f1 race
-
హామిల్టన్ రికార్డు
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 945 రోజుల తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మళ్లీ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్ 2021 డిసెంబర్ 5న సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో గెలుపొందాడు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ చరిత్రలో ఒకే సర్క్యూట్‌పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు నెలకొల్పాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ) ఫ్రాన్స్‌లోని మాగ్నీ కోర్స్ సర్క్యూట్ లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్ రికార్డును హామిల్టన్ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్లో 12 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) 255 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
తను తండ్రితో.. చెల్లి తల్లితో! నాన్న వల్లే ఇప్పుడిలా.. రికార్డులు కొల్లగొడుతూ!
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు .. ఏడాదిలో ఇలా రేస్‌ల సంఖ్య మారుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేదికలు కూడా మారిపోతున్నాయి. కానీ ఫలితం మాత్రం మారడం లేదు. ఒకే ఒక్కడు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసిస్తున్నాడు. బరిలో నిలిచిన మిగతావారంతా ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాలి అన్నట్లుగా ఆధిపత్యం సాగింది. సంవత్సరం క్రితం తన అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఈ ఏడాది అంతకు మించిన వేగంతో దూసుకుపోయి తన రికార్డులను తానే బద్దలు కొట్టాడు. 26 ఏళ్ల వయసులోనే వరుసగా మూడు సీజన్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచి మరిన్ని సంచలనాలకు సిద్ధమైన ఆ డ్రైవర్ పేరే మ్యాక్స్ వెర్స్టాపెన్.. 2022 సీజన్లో 15 రేస్‌లను గెలిచి కొత్త రికార్డు నమోదు చేసిన అతను.. ఈసారి తొలి 19 రేస్‌లు ముగిసే సరికే 16 సార్లు విజేతగా నిలవడంతో తన ఘనతను తానే అధిగమించి సత్తా చాటాడు. ‘పిన్న వయసు’ ఘనతలన్నీ 17 ఏళ్ల 166 రోజులు.. తొలిసారి ఫార్ములా వన్ ట్రాక్‌పై రయ్యిమంటూ దూసుకుపోయినప్పుడు వెర్స్టాపెన్ వయసు! దీంతో ఎఫ్1 బరిలో దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. ‘పిన్న వయసు’ ఘనతలన్నీ వరుసగా అతని ఖాతాలోనే చేరుతూ వచ్చాయి. పాయింట్లు సాధించడంలో, రేస్ గెలవడంలో, పోడియం ఫినిష్‌లో భాగం కావడంలో, ఫాస్టెస్ట్ ల్యాప్.. ఇలా అన్నింటిలో అతను అందరికంటే చిన్నవాడే. ఈ రికార్డుల వరుస చూస్తుంటేనే అతను ఎంత వేగంగా ఎదిగాడనేది స్పష్టమవుతోంది. 2021లో ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన తొలి నెదర్లాండ్స్ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన వెర్స్టాపెన్ ఆ తర్వాత వరుసగా రెండు సీజన్ల పాటు తన టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం! తండ్రి మార్గనిర్దేశనంలో.. 107.. వెర్స్టాపెన్ తండ్రి జోస్ వెర్స్టాపెన్ ఫార్ములా వన్‌లో పోటీ పడిన రేస్‌ల సంఖ్య. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్క రేస్‌లో కూడా అతను విజేతగా నిలవలేకపోయాడు. ఆ తర్వాత పోటీల నుంచి తప్పుకొని ఎఫ్1 టీమ్‌ల సహాయక సిబ్బందిలో అతను చేరాడు. జోస్ మనసులో కూడా కొడుకు గురించి ఒక ప్రణాళిక ఉంది. కానీ దానికి తొందరపడదల్చుకోలేదు. అయితే నాలుగున్నరేళ్ల వయసున్న మ్యాక్స్ తండ్రిని గోకార్టింగ్ కారు కొనివ్వమని కోరగా.. ఆరేళ్లు వచ్చాకే అవన్నీ అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. కానీ మ్యాక్స్ వదల్లేదు. తండ్రిని పదేపదే అడగటంతో పాటు నాకంటే చిన్నవాళ్లు కూడా కార్టింగ్ చేస్తున్నారంటూ తల్లితో కూడా చెప్పించాడు. దాంతో జోస్ దిగిరాక తప్పలేదు. చివరకు ఇద్దరూ రాజీ పడి అయితే ఒక చిన్న కార్టింగ్ కారులో మొదలైన తన కొడుకు ప్రస్థానం అంత వేగంగా, అంత అద్భుతంగా సాగుతుందని ఆయనా ఊహించి ఉండడు. అయితే మ్యాక్స్ ఎదుగుదలలో ఒక్క ఆసక్తి మాత్రమే కాదు.. అతని కఠోర శ్రమ, సాధన, పట్టుదల, పోరాటం అన్నీ ఉన్నాయి. 15 ఏళ్ల వయసులో స్థానికంగా జరిగిన ఒక గోకార్టింగ్ చాంపియన్‌షిప్ దాదాపు చివరి వరకు ఆధిక్యంలో ఉండి కూడా మ్యాక్స్ ఓటమిపాలయ్యాడు. ఇది తండ్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కొంత కాలం పాటు వీరిద్దరి మధ్య మాటలే లేవు. చివరకు ఇద్దరూ రాజీ పడి మరింత సాధన చేసి ఫలితాలు సాధించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. తను నాన్నతో... చెల్లి అమ్మతో మరోవైపు అదే సమయంలో తన తల్లిదండ్రులు అనూహ్యంగా విడిపోవడం కూడా వెర్స్టాపెన్పై మానసికంగా ప్రభావం చూపించింది. తన చెల్లి.. తల్లితో వెళ్లిపోగా.. తాను తండ్రితో ఉండిపోయాడు. తండ్రికి ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్‌తో ఉన్న స్నేహం.. అతనికి ఆటపై మరింత ఆసక్తిని పెంచడమేకాకుండా సరైన దిశానిర్దేశమూ చేసింది. ముందుగా ఎఫ్1తోనే.. వెర్స్టాపెన్ 2015లో తొలిసారి ఫార్ములా వన్ రేస్‌లోకి అడుగు పెట్టాడు. ఈ సీజన్లో 19 రేస్‌లలో పాల్గొన్న అతను 12వ స్థానంతో ముగించాడు. ఆసక్తికర అంశం ఏమిటంటే అతనికి అప్పటికి 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. ఎఫ్1 లైసెన్స్ అందుకొని ట్రాక్‌పై రయ్యంటూ పరుగులు పెట్టిన కొద్ది రోజులకు గానీ వెర్‌స్టాపెన్‌కు అధికారికంగా రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు. ఏదైనా సాధించగలననే నమ్మకం తొలి సీజన్ గొప్పగా లేకపోయినా అతనిలో మంచి ప్రతిభ ఉన్నట్లుగా సర్క్యూట్లో గుర్తింపు లభించింది. తర్వాతి ఏడాది వెర్స్టాపెన్ ఎఫ్1లో బోణీ చేశాడు. మొదటిసారి రెడ్‌బుల్ జట్టు తరఫున బరిలోకి దిగి.. 17 రేస్‌లలో పాల్గొని ఒక రేస్‌లో విజేతగా నిలిచాడు. ఇది అతని అద్భుత భవిష్యత్తుకు పునాది వేసిన మొదటి విజయం. మొత్తంగా సీజన్‌ను ఐదో స్థానంతో ముగించడంలో వెర్స్టాపెన్ సఫలమయ్యాడు. 2017లో కీలక దశలో కాస్త తడబడి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా.. తర్వాతి సీజన్లో నాలుగో స్థానంలో నిలవడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా 11 పోడియంలు వెర్‌స్టాపెన్‌కు తాను ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని కలిగించాయి. ఆ తర్వాత పైపైకి దూసుకుపోవడమే తప్ప మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇక అగ్రస్థానానికి చేరే సమయం ఆసన్నమైందని మ్యాక్స్‌తో పాటు అతని తండ్రి జోస్‌కు కూడా అర్థమైంది. ఆపై వచ్చే ఏ అవకాశాన్నీ వదలకూడదని భావించిన తండ్రీ కొడుకులు తర్వాతి సీజన్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. తొలిసారి విజేతగా.. 2021 ఎఫ్1 సీజన్ వచ్చేసింది. అప్పటి వరకు ఎఫ్1 చరిత్రలో 71 సార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ అందజేయగా.. 33 మంది విజేతలుగా నిలిచారు. గత ఏడు సీజన్లలో ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచి మెర్సిడీజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ మంచి ఊపు మీదున్నాడు. అంతకు ముందు కూడా ఒకసారి టైటిల్ సాధించిన అతను అత్యధిక టైటిల్స్‌తో షుమాకర్ (7 టైటిల్స్) రికార్డును కూడా సమం చేసేశాడు. బహ్రెయిన్‌లో జరిగిన తొలి రేసును కూడా హామిల్టన్ గెలుచుకొని తన ఫామ్‌ను చూపించాడు. సమ ఉజ్జీలు తర్వాతి రేసు ఇటలీలోని ఇమోలాలో. ఈసారి కూడా పోల్ పొజిషన్ సాధించి హామిల్టన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే ఇక్కడే వెర్స్టాపెన్లోని అసలు సత్తా బయటకు వచ్చింది. మొదటి కార్నర్‌లోనే హామిల్టన్‌ను ఓవర్టేక్ చేసిన అతను ఆ తర్వాత అంతే వేగంగా దూసుకుపోయాడు. చివరి వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సీజన్లో తొలిరేస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఈ సీజన్ మొత్తం వీరిద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. ఒకరు ఒక రేస్‌లో విజేతగా నిలిస్తే ఆ వెంటనే మరొకరు తర్వాతి రేస్‌ను సొంతం చేసుకొని సమ ఉజ్జీగా నిలిచారు. ఆపై ఆబూ ధాబీలో జరిగిన చివరి రేస్‌లోనే (మొత్తం 22 రేస్‌లు) సీజన్ ఫలితం తేలడం విశేషం. సరిగ్గా ఈ రేస్‌కు ముందు సమానంగా 369.5 పాయింట్లతో వెర్స్టాపెన్, హామిల్టన్ ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు. వెర్స్టాపెన్ విజయనాదం తొలి ల్యాప్‌లోనే ముందంజ వేసి హామిల్టన్ శుభారంభం చేసినా.. ఆ తర్వాత వెర్స్టాపెన్ ఎక్కడా తగ్గలేదు. అత్యంత ఆసక్తికరంగా సాగిన పోరులో చివరిదైన 58వ ల్యాప్‌లో హామిల్టన్‌ను వెనక్కి తోసి వెర్స్టాపెన్ విజయనాదం చేశాడు. 8 పాయింట్ల తేడాతో అగ్రస్థానం సాధించి తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు. దాంతో ఎఫ్1లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తర్వాతి ఏడాది ఏకంగా 146 పాయింట్ల ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి చార్ల్స్ లెక్లర్క్ను చిత్తుగా ఓడించి టైటిల్ నిలబెట్టుకోవడం వెర్స్టాపెన్ ఆధిక్యాన్ని చూపించింది. ఇక ఇదే జోరును కొనసాగించి 2023 సీజన్లో చాలా ముందుగానే విజేత స్థానాన్ని ఖాయం చేసుకొని వెర్స్టాపెన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 26 ఏళ్ల వయసులోనే అసాధారణ వేగంతో దూసుకుపోతున్న వెర్స్టాపెన్ మున్ముందు సర్క్యూట్లో మరిన్ని సంచలన విజయాలతో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
వెర్‌స్టాపెన్‌కే పోల్
జండ్వూర్ట్ (నెదర్లాండ్స్): ఈ ఎఫ్1 సీజన్లో జోరు మీదున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కే మరో పోల్ పొజిషన్ దక్కింది. శనివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ రేసులో ల్యాపును అందరికంటే ముందుగా 1 నిమిషం 10.567 సెకన్లలో పూర్తి చేసిన వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. ఈ సర్క్యూట్‌పై అతనికిది వరుసగా మూడో పోల్ పొజిషన్ కావడం విశేషం. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. డిఫెండింగ్ ఫార్ములావన్ చాంపియన్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో 11వ టైటిల్‌పై కన్నేశాడు. మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1ని.11.104 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. -
గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో.. బతికిపోయాడు!
స్పిల్బర్గ్ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్టైన్ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్మన్స్తో గాలిలో జెట్ప్యాక్స్తో కొన్ని స్టంట్స్ చేయించారు. సూపర్‌గా సాగుతూ మంచి ఎంటర్టైనింగ్ నడుస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఒక స్టంట్‌మన్ జెట్ప్యాక్ ల్యాపింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా కంట్రోల్ తప్పిన స్టంట్‌మన్ నేరుగా రేసు నిర్వహించే ల్యాప్‌పై మూడు పల్టీలు కొట్టాడు. అంత పైనుంచి పడినా అదృష్టవశాత్తూ సదరు స్టంట్మన్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది నిమిషాల్లో రేసు ప్రారంభమవుతుందనగా ఇది చోటుచేసుకోవడంతో కాస్త ఆందోళన కలిగించినా.. ఆ స్టంట్‌మన్ తనంతట తానుగా లేచి వెళ్లిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రేసు విషయానికి వస్తే ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు.పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది. Oscar Piastri nailing 'The Office' camera look after this jet-pack mishap! 😂 Glad to see the jet-pack flier in good spirits after too 😊#AustrianGP #F1 @OscarPiastri @McLarenF1 pic.twitter.com/AUwS04whpd — Formula 1 (@F1) July 2, 2023 చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..! -
ఇదీ ఇ–ఫార్ములా...రేసింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్
దాదాపు పుష్కరకాలం క్రితం భారత్‌లో ప్రతిష్టాత్మక ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ వచ్చింది. మూడేళ్లు ఢిల్లీ బుధ్ సర్క్యూట్లో కార్లు దూసుకుపోయిన తర్వాత వేర్వేరు కారణాలతో ఎఫ్1 నిర్వాహకులు భారత్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సరిగ్గా పదేళ్ల క్రితం అదే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) మన దేశంలో మరో రేసింగ్ ఈవెంట్‌కు అనుమతి ఇచ్చింది. అయితే దేశంలోనే ఇతర ప్రధాన నగరాలను కాదని ఫార్ములా–ఇ రేసింగ్‌కు వేదికగా మన హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం. భారత్‌లో జరగబోతున్న ఈ తొలి రేస్ గత కొంత కాలంగా అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హుస్సేన్ సాగర్ తీరాన ఈ వారాంతంలో అలా జూమ్మంటూ రేసింగ్ కార్లు సందడి చేయనున్న నేపథ్యంలో ఇ–ఫార్ములా విశేషాలు... సాక్షి, హైదరాబాద్: రేసింగ్ ప్రపంచంలో ఫార్ములావన్ అన్నింటికంటే పెద్ద ఈవెంట్. ఎఫ్1 కార్లు పెట్రోల్‌తో పని చేస్తాయి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇదే తరహాలో ఎలక్ట్రిక్ కార్లతో కూడా రేస్‌లు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) అధికారి కంగా ముందుకొచ్చింది. కాలుష్య నివారణకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇలాంటి కార్లను ప్రోత్సహించాలనే ఉద్దేశం కూడా వీటి ప్రారంభానికి కారణం. దాంతో 2014లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జరగబోతున్న ఫార్ములా–ఇ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయి ఈవెంట్. పర్యావరణహితం అంటూ ‘గో గ్రీన్’ పేరుతో ఈ రేసింగ్‌లను ఆయా దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ► ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు ఫార్ములా–ఇ పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్నది 9వ సీజన్. ఈ సీజన్లో మొత్తం 16 రేస్‌లు జరగనుండగా... హైదరాబాద్‌లో నాలుగోది నిర్వహిస్తున్నారు. తొలి మూడింటికి మెక్సికో సిటీ, దిరియా (సౌదీ అరేబియా–2 రేస్‌లు) ఆతిథ్యమిచ్చాయి. కేప్‌టౌన్, సావోపాలో, బెర్లిన్, మొనాకో, జకార్తా, పోర్ట్లాండ్, రోమ్, లండన్లలో తర్వాత రేస్‌లు జరుగుతాయి. ► ఎఫ్1లో ఉండే ప్రత్యేక సర్క్యూట్లతో పోలిస్తే ఫార్ములా–ఇ పోటీలు అన్నింటికీ దాదాపుగా జనావాసం మధ్యలో ఉండే ‘స్ట్రీట్ సర్క్యూట్‘లలో నే జరుగుతాయి. హైదరాబాద్‌లో కూడా నగరం మధ్యలో హుస్సేన్‌సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించేందుకు ఇదే ప్రధాన కారణం. ‘గ్రీన్కో’ సంస్థ ఈ ఈవెంట్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ► ఫార్ములా–ఇ కార్ల గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. గత ఎనిమిది సీజన్లతో పోలిస్తే ఈసారి కొత్తగా జెన్3 (జనరేషన్ 3) కార్లను ఉపయోగిస్తున్నారు. జెన్ 3 బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంటాయి. పనితీరు, సామర్థ్యంలో ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లలో ఇవే అత్యుత్తమం. ఇందులో 40 శాతం వరకు ఎనర్జీ కేవలం బ్రేక్‌లు వాడటం ద్వారానే ‘రీజనరేటివ్’తో ఉత్పత్తి అవుతుంది. రబ్బర్, రీసైకిల్డ్ ఫైబర్లనే టైర్ల తయారీలో వాడతారు. కాలుష్యరహితంగా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొనే ఈ కార్లను తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చెవులు చిల్లులు పడే ఎఫ్1 కార్ల శబ్దంతో పోలిస్తే తక్కువ డెసిబుల్స్‌తో ఈ కార్లు పరుగు తీస్తాయి. ► ఫార్ములా–ఇ జట్లలో ఎక్కువ భాగం టీమ్‌లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు చెందినవే ఉన్నాయి. భారత్‌కు చెందిన మహీంద్ర మోటార్స్ కూడా అలాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇ–రేసింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఎఫ్1 దిగ్గజాలైన మెక్లారెన్, మసెరాటి వంటి సంస్థలు కూడా ఇందులోకి అడుగు పెట్టాయి. ప్రఖ్యాత బ్రిటిష్ కంపెనీ ‘జాగ్వార్’ కూడా పోటీల బరిలో ఉంది. ► సాధారణ రేసింగ్ ప్రేమికుల కోణంలో ఫార్ములా–ఇ పోటీలకు ఎఫ్1 రేస్‌లతో పోలిక వస్తుంది. అయితే వీటి మధ్య ప్రస్తుతానికి పోలిక అనవసరం. అత్యుత్తమ స్థాయి సాంకేతికత వాడినా సరే, ఎఫ్1కంటే ఇ–కార్లలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఎఫ్1 కార్ హార్స్పవర్ (ఇంజన్ సామర్థ్యం) 1000 ఉంటే, ‘ఇ’ కార్లలో ఇది 350 మాత్రమే. ‘ఇ’ రేస్‌లలో ఎక్కువగా ఉండే మలుపుల వల్ల కూడా వేగం తగ్గుతుంది. అయినా సరే, అభిమానులను అలరించడంతో ఒక రకంగా అంచనాకు మించి ఫార్ములా ‘ఇ’ పోటీలు విజయవంతం అయ్యాయి. 45 నిమిషాల నిర్విరామ వినోదం అందించడంలో ఇవి అందరికీ చేరువయ్యాయి. హైదరాబాద్ రేస్ విశేషాలు వచ్చే శుక్ర, శనివారాల్లో రేస్‌లు జరుగుతాయి. శుక్రవారం, శనివారం జరిగే రెండు ఫ్రీ ప్రాక్టీస్ సెషన్లలో అన్ని జట్లు సాధన చేస్తాయి. శనివారం ఉదయం 10.40 నుంచి క్వాలిఫయింగ్ రేస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేసు జరుగుతుంది. సర్క్యూట్లో మొత్తం 17 మలుపులు ఉన్నాయి. మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు బరిలోకి దిగుతున్నారు. భారత్‌కు చెందిన ‘మహీంద్ర’ టీమ్ 2014 నుంచి కూడా పోటీ పడుతుంది. ఈసారి మహీంద్ర జట్టుకు ఒలివర్ రోలండ్, ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఎఫ్-1 రేసులో అపశ్రుతి.. రేసర్ వెన్నుముక విరిగింది
ఎఫ్-1 రేస్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. రేసులో భాగంగా జరిగిన యాక్సిడెంట్లో ఫార్ములావన్ దిగ్గజం మైకెల్ షుమాకర్ అల్లుడు డేవిడ్ షుమాకర్ వెన్నుముక విరిగింది. వెన్నుముకకు సర్జరీ అవసరం లేకపోయినప్పటికి డేవిడ్ షుమాకర్ కోలుకోవడానికి ఆరువారాల సమయం పట్టే అవకాశముంది. హాకెన్‌హీమ్ డీటీఎమ్ రేస్‌లో ఈ దుర్ఘటన జరిగింది. రేసులో భాగంగా లాప్-6 జరుగుతున్న సమయంలో టర్న్-8 వద్ద షుమాకర్ మెర్సిడెస్ కారు.. మరో కారుతో క్రాష్ అయింది. ఈ సమయంలో రెండు కార్లు బారికేడ్లను తాకడంతో షుమాకర్ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత షుమాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా వెన్నుముక కింది భాగమైన లంబర్ వర్టిబ్రే విరిగినట్లు రిపోర్ట్స్‌లో తేలింది. దీనికి సర్జరీ అవసరం లేకపోయినప్పటికి ఆరు వారాల విశ్రాంతి మాత్రం కచ్చితంగా అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఫార్ములావన్‌లో మైకెల్ షుమాకర్ దిగ్గజంగా పేరుపొందాడు. ఎఫ్-1 రేసులో ఏడు వరల్డ్ టైటిల్స్ సాధించిన షుమాకర్ అందులో ఐదు ఫెరారీ డ్రైవర్‌గా.. మిగతా రెండు టైటిల్స్ మెర్సిడెస్ ద్వారా అందుకున్నాడు. ఇక 2013లో తీవ్రమైన యాక్సిడెంట్‌కు గురైన షుమాకర్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2014లో కోమా నుంచి బయటపడిన షుమాకర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నాడు. ఇక షుమాకర్ రికార్డును లూయిస్ హామిల్టన్ 2021లో బ్రేక్ చేశాడు. షుమాకర్ తర్వాత మెర్సిడెస్కు ఎఫ్-1 రేసర్‌గా మారిన హామిల్టన్ ఏడు వరల్డ్ టైటిల్స్ సాధించి షుమాకర్‌తో సమానంగా నిలిచాడు. చదవండి: 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్ అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్ -
లెక్లెర్క్కు నాలుగో ‘పోల్’
బార్సిలోనా (స్పెయిన్): ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో నాలుగోసారి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 18.750 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఐదు రేసులు జరగ్గా రెండింటిలో లెక్లెర్క్... మూడింటిలో వెర్స్టాపెన్ విజేతలుగా నిలిచారు. -
పోలీస్ ఎస్కార్ట్ మధ్య ట్రోఫీ అందుకున్న ఫార్ములావన్ స్టార్
ఫార్ములావన్ స్టార్.. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు అరుదైన గౌరవం లభించింది. సోమవారం జరిగిన మియామి గ్రాండ్ప్రిక్స్ ఫైనల్ ల్యాప్ రేసులో వెర్స్టాపెన్ సూపర్ విక్టరీ సాధించాడు. మొదట మూడో పొజిషన్లో నిలిచినప్పటికి ఆ తర్వాత ఫెరారీ డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్, కార్లోస్ సెయింజ్లను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. మొదటి ల్యాప్‌ను మూడో స్థానంతో ప్రారంభించి చివరకు రెండో స్థానంతో పొజిషన్‌ను ముగించాడు. ఆ తర్వాత ఏడు ల్యాప్స్ అనంతరం పోల్ పొజిషన్ సాధించిన వెర్స్టాపెన్ దూసుకెళ్లి రేసు గెలవడంతో పాటు టైటిల్‌ను కొల్లగొట్టాడు. కాగా మియామి ఓపెన్ గ్రాండ్ప్రిక్స్ తొలిసారి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజేతకు గౌరవం ఇవ్వాలని పోడియం వరకు మేనేజ్మెంట్ పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముందు, వెనుక పోలీస్ ఎస్కార్ట్ వెళ్లగా.. మధ్యలో ఓపెన్ టాప్ కార్లో వెర్స్టాపెన్ పోడియం వద్దకు చేరుకొని ట్రోఫీని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఈ గెలుపును ఇప్పటికి నమ్మలేకపోతున్నా. నిజంగా ఇది మంచి కమ్‌బ్యాక్. వాస్తవానికి నాకు మంచి ఆరంభం లభించలేదు. ఆ తర్వాత ఫుంజుకొని తొలి స్థానంతో రేస్‌ను ముగించాను. మధ్యలో సెయింజ్ నుంచి గట్టిపోటి ఎదురైనప్పటికి టర్న్ 1 నుంచి అతన్ని దాటాలనే ప్రయత్నం చేశాను. లక్కీగా అది వర్కవుట్ అయింది. ఇక మెయిడెన్ టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది'' అంటూ ట్రోఫీ అందుకున్న అనంతరం వెర్స్టాపెన్ చెప్పుకొచ్చాడు. చదవండి: దిగ్గజాలకు షాకిచ్చి మాడ్రిడ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్ యువ కెరటం Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు A special escort to the podium for @Max33Verstappen #MiamiGP #F1 pic.twitter.com/7C4Qifciqm — Formula 1 (@F1) May 9, 2022 -
ఫార్ములావన్ దిగ్గజ రేసర్ కన్నుమూత
ఫార్ములావన్ దిగ్గజం టోనీ బ్రూక్స్ కన్నుమూశాడు. 90 ఏళ్ల టోనీ బ్రూక్స్ కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా బుధవారం బ్రూక్స్ తుది శ్వాస విడిచినట్లు అతని కూతురు గులియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా 'రేసింగ్ డెంటిస్ట్'గా పేరు పొందిన బ్రూక్స్ 1957లో బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ ద్వారా కెరీర్లో తొలి విజయంతో పాటు మెయిడెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్లో 38 రేసుల్లో పాల్గొన్న టోనీ బ్రూక్స్ 10సార్లు ఫోడియం పొజిషన్ అందుకున్నాడు. ఆరు గ్రాండ్ప్రిక్స్ టోర్నీల్లో విజయాలు అందుకున్న బ్రూక్స్ ఖాతాలో బ్రిటీష్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ గ్రాండ్ప్రిక్స్ టైటిల్స్ ఉన్నాయి. 1959లో ఎఫ్ 1 చాంపియన్‌షిప్ టైటిల్ పొందే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 29 ఏళ్ల వయసులోనే ఫార్ములావన్‌కు గుడ్‌బై చెప్పిన టోనీ బ్రూక్స్ వాన్మాల్, ఫెరారీ, కూపర్ టీమ్‌ల తరపున బరిలోకి దిగాడు. చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం We are saddened to hear of the passing of Tony Brooks F1's last surviving race winner of the 1950s, Brooks was one of the earliest pioneers of the sport we love. Our thoughts are with his loved ones pic.twitter.com/9hhY6MlmWZ — Formula 1 (@F1) May 3, 2022 -
నిమిషం ఆలస్యమయినా పరిస్థితి వేరుగా ఉండేది
బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌లో భాగంగా ఫార్ములావన్ డ్రైవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాప్ జరుగుతుండగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫార్ములావన్ డ్రైవర్ వెంటనే బయటకు దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. గత ఆదివారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీ జరిగింది. కుడేరియా ఆల్ఫాతౌరీ డ్రైవర్ పియర్ గ్యాస్లీ రేసులో పాల్గొన్నాడు. మరో 10 ల్యాప్స్ ఉన్న సమయంలో పియర్ గ్యాస్లీ కారుకు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన పియర్ వెంటనే కారును సైడ్‌కు తీసుకెళ్లి అందులో నుంచి బయటకు దూకేశాడు. చూస్తుండగానే మంటలు కారును మొత్తం చుట్టేశాయి. వెంటనే నిర్వహకులు వచ్చి మంటలు ఆర్పేశారు. కాగా పియర్ గ్యాస్లీ 46వ ల్యాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కచ్చితంగా టాప్ 10లో ఉంటానని భావించిన పియర్‌కు ఇది ఊహించని ఫలితం అని చెప్పొచ్చు. ఇక ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: Lewis Hamilton: టైటిల్ గెలవకపోయినా ప్రపంచ రికార్డు బద్దలు Ashleigh Barty: టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం.. 25 ఏళ్ల వయస్సులోనే Not the start to the season Pierre Gasly wanted! 💔 An unlucky end to the Frenchman's race with his car coming to a stop on Lap 46 😔#BahrainGP #F1 pic.twitter.com/bai0TUPgMz — Formula 1 (@F1) March 22, 2022 -
పేరు మార్చుకోనున్న స్టార్ ఆటగాడు.. కారణం?
''ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు ఉండరు''.. ఇది కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పిన ఫేమస్ డైలాగ్. ఇది అక్షరాలా నిజం.. మనకు జన్మనిచ్చిన తల్లిని మనం ఎంత ప్రేమిస్తే.. అంతే ప్రేమను తిరిగి పొందుతామని అంటుంటారు. తాజాగా ఏడుసార్లు ఫార్ములాన్ చాంపియన్(ఎఫ్ 1), మెర్సిడస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన పేరులో చిన్న మార్పు చేయనున్నట్లు తెలిపాడు. ఇకపై తన పేరు తల్లి పేరుతో కలిపి ఉంటుందని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని తెలిపాడు. ''పెళ్లవ్వగానే ఆడవాళ్ల ఇంటిపేరు మారుతుందంటారు. ఇది విన్నప్పుడల్లా నాకు వింతగా అనిపిస్తుంటుంది. ఆడవాళ్ల పేర్లు మారుతాయి తప్ప.. వారి పేర్లను మనలో ఎందుకు చేర్చమో అర్థం కాదు. అందుకే ఇప్పుడు చెబుతున్నా.. నా తల్లి పేరు కార్మెన్ లార్బలీస్టర్ హామిల్టన్. ఇకపై నా పేరులో తల్లి పేరుతో ఉంటుంది. ఇక నా పూర్తి పేరు లుయీస్ లార్బలీస్టర్ హామిల్టన్.. ఎనిమిదో టైటిల్ గెలిచే సమయంలో నా పేరులో అమ్మ పేరు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. బహ్రెయిన్ గ్రాండ్ప్రిక్స్ ప్రారంభమయ్యేలోగా ఇదంతా పూర్తవుతుందని ఆశిస్తున్నా. ప్రపంచంలో తల్లికి మించి గొప్ప ఎవరు లేరు.. అందుకే పేరు మార్చుకుంటున్నా'' అని చెప్పుకొచ్చాడు. కాగా హామిల్టన్ 12 ఏళ్ల వయసులో తల్లి కార్మెన్ లార్బలీస్టర్.. తండ్రి ఆంథోని హామిల్టన్ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి లుయీస్ హామిల్టన్ తల్లి కార్మెన్తోనే ఉంటున్నాడు. చదవండి: Pat Cummins: సుత్తితో క్రీజులోకి ఆసీస్ కెప్టెన్.. ఎగతాళి చేసిన పాక్ అభిమానులు Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే'
Ukraine-Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం సంక్షోభం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. రష్యా అమానుష దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యుద్ధం మంచి పద్దతి కాదని.. వెంటనే ఆపేయాలని మొత్తుకుంటున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. పైగా తమ జోలికి వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమను టార్గెట్ చేసిన దేశాలకు రష్యా పరోక్షంగా హెచ్చరికలు పంపింది. రష్యా దుందుడుకు వైఖరిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం క్రీడలకు కూడా పాకింది. రష్యాలో జరిగే ఏ క్రీడైనా సరే తాము ఆడబోయేది లేదని పలువురు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఫార్ములావన్ డ్రైవర్.. సూపర్ స్టార్ సెబాస్టియన్ వెటెల్ ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. నాలుగుసార్లు చాంపియన్ అయిన వెటెల్ రష్యాలో జరగబోయే ఎఫ్ 1 రేసును బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. ఫార్ములా వన్ 2022 ప్రీ టెస్టింగ్ సీజన్ కోసం ప్రస్తుతం బార్సిలోనాలో ఉన్న వెటెల్ తాను రష్యా జీపీలో పాల్గొనేది లేదని స్పష్టం చేశాడు. ''నేను ఈరోజు ఉదయం లేచేసరికి ఒక వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ రష్యా అమానుషంగా ప్రవర్తిస్తోంది. ఒక సిల్లీ కారణంతో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం ఉపేక్షించేది కాదు. అందుకే ఒకసారి నేను పాల్గొనబోయే రేసింగ్ క్యాలెండర్‌ను చూసుకున్నా. అందులో రష్యా కూడా ఉంది. రష్యాలో జరిగే రేసింగ్‌లో పాల్గొనకూడదని ఇప్పుడే నిర్ణయించుకున్నా. ఆ దేశంలో రేసింగ్‌కు వెళితే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్లే. అందుకే రష్యాకు వెళ్లను గాక వెళ్లను..'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Formula One: 'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు' Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా? -
హామిల్టన్‌కే ‘పోల్’
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ సీజన్లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.252 సెకన్లలో ముగించాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ సహచరుడు, మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు రేసులు జరగ్గా... నాలుగింటిలో హామిల్టన్ విజయం సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఒక్కో విజయాన్ని అందుకున్నారు. నేటి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మొదలయ్యే బెల్జియం గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెనౌæ), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. ఒకాన్ (రెనౌ), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 9. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 10. లాండో నోరిస్ (మెక్లారెన్), 11. డానిల్ క్వియాట్ (అల్ఫా టౌరి), 12. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 13. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 14. వెటెల్ (ఫెరారీ), 15. జార్జి రసెల్ (విలియమ్స్), 16. రైకోనెన్ (అల్ఫా రోమియో), 17. గ్రోస్యెన్ (హాస్), 18. గియోవినాజి (అల్ఫా రోమియో), 19. నికోలస్ లతిఫి (విలియమ్స్), 20. మాగ్నుసెన్ (హాస్). -
మరో నాలుగు ఎఫ్1 రేసులు
లండన్: కరోనా వైరస్‌తో ఆలస్యంగా ఆరంభమైన ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో మరో నాలుగు రేసులను జోడించినట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ నాలుగు రేసులు చేరడంతో ఈ ఏడాది జరిగే రేసుల సంఖ్య 17కు చేరింది. కొత్తగా ప్రకటించిన వాటిల్లో టర్కీ గ్రాండ్‌ప్రి (జీపీ) ఉండటం విశేషం. 2011 అనంతరం మళ్లీ ఎఫ్1 క్యాలెండర్లో టర్కీ జీపీకి చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. నవంబర్ 15న ఈ రేసు జరగనుంది. అనంతరం బహ్రెయిన్‌లో నవంబర్ 29న, డిసెంబర్ 6న రెండు రేసు (డబుల్ హెడర్)లను నిర్వహిస్తారు. ఇక సీజన్ ముగింపు రేసు అబుదాబి వేదికగా డిసెంబర్ 13న జరుగుతుంది. తాము ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా పలుమార్లు ఎఫ్1 నిర్వాహకులతో మొరపెట్టుకున్నా వారికి అవకాశం దక్కలేదు. చివరి నాలుగు రేసులు కూడా అభిమానులు లేకుండానే జరిగే అవకాశం ఉంది. -
హామిల్టన్ హవా
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం తన ఆధిక్యాన్ని కొనసాగించి అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 45.279 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేత అయ్యాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 88వ విజయం కావడం విశేషం. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో, మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. సీజన్లో ఆరు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 132 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
బొటాస్దే బోణీ
స్పీల్బర్గ్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన బొటాస్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 55.739 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ రేసులో తొమ్మిది మంది మధ్యలోనే వైదొలిగారు. డ్రైవర్ల అత్యుత్సాహంతో మూడుసార్లు ఈ రేసులో సేఫ్టీకారు రావాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో మెర్సిడెస్‌కే చెందిన మరో స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌పై మూడు స్థానాల గ్రిడ్ పెనాల్టీ విధించారు. అనంతరం ప్రధాన రేసులో ట్రాక్‌పై మరో డ్రైవర్‌ను ఢీకొట్టడంతో ఐదు సెకన్ల పెనాల్టీ వేశారు. దాంతో హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)కు రెండో స్థానం... బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం పొందారు. ఈ ప్రదర్శనతో నోరిస్ (20 ఏళ్ల 235 రోజులు) ఫార్ములావన్ చరిత్రలో పిన్న వయస్సులో పోడియం (టాప్–3)పై నిలిచిన మూడో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మాక్స్ వెర్స్టాపెన్ (18 ఏళ్ల 228 రోజులు), లాన్స్ స్ట్రోల్ (18 ఏళ్ల 240 రోజులు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రేసు ప్రారంభానికి ముందు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌తో కలిసి మరో 13 మంది డ్రైవర్లు మోకాలిపై నిల్చోని తమ సంఘీభావం తెలిపారు. సీజన్‌లోని రెండో రేసు ఇదే వేదికపై 10న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్–25 పాయింట్లు); 2. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ–18); 3. లాండో నోరిస్ (మెక్లారెన్–16); 4. హామిల్టన్ (మెర్సిడెస్–12); 5. కార్లోస్ సెయింజ్ జూనియర్ (మెక్లారెన్–10); 6. పెరెజ్ (రేసింగ్ పాయింట్–8); 7. పియరీ గాస్లీ (అల్ఫా టౌరీ–6), 8. ఒకాన్ (రెనౌ–4); 9. గియోవినాజి (అల్ఫా రోమియో–2 పాయింట్లు), 10. వెటెల్ (ఫెరారీ–1 పాయింట్). -
నల్లజాతీయులకు అండగా నలుపు కార్లతో రేస్
లండన్: ఫార్ములావన్ (ఎఫ్1) చాంపియన్ జట్టు మెర్సిడెజ్ నల్ల జాతీయులకు అండగా... జాత్యాహంకారానికి వ్యతిరేకంగా స్పందిం చింది. 2020 సీజన్లో పూర్తిగా తమ కార్లు నలుపుమయం కానున్నాయని ప్రకటించింది. నలుపు రంగు కార్లతో ఫార్ములావన్‌లో తమ రేసర్లు పాల్గొంటారని తెలిపింది. సహజంగా మెర్సిడెజ్ సంస్థ ఎప్పుడైనా సిల్వర్ కలర్ కార్లతో సర్క్యూట్లో దూసుకెళ్లెది. అయితే జాత్యాహంకారానికి, నల్లజాతీయులపై దమనకాండకు ముగింపు పలికే కార్యక్రమంలో భాగంగానే తాము ఈ సీజన్లో నలుపు కార్లతో బరిలోకి దిగుతున్నామని టీమ్ ప్రిన్సిపల్ టొటొ వోల్ఫ్ వెల్లడించారు. ‘ఇక వర్ణవివక్షపై మౌనముద్ర ఉండదు. ప్రపంచ క్రీడా వేదికపై మా గళం వినిపించేలా.... మా సంకల్పం ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో వస్తున్నాం. ఈ వివక్షను ఉపేక్షించం. జాత్యాహంకారం నశించిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని అన్నారు. ఈ ఆదివారం జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్, అతని సహచరుడు బొటాస్ నలుపు కార్లతో ట్రాక్‌పై దూసుకెళ్లనున్నారు. -
మరో మూడు ఎఫ్1 రేసులు రద్దు
సింగపూర్: కరోనా కారణంగా ఫార్ములావన్‌లో తాజాగా మూడు రేసులు రద్దు అయ్యాయి. వేర్వేరు కారణాలతో అజర్బైజాన్, జపాన్, సింగపూర్లలో జరగాల్సిన గ్రాండ్‌ప్రి రేసుల్ని రద్దు చేసినట్లు ఫార్ములావన్ (ఎఫ్1) యాజమాన్యం పేర్కొంది. వీధి సర్క్యూట్లను సిద్ధం చేయడంలో ఏర్పడిన సవాళ్ల కారణంగా అజర్బైజాన్, సింగపూర్లలో... ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో జపాన్ గ్రాండ్ప్రిను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే 8 రేసులతో కూడిన సవరించిన క్యాలెండర్‌ను ప్రకటించిన ఫార్ములావన్... జూలై 7న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో పోటీలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 22 రేసులు జరగాల్సిన ఈ సీజన్లో ఇప్పటికే ఆస్ట్రేలియా, డచ్, మొనాకో, ఫ్రెంచ్ రేసులు రద్దు కాగా... తాజాగా వీటికి మరో మూడు జత చేరాయి. అయితే సీజన్ రెండో భాగంలో ఎక్కువ రేసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఫార్ములావన్ మోటార్‌స్పోర్ట్స్ చీఫ్ రాస్ బ్రాన్ అన్నారు. ‘త్వరితగతిన పరిణామాలు మారిపోతున్నాయి. అయినప్పటికీ ఇంకా మా వద్ద చాలా సమయముంది. రేసుల నిర్వహణకు అనేక అవకాశాలు కనుగొంటున్నాం. యూరోప్‌లో వేదికలను పెంచుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
షాంఘై: ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.547 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌కే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫార్ములావన్‌లో నేడు జరిగే చైనా గ్రాండ్‌ప్రి 1000వ రేసు కానుండటం విశేషం. -
హామిల్టన్... ఆగాగు!
ఆస్టిన్ (అమెరికా): ఈ సీజన్లో ఎవరికీ అందనంత వేగంతో దూసుకెళ్తున్న లూయిస్ హామిల్టన్‌కు అమెరికాలో అనూహ్యంగా నిరాశ ఎదురైంది. ఇప్పటికే తొమ్మిది రేసుల్లో విజేతగా నిలిచిన ఈ మెర్సిడెస్ డ్రైవర్ ఇక్కడ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టు కున్నాడు. దీంతో ఐదో ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం అతనికి నిరీక్షణ తప్పడం లేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ విజేతగా నిలిచాడు. ఐదేళ్ల తర్వాత అతనికి ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా అతను 2013లో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో గెలిచాడు. అమెరికన్ సర్క్యూట్లో 56 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా రైకోనెన్ 1 గంటా 34 నిమిషాల 18.643 సెకన్లలో పూర్తి చేశాడు. 2.342 సెకన్లు వెనుకబడిన హామిల్టన్ 1:34:16.301 సె. టైమింగ్‌తో మూడో స్థానంతో తృప్తిపడ్డాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ (1:34:17.362 సె.) రెండో స్థానంలో నిలువగా, హామిల్టన్ ప్రత్యర్థి వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం పొందాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్బెన్ ఒకాన్ డిస్క్వాలిఫై కాగా, సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానం పొందాడు. తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో ఒకవేళ వెటెల్ గెలిచినా కూడా... హామిల్టన్ టాప్–7లో నిలిస్తే చాలు ఇతనే ఐదోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడు. వెటెల్ గెలవకపోతే హామిల్టన్ స్థానాలతో సంబంధం లేకుండా విజేతగా నిలుస్తాడు. ప్రస్తుతం హామిల్టన్ (346 పాయింట్లు), వెటెల్ (276 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
వెటెల్ ఖాతాలో 50వ టైటిల్
మోంట్రియల్: వరుసగా నాలుగు రేసుల్లో టైటిల్‌కు దూరంగా నిలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ విజయాల ట్రాక్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రేసులో వెటెల్ 68 ల్యాప్‌లను గంటా 28 నిమిషాల 31.377 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ కెరీర్లో ఇది 50వ విజయంకాగా, ఈ సీజన్లో మూడోది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. గత మూడేళ్లుగా ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ సాధించడంతోపాటు విజేతగా నిలిచిన హామిల్టన్ (మెర్సిడెస్) ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 2004 తర్వాత కెనడా గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌కు టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ 14వ స్థానంలో నిలిచారు. మరోవైపు రేసు ముగింపునకు సూచికగా చెకర్డ్ ఫ్లాగ్‌ను చివరిదైన 70 ల్యాప్నకు బదులుగా 68వ ల్యాప్‌లోనే మోడల్ విన్నీ హార్లో ఊపడంతో గందరగోళం చోటు చేసుకుంది. సీజన్లో ఏడు రేసులు ముగిశాక వెటెల్ 121 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 120 పాయింట్లతో హామిల్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
‘ఇండియా వన్ రేస్’ పేరిట కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ రేసింగ్ తరహాలో ఇండియా వన్ రేస్ కార్ల పోటీలు నిర్వహిస్తామంటూ నగర వ్యాపారవేత్త రఘురామ కృష్ణమరాజు నుంచి రూ.7.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఓ సంస్థతోపాటు ముగ్గురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన మజ్దార్ కంపెనీతోపాటు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న డెక్కన్ క్రానికల్ ఎండీ వినాయక్ రవిరెడ్డి కుమార్తె అంజనారెడ్డి, వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే అంజనారెడ్డికి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేసి ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలను శనివారం పిలిపించి విచారించినట్టు తెలిసింది. వాంగ్మూలాల రికార్డు... ‘ఐపీఎల్లో డెక్కన్ చార్జెస్ మాకున్న సమయంలో మజ్దార్ కంపెనీ వాళ్లు సంప్రదించారు. కంపెనీలో 20 శాతం వాటా ఇస్తామన్నారు. ఆ తర్వాత వాళ్లు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశా. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు’అంటూ అంజనారెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ‘మచదర్ మోటార్ కారు కంపెనీకి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. ఆ తర్వాత నష్టాలు రావడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలిసిన వాళ్లు కదా అని వెళ్లి మాట్లాడాను. అంతే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు.’అని చాముండేశ్వరినాథ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. సచిన్, షారుఖ్, నాగార్జున బ్రాండ్ అంబాసిడర్లంటూ... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరిగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండియా వన్ కార్ రేసింగ్ నిర్వహించేందుకు ఆరేళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా మచదర్ మోటార్ కారు కంపెనీని ఏర్పాటు చేశారు. ఇందులో వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలతోపాటు అంజనారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను వీరు సంప్రదించారు. తమ రేస్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, నాగార్జునలను నియమిస్తున్నట్టుగా నమ్మించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 2011లో రఘురామ కృష్ణమరాజు దగ్గరికి చాముండేశ్వరినాథ్‌తో కలసి అంజనారెడ్డి వెళ్లారు. ఫార్ములా వన్ రేసింగ్ తరహాలో ఇండియా వన్ రేస్ కార్ల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించడంతో చెన్నై ఫ్రాంచైజీస్ కొనుగోలు చేసేందుకు రూ.7.5 కోట్లను రఘురామ కృష్ణమరాజు చెల్లించారు. ఆ తర్వాత కారు రేసింగ్ నిర్వహించకపోవడంతో రఘురామ కృష్ణమరాజు 2016లో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అంజనారెడ్డి, వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. -
రేసులో వారసుడొచ్చాడు...
దిగ్గజాల్లాంటి తండ్రి అడుగు జాడల్లో కొడుకులు నడవటం కొత్త కాదు. డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్, క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావడం చూసేశాం. ఇప్పుడు రేసర్ తనయుడు రేసర్‌గా వారసత్వం నిలబెట్టేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఎఫ్1 ప్రపంచాన్ని శాసించి... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ డ్రైవర్ మైకేల్ షుమాకర్ కొడుకు మిక్ షుమాకర్ ఎఫ్1 లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. స్కీయింగ్ చేస్తూ గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమైన తండ్రి ఆశలకు కొత్త ఊపిరి పోసేందుకు 16 ఏళ్ల మిక్ సన్నద్ధమయ్యాడు. శనివారం ప్రారంభమైన యూరోపియన్ ఏడీఏసీ ఫార్ములా-4 పోటీల్లో నెదర్లాండ్స్‌కు చెందిన వాన్ అమర్స్ఫూర్ట్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. యూరోపియన్ కార్టింగ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచి అతను ఈ రేస్‌లకు అర్హత సాధించాడు. చాన్నాళ్లుగా మిక్ షుమాకర్ రేసింగ్ పోటీల్లో కనిపిస్తున్నా... తన తండ్రి పేరు ఎక్కడా తెలీకుండా జాగ్రత్త పడ్డాడు. కార్టింగ్‌లో అతను తల్లి పేరు కొరిన్నా జత చేసి బరిలోకి దిగేవాడు. ఇప్పుడు ఇది బయటపడటంతో అతనిపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. వారసుల విజయాలు, వైఫల్యాలు సంగతి ఎలా ఉన్నా... తండ్రి పేరు భారం మోస్తూ అంచనాల మధ్య సత్తా చాటడం అంత సులువు కాదు. అయితే రేసింగ్ ప్రపంచం మొత్తం మిక్కు అండగా నిలుస్తోంది. అతనిలో అపార ప్రతిభ ఉందని, కచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టగలడని మాజీ డ్రైవర్లు, ఎఫ్1 దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఈ కుర్రాడు భవిష్యత్తులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. -
నేడు ఎఫ్1 ‘షో రన్’
హైదరాబాద్‌లో తొలిసారి ఎఫ్1 రేస్ కారు పరుగులు తీయనుంది. ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఉదయం 9 గంటలకు రెడ్‌బుల్ రేస్ కారు ‘షో రన్’ జరుగుతుంది. గతంలో 13 గ్రాండ్‌ప్రి రేస్‌లను గెలిచిన డ్రైవర్ డేవిడ్ కూల్ట్‌హర్డ్ ఈ కారును నడుపుతారు.