న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గత నెలలో బల్గేరియాలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 125 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించాడు. అయితే ఇదే టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో సుమిత్ విఫలమయ్యాడు. సుమిత్ శాంపిల్‌లో నిషేధిత మెథిలెక్సాన్ ఉత్ప్రేరకం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో సుమిత్‌పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం కారణంగా సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయినట్టే. ఒకవేళ సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతనిపై కనీసం రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment