ఘనంగా ముగిసిన పారాలింపిక్స్ | Rio Paralympics 2016: Closing ceremony tribute for Bahman - BBC | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 20 2016 7:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు.. రంగురంగుల విద్యుత్ కాంతులు.. హోరెత్తించే సంగీత కార్యక్రమాలతో రియో పారాలింపిక్స్ ముగింపు సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్నో అడ్డంకులు, సవాళ్లను అధిగమించిన బ్రెజిల్ మొత్తానికి ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను విజయవంతంగా ముగించగలిగింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున ప్రఖ్యాత మరకానా స్టేడియంలో కన్నులపండవగా జరిగిన ఈ వేడుకలు ‘జీవవైవిధ్యం: మన స్ఫూర్తి’ అనే థీమ్ ఆధారంగా సాగాయి. వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు తమ ప్రదర్శనతో అబ్బురపరిచారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement