Sumit
-
మిఠాయిలకు దూరం...‘బంగారం’తో సంబరం
పారిస్ పారాలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్... బంగారు పతకాన్ని నిలబెట్టుకునేందుకు తనకిష్టమైన మిఠాయిలకు దూరమైనట్లు వెల్లడించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్... తాజా పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో సుమిత్ జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం సుమిత్ మాట్లాడుతూ... ‘పారాలింపిక్స్ కోసం 10 నుంచి 12 కేజీల బరువు తగ్గా. అధిక బరువు వల్ల శరీరంపై ఒత్తిడిపడి మెరుగైన ప్రదర్శన చేయలేనని ఫిజియో సూచించడంతో నాకు ఇష్టమైన స్వీట్లు తినడం మానేశా.ఒత్తిడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టోక్యో సమయంలో నాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకపోయింది. వంద శాతం ఫిట్నెస్తో లేకుండానే పారిస్ పోటీల్లో పాల్గొన్నా. గాయం భయంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నా... స్వదేశానికి చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుంటా’ అని అన్నాడు. -
Sumit Antil: ప్రపంచ రికార్డు... పసిడి పతకం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని భారత పారాథ్లెట్ సుమిత్ అంటిల్ పేర్కొన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు పారాలింపిక్స్ జరగనుండగా... ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ భారత బృందం పతాకధారిగా వ్యవహరించనున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్.. ఎఫ్64 విభాగంలో పోటీపడనున్నాడు. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల మూడుసార్లు బద్దలు కొట్టిన సుమిత్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్నాడు. పారా ప్రపంచ చాంపియన్సిప్లోనూ సుమిత్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సుమిత్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. ప్రాక్టీస్ లో నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నా. 80 మీటర్ల మార్క్ అందుకోవడం నా లక్ష్యం. డిఫెండింగ్ చాంపియన్ అనే ఒత్తిడి ఏం లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెడతా. 2019 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగంగా ఉన్నా. ప్రభుత్వ సహకారం వల్లే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఉద్దేశంతో ఇతర టోరీ్నల్లో ఎక్కువ పాల్గొనలేదు’ అని సుమిత్ అన్నాడు. పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. -
పారాలింపిక్స్ సమయం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం శుక్రవారం ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇటీవల పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా.. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. విశ్వ క్రీడలకు బయలుదేరే ముందు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో మన అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ‘ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన పారా అథ్లెట్లు ఒలింపిక్స్ వరకు చేరుకున్నారు. ‘పారిస్’ పారాక్రీడల్లో సత్తా చాటి అధిక సంఖ్యలో పతకాలు సాధిస్తారనే నమ్మకముంది. ఈ బృందంలో చాలా మంది అథ్లెట్లు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా లబ్ది పొందినవారే. అథ్లెట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశ్వక్రీడల్లో అధిక సంఖ్యలో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంపొందించాలి’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ఫ్లాగ్ బేరర్లుగా భాగ్యశ్రీ, సుమిత్ పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో పారాలింపిక్స్ ఎఫ్64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్.. గత ఏడాది ప్రపంచ పారా చాంపియన్íÙప్లోనూ బంగారు పతకం సాధించాడు. మహిళల ఎఫ్34 కేటగిరీలో పోటీపడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధిచింది. ఈ నేపథ్యంలో పీసీఐ అధ్యక్షుడు ఝఝారియా మాట్లాడుతూ.. ‘విశ్వక్రీడల ఆరంభ వేడుకలో సుమిత్, భాగ్యశ్రీ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారు. వీరిద్దరూ గత కొంతకాలంగా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తామనే నమ్మకముంది. అనేక క్రీడాంశాల్లో మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దాని వెనక వారి కఠోర శ్రమ, కృషి ఉంది. పారిస్ పారాలింపిక్స్‌లో దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఈ క్రీడల్లో తెలంగాణ నుంచి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో జివాంజి దీప్తి పోటీపడనుంది. -
తొలి రౌండ్లోనే సుమిత్ పరాజయం
సిన్సినాటి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం క్వాలిఫయింగ్‌లోనే ముగిసింది. తొలి రౌండ్లో ప్రపంచ 74వ ర్యాంకర్ సుమిత్ 2–6, 4–6తో ప్రపంచ 119వ ర్యాంకర్ మెకంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్విస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.. సుమిత్‌కు 7,290 డాలర్ల (రూ. 6 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ
సెలబ్రిటీల కెరీర్ కన్నా పర్సనల్ లైఫ్ మీదే అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. వారి ప్రేమ వ్యవహారాలు-పెళ్లి-విడాకులపైనే ఎక్కడలేని ఇంట్రస్ట్ చూపిస్తారు. అలా బుల్లితెర నటి సుమిత్ సింగ్ నటుడు షాగుణ్ పాండేతో డేటింగ్లో ఉందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు నటి డేటింగ్ గురించి గుసగుసలు మొదలుపెట్టారు.నటుడితో డేటింగ్?ఆ వార్త తనదాకా చేరడంతో నటి సుమిత్ సింగ్ ఈ రూమర్స్‌ను కొట్టిపారేసింది. షాగుణ్తో డేటింగ్లో లేనని క్లారిటీ ఇచ్చింది. ఇంతలో సోషల్ మీడియాలో నటి సుమిత్, దర్శకుడు పుష్పేందర్ సింగ్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరికీ ఐదేళ్ల క్రితమే పెళ్లయిందని తెలుస్తోంది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడట!మేము విడిపోయాంఐదేళ్ల క్రితం నాటి వెడ్డింగ్ పిక్స్ లీక్ అవడంతో ఎట్టకేలకు తన పెళ్లిపై నోరు విప్పింది సుమిత్. ఆమె మాట్లాడుతూ.. 'మేము 2018లో పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు పుట్టాడు. అతడి పేరు రుద్ర. అయితే నా భర్త, నేను విడిపోయి చాలారోజులే అవుతోంది. అతడితో నాకిప్పుడు ఏ సంబంధమూ లేదు. మేము కలిసుండటం లేదు. విడిపోయాం. అయినా ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు' అని అసహనం ప్రదర్శించింది.చదవండి: నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్: నటుడు -
పతకాల పంట
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ దినేశ్ ముదియన్‌సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్లో హనే... మహిళల టి47 లాంగ్‌జంప్ ఈవెంట్లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. -
కృత్రిమ కాలుతో కనకం వైపు...
‘ఫాంటమ్ లింబ్ పెయిన్’... కృత్రిమ కాలు అమర్చుకున్న వారిలో దాదాపు అందరికీ వచ్చే సమస్య. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే పరిస్థితి... కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతుంటే ఆ బాధ తట్టుకోవడం కష్టం! సాధన సమయంలో సుమిత్ అంటిల్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. కానీ తాను పారాలింపిక్స్‌లో పాల్గొనాలనే, పతకం సాధించాలనే లక్ష్యం నుంచి మాత్రం అతను తప్పుకోలేదు. ‘ప్రొస్థెటిక్ లెగ్’తోనే జావెలిన్‌లో ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం అతను తన కలను నిజం చేసుకున్నాడు. టోక్యోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. 2015 జనవరి 5 వరకు సుమిత్ జీవితం చాలా మందిలాగే సరదాగా సాగింది. హరియాణాలో గల్లీ గల్లీలో కనిపించే చాలా మందిలాగే రెజ్లింగ్ వైపు వెళ్లాడు. నాలుగైదేళ్లు పెద్దగా ఫలితాలు లేకపోయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతను ‘పహిల్వాన్’ కావాలనే కోరుకోవడంతో ఆటను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 17 ఏళ్ల వయసులో ట్యూషన్ నుంచి తిరిగొస్తూ జరిగిన ఒక ప్రమాదం సుమిత్ జీవితాన్ని మార్చేసింది. మోటార్ బైక్‌పై వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్‌తో అతను తన ఎడమ కాలును కోల్పోయాడు. మోకాలి కింది భాగం మొత్తం తొలగించాల్సి రాగా... 53 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. కృత్రిమ కాలు బిగించడంతో ఇక లోకమంతా విషాదంగా, ఏదో కోల్పోయినట్లుగా కనిపించింది. దాంతో ఇంటికే పరిమితమైన అతను పాత జ్ఞాపకాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ స్టేడియం వైపు మరలాడు. అదే సుమిత్ జీవితాన్ని మార్చింది. సోనెపట్ సమీపం లోని తన సొంత ఊరు ఖేవ్డాకు చెందిన ఒక పారాథ్లెట్ అతనికి పరిచయమయ్యాడు. అంతే... పారా క్రీడల గురించి మొత్తం తెలుసుకున్న అతను మళ్లీ ఆటల్లో కొత్త జీవితం వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. అథ్లెటిక్స్‌లో, అందులోనూ జావెలిన్ త్రోలో సత్తా చాటగలనని నమ్మకంతో సాధన మొదలుపెట్టిన సుమిత్ ఒక్కసారిగా దూసుకుపోయాడు. 2019లో వరల్డ్ పారా అథ్లెటిక్స్, వరల్డ్ గ్రాండ్‌ప్రి, పారిస్ ఓపెన్లలో అతను మూడు రజతాలు సాధించి సత్తా చాటాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా, వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనతతో టోక్యో బరిలోకి దిగిన సుమిత్ రాణించి విశ్వ క్రీడల్లో భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించగలిగాడు. -
స్వర్ణంతో సుమిత్ చరిత్ర సృష్టించాడు ఫొటోలు
-
నిషేధ కాలం తగ్గించండి: భారత రెజ్లర్ సుమిత్ అప్పీల్
డోపింగ్‌లో పట్టుబడటంతో రెండేళ్ల నిషేధానికి గురైన భారత రెజ్లర్ సుమిత్ మలిక్... నిషేధ కాలాన్ని తగ్గించాలంటూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ)కు అప్పీల్ చేయనున్నాడు. తను తీసుకున్న ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకం కలిసి వుండవచ్చని అంగీకరించిన రెజ్లర్ విధించిన నిషేధాన్ని ఏడాదికి తగ్గిస్తే వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాడు. 125 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఈ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సస్పెన్షన్ వేటుతో విశ్వ క్రీడలకు దూరమయ్యాడు. -
రెజ్లర్ సుమిత్‌పై నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన కామన్వెల్త్గేమ్స్ చాంపియన్, భారత రెజ్లర్ సుమిత్ మాలిక్‌పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హరియాణా రెజ్లర్ ఒలింపిక్స్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. అతను అప్పీల్ చేసుకునేందుకు ఒక వారం గడువిచ్చినప్పటికీ ఒలింపిక్స్ సమయానికల్లా ఈ విచారణ ముగిసే అవకాశాల్లేవు. గత నెల సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో 125 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో పోటీపడిన భారత రెజ్లర్ మెగా ఈవెంట్‌కు అర్హత సంపాదించాడు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించగా ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ రెజ్లింగ్ యూనియన్ (యూడబ్ల్యూడబ్ల్యూ) శుక్రవారం అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపి యన్‌షిప్‌లలో అతను రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించాడు. -
రెజ్లర్ సుమిత్‌పై రూ. 16 లక్షల జరిమానా!
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సుమిత్ మలిక్ (125 కేజీలు) డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భారీ మూల్యం చెల్లించుకోనుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సుమిత్ డోపింగ్‌లో పట్టుబడటంతో అతనిపై తాత్కాలికంగా ఆరు నెలలపాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. డోపింగ్‌లో పట్టుబడినందుకు సుమిత్ బదులుగా ఈ విభాగంలోనే మరో భారత రెజ్లర్‌ను పంపించే వీలు లేకుండాపోయింది. డోపింగ్‌లో దొరికిన రెజ్లింగ్ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ రూ. 16 లక్షల జరిమానా విధిస్తుంది. ఈ మొత్తాన్ని డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్ నుంచి వసూలు చేస్తారు. ఫలితంగా ఇప్పుడు సుమిత్ తన జేబు ద్వారా రూ. 16 లక్షలు భారత రెజ్లింగ్ సమాఖ్యకు చెల్లించాలి. ఒకవేళ జరిమానా మొత్తం చెల్లించకపోతే సుమిత్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య జీవితకాల నిషేధం విధించే అవకాశముంది. సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతను రూ. 16 లక్షల జరిమానాతోపాటు టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల కోసం హరియాణా ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 5 లక్షలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. -
Tokyo Olympics: డోపింగ్‌లో సుమిత్ విఫలం
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గత నెలలో బల్గేరియాలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 125 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించాడు. అయితే ఇదే టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో సుమిత్ విఫలమయ్యాడు. సుమిత్ శాంపిల్‌లో నిషేధిత మెథిలెక్సాన్ ఉత్ప్రేరకం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో సుమిత్‌పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం కారణంగా సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయినట్టే. ఒకవేళ సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతనిపై కనీసం రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. -
క్యాస్ట్‌కు మూల అర్థం రక్తమా?
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సమాజంలో కులానికున్న ప్రాధాన్యత తక్కువేమి కాదు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కులాల ప్రస్థావన లేకుండా ప్రభుత్వ పాలనే లేదు. ఇంతకూ కులం అంటే ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చింది. ఎలా పుట్టింది?. కులానికి సమానమైన అర్థం ఉందా?. సంస్కతంలో ‘జాతి’ , అరబిక్‌లో ‘కామ్’, పర్షియన్లో ‘జాట్’ అనే పదాలున్నాయి. ఇవన్నీ కూడా ‘క్యాస్ట్ (కులం)’అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇవ్వడం లేదు. క్యాస్ట్ అనే ఇంగ్లీషు పదం ‘క్యాస్ట’ అనే స్పానిష్ మాతృక నుంచి వచ్చింది. ‘క్యాస్ట’ అన్న పదం తొలుత ఐబీరియన్లు అయిన స్పానిష్, పోర్చుగీసులు ఉపయోగించారు. ఈ పదాన్ని అమెరికాకు స్పానిష్‌లు, ఆసియాకు పోర్చుగీసులు పరిచయం చేశారు. ‘ఎసో మీ వియెని డి క్యాస్ట’... ‘క్యాస్ట డి జుడియోస్’ పదాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. ‘ఎసో మీ వియెని డి క్యాస్ట’ అనే స్పానిష్ వ్యాక్యానికి తెలుగులో ‘ఇది నా రక్తం’ అని అర్థం. ఎవరి కులం ఏదైనా అందరిలో ప్రవహించేది ఒకే రక్తం అంటాం. అదే రక్తం అనే పదం నుంచి క్యాస్ట్ అనే పదం వచ్చిందంటే ఆశ్చర్యమే! యూదులను వేరు చేసి వారిని అవమానించడం కోసం ఐబీరియన్లు ‘క్యాస్ట డి జుడియోస్’ అంటే ‘వారు యూదులు’ అనే పదాన్ని ముందుగా తీసుకొచ్చారట. ఈ క్యాస్ట్ అనే పదం భారత దేశానికి పరిచయం కాకముందే ఒకే ఆదిమ జాతి లేదా గణం మధ్య తప్ప మిగతా జాతి లేదా గణాల మధ్య పెళ్లిళ్లు చేసుకునే వ్యవస్థ లేదు. భారత్‌లోని హిందువులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవ మతస్తులందరిలోనూ ‘క్యాస్ట్ సిస్టమ్’ ఉంది. ఒకప్పుడు జైనులు, బౌద్ధులు, సిక్కులను హిందువులుగానే పరిగణించేవారు. ఇప్పుడు జైనులు, బౌద్ధులను వేరు మతస్థులుగాను, సిక్కులను హిందువుల్లో భాగంగాను పరిగణిస్తున్నారు. బ్రిటిషర్లు మొట్టమొదటి సారిగా ముంబైలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా కులాల ప్రాతిపదికనే పదవులను నిర్ణయించారు. వ్యవసాయదారులు, వ్యవసాయేతరుల మధ్య భూముల లావాదేవీలకు సంబంధించి 1900 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు ‘ల్యాండ్ ఎలియనేషన్ యాక్ట్’ను తీసుకొచ్చినప్పుడు కూడా అందులో తెగలు, కులాల ప్రస్థావన తీసుకొచ్చారు. (కుల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కలగాలంటే సుమిత్ గుహ రాసిన ‘బియాండ్ క్యాస్ట్’ రివైజ్డ్ వెర్షన్ పుస్తకాన్ని చదవాల్సిందే. సుమిత్ టెక్సాస్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు). -
‘రియో’కు చేరువలో మనోజ్, సుమిత్
బాకు (అజర్బైజాన్): మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 2-1తో ఇస్మెతోవ్ ఐరిన్ స్మెతోవ్ (బల్గేరియా)ను ఓడించగా... సుమిత్ 3-0తో సందాగ్సురెన్ ఎర్దెనెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించాడు. 75 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన వికాస్ కృషన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ సెమీఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌కు చేరితేనే దేవేంద్రోకు రియో బెర్త్ ఖాయమవుతుంది. -
నయా నేరగాళ్లు!
మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆగస్టు 28న స్నాచింగ్ కేసుల్లో అక్షయ్ శర్మ, సుమిత్ కుమార్, సయ్యద్ అబ్దుల్ మెహిద్లను అరెస్టు చేశారు. బేగంబజార్‌కు చెందిన అక్షయ్, సుమిత్‌లు బాగా స్థిరపడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. కేవలం జల్సాల కోసం నేరబాటపట్టి పోలీసులకు చిక్కారు. - సాక్షి, సిటీబ్యూరో అక్షయ్, సుమిత్‌ల ఉదంతమే కాదు. ఇటీవల కాలంలో జల్సాల కోసం నేరాల బాటపడుతున్న యువత, విద్యాధికుల ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. 2013-2015 అక్టోబర్ మధ్య నమోదైన స్నాచింగ్ కేసుల గణాంకాలను పరిశీలిస్తే పోలీసులకు చిక్కిన నేరగాళ్ళలో 40.87 శాతం కొత్త వారే. మారిన జీవన విధానం, పరిస్థితుల కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడం సైతం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. స్నాచింగ్సే ఎందుకంటే..? ‘నయా’ నేరగాళ్ళు చేస్తున్న నేరాల్లో చైన్ స్నాచింగ్సే ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఈజీ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. ఓ ఇంట్లోనో, దుకాణంలోనూ దొంగతనం చేయాలంటే దానికి భారీ తతంగం తప్పదు. రెక్కీ, చుట్టు పక్కల పరిస్థితుల అధ్యయనం తదితరాల తరవాతే ఇంట్లోకో/దుకాణంలోకో ప్రవేశించాల్సి ఉంటుంది. అంత ‘కష్టపడినా’ ఎంత వరకు ‘గిట్టుబాటు’ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అదే స్నాచింగ్ చేయడానికి నేరగాళ్ళు పెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం ఉండదు. ఓ అనుచరుడిని తీసుకుని, ద్విచక్ర వాహనంపై రోడ్డమీదికి వస్తే సరిపోతుంది. మార్కెట్లో పెరిగిన బంగారం రేట్ల కారణంగా ఒక్క గొలుసు చోరీ చేసినా కనీసం రూ.10 వేలు ఎక్కడికీ పోవు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొత్త నేరగాళ్ళు స్నాచింగ్స్ వైపు మళ్ళుతున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెరుగ్గా మొదలెట్టి భేషుగ్గా... కొత్త నేరగాళ్లు తొలినాళ్లలో కొంత బెరుగ్గానే నేరాలు చేస్తున్నారు. ఒక నేరం చేసిన తరవాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా చేసుకుపోతున్నారు. పోలీసులకు చిక్కి, జైలుకు వెళ్తున్న తరవాత చట్టాల్లో ఉన్న లోపాలు, తేలిగ్గా బెయిల్స్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడటంలో ఉన్న జాప్యం...ఇవన్నీ వీరిని అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి. నివాస ప్రాంతాలు, పేర్లను తరచుగా మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న వారినే టార్గెట్‌గా చేసుకుని స్నాచర్లు రెచ్చిపోయే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇళ్ళల్లోకి వచ్చి, ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్తున్న వారినీ టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నారు. కారణాలనేకం... యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్న వారు, నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదే పదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి స్నాచింగ్ తరహా నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్‌ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారిన ఉదంతాలూ అనేకం ఉన్నాయి. తల్లిదండ్రుల అజమాయిషీ లేక... నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండా పోతున్నారు. నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. విలాసాల కోసమే అధికంగా... సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా స్నాచింగ్స్ వంటి నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకు వస్తున్న ఈ కొత్త దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. స్నాచింగ్ వంటి నేరాల్లో వేలిముద్రలు వంటి ఆధారాలు సైతం ఉండవు. దీంతో పక్కా సమాచారంతో నేరగాళ్ళను పట్టుకునే వరకు ఆ కేసులు కొలిక్కి రావట్లేదు. అర్బనైజ్డ్ క్రైమ్‌గా స్నాచింగ్స్... అర్బనైజ్డ్ క్రైమ్‌గా మారిన చైన్‌స్నాచింగ్స్ బెడద కేవలం జంట కమిషనరేట్లకే కాదు... దేశ వ్యాప్తంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా వెయ్యికి తగ్గకుండా స్నాచింగ్స్ చోటు చేసుకుంటున్నాయి. 2013లో మూడు వేలు, 2014లో ఏకంగా ఏడువేలు దాటాయి. ముంబైలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అక్కడి పోలీసు చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 2834 ఉదంతాలు జరిగాయి. దీంతో ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) సైతం స్నాచర్ల కోసం వేట ప్రారంభించింది. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలోనూ అర్బనైజ్డ్ క్రైమ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ ‘గొలుసులు’ లేకపోవడంతో వాహనాల చోరీలు జరుగుతాయని వివరిస్తున్నారు. సింగిల్ హ్యాండ్ స్నాచర్... స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, హెల్మెట్టు, మాస్క్‌తో దూసుకువచ్చి పంజా విసిరే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. అయితే నగరంలో ఇటీవల ఓ ‘సింగిల్ స్నాచింగ్’ సైతం జరిగింది. గత నెల 29 అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటోను వెంబడిస్తూ వచ్చిన స్నాచర్ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుపోయాడు. -
ఊడిపడ్డ పాఠశాల పైకప్పు
నారాయణఖేడ్ రూరల్ : పాఠశాల పైకప్పు పె చ్చులూడి ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని చాప్టా (కే) ఉన్న త పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చాప్టా(కే) ఉన్నత పాఠశాల ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. 9వ తరగతి గదిలోకి ఐదారుగురు విద్యార్థులు వెళ్లగానే ఒక్కమారిగా పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గదిలో కూర్చున్న హంగిర్గా (కే) గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని లావణ్య (14) తలపై పెచ్చులు పడడంతో తలపగిలింది. అదేవిధం గా చాప్టా (కే) గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని సుమిత్ర (14)కు చేయికి స్వల్ప గాయాలు తగిలాయి. పైకప్పులు ఇంకాస్త ఆలస్యంగా ఊడిపడి ఉంటే చాలామంది విద్యార్థులు గాయపడేవారని ఉపాధ్యాయులు చెప్పా రు. పాఠశాల ప్రారంభంకాగానే పెచ్చులు ఊడిపడడంతో ఇద్దరు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. కాగా పాఠశాలను ఆర్వీఎం నిధులతో 2012-13వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించగా ఆరునెలల క్రితమే భవనం నిర్మాణం పనులు పూర్తయి పాఠశాల కొనసాగుతుంది. పాఠశాల పైకప్పుకు గిలావ్ (సిమెంట్ పూత) వేసే ముందు కచ్చులు కొట్టకపోవడంతోనే కూ లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ప్రమా దం అనంతరం విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పాఠశాలు బోధించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భీంసింగ్ పాఠశాలను సందర్శించి ప్రమాద సంఘటన వివరాలను ఉపాధ్యాయులను అడగి తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన : ప్రమాదం విష యం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నా యకులు గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, సీపీఎం, టీఎన్ఎస్ఎఫ్ సంఘాల నాయకు లు ప్రవీణ్, నరసింహులు, చిరంజీవి, అర్జున్, అశోక్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి గ్రామంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నాసిరకంగా భవనం నిర్మించడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. భవనం నాసిరకం నిర్మాణానికి కారణమైన ఆర్వీఎం ఏఈ, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. -
సంగీతం... జీవితం...
బంధానికీ, ప్రేమకూ ఉన్న తేడా ఏంటి? వాటి విలువలు ఎవరికి తెలుస్తాయి? సంగీతానికీ, జీవితానికీ మధ్య ఏమైనా అనుబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ చిత్రం రూపొందుతోంది. డీవీ రాజేందర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ రాజ్, అరుణ్ కృష్ణ, సాకేత్, సుమిత్, అభిషేక్, సుస్మిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. యువతరం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ దర్శకుడు చెప్పారు. విజ్ఞాన్ రత్తయ్య, ఆర్వీఎస్ భరత్, గోపి, రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్, కూర్పు: అనిల్.