రెండు లక్ష్యాలతో పారాలింపిక్స్ బరిలో సుమిత్ అంటిల్
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని భారత పారాథ్లెట్ సుమిత్ అంటిల్ పేర్కొన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు పారాలింపిక్స్ జరగనుండగా... ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ భారత బృందం పతాకధారిగా వ్యవహరించనున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్.. ఎఫ్64 విభాగంలో పోటీపడనున్నాడు.
తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల మూడుసార్లు బద్దలు కొట్టిన సుమిత్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్నాడు. పారా ప్రపంచ చాంపియన్‌సిప్‌లోనూ సుమిత్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సుమిత్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం గెలవాలనుకుంటున్నా.
ప్రాక్టీస్ లో నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నా. 80 మీటర్ల మార్క్ అందుకోవడం నా లక్ష్యం. డిఫెండింగ్ చాంపియన్ అనే ఒత్తిడి ఏం లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెడతా. 2019 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగంగా ఉన్నా. ప్రభుత్వ సహకారం వల్లే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఉద్దేశంతో ఇతర టోరీ్నల్లో ఎక్కువ పాల్గొనలేదు’ అని సుమిత్ అన్నాడు. పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment