T20 World Cup 2021 Scotland Vs Bangladesh: మస్కట్: అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన స్కాట్లాండ్ జట్టు టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘బి’లో గెలుపు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ఆశ్చర్యపరిచింది. క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2/19) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
మెహిదీ హసన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. ముషి్ఫకర్ రహీమ్ (36 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. కీలకమైన షకీబ్, ముషి్ఫకర్ వికెట్లను గ్రీవ్స్ పడగొట్టగా... మరో బౌలర్ బ్రాడ్ వీల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఇది కేవలం రెండో టి20 మ్యాచ్‌కాగా రెండింటిలోనూ స్కాట్లాండే నెగ్గడం విశేషం. 2012లో ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరిగింది.
గ్రీవ్స్ మెరుపులు
స్కాట్లాండ్ కెపె్టన్ కొయెట్జర్ (0) డకౌట్ కాగా, మున్సే (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూక్రాస్ (11) కాసేపు స్కోరు బోర్డును నడిపించారు. తర్వాత మెహిదీ హసన్, షకీబ్‌ల దెబ్బకు స్కాట్లాండ్ కుదేలైంది. 8 పరుగుల వ్యవధిలోనే క్రాస్, మున్సే, బెరింగ్టన్ (2), లిస్‌్క(0), మ్యాక్‌లియోడ్ (5) పెవిలియన్ చేరారు. 53 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన స్కాట్లాండ్‌ను క్రిస్ గ్రీవ్స్ ఆదుకున్నాడు. మార్క్ వాట్ (22; 2 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.
టాపార్డర్ వైఫల్యం
బంగ్లా టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు లిటన్ దాస్ (5), సౌమ్య సర్కార్ (5), షకీబ్ (20) నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ముషి్ఫకర్, మహ్మూదుల్లా (23; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. అయితే స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా స్కోరు వేగం పడిపోయింది. దీంతో తర్వాత క్రీజులోకి దిగిన బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడికి తలవంచారు.
షకీబ్ రికార్డు
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్కాట్లాండ్‌పై అతను 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా శ్రీలంక పేసర్ మలింగ పేరిట ఉన్న 107 వికెట్ల రికార్డును అధిగమించి 108 వికెట్లతో టాప్ ర్యాంక్‌లోకి వెళ్లాడు.
స్కోరు వివరాలు
స్కాట్లాండ్ ఇన్నింగ్స్: మున్సే (బి) మెహిదీ 29; కొయెట్జర్ (బి) సైఫుద్దీన్ 0; క్రాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మెహిదీ 11; బెరింగ్టన్ (సి) అఫిఫ్ (బి) షకీబ్ 2; మ్యాక్‌లియోడ్ (బి) మెహిదీ 5; లిస్క్ (సి) లిటన్ దాస్ (బి) షకీబ్ 0; గ్రీవ్స్ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 45; వాట్ (సి) సౌమ్య సర్కార్ (బి) తస్కిన్ 22; డేవీ (బి) ముస్తఫిజుర్ 8; షరీఫ్ (నాటౌట్) 8; బ్రాడ్ వీల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1–5, 2–45, 3–46, 4–52, 5–52, 6–53, 7–104, 8–131, 9–131.
బౌలింగ్: తస్కిన్ 3–0–28–1, ముస్తఫిజుర్ 4–1–32–2, సైఫుద్దీన్ 4–0–30–1, షకీబ్ 4–0–17–2, మెహిదీ 4–0–19–3, అఫిఫ్ 1–0–10–0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) మున్సే (బి) వీల్ 5; సౌమ్య సర్కార్ (సి) మున్సే (బి) డేవీ 5; షకీబ్ (సి) మ్యాక్‌లియోడ్ (బి) గ్రీవ్స్ 20; ముషి్ఫకర్ (బి) గ్రీవ్స్ 38; మహ్మూదుల్లా (సి) మ్యాక్‌లియోడ్ (బి) వీల్ 23; అఫిఫ్ (సి) డేవీ (బి) వాట్ 18; నురుల్ (సి) మ్యాక్‌లియోడ్ (బి) వీల్ 2; మెహిదీ (నాటౌట్) 13; సైఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134.
వికెట్ల పతనం: 1–8, 2–18, 3–65, 4–74, 5–106, 6–110, 7–116.
బౌలింగ్: బ్రాడ్ వీల్ 4–0–24–3, డేవీ 4–0–24–1, షరీఫ్ 3–0–26–0, లిస్క్ 2–0–20–0, మార్క్ వాట్ 4–0–19–1, గ్రీవ్స్ 3–0–19–2.
Comments
Please login to add a commentAdd a comment