Grand Prix
-
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
సుమిత్ నగాల్ శుభారంభం
గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 4–6, 6–3, 6–2తో కొరెంటిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఆరు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో సుమిత్ ఆడతాడు. -
Max Verstappen: విజేత వెర్స్టాపెన్
Saudi Arabian Formula One Grand Prix 2024- జెద్దా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో రేసులోనూ టైటిల్ సాధించాడు. సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 50 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా 1 గంట 20 నిమిషాల 43.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని తన కెరీర్లో 56వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలోనూ వెర్స్టాపెన్ నెగ్గాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. పోరాడి ఓడిన శ్రీజ సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ మాన్యు (చైనా)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 50వ ర్యాంకర్ శ్రీజ 6–11, 11–9, 5–11, 11–8, 8–11తో పోరాడి ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 4–11, 11–7, 9–11, 11–9, 10–12తో జియోజిన్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్ క్వాలిఫయింగ్‌లో విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. -
Rohit Sharma: ఆఖరి బాల్‌కు సిక్సర్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం!
Rohit Sharma & Usman Khawaja React On Verstappen Win: గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉంటేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేయవచ్చంటారు... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఈ మాటలు చక్కగా సరిపోతాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్‌ను ఓడించి తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్ 1) ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు వెర్స్టాపెన్. తన చిరకాల కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. గెలవగానే.. ‘‘నిజంగా.. ఇది నా అదృష్టమనే చెప్పాలి’’ అని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విజేతను నిర్ణయించిన తీరుపై నిర్వాహకులపై విమర్శలు కూడా వస్తున్నాయి. రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజయంపై పలువురు క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు. కొంతమంది అతడిని అభినందిస్తే.. మరికొంతమంది మాత్రం మెర్సిడెస్కు వత్తాసు పలికారు. ఎవరెవరు ఏమన్నారంటే.. ఆఖరి బాల్.. సిక్స్ కొట్టేశాడు... ‘‘ఒక్క బాల్ సిక్సర్ కొట్లాలి.. ఏం జరిగిందో ఊహించండి.. మాక్స్ వెర్స్టాపెన్ సిక్స్ కొట్టేశాడు. నమ్మశక్యం కాని విజయం ఇది. అబుదాబి గ్రాండిప్రి.. కొత్త చాంపియన్ వెర్స్టాపెన్’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెర్‌స్టాపెన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. 1 ball 6 required and guess what, Max Verstappen hits it. Unbelievable win #AbuDhabiGP #F1TitleChampionship — Rohit Sharma (@ImRo45) December 12, 2021 అతిపెద్ద తప్పిదం ఇది.. ‘‘ఎఫ్ 1 చరిత్రలో అతిపెద్ద తప్పిదం ఇది’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ట్వీట్ చేశాడు. That is the biggest mistake in F1 history. — Usman Khawaja (@Uz_Khawaja) December 12, 2021 హామిల్టన్ మాటల్ని ఉటంకించిన మాంటీ పనేసర్.. ‘‘కచ్చితంగా.. నేను ఏమాత్రం సంతోషంగా లేను. నా పట్ల ఎలా వ్యవహరించాలనుకున్నారో వాళ్లు అలాగే వ్యవహరించారు. దృఢ సంకల్పంతో నేను తిరిగి వస్తాను’’ అని మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ మాటల్ని ఉటంకిస్తూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అతడికి మద్దతు పలికాడు. Obviously I am not happy but they can throw what they want at me, I will come back stronger. @LewisHamilton #LewisHamilton #MaxVerstappen #F1Finale #AbuDabhiGP pic.twitter.com/NGNLf5hmNc — Monty Panesar (@MontyPanesar) December 12, 2021 నిజంగా ఇది ఏమాత్రం సరికాదు.. ‘‘ఇద్దరు డ్రైవర్లు... రెండు జట్లు... అయినా ఇది సరికాదు... ఏం మాట్లాడాలో అర్థంకాలేదు’’ అని ఇంగ్లండ్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ టిమ్ బ్రెస్నన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్ I like both drivers and both teams. But surely that wasn't right. Speechless #Formula1 #AbuDabhiGP — Tim Bresnan (@timbresnan) December 12, 2021 The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
వెర్‌స్టాపెన్‌కు తొమ్మిదో ‘పోల్’
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొమ్మిదో పోల్ పొజిషన్ సొంతం చేసుకున్నాడు. యూఎస్ఏ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.910 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ పెరెజ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ ఏడు రేసుల్లో విజేతగా నిలిచి 262.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
సవతి సోదరితో 11 ఏళ్ల ప్రేమ, పెళ్లి.. త్వరలోనే..
లిస్బేన్: మోటోజీపీ స్టార్ రేసర్ మైగెల్ ఒలీవిరా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తమ జీవితాల్లోకి మరికొన్ని నెలల్లో చిన్నారి రానుందనే శుభవార్తను పంచుకున్నాడు. భార్య ఆండ్రియా పిమెంటాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒలీవిరా అభిమానులకు ఈ గుడ్‌న్యూస్ చెప్పాడు. ‘‘ఒక ప్రత్యేక వ్యక్తి మా జీవితాల్లోకి రాబోతున్నారు. మా ప్రయాణంలో అతి మధుర క్షణం. నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను మై లవ్’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా 2015లో ఇటాలియన్ మోటార్ గ్రాండ్ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన ఈ పోర్చుగీస్ రేసర్.. తద్వారా తొలి ప్రపంచషిప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ రేసర్‌గా గుర్తింపు పొందాడు. ఇక తన తండ్రి రెండో భార్య కూతురు(స్టెప్ సిస్టర్) ఆండ్రియాతో ప్రేమలో పడ్డ 26 ఏళ్ల ఒలీవిరా.. 11 ఏళ్ల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ సీక్రెట్‌ను రివీల్ చేసిన ఒలీవీరా గత నెలలో ప్రేయసిని వివాహమాడాడు. ఇక పెళ్లైన.. సుమారు నెల రోజుల తర్వాత తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అభిమానులకు స్వీట్ షాకిచ్చాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్ -
వెర్‌స్టాపెన్‌కే ‘పోల్’
స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో మూడో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన స్టిరియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1ని:03.841 సెకన్లలో ముగించాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు రేసులు జరగ్గా... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు నాలుగు రేసుల్లో విజేతగా నిలిచారు. వెర్స్టాపెన్ మూడు రేసుల్లో... పెరెజ్ ఒక రేసులో గెలిచారు. -
క్వాలిఫయింగ్‌లో హామిల్టన్‌కు నిరాశ
పోర్టిమావో (పోర్చుగల్): కెరీర్లో 100వ పోల్ పొజిషన్ సాధించేందుకు డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ మాత్రం ఈ క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇది 17వ పోల్. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్ సెషన్లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌లో వెర్స్టాపెన్, ఇమోలా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌లు పోల్ పొజిషన్‌తో మెరిశారు. గ్రిడ్ పొజిషన్స్ 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. పెరెజ్ (రెడ్‌బుల్), 5. సెయింజ్ (ఫెరారీ), 6. ఒకాన్ (ఆల్పైన్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. లెక్లెర్క్ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్ (ఆస్టన్ మార్టిన్), 11. రసెల్ (విలియమ్స్), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్లారెన్) 17. స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్), 18. లతీఫ్ (విలియమ్స్), 19. మిక్ షుమాకర్ (హాస్), 20. మేజ్‌పిన్ (హాస్) -
వచ్చే ఏడాది ఎఫ్1లోకి మిక్ షుమాకర్
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ వచ్చే ఏడాది ఎఫ్1లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు 2021 సీజన్ కోసం అమెరికాకు చెందిన హాస్ జట్టు 21 ఏళ్ల మిక్ షుమాకర్‌తో ఒప్పందం చేసుకుంది. వచ్చే సంవత్సరంలో మిక్ షుమాకర్తోపాటు నికిటా మేజ్‌పిన్ (రష్యా) హాస్ జట్టు ప్రధాన డ్రైవర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది తమ జట్టు ప్రధాన డ్రైవర్లు ఉన్న రొమైన్ గ్రోస్యెన్, కెవిన్ మాగ్నుసన్లను ఈ సీజన్ తర్వాత కొనసాగించడంలేదని హాస్ జట్టు తెలిపింది. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 51 ఏళ్ల మైకేల్ షుమాకర్ 2012లో ఎఫ్1 నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. 2013లో డిసెంబర్ 29న తనయుడు మిక్‌తో కలిసి షుమాకర్ ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఏడేళ్లుగా షుమాకర్‌కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఫార్ములా–2 చాంపియన్‌షిప్‌లో ప్రెమా రేసింగ్ జట్టు తరఫున డ్రైవర్‌గా ఉన్న మిక్ 205 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఒకే ఒక్కడు...
పోర్టిమావో (పోర్చుగల్): ఫార్ములావన్ (ఎఫ్1)లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తెరమరుగైంది. గత ఏడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 92వ విజయం నమోదు చేశాడు. ఈ క్రమంలో 91 విజయాలతో జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును 35 ఏళ్ల హామిల్టన్ బద్దలు కొట్టాడు. 2007లో తొలి ఎఫ్1 విజయం సాధించిన హామిల్టన్ 2013లో మెర్సిడెస్ జట్టులో చేరాడు. మెర్సిడెస్ జట్టులో షుమాకర్ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్ అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. షుమాకర్ ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ (సీజన్ ఓవరాల్ విన్నర్) ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండగా... ఈ ఏడాదీ హామిల్టన్‌కే ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా ఈ సీజన్లో మరో ఐదు రేసులు ముగిశాక షుమాకర్ పేరిట ఉన్న ఈ రికార్డునూ హామిల్టన్ సమం చేసే చాన్స్ ఉంది. 2006లో చైనా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత షుమాకర్ అదే ఏడాది ఎఫ్1కు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని ఎఫ్1లో పునరాగమనం చేసిన షుమాకర్ 2012 వరకు మెర్సిడెస్ జట్టుతో కొనసాగినా మరో రేసులో గెలుపొందలేకపోయాడు. ఆరంభంలో వెనుకబడ్డా... 24 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించాడు. అయితే రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మొదట్లోనే హామిల్టన్‌ను ఓవర్టేక్ చేశాడు. అయితే 20వ ల్యాప్‌లో హామిల్టన్ ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత అదే జోరును చివరిదైన 66వ ల్యాప్ వరకు కొనసాగించాడు. చివరకు గంటా 29 నిమిషాల 56.828 సెకన్లలో రేసును ముగించిన హామిల్టన్ కెరీర్లో 92వ విజయాన్ని దక్కించుకున్నాడు. బొటాస్‌కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొం దాడు. ప్రస్తుత సీజన్‌లోని 17 రేసుల్లో 12 పూర్తయ్యాయి. తదుపరి రేసు ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి ఇటలీలో నవంబర్ 1న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో హామిల్టన్ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బొటాస్ (179 పాయింట్లు), వెర్స్టాపెన్ (162 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ 435 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
మరో నాలుగు ఎఫ్1 రేసులు
లండన్: కరోనా వైరస్‌తో ఆలస్యంగా ఆరంభమైన ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో మరో నాలుగు రేసులను జోడించినట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ నాలుగు రేసులు చేరడంతో ఈ ఏడాది జరిగే రేసుల సంఖ్య 17కు చేరింది. కొత్తగా ప్రకటించిన వాటిల్లో టర్కీ గ్రాండ్‌ప్రి (జీపీ) ఉండటం విశేషం. 2011 అనంతరం మళ్లీ ఎఫ్1 క్యాలెండర్లో టర్కీ జీపీకి చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. నవంబర్ 15న ఈ రేసు జరగనుంది. అనంతరం బహ్రెయిన్‌లో నవంబర్ 29న, డిసెంబర్ 6న రెండు రేసు (డబుల్ హెడర్)లను నిర్వహిస్తారు. ఇక సీజన్ ముగింపు రేసు అబుదాబి వేదికగా డిసెంబర్ 13న జరుగుతుంది. తాము ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా పలుమార్లు ఎఫ్1 నిర్వాహకులతో మొరపెట్టుకున్నా వారికి అవకాశం దక్కలేదు. చివరి నాలుగు రేసులు కూడా అభిమానులు లేకుండానే జరిగే అవకాశం ఉంది. -
బొటాస్‌కు ‘పోల్ పొజిషన్’
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): మరోసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ సత్తా చాటుకున్నారు. వరుసగా ఐదో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సాధించారు. శనివారం జరిగిన ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 25.154 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. రేసింగ్ పాయింట్ జట్టు సబ్‌స్టిట్యూట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ మూడో స్థానంలో నిలువడం విశేషం. రేసింగ్ పాయింట్ రెగ్యులర్ డ్రైవర్ సెర్గియో పెరెజ్‌కు కరోనా సోకడంతో హుల్కెన్‌బర్గ్‌కు అవకాశం దక్కింది. గత ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హుల్కెన్‌బర్గ్ పాల్గొన్నా ప్రధాన రేసు మొదలయ్యే సమయానికి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అతను ట్రాక్‌పైకి రాకుండానే వైదొలిగాడు. తన కెరీర్లో 177 రేసుల్లో పాల్గొన్న హుల్కెన్‌బర్గ్ ఏనాడూ టాప్–3లో నిలువలేకపోయాడు. ఎఫ్1 మొదలై ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఎఫ్1 తొలి రేసు వేదిక సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో ఈ రేసును నిర్వహిస్తున్నారు. ఈ సీజన్లో తొలి రేసులో బొటాస్ ‘పోల్’ పొందగా... మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ తర్వాతి మూడు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేటి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్స్: 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. నికో హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 4. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. రికియార్డో (రెనౌ), 6. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 7. పియరీ గాస్లే (అల్ఫా టౌరి), 8. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 9. అలెగ్జాండర్ అల్బోన్ (రెడ్‌బుల్), 10. లాండో నోరిస్ (మెక్లారెన్), 11. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 12. వెటెల్ (ఫెరారీ), 13. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. జార్జి రసెల్ (విలియమ్స్), 16. డానిల్ క్వియాట్ (అల్ఫా టౌరి), 17. మాగ్నుసెన్ (హాస్), 18. నికోలస్ లతీఫి (విలియమ్స్), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. రైకోనెన్ (అల్ఫా రోమియో). -
హంపి, హారిక ఓటమి
చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ గ్రాండ్‌ప్రి మూడో అంచె పోటీల్లో భారత పోరాటం ముగిసింది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యారు. వరల్డ్ నంబర్ 2 హంపి 2–9తో అలెగ్జాండ్రా కోస్టెనిక్ (రష్యా) చేతిలో చిత్తు కాగా, వరల్డ్ నంబర్‌వన్ హూ యిఫాన్ (చైనా) 7–3తో హారికపై విజయం సాధించింది. ఈ టోర్నీలో చివరిదైన నాలుగో అంచె పోటీలు బుధవారంనుంచి జరుగుతాయి. ఇందు లో హంపి, హారిక పాల్గొంటారు. -
అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి కూడా వాయిదా
బాకు: ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఫార్ములావన్ సీజన్‌కు కరోనా వైరస్ కారణంగా వాయిదాల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ జాబితాలో అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి చేరింది. జూన్ 7న జరగాల్సిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిని వాయిదా వేస్తున్నట్లు... ఎప్పుడు నిర్వహిం చేది తర్వాత చెబుతామని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే మార్చి 15న జరగాల్సిన సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి... మే 24న జరగాల్సిన సీజన్‌లోని ఏడో రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దు అయ్యాయి. బహ్రెయిన్ (మార్చి 22), వియత్నాం (ఏప్రిల్ 5), చైనా (ఏప్రిల్ 19), డచ్ (మే 3), స్పెయిన్ గ్రాండ్‌ప్రి (మే 10) వాయిదా పడ్డాయి. దాంతో ఫార్ములావన్–2020 సీజన్ జూన్ 14న మాంట్రియల్లో జరిగే కెనడా గ్రాండ్‌ప్రితో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
హామిల్టన్‌కు పోల్
సింగపూర్: ఈ సీజన్లో ఏడో విజయంపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దృష్టి పెట్టాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ దుమ్ము రేపాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ముగించి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఆరు రేసుల్లో గెలిచిన హామిల్టన్ క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 36.015 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 7, 9 స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. సీజన్లో 14 రేసులు పూర్తయ్యాక ప్రస్తుతం హామిల్టన్ 256 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... 226 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సాయంత్రం గం. 5.35 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
క్రీడా స్ఫూర్తికే అవమానం.. జీవితకాల నిషేధం
రోమ్: ఏ క్రీడలోనైనా క్రీడా స్ఫూర్తి అనేది అనివార్యం. ఒకవేళ గెలుపు కోసం అడ్డదారులు తొక్కితే అందుకు తగిన మూల్యం భారీగానే ఉంటుంది. ఇలానే ఒక రేసర్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యహరించి జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. ఇటలీలోని సాన్ మారినోలో నిర్వహించిన ఒక బైక్ రేస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇది బైక్ రేసులకే సవాల్‌గా పరిణమించింది. ఈ బైక్ రేసులో ఒక రైడర్ తన ప్రత్యర్థిని ఓడించేందుకు అతని బైక్ హ్యాండ్ బ్రేక్‌ను నొక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ బైక్ 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కొద్దిగా పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగివుండేది. ‘ఇటాలియన్ మోటో జిపీ-2’కు చెందిన రొమానే ఫెనటీ... జాన్ మెరీనోరైడ్ సందర్భంలో ప్రత్యర్థి స్టెఫానో మంజీ బైక్ బ్రేక్‌ను ఒత్తి అతనిని పడవేసేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారం కారణంగా అతను రేసింగ్ గేమ్ ఆడకుండా జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫెనాటీని ఈ రేస్ నుంచి తప్పించారు. అలాగే రేసింగ్ గేమ్ నిర్వాహకులు... ఫెనాటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
తన ప్రత్యర్థిని ఓడించాలనుకున్నాడు...కానీ!
-
హామిల్టన్‌కు పోల్ పొజిషన్
సిల్వర్‌స్టోన్: ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ నాలుగోసారి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అతను దుమ్మురేపాడు. ఈ గ్రాండ్‌ప్రిలో వరుసగా ఆరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. గత నాలుగేళ్లుగా ఈ రేసులో విజేతగా నిలిచిన అతను క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.892 సెకన్లలో పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. కేవలం 0.044 సెకన్ల తేడాతో వెటెల్ (ఫెరారీ–1ని.25.936 సె) రెండో స్థానం పొందాల్సి వచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 10వ, పెరెజ్ 12వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. నేటి సాయత్రం గం. 6.35కు ప్రారంభమయ్యే ఈ రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
హీట్ పుట్టించే స్కేటింగ్
-
‘క్యాండిడేట్స్’కు అర్హతే లక్ష్యం
♦ గ్రాండ్‌ప్రి’లతో మంచి అవకాశం ♦ ఇది నా కెరీర్లో అత్యుత్తమ దశ ♦ ‘సాక్షి’తో గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ భారత చెస్ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటి ఆటకు మరింత గుర్తింపు తెచ్చిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. సుదీర్ఘ కాలంగా నిలకడగా విజయాలు సాధిస్తున్న ఈ తెలుగు ఆటగాడి కెరీర్ ఇటీవల మరింత ఊపందుకుంది. కొద్ది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే అందుకోగలిగిన 2770 రేటింగ్‌కు ఇటీవలే హరికృష్ణ చేరుకోవడం పెద్ద విశేషం. ప్రస్తుతం ఆటపరంగా తన అత్యుత్తమ దశలో ఉన్నానని హరి చెబుతున్నాడు. తన ప్రదర్శన, భవిష్యత్తు టోర్నీలు తదితర అంశాలపై ‘సాక్షి’ క్రీడా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వూ్య విశేషాలు అతని మాటల్లోనే... 2770 రేటింగ్ సాధించడంపై... ప్రస్తుత అంతర్జాతీయ చెస్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే 2770 రేటింగ్‌ను అరుదైన ఘనతగా చెప్పవచ్చు. దీనిని సాధించడం ద్వారా తక్కువ మందికే చోటున్న ‘ఎలైట్’ గ్రూప్‌కి చేరుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ రేటింగ్ కారణంగా ఎప్పుడో ఒకసారి టాప్ ప్లేయర్‌తో తలపడటం కాకుండా ఇక తరచుగా అగ్రస్థాయి టోర్నీలలో నేను వారిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్కడ మంచి విజయాలు లభిస్తే దానికి దక్కే గుర్తింపు, విలువ చాలా ఎక్కువ. ఇటీవలి ప్రదర్శనపై... ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరీర్లో ఇది అత్యుత్తమ దశ. రేటింగ్‌తో పాటు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి అడుగు పెట్టాను. గత రెండేళ్లుగా నేను పడిన శ్రమకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చైనా టోర్నీలో రెండో స్థానంలో నిలవగా, ఒలింపియాడ్‌లో నాలుగో స్థానంతో త్రుటిలో పతకం చేజారింది. 2016 నుంచి ఓపెన్, లీగ్ టోర్నీలను చాలా వరకు తగ్గించి ప్రధాన టోర్నమెంట్లపై దృష్టి పెట్టాను. టాటా స్టీల్ టోర్నీలో కొన్ని సార్లు విజయావకాశాలు లభించినా వాటిని ఉపయోగించుకోలేకపోవడంతో తుది ఫలితం గొప్పగా లేదు. వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం చెప్పుకోదగ్గ అంశం. ఒక్క రోజే అయినా... ఆనంద్‌ను కూడా ర్యాంకుల్లో అధిగమించగలగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది! భారత్‌లో చెస్ పురోగతిపై... దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా వేగంగా భారత చెస్ ఎదుగుతోంది. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య పెరగడం ఒక్కటే కాదు, ఆటగాళ్ల పరిజ్ఞానం కూడా చాలా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవడం వల్ల ఆట వ్యూహాల్లో కూడా కొత్త తరహాలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దీని వల్ల పోటీ కూడా పెరిగింది. ఓవరాల్‌గా సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తే చాలా మెరుగైందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. తదుపరి లక్ష్యాలపై... 2017 నా కెరీర్లో కీలక సంవత్సరం కానుంది. వచ్చే నెలలో చైనా, అజర్బైజాన్లలో రెండు పెద్ద టోర్నమెంట్లు ఉన్నాయి. అంతకంటే ప్రధానమైనవి ఈ ఏడాది జరిగే మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలు. ఈ మూడు టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే లేదా సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచకప్‌లోనైనా ఫైనల్ చేరితే క్యాండిడేట్స్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాను. ప్రస్తుతం నా లక్ష్యం అదే. ప్రపంచంలోని టాప్–8 ఆటగాళ్లు మాత్రమే తలపడే క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొనడం అన్నింటికంటే ముఖ్యం. ఆ టోర్నీ విజేతకు వరల్డ్ చాంపియన్‌ను ఢీకొట్టే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నా సన్నాహకాలు, ఫామ్ చాలా బాగున్నాయని, సరైన దిశలోనే వెళుతున్నానని నమ్ముతున్నా. గతంలో నాలో ఉన్న ఓపెనింగ్ లోపాలను ఇప్పటికే సరిదిద్దుకున్నా. నా ముగ్గురు సహాయకులు (సెకండ్స్) రాబోయే టోర్నీల సన్నద్ధతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ టోర్నీలలో పాల్గొనకపోవడంపై... నేను ఆఖరిసారిగా భారత్‌లో 2004లో ఆడాను. దురదృష్టవశాత్తూ మన దేశంలో పెద్ద స్థాయి టోర్నీల నిర్వహణ విషయంలో ఫెడరేషన్ చొరవ తీసుకోవడం లేదు. ఆదరణ ఉండదు, స్పాన్సర్లు రారు అనడంలో వాస్తవం లేదు. ఇటీవల క్రికెటేతర క్రీడలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో చెస్‌ను కూడా అనుసరించేవారు బాగా పెరిగారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. నిజానికి ఫెడరేషన్లో వేల సంఖ్యలో ఉన్న రిజిస్టర్డ్ ఆటగాళ్లు సదరు టోర్నీని అనుసరించినా అది సక్సెస్ అయినట్లే! ఇక నేను, ఆనంద్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనకపోవడానికి తగినంత పోటీ లేకపోవడమే కారణం. మా రేటింగ్‌కు కాస్త అటూ ఇటుగా ఉన్న ఆటగాళ్లతో పర్వాలేదు గానీ మరీ తక్కువ స్థాయి ఆటగాళ్లతో తలపడితే మాకు ప్రయోజనంకంటే నష్టమే ఎక్కువ. గతంలో మన దేశంలో పలుసార్లు జరిగిన నిర్వహణా లోపాలు కూడా మమ్మల్ని ఆడకుండా నిరోధిస్తున్నాయి. -
హామిల్టన్ సరికొత్త రికార్డు
హంగారోరింగ్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గత బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఆ టైటిల్ ను వరుసగా మూడు సార్లు సాధించిన తొలి ఇంగ్లిష్ డ్రైవర్ గా ఘనత సాధించిన హామిల్టన్.. తాజాగా జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన డ్రైవర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలవడంతో ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు 2007, 09,12,13 సంవత్సరాల్లో హంగేరి గ్రాండ్ ప్రి ఫార్ములావన్ టైటిల్ ను హామిల్టన్ సాధించాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో హామిల్టన్ ఖాతాలోఐదో విజయం చేరడం మరో విశేషం. అంతకుముందు మొనాకో, కెనడా, ఆస్ట్రియన్, బ్రిటీష్ గ్రాండ్ ప్రిలను హామిల్టన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన హామిల్టన్ అదే ఊపును చివరి వరకూ కొనసాగించాడు. 70 ల్యాప్‌లో రేసును అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మరోవైపు రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికాయార్డో మూడో స్థానం సాధించాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్ బర్గ్‌ను హామిల్టన్ వెనుక్కునెట్టాడు. ఈ సీజన్లో తొలిసారి హామిల్టన్(181పాయింట్లు) ప్రథమ స్థానంలోకి రాగా, రోస్ బర్గ్(178పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. -
రోస్బర్గ్కే పోల్ పొజిషన్
షాంఘై:ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే దూకుడును చైనీస్ గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.402 సెకెండ్లలో ల్యాప్ ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్ బర్గ్ తొలిస్థానం నుంచి ప్రారంభిస్తాడు. అయితే రెడ్ బుల్ కు చెందిన డానియల్ రికార్డో రెండో స్థానం సాధించడం విశేషం. మరోవైపు ఫోర్స్ ఇండియాకు చెందిన సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలిచాడు.