సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 945 రోజుల తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మళ్లీ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్ 2021 డిసెంబర్ 5న సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో గెలుపొందాడు.
సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ చరిత్రలో ఒకే సర్క్యూట్‌పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు నెలకొల్పాడు.
మైకేల్ షుమాకర్ (జర్మనీ) ఫ్రాన్స్‌లోని మాగ్నీ కోర్స్ సర్క్యూట్ లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్ రికార్డును హామిల్టన్ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్‌లో 12 రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) 255 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment