... తాలిబన్ల తుపాకి రాజ్యం నడుస్తోంది. అక్కడి భీతావహ పరిస్థితులు, పౌర విమాన సేవలు లేక ఆ దేశ అథ్లెట్లు ఎవరూ పారాలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. అయినాసరే వారి జాతీయ పతాకం మాత్రం రెపరెపలాడుతుందని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ చీఫ్ అండ్రూ పార్సన్స్ స్పష్టం చేశారు. సంఘీభావానికి సంకేతంగా అఫ్గాన్ జాతీయ జెండా ప్రారంభవేడుకల్లో ఎగురుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్ పతాకాధారిగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారని పార్సన్స్ తెలిపారు. -
ఇక పద... పారాలింపిక్స్‌కు!
న్యూఢిల్లీ: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకున్న భారత్ అదే వేదికపై మళ్లీ పతకాల వేటకు వెళ్లింది. పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు 54 మంది సభ్యులతో కూడిన భారత జట్టు గురువారం అక్కడికి బయల్దేరింది. టోక్యోలోనే ఈ నెల 24 నుంచి దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. భారత ఆటగాళ్లు పోటీ పడే ఈవెంట్లు 27న మొదలవుతాయి. ముందుగా ఆర్చరీ పోటీలు జరుగుతాయి. పారాలింపిక్ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్–46 జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (టి–63 హైజంప్), ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి (ఎఫ్–64 జావెలిన్ త్రో) ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర మూడో స్వర్ణంపై కన్నేశాడు. తను ఇదివరకే ఏథెన్స్(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు నెగ్గాడు. గత పారాలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది. మన జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్ సంఘం అధికారులు గురువారం జరిగిన ‘వర్చువల్ సెండాఫ్’ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు. -
టోక్యో పారా ఒలింపిక్స్‌కు పయనమైన భారత బృందం
న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం పయనమైంది. 54 మందితో టోక్యోకు భారత బృందం బయల్దేరింది. ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఈనెల 27న ఆర్చరీతో భారత్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు కలిపి మొత్తంగా 237 పతకాలు సాధించింది. ఇక బ్రిటన్ 64, ఉక్రెయిన్ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలువగా.. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో నిలిచింది. -
టోక్యో ఒలింపిక్స్.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది
తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేలా సిమ్రాన్ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం. ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్‌కి వెళుతోందని సిమ్రాన్ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల ట్రాక్ ఈవెంట్‌కు సిమ్రాన్ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్ శర్మ! ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్.ఎస్.) జూన్ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్’. ∙∙ సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్‌కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్.ఎస్.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్ చేశాడు! అదే గ్రౌండ్లో ఆమెను ఒలింపిక్స్‌కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు. అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్‌ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు. ∙∙ భర్త ఆమె వ్యక్తి గత కోచ్ అయితే, ఆంటోనియో బ్లోమ్ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్. కోచ్! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్ దుబాయ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. సిమ్రాన్ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్ చైనా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్‌లోనే జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్. టోక్యో ఒలింపిక్స్‌తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు. సిమ్రాన్ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు. -
గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్‌తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్‌కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్‌మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్‌కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్‌కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్‌డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్‌జెక్ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్‌మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్‌గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్‌కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్‌కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్‌మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్‌లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్‌కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్‌విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్‌కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్‌గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్‌విల్లే గేమ్స్‌ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్‌కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్‌మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్‌తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్‌విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్‌గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్‌తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
ఆట ఆడుతూ ఉండు
విధి మన ఆటను సడన్‌గా మారుస్తుంది. మనం ఏదో గోల్ అనుకుని వెళుతూ ఉంటాం. అది గేమ్‌ను తిరగేసేస్తుంది. పరిగెత్తేవారిని కూచుండి పోయేట్టు... కూచున్నవారిని పాకుతూ వెళ్లేట్టు చేస్తుంది విధి. అయితే మనం ఓడిపోతామా? కొత్త ఆట మొదలెడతాం. కొత్త గోల్‌ను సెట్ చేసుకుంటాం. బంతి ఎప్పుడూ విధి చేతిలోనే ఉండదు. మన దగ్గరికీ వస్తుంది. అప్పుడు లాగి పెట్టి కొట్టడమే. కశ్మీర్‌కు చెందిన ఇష్రత్ అఖ్తర్ చేస్తుంది అదే. అల్లర్ల వల్ల కాళ్లు పోగొట్టుకున్నా వీల్ చైర్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా స్ఫూర్తినిస్తోందా అమ్మాయి. ఈ సంవత్సరం అంతా సజావుగా జరిగి ఆగస్ట్‌లో ‘పారలింపిక్స్’ (దివ్యాంగుల ఒలింపిక్స్) టోక్యోలో జరిగితే మనం ఇష్రత్ అఖ్తర్ పేరు తప్పక వింటాం. ఆ అమ్మాయి భారతదేశం తరుఫున ఆ పోటీలలో వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా–ఓషెనియా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ఆడిన ఇష్రత్ గొప్ప ప్రతిభను ప్రదర్శించింది. కోవిడ్ వల్ల 2020లో జరగాల్సిన పారలింపిక్స్ 2021కు జరపబడ్డాయి. అయినా సరే ఉత్సాహం నీరుగారిపోకుండా బారాముల్లాలోని తన ఇంటి వద్దే రేయింబవళ్లు ప్రాక్టీస్ చేస్తోంది ఇష్రత్. అయితే ఇంత ప్రావీణ్యం ఉన్న అమ్మాయి నిజంగా బాస్కెట్‌బాల్ ప్లేయర్ కాదు. విధి విసిరిన సవాలుకు ఆమె అలా స్పందించింది. మేడ మీద నుంచి దూకేసి ఇష్రత్ అఖ్తర్‌ది బారాముల్లాలోని బంగ్దారా అనే గ్రామం. 2016లో ఆమెకు 19 ఏళ్లు. చదువుకుంటోంది. కాని ఆ సంవత్సరం కశ్మీర్లో అతి పెద్ద ఉగ్రవాది అయిన బర్హాన్ వని ఎన్కౌంటర్ జరిగింది. జూలైలో ఈ ఎన్కౌంటర్ జరిగితే అప్పటి నుంచి జమ్ము కాశ్మీర్ అంతా నిరసనలు అల్లర్లు పెరిగిపోయాయి. ఆగస్టు 24న కొందరు కుర్రాళ్లు భద్రతా దళాల మీద రాళ్లు విసురుతూ ఇష్రత్ ఇంట్లోకి వచ్చి దాక్కున్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన భద్రతా దళాలు ఇష్రత్ ఇంటిని చుట్టుముట్టాయి. ఇష్రత్ ఈ గొడవకి గందరగోళానికి బాగా భయపడిపోయి తన ఇంటి రెండో అంతస్తుకు చేరుకుంది. కుర్రాళ్ల వల్ల లేదంటే లోపలికి వచ్చిన భద్రతాదళాల వల్ల ఏం జరుగుతుందోనని కంగారులో పై నుంచి దూకేసింది. అంతే ఆమెకు ఆ తర్వాత ఏమీ తెలియదు. కళ్లు తెరిచే సరికి రెండు కాళ్లూ చలనం కోల్పోయాయి. ఆమె వెన్నుముకకు సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. 6 నెలలు మంచాన ఉండి.. ‘హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తెస్తే అందరూ శవం వచ్చినట్టుగానే శోకం ప్రకటించారు. చలనం లేని నా దేహం శవమే కదా. ఆరునెలలు మంచాన ఉన్నాను. చాలా డిప్రెషన్ వచ్చింది. అప్పుడు మా నాన్న అబ్దుల్ రషీద్ దగ్గరలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థకు తీసుకెళ్లడం మొదలెట్టాడు. అక్కడంతా నాలాంటి వాళ్లే. అవయవాలు కోల్పోయిన వాళ్ళు’ అంది ఇష్రత్. ‘ఆమె తనలాంటి వాళ్లను చూసి ధైర్యం తెచ్చుకోవాలని ఆ పని చేశాను’ అంటాడు అబ్దుల్ రషీద్. అక్కడే కొందరు దివ్యాంగులు వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆడుతుంటే ఇష్రత్‌కు కూడా ఆసక్తి కలిగింది. వెళ్లి వాళ్లతో ఆడటం మొదలెట్టింది. అప్పటి వరకూ ఆమెకు ఆ ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆమె ఆడుతున్న పద్ధతి చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ సమయంలోనే శ్రీనగర్‌లో జరుగుతున్న వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ల క్యాంప్ గురించి ఇష్రత్‌కు తెలిసింది. తండ్రితో అక్కడకు వెళితే సెలెక్టర్లు ఆమె ప్రతిభను చూసి నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ చేశారు. మొత్తం జమ్ము కశ్మీర్ నుంచి ఒక్క ఇష్రతే ఇందుకు సెలెక్ట్ అయ్యింది. చెన్నైకు వెళ్లి 2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్‌లో పాల్గొనడానికి చెన్నైలో ‘వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డబ్లు్యబిఎఫ్ఐ) నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అది ఆగస్టు 2019. సరిగ్గా ఆ సమయంలోనే జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. నేషనల్ టీమ్ మెంబర్‌గా ట్రయినింగ్ తీసుకోవాల్సిన ఇష్రత్‌కు అసలు సమాచారమే అందలేదు. కాని ఆగస్టు 25న కోచ్ లూయిస్ జార్జ్ ఒక రిటైర్డ్ ఇంటెలిజన్స్ అధికారితో యధాలాపంగా ఈ ప్రస్తావన చేస్తే ఆ అధికారి తన సోర్స్ ద్వారా సైన్యానికి ఈ సంగతి చేరవేసి హుటాహుటిన ఇష్రత్‌ను చెన్నై వచ్చేలా చేశారు. భారత సైన్యం ఇందుకు సహకరించింది. చెన్నైకు చేరిన ఇష్రత్ ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో విశేష ప్రతిభ కనిపించడంతో ఆమె జీవితమే మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. ప్రోత్సహించింది. ‘నన్ను నా వంటి వారిని స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇమ్మని పిలుస్తున్నారు’ అంటోంది ఇష్రత్. ఇష్రత్ నిజంగానే స్ఫూర్తి ఇస్తోంది. కాళ్లు లేకపోతే ఏమి. రెక్కల్లో బలం ఉంది. ఆమె ఎగురుతూనే ఉంటుంది. గోల్స్ కొడుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
బంగారాలకు బ్రహ్మరథం
► తంగమారికి ’కారు’ కానుక ► వేళమ్మాల్‌లో ‘రియో’ హీరోల సందడి ► దీపిక, దేవేంద్ర, వరుణ్‌లకు సత్కారం ► తలా..రూ.ఐదు లక్షల విలువైన బంగారు నాణేలు ► విద్యార్థులతో ముచ్చట్లు రియో పారాలింపిక్ బంగారాలు గురువారం చెన్నైలో ప్రత్యక్షమయ్యారు.క్రీడారంగంలో దేశానికి వన్నె తెచ్చిన ఈ హీరోలకు వేళమ్మాల్ విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. తమిళ తంగం మారియప్పన్‌కు కారును బహుకరించారు. మరో బంగారం దేవేంద్ర జజారియా, వెండి సింగారం దీపామాలిక్, కాంస్య కెరటం వరుణ్ సింగ్ బాటీలకు తలా రూ. ఐదు లక్షల విలువైన బంగారు నాణేలను అందజేశారు. విద్యార్థులతో ముచ్చటించిన పారా పతకాల ధీరులు తమ క్రీడానుభవాలను పంచుకున్నారు. - సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: చెన్నైలోని వేళమ్మాల్ విద్యాసంస్థ యాజమాన్యం క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నదని చెప్పవచ్చు. భారతదేశంలో ఏ క్రీడాకారుడైనా సరే ఉత్తమ ప్రతిభను కనబరిస్తే చాలు సత్కరిస్తూ, తమ వంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నది. ఆ దిశలో తమిళ తంగం మారియప్పన్ తంగవేలు పారాలింపిక్స్‌లో బంగారం చేజిక్కించుకోవడంతో తమ విద్యాసంస్థకు ఆహ్వానించి గతవారం ఘనంగా సత్కరించారు. ఇక, ఇదే ఒలింపిక్స్‌లో బంగారం, వెండి, కాంస్య పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచిన మరో ముగ్గుర్ని కూడా సత్కరించుకునేందుకు ఆ యాజమాన్యం నిర్ణయించింది.ఇందుకుగాను గురువారం మధురవాయిల్ సమీపంలోని ఆలపాక్కం క్యాంపస్ ఆవరణ వేదికగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైజంప్‌లో బంగారంతో మెరిసిన మారియప్పన్ తంగవేలు, ఎఫ్-46 జావెలిన్ త్రోలో తన రికార్డును తానే బద్దలు చేస్తూ, కొత్త చరిత్ర సృష్టించిన దేవేంద్ర జజరియా, షాట్‌పుట్‌లో వెండి సింగారంతో తొలి భారతీయ మహిళగా ఘనత సాధించిన దీపామాలిక్, హైజంప్‌లో కాంస్యంతో సత్తా చాటిన వరుణ్ సింగ్ బాటి ఉదయాన్నే ఆలపాక్కంకు చేరుకోగానే, వేళమ్మాల్ విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. మేళ తాళాల నడుమ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటే విధంగా ఆహ్వానం పలికారు. జాతీయ పతాకాన్ని చేత బట్టి పారా రియో హీరోలను ఆహ్వానిస్తూ, తమ విద్యా సంస్థల్లోకి తీసుకెళ్లారు. అక్కడి వేదికపై జరిగిన వేడుకలో పూలమాలలతో, పూల కిరీటాలతో ఘనంగా సత్కరించారు. క్రీడాస్ఫూర్తిని చాటే పాటలతో ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులను అభినందనలో ముంచెత్తారు. తంగంకు కారు : రియోలో తంగంతో మెరిసిన రాష్ట్రానికి చెందిన మారియప్పన్ తంగవేలుకు ఆ విద్యా సంస్థ యాజమాన్యం రూ. ఆరు లక్షలు విలువగల రెనాల్ట్ కై ్వడ్ కారును బహూకరించింది. దేశ గౌరవాన్ని పెంచడంలోనే కాదు, తమిళ ఖ్యాతిని రియోలో చాటిన తంగంను ఈ సందర్భంగా విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు. ఆ విద్యా సంస్థ చైర్మన్ వేల్ మురుగన్ కారు తాళంను మారియప్పన్‌కు అందజేశారు. అలాగే, మిగిలిన ముగ్గురు హీరోలను బంగారాలతో సత్కరించారు. ఒకొక్కరికి రూ. ఐదు లక్షలు విలువల బంగారు నాణేలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా క్రీడ కారుల రియో విజయకేతనాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా వీడియో ప్రజంటేషన్ను ప్రదర్శించడం విశేషం. ఈ సమయంలో ఇక్కడి విద్యార్థుల కేరింతలకు హద్దే లేదు. క్రీడాకారులకు విద్యార్థులు, విద్యార్థులకు క్రీడాకారులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే, విద్యార్థులతో రియో హీరోలు ముచ్చటించారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతి రోజూ ఓ పండుగే: దీపామాలిక్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, వేళమ్మాల్‌లో తమను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రోత్సాహం అన్నది ఉంటే చాలు, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగగలమని, మరిన్ని పతకాలను సాధించగలమన్నారు. ఈ వయస్సులో కూడా తాను ప్రతిభను చాటుకోవడంతో పతకం దక్కిందని, ఇది తనకు ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ పండుగే అని, ఆనందోత్సాహలతో ప్రతిరోజును పరిగణించాలని ఓ విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. క్రమశిక్షణ, కృషి , పట్టుదల ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగలమన్న భావనతో ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రీడాకారుడు అడుగు పెట్టిన, సత్కారం అందుకున్న వేళమ్మాల్ విద్యాసంస్థ వేదికలో, తాను కూడా సత్కారం పొందడం జీవితంలో లభించిన అదృష్టంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే, వైకల్యం అడ్డు కాదు అని, కృషి, పట్టుదల, సాధన ఉంటే చాలు అంటూ, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఉదాహరణగా రియోలో పతకాలు సాధించిన తమ నలుగుర్ని ఉద్దేశించి సమాధానం ఇచ్చారు. మారియప్పన్ మాట్లాడుతూ తన తల్లి, సోదరుడు, సోదరి ప్రోత్సాహం, తన స్వగ్రామంలోని ప్రతి ఒక్కరూ అందించిన సహకారం, పాఠశాల, కళాశాల స్థాయిలో లభించిన ఆదరణతో పాటు కోచ్ ఇచ్చిన సాధనతో తాను ఈ పతకాన్ని సాధించినట్టు వివరించాడు. దేవేంద్ర మాట్లాడుతూ తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. దివ్యాంగుడు అన్న భావనను వీడాలని, ఎంతటి విజయాన్ని అయినా సాధించగలమన్న ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వరుణ్‌సింగ్ బాటీ మాట్లాడుతూ ఏదైనా సాధించ గలనన్న దృక్పథంతో శ్రమించానని, అందుకు ఫలితం గా పతకం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం 80 చ.అడుగులతో ఆ విద్యా సంస్థ విద్యార్థులు రియో పారాలింపిక్లోని క్రీడల్ని ఎత్తి చూపుతూ సిద్ధం చేసిన పెరుయింటింగ్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సపాల్ జయంతి రాజగోపాలన్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా ముగిసిన పారాలింపిక్స్
-
ఘనంగా ముగిసిన పారాలింపిక్స్
* ఆకట్టుకున్న విన్యాసాలు * ఇరాన్ సైక్లిస్ట్ మృతికి నివాళి రియో డి జనీరో: కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు.. రంగురంగుల విద్యుత్ కాంతులు.. హోరెత్తించే సంగీత కార్యక్రమాలతో రియో పారాలింపిక్స్ ముగింపు సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్నో అడ్డంకులు, సవాళ్లను అధిగమించిన బ్రెజిల్ మొత్తానికి ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను విజయవంతంగా ముగించగలిగింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున ప్రఖ్యాత మరకానా స్టేడియంలో కన్నులపండవగా జరిగిన ఈ వేడుకలు ‘జీవవైవిధ్యం: మన స్ఫూర్తి’ అనే థీమ్ ఆధారంగా సాగాయి. వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు తమ ప్రదర్శనతో అబ్బురపరిచారు. పుట్టుకతోనే చేతులు కోల్పోయిన బ్రెజిల్ గిటారిస్ట్ జొనాథన్ బాస్టోస్ తన కాళ్లతో గిటార్‌ను వాయించే ప్రదర్శనతో వేడుకలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత 16 మంది వీల్‌చెయిర్‌లో కూర్చుని చేసిన నృత్యం ఆకట్టుకుంది. అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ క్రీడలు ముగస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సింగర్ సాలో లూకాస్ బ్రెజిల్ జాతీయగీతాన్ని ఆలపించారు. ప్రారంభ వేడుకల మాదిరి అందరూ కాకుండా 160 దేశాలకు చెందిన ఒక్కో అథ్లెట్ తమ దేశ పతాకాలను చేతబూని పరేడ్ చేశారు. అంతేకాకుండా పోటీల చివరి రోజు ప్రమాదవశాత్తు మరణించిన ఇరాన్ సైక్లిస్ట్ బహ్మాన్ గోల్బర్నెజ్హద్కు నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించారు. చివర్లో పారాలింపిక్ పతాకాన్ని రియో గేమ్స్ నిర్వాహకులు టోక్యో గవర్నర్‌కు అందించారు. 2020లో ఈ గేమ్స్ జపాన్‌లో జరుగుతాయి. -
స్ఫూర్తినిచ్చారు..
పారాలింపిక్స్‌లో అదరగొట్టిన భారత్ చరిత్రలో తొలిసారి ఒకే టోర్నీలో నాలుగు పతకాలు ఒలింపిక్స్‌లో కనీసం పది పతకాలైనా తెస్తారని భావించిన భారత క్రీడాభిమానుల ఆశలపై మన అథ్లెట్లు నీళ్లు చల్లారు. చివర్లో రెండు పతకాలు వచ్చాయన్న సంతృప్తి మిగిలినా ఎక్కడో ఏదో తెలీని వెలితి. ఆ వెలితి తీరిపోయి.. అభిమానులకు ఊహించని స్థాయి ఆనందం మరో నెలరోజుల్లోపే కలుగుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే మన పారాథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని ఒకే పారాలింపిక్ టోర్నీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించి అభిమానులకు వెల కట్టలేని ఆనందం అందించారు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా పతకాలు నెగ్గిన మన క్రీడారులు.. అలాగే ఆ ఈవెంట్ పాల్గొన్న మొత్తం 19 మంది భారత ప్లేయర్లు మనందరికీ స్ఫూర్తిదాయకం. రియో డీ జనీరో: రియో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పోటీ పడుతున్న క్రీడాంశాల్లో పోటీలు ముగిశాయి. మన క్రీడాకారులు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మనకు గర్వకారణంగా నిలిచారు. నిజానికి రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనతో నిరాశ చెందిన క్రీడాభిమానులకు పారాలింపిక్స్ మొదలయ్యేంత వరకు అందులో పోటీపడుతున్న ఆటగాళ్ల గురించి మనవాళ్లకు పెద్దగా తెలియదు. ఈ పోటీల్లో పాల్గొన్న భారత క్రీడాకారులు 19 మందే. పైగా అంచనాలు లేవు. కానీ ఒక్కసారి పోటీలు ఆరంభమాయ్యక అద్భుత ప్రదర్శనతో అందరీ దృష్టీ తమవైపు మళ్లేలా చేశారు. దృఢ సంకల్పంతో శారీరక వైకల్యాన్ని జరుుంచి పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. శనివారంతో రియో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రస్థానం ముగిసింది. ఆఖరి రోజు పోటీపడ్డ ముగ్గురు భారత క్రీడాకారులూ విఫలమయ్యారు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్56/57)లో వీరేందర్ 8వ స్థానంలో నిలవగా.. . హైజంప్ (టీ45/46/47)లో రాంపాల్ ఆరో స్థానం సాధించాడు. మహిళల డిస్కస్ త్రో (ఎఫ్55)లో కర్మజ్యోతి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. రెండు స్వర్ణాలు, ఒక రజతం, మరొక కాంస్యం.. పారాలింపిక్స్‌లో 1968 నుంచి పోటీపడుతున్న భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఒకే పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. చిన్నప్పుడే ప్రమాదంలో కాలు కోల్పోయిన తమిళ తంబి తంగవేలు మారియప్పన్ హైజంప్‌లో పసిడితో ఘన బోణీ కొట్టగా.. పోలియో కారణంగా వికలాంగుడిగా మారిన వరుణ్ సింగ్ భాటి కాంస్యం కొల్లగొట్టాడు. శస్త్రచికిత్సల వల్ల చక్రాల కుర్చీకి పరిమితమైన దీపా మాలిక్ షాట్‌పుట్ రజతం గెలిచి పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించగా.. ఎనిమిదేళ్లవయసులో విద్యుదాఘాతానికి ఓ చేరుుకోల్పోరుున దేవేంద్ర జజారియా పారాలింపిక్స్‌లో రెండో స్వర్ణం నెగ్గిన భారత తొలి పారాఅథ్లెట్‌గా ఘనత వహించాడు. వైకల్యం శరీరానికే కాని సవాళ్లకు కాదని చాటి చెప్పిన ఈ అథ్లెట్ల విజయగాథ కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. -
తృటిలో చేజారిన కాంస్యం
రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన ఎఫ్51 క్లబ్ త్రో ఈవెంట్లో 31 ఏళ్ల ఈ హరియాణా పారా అథ్లెట్ 26.63మీ. దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. స్లొవేకియాకు చెందిన మరియన్ కురేజ 26.82మీ. విసిరి కాంస్యం సాధించాడు. వీరిద్దరి మధ్య దూరం కేవలం 0.19మీ. మాత్రమే. తొలి స్థానంలో నిలిచిన జెల్జికో దిమిత్రిజెవిక్ (29.96మీ) ప్రపంచ రికార్డును సృష్టించాడు. -
అ 'ద్వితీయం'
జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డుతోపాటు అగ్రస్థానం ఒలింపిక్స్ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి భారతీయుడిగా గుర్తింపు ‘రియో’లో భారత జాతీయ గీతం మళ్లీ వినిపించింది. మువ్వన్నెల పతాకం పైపైకి ఎగిరింది. మూడు వారాల క్రితం రియోలోనే ముగిసిన ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో పసిడి పతకం లేని లోటును తీర్చుతూ... అదే వేదికపై జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం లభించింది. ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్లో 35 ఏళ్ల దేవేంద్ర జజరియా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకై క భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. 2004 ఏథెన్‌స ఒలింపిక్స్‌లోనూ దేవేంద్ర ఇదే ఈవెంట్లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత అదే ఫలితాన్ని పునరావృతం చేసి ఔరా అనిపించాడు. రియో డి జనీరో: భారత క్రీడాభిమానులకు రియో నుంచి మరో ‘బంగారం’లాంటి శుభవార్త అందింది. పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్లో భారత అథ్లెట్ దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల దేవేంద్ర ఈటెను 63.97 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. దాంతో రియో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. పురుషుల హైజంప్‌లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం, వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గగా... మహిళల షాట్‌పుట్‌లో దీపా మలిక్ రజత పతకాన్ని గెల్చుకున్న సంగతి విదితమే. 12 ఏళ్ల క్రితం 2004 ఏథెన్‌స ఒలింపిక్స్‌లో దేవేంద్ర 62.15 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని సాధించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేవేంద్ర ఈవెంట్ లేకపోవడంతో అతను పాల్గొనలేకపోయాడు. రియోలో మళ్లీ అతని ఈవెంట్‌ను చేర్చడంతో దేవేంద్ర రెండోసారీ బంగారు పతకాన్ని నెగ్గి అద్వితీయ ఘట్టాన్ని లిఖించాడు. మొత్తం 13 మంది పాల్గొన్న ఫైనల్స్‌లో అందరికీ ఆరుసార్లు ఈటెను విసిరే అవకాశం లభించింది. భారత్ నుంచి దేవేంద్రతోపాటు రింకూ హుడా, సుందర్‌సింగ్ గుర్జర్ పాల్గొన్నారు. రింకూ హుడాకు (54.39 మీటర్లు) ఐదో స్థానం లభించగా... సుందర్ సింగ్ మాత్రం వైదొలిగాడు. చున్లియాంగ్ గువో (చైనా-59.93 మీటర్లు) రజతం గెలుపొందగా... ముదియన్సెల్ హెరాత్ (శ్రీలంక-58.23 మీటర్లు) కాంస్యం సాధించాడు. దేవేంద్ర తొలి ప్రయత్నంలో ఈటెను 57.25 మీటర్లు, రెండో ప్రయత్నంలో 60.70 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మూడు ప్రయత్నాల్లో అతను వరుసగా 57.35 మీ., 59.99 మీ., 61.61 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఆరింటిలో అత్యధిక దూరమైన 63.97 మీటర్లకు దేవేంద్రకు పసిడి పతకం ఖాయమైంది. 2013 అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్‌సలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ దేవేంద్రకు స్వర్ణం లభించడం విశేషం. ఓవరాల్‌గా పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు లభించిన పసిడి పతకాలు. దేవేంద్ర రెండు స్వర్ణాలు సాధించగా... మురళీకాంత్ పేట్కర్ (1972 హిడెల్‌బర్గ్-స్విమ్మింగ్), తంగవేలు మరియప్పన్ (2016 రియో-అథ్లెటిక్స్) ఒక్కో బంగారు పతకాన్ని గెలిచారు. మొత్తంగా ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు 12 పతకాలు లభించారుు. ఇందులో నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. ఒకే పారాలింపిక్స్‌లో అత్యధికంగా నాలుగు పతకాలు నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 1984 స్టోక్ మాండివిలి-న్యూయార్క్క్రీడల్లోనూ భారత్‌కు నాలుగు పతకాలు వచ్చారుు. ‘సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. 12 ఏళ్ల తర్వాత మళ్లీ నా రికార్డును నేనే బ్రేక్ చేసుకోవడం గర్వంగా ఉంది. ఫిన్లాండ్లో రోజుకు ఏడు గంటల పాటు శిక్షణలో పాల్గొన్నాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. పారాలింపిక్స్ గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఈసారి భారత్‌కు వచ్చిన పతకాల తర్వాత ఈ క్రీడలకు కూడా ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నాను. భవిష్యత్ గురించి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవు. కానీ నా అనుభవాన్ని దేశంలోని చిన్నారులకు అందిస్తాను.’ - దేవేంద్ర దేవేంద్ర జజరియాపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని దగ్గరి నుంచి సాధారణ పౌరుడి దాకా పలువురు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పారాలింపిక్స్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన దేవేంద్రకు అభినందనలు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం’ - ప్రధాని నరేంద్ర మోదీ ‘జజరియా యావత్ జాతి గర్వించే విజయాన్నిచ్చాడు. భారత్‌కు చిరస్మరణీయ పతకాన్ని అందించాడు’ - కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ‘దేవేంద్ర అంకితభావం అద్భుతం. అసాధారణ ప్రదర్శనతో పసిడి పతకం నెగ్గాడు. దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు’ - కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ -
ఒలింపిక్ విజేతకే షాక్ ఇచ్చేలా..
పారాలింపిక్స్ 1500మీ. పరుగులో బాకా రికార్డు రియో డి జనీరో: ఒలింపిక్స్ విజేత నెలకొల్పిన రికార్డును ఓ పారాలింపిక్స్ అథ్లెట్ అధిగమించడమంటే మాటలా... వినడానికి నమ్మశక్యంగా లేని ఈ ఫీట్‌ను అల్జీరియాకు చెందిన అబ్దెల్లతిఫ్ బాకా సాధ్యం చేసి చూపించాడు. మంగళవారం జరిగిన టి13 1500మీ. ఫైనల్ పరుగును బాకా 3 నిమిషాల 48.29 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇది గత నెలలో జరిగిన ఒలింపిక్స్ 1500మీ. చాంపియన్ మాథ్యూ సెంట్రోవిట్జ్ (3నిమిషాల 50.00 సె) టైమింగ్కన్నా 1.7 సెకన్ల కన్నా తక్కువ కావడం విశేషం. అంతేకాకుండా రజతం సాధించిన టమిరు డెమిస్సే (ఇథియోపియా, 3.48:49), కాంస్యం సాధించిన హెన్రీ కిర్వా (కెన్యా, 3.49:59), నాలుగో స్థానంలో నిలిచిన ఫోవద్ బాకా (అల్జీరియా, 3.49:84) కూడా ఈ ఒలింపిక్స్ చాంపియన్కన్నా వేగంగా పరిగెత్తి రేసు పూర్తి చేయడం నిజంగా అభినందనీయం. -
మణి దీపం
దీపా మలిక్ కొత్త చరిత్ర రియోలో దీప, మలిక్‌ల విన్యాసాలు మరచిపోకముందే ఈసారి దీపా మలిక్ మన జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. భారత్ కీ బేటీలే కాదు... భారత్ కీ ‘మా’ కూడా దేశం గర్వపడేలా చేయగలదని 46 ఏళ్ల ఈ స్ఫూర్తి ప్రదాత నిరూపించింది. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత నారి ఘనతను ప్రపంచానికి చాటింది. కాళ్లు కదపలేకపోతేనేమి... ఆత్మస్థైర్యం నిండిన ఆ చేతులు ఇనుప గుండును అల్లంత దూరం విసిరి వెండి వెలుగులు పంచాయి. రియో వేదికగా... తొలిసారి ఓ భారత మహిళ పారాలింపిక్స్ పతకం సాధించింది. ♦ పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు ♦ రియోలో షాట్‌పుట్ ఈవెంట్లో రజతం రియో డి జనీరో: భారత క్రీడాభిమానులకు మరో తీపి కబురు. రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో దీపా మలిక్ ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్ (బహ్రెయిన్-4.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... దిమిత్రా కొరోకిడా (గ్రీస్-4.28 మీటర్లు) కాంస్యం సంపాదించింది. హరియాణాలోని సోనెపట్‌కు చెందిన 46 ఏళ్ల దీపా పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దీప మొత్తం ఆరు ప్రయత్నాలు చేసింది. ఆరో ప్రయత్నంలో ఆమె ఇనుప గుండును అత్యధికంగా 4.61 మీటర్ల దూరం విసిరి రజతాన్ని ఖాయం చేసుకుంది. తొలి మూడు ప్రయత్నాల్లో ఆమె వరుసగా 4.26 మీటర్లు, 4.49 మీటర్లు, 4.41 మీటర్లు దూరం విసిరింది. నాలుగో ప్రయత్నం ఫౌల్ కాగా... ఐదో ప్రయత్నంలో 4.41 మీటర్ల దూరం విసిరింది. ఆల్‌రౌండర్: షాట్పుట్తోపాటు జావెలిన్ త్రో, స్విమ్మింగ్‌లో ప్రవేశమున్న దీపా మలిక్ 2011లో ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌పుట్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు 2010లో ఆసియా పారాగేమ్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్యం సాధించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ పురస్కారాన్ని అందుకుంది. అర్జున అవార్డు పొందిన పెద్ద వయస్కురాలిగా కూడా దీప (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది. హరియాణా రూ.4 కోట్లు: రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన దీపా మలిక్‌కు హరియాణా ప్రభుత్వ క్రీడా పథకం నిబంధనల ప్రకారం రూ. 4 కోట్ల నజరానా లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు లభించనున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ. కోటి నజరానా ప్రకటించారు. అభినందనల వెల్లువ: దీపా మలిక్ పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. ‘దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా... దేశానికి స్ఫూర్తిని అందించే పతకం ఇదంటూ అభినవ్ బింద్రా అభినందనలు తెలిపాడు. సచిన్‌తో పాటు పలువురు క్రికెటర్లు, సోనియాతో సహా అనేకమంది రాజకీయ నాయకులు దీపను అభినందించారు. ‘నేనెంతో గర్వపడే క్షణం ఇది. వైకల్యంతో బాధపడే మహిళలకు అండగా నిలిచేందుకు ఈ విజయం తోడ్పడుతుంది. భారత జట్టులో పెద్ద వయస్కురాలిగా ఉండి పతకం గెలవడం సంతోషంగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఇందులో నా కుటుంబం మొత్తం తోడుగా నిలిచింది‘ - దీపా మలిక్ ‘విల్ ఆన్ వీల్స్’ దీపా మలిక్ స్ఫూర్తిదాయక గాథ అథ్లెటిక్స్.. బైక్ రైడింగ్.. స్విమ్మింగ్... అడ్వెంచరస్ స్పోర్ట్స.. నడుము కింది భాగం అంతా చచ్చుబడిపోరుు చక్రాల కుర్చీకే పరిమితమైపోరుున 46 ఏళ్ల మహిళ ఈ అన్ని అంశాల్లో అసాధారణ ప్రతిభ చూపడాన్ని కనీసం ఊహించగలమా..! వైకల్యాన్ని అధిగమించి ఎన్నో ఘనతలు సాధించిన స్ఫూర్తి ప్రదాత దీపా మలిక్. పారాలింపిక్స్ పతకంతో దీపా మలిక్ అద్భుతాల జాబితాలో మరో కోహినూర్ చేరింది. చిన్ననాటినుంచి ఆమె జీవితమే ఒక పోరాటంగా బతికింది. మూడేళ్లు ఆస్పత్రిలో..: తండ్రి బీకే నాగ్‌పాల్ ఆర్మీలో ఉన్నతాధికారి. సరదాగా గడిచిపోతున్న బాల్యానికి ఐదేళ్ల వయసులోనే దేవుడు అడ్డుకట్ట వేశాడు. పారాప్లెజిక్ డిసెబిలిటీతో దీప కాళ్లూ, చేతులూ ఒక్కసారిగా బలహీనంగా మారిపోయాయి. కనీసం నిలబడటం కూడా సాధ్యం కాకపోయేది. వెన్నెముక సమస్య అని తేల్చిన డాక్టర్లు చివరకు సుదీర్ఘ వైద్యం చేశారు. మూడేళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఎలాగో కోలుకొని మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చింది. బైక్‌ల పిచ్చి: చిన్నప్పటినుంచి దీప స్నేహితుల్లో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. దాంతో మోటార్ బైక్‌లు అంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యే సరికే ఇదీ, అదని లేకుండా అన్ని రకాల బైక్‌లను నడిపేసింది. బైక్‌ల మీద వ్యామోహమే ఇంటికి పెళ్లి సంబంధాన్ని తెచ్చింది. ఒక రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు ఏదో పని మీద నిలబడి ఉన్న సైనికుడి వద్ద బైక్ తీసుకొని అక్కడికక్కడే భిన్నమైన విన్యాసాలు చేసేసింది. దాంతో మనసు పారేసుకున్న ఆ కుర్రాడు కల్నల్ విక్రమ్ సింగ్ పెళ్లి చేసుకుంటానంటూ ఇంటికొచ్చేశాడు. కూతురికి కూడా..: దీప హెల్త్ రిపోర్ట్లు అన్నీ చూపించి ఇదీ పరిస్థితి అని చెప్పినా ఆ సైనికుడు వెనుకడుగు వేయలేదు. దాంతో 19 ఏళ్లకే పెళ్లయిపోయింది. కొన్నాళ్లు మళ్లీ సంతోషాలు విరబూసాయి. ఒక పాప (దేవిక)పుట్టింది. అయితే 13 నెలల వయసులో ఆ చిన్నారికి కూడా తల్లిలాగానే సమస్య రావడంతో అమ్మ గుండె తరుక్కుపోయింది. అయితే చివరకు కోలుకున్న ఆ చిన్నారి నిలబడగలిగింది. ఆ తర్వాత రెండో పాప (అంబిక) కూడా పుట్టి కుటుంబంలో సంతోషాన్ని పంచింది. ఒక్కసారి నడుస్తాను ప్లీజ్: అది 1999లో కార్గిల్ వార్ జరుగుతున్న సమయం... భర్త విక్రమ్ యుద్ధ భూమిలో ఉన్నాడు. ఇక్కడ దీప ఒక్కసారిగా అనారోగ్యం పాలైంది. చికిత్స కోసం వెళితే చిన్ననాటి సమస్య మళ్లీ వచ్చిందని తెలిసింది. ఆపరేషన్ చేసి ట్యూమర్‌ను తొలగిస్తామని డాక్టర్లు చెప్పారు. అయితే జీవితంలో మళ్లీ నడవలేవని పిడుగులాంటి మాట కూడా చెప్పారు. కన్నీళ్లు జలపాతాలై కారుతుండగా శాటిలైట్ ఫోన్లో భర్తతో మాట్లాడింది. అచ్చమైన సైనికుడిలా ‘నీకు నేనున్నాను, మరేం భయం లేదంటూ’ భర్త ధైర్యం నూరిపోశాడు. ఆపరేషన్‌కు అంతా సిద్ధమైంది. థియేటర్లోకి వెళ్లే ముందు డాక్టర్‌తో ‘చివరిసారిగా నడుస్తాను’ అని చెప్పి అక్కడి వరకు దీప నడుస్తూ పోయింది. చక్రాల కుర్చీలోనే విజయాలు... తనకు ఇలాంటి జీవితం ఇచ్చినందుకు దేవుడిని తిట్టుకోలేదు. తన ఆరోగ్య పరిస్థితి ఆమెలో మరింత స్థైర్యాన్ని, పట్టుదలను పెంచింది. ముందుగా కుటుంబ సభ్యుల సహకారంతో రెస్టారెంట్ నడిపి సక్సెస్ అయింది. స్విమ్మింగ్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయిన వారికి యమునా నదిలో ఏటికి ఎదురీది చూపించింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో హిమాలయాల వద్ద రైడింగ్ చేసింది. తర్వాత అథ్లెటిక్స్‌లోకి వచ్చింది. వీల్‌చైర్‌తోనే అంతా ముగిసిపోదని, జీవితమంటే ప్రతి రోజూ చేసుకునే పండగలాంటిదని నమ్మిన దీపా మలిక్ తనలాంటి వారి కోసం ఇప్పుడు ‘విల్ ఆన్ వీల్స్’ అనే సంస్థను కూడా నడిపిస్తోంది. -
తంగవేలు పెద్ద మనసు
చెన్నై: పారాలింపిక్స్ హైజంప్‌లో స్వర్ణం తో భారత గౌరవాన్ని పెంచిన దివ్యాంగ అథ్లెట్ తంగవేలు మరియప్పన్... ఇప్పు డు దాతృత్వంలోనూ తన పెద్ద మనసును చూపించాడు. పతకం సాధించినందుకు తనకు లభిస్తున్న మొత్తంలో నుంచి రూ.30 లక్షల రూపాయలు తనకు ఓనమాలు నేర్పిన ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇస్తున్నాడు. -
పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం
-
పాదం లేకున్నా... పట్టుదల ఉంది
-
తంగవేలు...నీకు జేజేలు
భారతదేశం ప్రతిరోజు ఆశగా నిద్ర లేచింది. కానీ స్వర్ణం కల సాకారం కాకుండానే ఒలింపిక్స్ ముగిశాయి. అయితే అదే వేదికలో ఒలింపిక్స్ ముగిసిన 20 రోజుల తర్వాత భారత్‌కు బంగారు కల నెరవేరింది. రియోలోనే జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ తంగవేలు హైజంప్‌లో స్వర్ణం సాధించి మువ్వన్నెలు రెపరెపలాడించాడు. ఇదే ఈవెంట్లో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించడంతో ఆనందం రెట్టింపయిది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఈ ఇద్దరికీ భారత్ జేజేలు పలుకుతోంది. పారాలింపిక్స్‌లో పతకం సాధిస్తానని నమ్ముతూ వచ్చాను. రియోకి రావడానికి ముందే 1.85మీ. ఎత్తును అధిగమించాను. నేను మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ను. అందుకే అంత నమ్మకంతో ఉన్నాను. ఇక స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది అత్యంత మధురమైన రోజు. నా కోచ్ సత్యనారాయణ, సాయ్ అధికారుల కృషిని మరువలేను. కేంద్రం ‘టాప్’ స్కీంలో నేనూ ఉన్నాను. శిక్షణ కోసం జర్మనీ పంపారు. -తంగవేలు రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో రెండో రోజే భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దేశ అథ్లెట్ల సంచలన ప్రదర్శనతో ఒకే ఈవెంట్లో రెండు పతకాలు వచ్చారుు. శనివారం తెల్లవారుజామున జరిగిన పురుషుల హైజంప్ టి-42లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు కొత్త చరిత్ర సృష్టిస్తూ స్వర్ణం సాధించగా... ఇదే విభాగంలో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు. మరో అథ్లెట్ శరద్ కుమార్ ఆరో స్థానంలో నిలిచాడు. తంగవేలు 1.89మీ. ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా... భటి 1.86మీ.తో మూడో స్థానంలో నిలి చాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రెవే (1.86) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. ఇటీవల ట్యునీషియాలో జరిగిన ఐపీసీ గ్రాండ్‌ప్రి ఈవెంట్లో తంగవేలు 1.78మీ. జంప్‌తో స్వర్ణం అందుకున్నాడు. హోరాహోరీ పోరాటంలో... ఈసారి పారాలింపిక్స్ హైజంప్ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 12 మంది అథ్లెట్లు పాల్గొన్న హైజంప్‌లో తొలి ఎనిమిది ప్రయత్నాల్లో 1.74మీ. అర్హత ప్రమాణాన్ని ఆరుగురు అథ్లెట్లు సాధించారు. పదో ప్రయత్నంలో తంగవేలు 1.77మీ. హైజంప్ చేసి సహచర అథ్లెట్ శరద్ కుమార్, మరో ఇద్దరితో కలిసి టాప్‌లో నిలిచాడు. కానీ చివరి దశల్లో పోటీ హోరాహోరీగా సాగింది. శరద్ నిరాశపరుస్తూ నిష్ర్కమిం చగా అటు తంగవేలు, వరుణ్ భటి 1.83మీ. ఎత్తుతో అందరికన్నా ముందు నిలిచారు. ఆ తర్వాత సామ్ గ్రెవే వీరిద్దరిని వెనక్కి నెట్టి 1.86మీ. జంప్‌తో టాప్‌లో నిలిచాడు. కానీ ఫైనల్ ప్రయత్నంలో తంగవేలు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఏకంగా 1.89మీ. హైజంప్‌తో స్వర్ణం అందుకోగా గ్రెవే, వరుణ్ 1.86మీ.లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గ్రెవే, వరుణ్ ఇద్దరూ సమాన ఎత్తు ఎగిరినా... గ్రెవే తన తొలి ప్రయత్నంలో 1.86మీ. ఎగిరాడు. దీంతో తనకు రజతం లభించింది. వరుణ్ తన మూడో ప్రయత్నంలో 1.86మీ. ఎగిరాడు. -
డయాస్... ది గ్రేట్
పారాలింపిక్స్‌లో ఇప్పటివరకూ 16 పతకాలు రియో డి జనీరో: డానియల్ డయాస్... బ్రెజిల్‌కు చెందిన ఈ స్టార్ స్విమ్మర్ పేరు ఇప్పుడు పారాలింపిక్స్‌లో మారుమోగుతోంది. ప్రధాన ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగితే చాలు స్వర్ణం అందుకునే అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్తోనే ఇప్పుడు అతడిని పోలుస్తున్నారు. మొత్తం 28 పతకాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచి కెరీర్‌ను ముగించిన ఫెల్ప్స్ లాగే డయాస్ కూడా పారాలింపిక్ చరిత్రలో నిలిచేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటిదాకా అతడు బీజింగ్ గేమ్స్‌లో 4 స్వర్ణాలు, 4 రజతాలు, ఓ కాంస్యంతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలతో కలిపి మొత్తం 15 పతకాలు సాధించాడు. తాజాగా రియో పారాగేమ్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 200 మీ. ఫ్రీస్టయిల్ ఎస్5లో తను 2 నిమిషాల 27.88 సెకెన్ల టైమింగ్‌తో స్వర్ణం అందుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఇదే ఈవెంట్లో ప్రపంచ రికార్డును సృష్టించిన డయాస్ అమెరికా ప్రఖ్యాత స్విమ్మర్ రాయ్ పెర్కిన్స కన్నా పది సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇది తనకు 16వ పతకం కావడం విశేషం. అందుకే తమ హీరో స్వర్ణం అందుకునే సమయంలో గ్యాలరీలోని స్వదేశీ ప్రేక్షకులంతా ముక్తకంఠంతో ‘డయాస్.. చాంపియన్’ అంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో తాను ఊహించినదానికన్నా ఎక్కువ భావోద్వేగానికి గురయ్యానని డయాస్ తెలిపాడు. మరో ఎనిమిది ఈవెంట్లలో పోటీ రెండు భుజాలు, కుడి కాలు వైకల్యంతో జన్మిం చిన 28 ఏళ్ల డయాస్ మరో ఎనిమిది ఈవెంట్స్‌లో తలపడనున్నాడు. దీంట్లోనూ పతకాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో డయాస్‌ను అంతా ఫెల్ప్స్తో పోలుస్తున్నారు. గతంలో ఈ గేమ్స్ పురుషుల విభాగంలో మాథ్యూ కౌడ్రే (ఆస్ట్రేలియా) అత్యధికంగా 23 పతకాలతో టాప్‌లో ఉన్నాడు. మరోవైపు తనను ఫెల్ప్స్తో మాత్రం పోల్చవద్దని, తనకంటూ ఓ నేపథ్యం ఉందని స్పష్టం చేశాడు. ‘నాపేరు డానియల్ డయాస్. నాకంటూ సొంత చరిత్రను లిఖించాలనుకుంటున్నాను. కానీ ఫెల్ప్స్లాంటి అద్భుత అథ్లెట్‌తో పోల్చడం ఓరకంగా సంతోషంగానే ఉంది’ అని డయాస్ అన్నాడు. ఈగేమ్స్లో తను పాల్గొనే మిగతా పోటీల్లో పతకాలు సాధించడంతో పాటు టోక్యో పారాగేమ్స్‌లోనూ బరిలోకి దిగితే ఫెల్ప్స్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలున్నాయి. డయాస్ పాల్గొనే ఈవెంట్స్ టిక్కెట్లన్నీ హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. -
రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు!
రియో డీ జనీరో: వచ్చే నెలలో రియోలో ఆరంభం కానున్న పారా ఒలింపిక్స్ నేపథ్యంలో అక్కడ అప్పుడే టికెట్ల అమ్మకాల సందడి ఊపందుకుంది. గతవారం ముగిసిన రియో ఒలింపిక్స్ విజయవంతం కావడంతో పారా ఒలింపిక్స్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. పారా ఒలింపిక్స్ టికెట్లు అమ్మకాలు మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల టికెట్లు అమ్మడైపోయాయి. గత మంగళవారం ఒక్క రోజే లక్షా ముప్పై మూడు వేల టికెట్లు అమ్ముకావడంతో సరికొత్త రికార్డు నమోదయ్యింది. రియో ఒలింపిక్స్ లో ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టికెట్లను విక్రయించడం ఇదే ప్రథమం. 'గడిచిన 48 గంటల్లో టికెట్లు అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఇలా పారా ఒలింపిక్ టికెట్లకు డిమాండ్ పెరగడం గేమ్స్నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంది. తొలి రోజు పదహారు వేల టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు యాభై టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూడు, నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో టికెట్లను విక్రయించాం'అని అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోన్జాలెజ్ పేర్కొన్నారు. -
వైకల్యాన్ని జయించాడు...
టెన్నిస్‌లో రాణిస్తున్న బధిర క్రీడాకారుడు సాయిచందన్ - పారాలింపిక్స్ లక్ష్యంగా సాధన - స్పాన్సర్షిప్ కోసం ఎదురుచూపు సాక్షి, హైదరాబాద్: శారీరక వైకల్యం ఆ కుర్రాడి పట్టుదలను ఆపలేకపోయింది. తనలో లోపం ఉన్నా తానూ అందరిలాగే నచ్చిన రంగంలో సత్తా చాటాలనుకున్నాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని క్రీడలను ఎంచుకున్నాడు. ఇప్పుడు జాతీయస్థాయిలో రాణించి తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. అతడే యువ టెన్నిస్ ప్లేయర్ లింగాపురం సాయిచందన్. పుట్టుకతోనే మూగ, చెవిటివాడు అయినప్పటికీ సాధనతో టెన్నిస్ క్రీడలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న 15 ఏళ్ల ఈ కుర్రాడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. అతని ఆశయం నెరవేర్చేందుకు అన్ని కష్టనష్టాలకు ఓర్చి తల్లిదండ్రులు కూడా అండగా నిలుస్తున్నారు. ఐదేళ్ల వయసు నుంచి... సాయిచందన్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల. జన్మత బధిరుడు. మూడేళ్ల వయసులో స్పీచ్ థెరపీ చేయించినా పెద్దగా మెరుగుదల కనిపించలేదు. స్థానికంగా కొంత మంది టెన్నిస్ ఆడటాన్ని ఆసక్తిగా గమనించిన అతను దానిపై మక్కువ చూపించాడు. హోమియోపతి వైద్యుడైన తండ్రి నరసింహేశ్వరన్ కొడుకును నిరాశపర్చకుండా ఐదేళ్ల వయసులో రాకెట్ చేతికిచ్చి ప్రోత్సహించారు. అక్కడి నంది అకాడమీలో కోచ్ మేఘ్‌నాథ్, సాయికి శిక్షణ ఇచ్చారు. కొడుకుకు తోడుగా ఉండేందుకు తల్లి కృష్ణప్రియ కూడా టెన్నిస్ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. సైగలే తప్ప మాట్లాడలేని కుమారుడికి టెన్నిస్‌లోనూ ఆమె సహకరించాల్సి వచ్చింది. కోచ్ చెప్పిన మాటలను ఆమె కొడుకుకు సైగలతో చెప్పడం, అతని సందేహాలకు కోచ్‌నుంచి సమాధానం తీసుకొని మళ్లీ అబ్బాయికి వివరించడం చేశారు. ఇలా దాదాపు ఐదేళ్ల శిక్షణ అనంతరం తొలిసారి అతను ఓపెన్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సెమీఫైనల్‌కు చేరాడు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో నిలకడగా విజయాలు సాధించిన సాయిచందన్...అండర్-12, అండర్-14 వయో విభాగాల్లో పలు ఐటా టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. బధిరుల టెన్నిస్‌లోకి.. ఈ దశలో బధిరులకు ప్రత్యేకంగా టెన్నిస్ పోటీలు ఉంటాయనే విషయం సాయి తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా వరుసగా రెండేళ్ల పాటు జాతీయ స్థాయిలో అతను విజేతగా నిలిచాడు. 2012లో పాటియాలాలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2013లో ఔరంగాబాద్‌లో జరిగిన పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌లో రజతాలు సాధించాడు. చేజారిన ఒలింపిక్స్... జాతీయస్థాయిలో నిలకడగా రాణించిన సాయికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలక్షన్స్ ద్వారా అరుదైన అవకాశం దక్కింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులోకి అతను దాదాపుగా ఎంపికయ్యాడు. ప్రతిభపరంగా చక్కటి ప్రదర్శన కనబర్చినా... ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే కనీసం 15 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనతో అతను వాటికి వెళ్లలేకపోయాడు. ఆర్థిక సమస్యలతో... ఈ దశలో సాయిచందన్కు ఇతర అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. వరల్డ్ డెఫ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ఎంపికైన తర్వాత కూడా సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్లలేని పరిస్థితిలో తప్పుకోవాల్సి వచ్చింది. గత రెండేళ్లలో వరుసగా మూడు పెద్ద ఈవెంట్లు బల్గేరియా, జర్మనీ, ఇటీవల జులైలో నాటింగ్‌హామ్ పోటీలకు ఎంపికైనా అవకాశం తప్పింది. కనీస మొత్తం డిపాజిట్ చేయలేకపోవడంతో అధికారులు వీసా తిరస్కరించారు. ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నట్లు లెటర్ ఉన్నా సాయికి ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అదీ సాధ్యం కాలేదు. హోమియోపతి వైద్యుడిగా పరిమిత ఆదాయంతో తాము అంతటి భారం మోయలేకపోతున్నామని సాయి తండ్రి చెబుతున్నారు. భవిష్యత్తుపై భరోసాతో... అయితే సాయితో పాటు అతని తల్లిదండ్రులు కూడా సై ్థర్యం కోల్పోలేదు. కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని భావిస్తున్న వారు శిక్షణను కొనసాగిస్తున్నారు. సాధారణ కేటగిరీలో ఐటీఎఫ్తో పాటు డెఫ్ విభాగంలో 2016 రియో పారాలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్న సాయి తీవ్రంగా సాధన చేస్తున్నాడు. భారత జూనియర్ డేవిస్‌కప్‌కు గతంలో ప్రాతినిధ్యం వహించిన నున్నా గోపాలకృష్ణ తమ టెన్నిస్ కోర్టును శిక్షణ కోసం ఉచితంగా వాడుకునేందుకు అనుమతినిచ్చారు. హమీద్ అనే కోచ్ ప్రస్తుతం శిక్షణనిస్తున్నారు. అక్టోబరులో చైనీస్ తైపీలో జరిగే మరో పెద్ద ఈవెంట్‌కు అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే మరోసారి ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు స్పాన్సర్షిప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఎవరైనా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మా అబ్బాయిని ఆటను వదిలేయమని చెప్పలేదు. చిన్నప్పటినుంచి బాగా ఆడాడు. కనీసం 20 ఏళ్ల వయసు వచ్చే సరికి అతను మరింత మంచి ఆటగాడిగా తయారవుతాడన్న ఆశతోనే దీనిని కొనసాగిస్తున్నాం’ అని తల్లి కృష్ణప్రియ చెబుతున్నారు. ఎవరైనా అండగా నిలిస్తే వారి కోరిక ఫలించడంలో సమస్య ఎదురు కాకపోవచ్చు.