Qualifying match
-
క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి
చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ ఓడిపోయాడు. ప్రపంచ 63వ ర్యాంకర్ పావెల్ కొటోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 6–7 (5/7)తో ఓటమి పాలయ్యాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 37 అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 8,340 డాలర్ల (రూ. 6 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
అమిత్‌కు పిలుపు హుసాముద్దీన్‌పై వేటు
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్) వేటు పడింది. దీపక్ స్థానంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్థానంలో సచిన్ సివాచ్‌ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీ మే 25 నుంచి జూన్ 2 వరకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. భారత బాక్సింగ్ జట్టు: పురుషుల విభాగం: అమిత్ పంఘాల్ (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు). -
మెయిన్ ‘డ్రా’కు గెలుపు దూరంలో...
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. కాలిఫోర్నీయాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 101వ ర్యాంకర్ సుమిత్ 6–2, 6–2తో ప్రపంచ 580వ ర్యాంకర్ స్టెఫాన్ డొస్టానిక్ (అమెరికా)పై గెలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో కొరియా ప్లేయర్ సియోంగ్చన్ హాంగ్‌తో సుమిత్ తలపడతాడు. -
భారత్ శుభారంభం
కువైట్ సిటీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 1–0 గోల్ తేడాతో కువైట్ జట్టును ఓడించింది. ఆట 75వ నిమిషంలో మాన్విర్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని 22 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో విదేశీ గడ్డపై భారత్ తొలి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈనెల 21న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ఇంటా, బయట పద్ధతిలో జరిగే లీగ్ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. ఇప్పటి వరకు భారత జట్టు ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్ కు అర్హత సాధించలేదు -
అంకిత పరాజయం
న్యూయార్క్: భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో తొలి రెండు నెగ్గిన అంకిత మూడో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అంకిత వరుస సెట్లలో 2–6, 2–6 స్కోరుతో మిర్జమ్ జొర్క్లండ్ (స్వీడన్) చేతిలో పరాజయంపాలైంది. 1 గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 154వ ర్యాంకర్ అంకిత తన ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. జొర్క్లండ్ 3 ఏస్‌లు సంధించగా, అంకిత ఒకే ఒక ఏస్ కొట్టింది. -
వెర్‌స్టాపెన్‌కే పోల్
జండ్వూర్ట్ (నెదర్లాండ్స్): ఈ ఎఫ్1 సీజన్లో జోరు మీదున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కే మరో పోల్ పొజిషన్ దక్కింది. శనివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ రేసులో ల్యాపును అందరికంటే ముందుగా 1 నిమిషం 10.567 సెకన్లలో పూర్తి చేసిన వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. ఈ సర్క్యూట్‌పై అతనికిది వరుసగా మూడో పోల్ పొజిషన్ కావడం విశేషం. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. డిఫెండింగ్ ఫార్ములావన్ చాంపియన్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో 11వ టైటిల్‌పై కన్నేశాడు. మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1ని.11.104 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. -
'బాస్ నేను మనిషినే'.. స్టార్ ఫుట్‌బాలర్‌కు వింత అనుభవం
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి ఒక అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈక్వెడార్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ అభిమాని ఒకరు ''మెస్సీ.. మెస్సీ'' అని గట్టిగా అరుస్తూ గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చాడు. ఇది గమనించకుండా వెళ్తున్న మెస్సీకి అడ్డుగా వెళ్లి.. అతని భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. అయితే పొరపాటు ఆ అభిమాని తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. దీంతో మెస్సీ కోపంతో.. ''బాస్ నేను మనిషినే.. సెల్ఫీ కోసం నన్ను ఇబ్బంది పెట్టకు'' అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యురిటీ వచ్చి అతన్ని స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. కాగా అర్జెంటీనాకు క్వాలిఫయింగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా 11 మ్యాచ్‌లు గెలిచి.. ఆరు డ్రా చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. కాగా అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఉరుగ్వే, ఈక్వెడార్‌లు ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. చదవండి: Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు? View this post on Instagram A post shared by @jossuegarzon -
T20 World Cup IRE Vs NED: కర్టిస్ సంచలనం.. 4 బంతుల్లో 4 వికెట్లు!
అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో సోమవారం అద్భుతం చోటు చేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పదో ఓవర్లోని రెండో బంతికి కోలిన్ అకెర్మాన్ (11)ను, మూడో బంతికి ర్యాన్ టెన్ డషెట్ (0)ను, నాలుగో బంతికి స్కాట్ ఎడ్వర్డ్స్ (0)ను, ఐదో బంతికి వాన్ డెర్ మార్వె (0)లను అవుట్ చేసిన కర్టిస్ హ్యాట్రిక్ పూర్తి చేసుకోవడంతోపాటు తన ఖాతాలో నాలుగు వికెట్లు జమచేసుకున్నాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ సాధించిన తొలి ఐర్లాండ్ బౌలర్‌గా కర్టిస్ గుర్తింపు పొందాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కర్టిస్ (4/26), మార్క్ అడైర్ (3/9) దెబ్బకు నెదర్లాండ్స్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ జట్టులో మ్యాక్స్ ఒ డౌడ్ (47 బంతుల్లో 51; 7 ఫోర్లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. అనంతరం ఐర్లాండ్ జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసి ఏడు వికెట్లతో గెలుపొందింది. డెలానీ (29 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), పాల్ స్టిర్లింగ్ (39 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ►అంతర్జాతీయ టి20 క్రికెట్లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్ కర్టిస్. గతంలో లసిత్ మలింగ (శ్రీలంక; న్యూజిలాండ్‌పై 2019లో), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్; ఐర్లాండ్‌పై 2019లో) ఈ ఘనత సాధించారు. లసిత్ మలింగ వన్డే క్రికెట్లోనూ ఈ అద్భుతం చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీశాడు. ►టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో బౌలర్ కర్టిస్. గతంలో ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ (2007లో బంగ్లాదేశ్‌పై) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ►అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన 19వ బౌలర్‌గా కర్టిస్ నిలిచాడు. Not to mention his double hat-trick 🥵 Well played, Curtis Campher 👏#T20WorldCup pic.twitter.com/Mn2Y1k0o5A — T20 World Cup (@T20WorldCup) October 18, 2021 -
బంగ్లాదేశ్ బోల్తా
T20 World Cup 2021 Scotland Vs Bangladesh: మస్కట్: అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన స్కాట్లాండ్ జట్టు టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘బి’లో గెలుపు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ఆశ్చర్యపరిచింది. క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2/19) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మెహిదీ హసన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. ముషి్ఫకర్ రహీమ్ (36 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. కీలకమైన షకీబ్, ముషి్ఫకర్ వికెట్లను గ్రీవ్స్ పడగొట్టగా... మరో బౌలర్ బ్రాడ్ వీల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఇది కేవలం రెండో టి20 మ్యాచ్‌కాగా రెండింటిలోనూ స్కాట్లాండే నెగ్గడం విశేషం. 2012లో ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరిగింది. గ్రీవ్స్ మెరుపులు స్కాట్లాండ్ కెపె్టన్ కొయెట్జర్ (0) డకౌట్ కాగా, మున్సే (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూక్రాస్ (11) కాసేపు స్కోరు బోర్డును నడిపించారు. తర్వాత మెహిదీ హసన్, షకీబ్‌ల దెబ్బకు స్కాట్లాండ్ కుదేలైంది. 8 పరుగుల వ్యవధిలోనే క్రాస్, మున్సే, బెరింగ్టన్ (2), లిస్్క(0), మ్యాక్‌లియోడ్ (5) పెవిలియన్ చేరారు. 53 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన స్కాట్లాండ్ను క్రిస్ గ్రీవ్స్ ఆదుకున్నాడు. మార్క్ వాట్ (22; 2 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. టాపార్డర్ వైఫల్యం బంగ్లా టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు లిటన్ దాస్ (5), సౌమ్య సర్కార్ (5), షకీబ్ (20) నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ముషి్ఫకర్, మహ్మూదుల్లా (23; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. అయితే స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా స్కోరు వేగం పడిపోయింది. దీంతో తర్వాత క్రీజులోకి దిగిన బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడికి తలవంచారు. షకీబ్ రికార్డు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్కాట్లాండ్పై అతను 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా శ్రీలంక పేసర్ మలింగ పేరిట ఉన్న 107 వికెట్ల రికార్డును అధిగమించి 108 వికెట్లతో టాప్ ర్యాంక్‌లోకి వెళ్లాడు. స్కోరు వివరాలు స్కాట్లాండ్ ఇన్నింగ్స్: మున్సే (బి) మెహిదీ 29; కొయెట్జర్ (బి) సైఫుద్దీన్ 0; క్రాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మెహిదీ 11; బెరింగ్టన్ (సి) అఫిఫ్ (బి) షకీబ్ 2; మ్యాక్‌లియోడ్ (బి) మెహిదీ 5; లిస్క్ (సి) లిటన్ దాస్ (బి) షకీబ్ 0; గ్రీవ్స్ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 45; వాట్ (సి) సౌమ్య సర్కార్ (బి) తస్కిన్ 22; డేవీ (బి) ముస్తఫిజుర్ 8; షరీఫ్ (నాటౌట్) 8; బ్రాడ్ వీల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–5, 2–45, 3–46, 4–52, 5–52, 6–53, 7–104, 8–131, 9–131. బౌలింగ్: తస్కిన్ 3–0–28–1, ముస్తఫిజుర్ 4–1–32–2, సైఫుద్దీన్ 4–0–30–1, షకీబ్ 4–0–17–2, మెహిదీ 4–0–19–3, అఫిఫ్ 1–0–10–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) మున్సే (బి) వీల్ 5; సౌమ్య సర్కార్ (సి) మున్సే (బి) డేవీ 5; షకీబ్ (సి) మ్యాక్‌లియోడ్ (బి) గ్రీవ్స్ 20; ముషి్ఫకర్ (బి) గ్రీవ్స్ 38; మహ్మూదుల్లా (సి) మ్యాక్‌లియోడ్ (బి) వీల్ 23; అఫిఫ్ (సి) డేవీ (బి) వాట్ 18; నురుల్ (సి) మ్యాక్‌లియోడ్ (బి) వీల్ 2; మెహిదీ (నాటౌట్) 13; సైఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–8, 2–18, 3–65, 4–74, 5–106, 6–110, 7–116. బౌలింగ్: బ్రాడ్ వీల్ 4–0–24–3, డేవీ 4–0–24–1, షరీఫ్ 3–0–26–0, లిస్క్ 2–0–20–0, మార్క్ వాట్ 4–0–19–1, గ్రీవ్స్ 3–0–19–2. -
Tokyo Olympics: డోపింగ్‌లో సుమిత్ విఫలం
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గత నెలలో బల్గేరియాలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 125 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించాడు. అయితే ఇదే టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో సుమిత్ విఫలమయ్యాడు. సుమిత్ శాంపిల్‌లో నిషేధిత మెథిలెక్సాన్ ఉత్ప్రేరకం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో సుమిత్‌పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం కారణంగా సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయినట్టే. ఒకవేళ సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతనిపై కనీసం రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. -
అంకితకు నిరాశ
పారిస్: గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రాలో ఆడాలనుకున్న భారత మహిళల నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా నిరీక్షణ మరింత కాలం కొనసాగనుంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీలో 27 ఏళ్ల అంకితకు మరోసారి నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 176వ ర్యాంకర్ అంకిత 3–6, 2–6తో 22వ సీడ్ కురిమి నారా (జపాన్) చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలైంది. గంటా 21 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ‘మ్యాచ్‌లో మరీ చెత్తగా ఆడలేదు. నా ప్రత్యర్థి గొప్పగా ఆడి నా సర్వీస్ గేమ్‌ల్ని దక్కించుకుంది. అవి గెలిచుంటే ఫలితం మరోలా ఉండేది. అక్కడ గాలి కూడా ప్రభావం చూపింది’ అని మ్యాచ్ అనంతరం అంకిత వ్యాఖ్యానించింది. అంకిత ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ కేటగిరీలో భారత ప్రాతినిధ్యం లేనట్లయింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ క్వాలిఫయర్స్‌లోనే ఓటమి పాలయ్యారు. -
చెన్నై చేతులెత్తేసింది...
విశాఖ స్పోర్ట్స్: వైజాగ్‌లో క్రికెట్ వీరాభిమానులకు మండు వేసవిలో మహా కూల్ వార్త! ఐపీఎల్ తుది ఘట్టంలో రెండు కీలక మ్యాచ్‌లు విశాఖలో జరగబోతున్నాయి. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది.ఈసారి ఏకంగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లనే సొంతం చేసుకుంది. తుదిపోరుకు అర్హత సాధించే జట్లను ఎంపిక చేసే నాకౌట్ మ్యాచ్‌లు విశాఖలోనే జరగనున్నాయి. ప్రస్తుత 12వ ఎడిషన్ ఐపీఎల్లో తొలినాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ పోరుకు తలపడేది విశాఖలోనే. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ చెన్నైలో జరగనున్నా...ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్ వైఎస్ఆర్ స్టేడియంలోనే జరగనున్నాయి. మే 8న జరిగే ఎలిమినేషన్ మ్యాచ్‌కు, మే10న జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు వైఎస్ఆర్ స్టేడియమే వేదిక కానుంది.టైటిల్ పోరు హైదరాబాద్‌లో 12న జరగనుంది. రెండు వారాల వ్యవధి చాలు కేవలం రెండు వారాల వ్యవధి ఇస్తే చాలు ఎటువంటి ఫార్మాట్ మ్యాచ్‌కైనా సిద్ధమంటూ విశాఖ వైఎస్ఆర్ స్టేడియం సవాలును స్వీకరిస్తుంది. 2016లో కేవలం రెండు వారాల వ్యవధిలోనే మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడమే కాక ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఐపీఎల్లో ఫ్రాంచైజీ జట్లు సయితం హోమ్ పిచ్ అంటూ విశాఖ స్టేడియంకోసం పోటీపడ్డాయి. డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లే కాదు ఏకంగా ఒకేసారి రెండు ఫ్రాంచైజీలు హోమ్పిచ్గా ఎంచుకుని మ్యాచ్‌ల్ని ఇక్కడ నిర్వహించాయి. దేశంలోనే తొలి ప్రాధాన్యపు స్టేడియంగా వైఎస్ఆర్ స్టేడియం నిలిచింది. గతంలోనూ చాన్స్ 2012లో దక్కన్ చార్జర్స్ జట్టు హోమ్ గ్రౌండ్‌గా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా సన్‌రైజర్స్‌గా మారిన ఆదే జట్టు 2015లోనూ ఇక్కడ మ్యాచ్‌లాడింది. 2016లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లకు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం వేదికగా నిలిచింది. పూణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు విశాఖను హోమ్ గ్రౌండ్‌గా ఎంపిక చేసుకుని మ్యాచ్‌లాడిన విషయం విదితమే. అప్పుడు లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించి ఆనందించిన విశాఖ క్రీడాభిమానులు ఈసారి ఏకంగా ఐపీఎల్ టోర్నీ టైటిల్ పోరుకు అర్హత సాధించే జట్లు పోటీ పడే ఎలిమినేటర్, క్వాలిఫయిర్ మ్యాచ్‌లను వీక్షించనున్నారు. మండు వేసవిలో ఇది మహా థ్రిల్ ఇచ్చే విషయమే మరి! చెన్నై చేతులెత్తేసింది... వాస్తవానికి ప్రస్తుత సీజన్ ఐపీఎల్ మ్యాచ్ తుదిదశ పోటీలకు చెన్నై వేదిక కావల్సి ఉంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఉన్న చెన్నై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేదే. అయితే, చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్లను తెరిచే విషయంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) తమ అశక్తతను తెలియజేయడంతో చెన్నైకి కేవలం ఒక క్వాలిఫయిర్ మ్యాచ్ నిర్వహణకు మాత్రం అవకాశం దక్కింది. స్టేడియంలో మూడు స్టాండ్లు చాలాకాలంగా మూతపడి ఉన్నాయి. వీటిని తెరవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదని టీఎన్‌సీఏ స్పష్టం చేయడంతో అక్కడ ఒక్క క్వాలిఫయిర్ మ్యాచ్ నిర్వహణకే ఐపీఎల్ నిర్వాహక కమిటీ సమ్మతించింది. కోట్లలో ఆదాయాన్ని ఒదులుకోవడం ఇష్టంలేని బీసీసీఐ ఈ మూడు స్టాండ్లను తెరవాలని పట్టుబడుతోంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోగల రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు ఫైనల్ నిర్వహించే అవకాశం దక్కడంతో క్వాలిఫైయర్, ఎలిమినేషన్ మ్యాచ్‌లకు వైఎస్ఆర్ స్టేడియమే వేదికైంది. ఎన్నికల నేపథ్యంలో ముంబై, బెంగళూరులలో కూడా పరిస్థితి మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో విశాఖకు మళ్లీ లక్కీగా అవకాశం అందివచ్చింది. -
‘ఎక్స్‌ప్రెస్ కు బ్రేక్‌లు
రాయ్‌పూర్: లక్ష్యంలో సగానికి పైగా పరుగులు చేసిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ (29 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. సదరన్ ఎక్స్‌ప్రెస్ బౌలర్లకు బ్రేక్‌లు వేస్తూ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఫలితంగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 7 వికెట్ల తేడాతో సదరన్ ఎక్స్‌ప్రెస్‌పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్‌కు దిగిన సదరన్10 ఓవర్లలో 5 వికెట్లకు 92 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (20 బంతుల్లో 37; 7 ఫోర్లు), గుణతాలిక (26 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. గుణతాలిక, ప్రసన్న (7) రెండో వికెట్‌కు 28 పరుగులు జోడించినా మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడే ప్రయత్నంలో స్వల్ప విరామాల్లో అవుటయ్యారు. బౌల్ట్ 2, సౌతీ, స్టైరిస్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు 9.3 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసి గెలిచింది. కేన్ విలియమ్సన్ వీరవిహారానికి తోడు డివిచ్ (8 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), ఫ్లిన్ (11 బంతుల్లో 14; 1 సిక్స్) సమయోచితంగా ఆడారు. డివిచ్తో కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు; ఫ్లిన్‌తో కలిసి రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించిన విలియమ్సన్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. చివర్లో హారిస్ (6 బంతుల్లో 10 నాటౌట్; 1 ఫోర్), స్టైరిస్ (4 నాటౌట్) నిలకడగా ఆడి విజయాన్ని అందించారు. విలియమ్సన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు సదరన్ ఎక్స్‌ప్రెస్ ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) బౌల్ట్ (బి) స్టైరిస్ 37; గుణతాలిక (బి) బౌల్ట్ 39; ప్రసన్న రనౌట్ 7; ముబారక్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; ఎంజెలో పెరీరా (సి) డివిచ్ (బి) సౌతీ 1; మహరూఫ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (10 ఓవర్లలో 5 వికెట్లకు) 92 వికెట్ల పతనం: 1-55; 2-83; 3-85; 4-91; 5-92 బౌలింగ్: బౌల్ట్ 2-0-12-2; సౌతీ 2-0-20-1; కుగ్ల్జీన్ 1-0-11-0; స్టైరిస్ 2-0-18-1; సోధి 2-0-10-0; డివిచ్ 1-0-18-0. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: కేన్ విలియమ్సన్ (బి) మహరూఫ్ 52; డివిచ్ (సి) డి.పెరీరా (బి) మహరూఫ్ 14; ఫ్లిన్ (సి) కుశాల్ పెరీరా (బి) డి.పెరీరా 14; హారిస్ నాటౌట్ 10; స్టైరిస్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (9.3 ఓవర్లలో 3 వికెట్లకు) 96 వికెట్ల పతనం: 1-41; 2-74; 3-86 బౌలింగ్: డి.పెరీరా 2-0-11-1; ప్రసన్న 1-0-14-0; గుణతాలిక 1-0-19-0; మహరూఫ్ 2-0-14-2; జయంపతి 2-0-18-0; పతిరనా 1.3-0-19-0. -
జింబాబ్వే ఆశలు సజీవం
రాణించిన టేలర్, మసకద్జా టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ సిల్హెట్: బ్రెండన్ టేలర్ (39 బంతుల్లో 49; 2 ఫోర్లు, 1 సిక్సర్), మసకద్జా (45 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రధాన టోర్నీకి అర్హత పొందే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. సిల్హెట్ స్టేడియంలో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. టామ్ కూపర్ (58 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) వీరవిహారం చేశాడు. బెన్ కూపర్ (24 బంతుల్లో 20; 1 ఫోర్), ముదస్సర్ (16 బంతుల్లో 14 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో జింబాబ్వే బౌలర్లు ఆకట్టుకోవడంతో నెదర్లాండ్స్ టాప్ ఆర్డర్ విలవిలలాడింది. 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే టామ్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. బెన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 52, ముదస్సర్తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించాడు. ఉత్సెయా 2, పన్యాన్‌గర, ముషాంగ్వే తలా ఓ వికెట్ తీశారు. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో సికిందర్ రజా (13) విఫలమైనా మసకద్జా మెరుగ్గా ఆడాడు. టేలర్‌తో కలిసి రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో మసకద్జా, చిగుంబురా అవుట్ కావడం, చివర్లో నెదర్లాండ్స్ బౌలర్లు చెలరేగడంతో కాస్త ఉత్కంఠ చోటు చేసుకుంది. విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు) ఆరు పరుగులు రాబట్టి రనౌటయ్యాడు. చివరి బంతిని సిబండా (3 బంతుల్లో 9 నాటౌట్; 1 సిక్సర్) సిక్సర్ బాదడంతో జింబాబ్వే ఊపిరి పీల్చుకుంది. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా విజయం డేవిడ్ వార్నర్ (65), ఫించ్ (47) బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 పరుగులతో నెగ్గింది. ముందుగా ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. తర్వాత కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై నెగ్గింది. మొదట పాక్ 17.3 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. -
ఐర్లాండ్ సంచలనం
చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే బౌలర్లు పట్టు విడవకుండా పోరాడినా ఫలితం దక్కలేదు. సోమవారం సిల్హెట్ స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఈ మెగా టోర్నీలోని ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు; 2 సిక్స్), చిగుంబురా (13 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్స్) రాణించారు. 14 పరుగులకే తొలి వికెట్ పడగా ఓపెనర్ మసకద్జా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి టేలర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వేగంగా ఆడిన టేలర్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో చిగుంబురా ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. డాక్రెల్, మెక్ బ్రైన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 20వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (34 బంతుల్లో 60; 9 ఫోర్లు; 1 సిక్స్), పోర్టర్‌ఫీల్డ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆరో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది స్టిర్లింగ్ జోరును ప్రదర్శించాడు. దీంతో 8.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేరాయి. స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. చివర్లో ఉత్కంఠ అయితే రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులతో పటిష్టంగానే కనిపించిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. పేసర్ పన్యంగరా (4/37) రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ ప్రారంభమైంది. 15వ ఓవర్లో తను రెండు వికెట్లు తీశాడు. అప్పటికి 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో బరిలోకి దిగిన కెవిన్ ఓబ్రియాన్ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్) తన సహజశైలిలో ఆడగా 12 బంతుల్లో లక్ష్యం ఏడు పరుగులకు వచ్చింది. చివరి ఓవర్లో నాలుగు పరుగులు రావాల్సి ఉండగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక చివరి బంతికి ఒక్క పరుగు అవసరం. బంతి బ్యాట్స్‌మన్‌కు చిక్కకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నేరుగా వికెట్లను గిరాటేసేందుకు టేలర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. విజయానికి కావాల్సిన సింగిల్‌ను ఐర్లాండ్ సాధించడంతో మ్యాచ్ ముగిసింది.