
సిల్వర్‌స్టోన్: ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ నాలుగోసారి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో అతను దుమ్మురేపాడు. ఈ గ్రాండ్‌ప్రిలో వరుసగా ఆరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. గత నాలుగేళ్లుగా ఈ రేసులో విజేతగా నిలిచిన అతను క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.892 సెకన్లలో పూర్తి చేశాడు.
ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. కేవలం 0.044 సెకన్ల తేడాతో వెటెల్ (ఫెరారీ–1ని.25.936 సె) రెండో స్థానం పొందాల్సి వచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 10వ, పెరెజ్ 12వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. నేటి సాయత్రం గం. 6.35కు ప్రారంభమయ్యే ఈ రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment