వెర్‌స్టాపెన్‌కే పోల్‌  | Another pole position for Max Verstappen | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌కే పోల్‌ 

Published Sun, Aug 27 2023 2:34 AM | Last Updated on Sun, Aug 27 2023 2:34 AM

Another pole position for Max Verstappen - Sakshi

జండ్‌వూర్ట్‌ (నెదర్లాండ్స్‌): ఈ ఎఫ్‌1 సీజన్‌లో జోరు మీదున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కే మరో పోల్‌ పొజిషన్‌ దక్కింది. శనివారం జరిగిన డచ్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ రేసులో ల్యాపును అందరికంటే ముందుగా 1 నిమిషం 10.567 సెకన్లలో పూర్తి చేసిన వెర్‌స్టాపెన్‌కు పోల్‌ పొజిషన్‌ లభించింది.

ఈ సర్క్యూట్‌పై అతనికిది వరుసగా మూడో పోల్‌ పొజిషన్‌ కావడం విశేషం. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. డిఫెండింగ్‌ ఫార్ములావన్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో 11వ టైటిల్‌పై కన్నేశాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ (1ని.11.104 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement