
లండన్: కరోనా వైరస్‌తో ఆలస్యంగా ఆరంభమైన ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్‌లో మరో నాలుగు రేసులను జోడించినట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ నాలుగు రేసులు చేరడంతో ఈ ఏడాది జరిగే రేసుల సంఖ్య 17కు చేరింది. కొత్తగా ప్రకటించిన వాటిల్లో టర్కీ గ్రాండ్‌ప్రి (జీపీ) ఉండటం విశేషం. 2011 అనంతరం మళ్లీ ఎఫ్1 క్యాలెండర్‌లో టర్కీ జీపీకి చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. నవంబర్ 15న ఈ రేసు జరగనుంది. అనంతరం బహ్రెయిన్‌లో నవంబర్ 29న, డిసెంబర్ 6న రెండు రేసు (డబుల్ హెడర్)లను నిర్వహిస్తారు. ఇక సీజన్ ముగింపు రేసు అబుదాబి వేదికగా డిసెంబర్ 13న జరుగుతుంది. తాము ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా పలుమార్లు ఎఫ్1 నిర్వాహకులతో మొరపెట్టుకున్నా వారికి అవకాశం దక్కలేదు. చివరి నాలుగు రేసులు కూడా అభిమానులు లేకుండానే జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment