Hamilton
-
హామిల్టన్ రికార్డు
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 945 రోజుల తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మళ్లీ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్ 2021 డిసెంబర్ 5న సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో గెలుపొందాడు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ చరిత్రలో ఒకే సర్క్యూట్‌పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు నెలకొల్పాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ) ఫ్రాన్స్‌లోని మాగ్నీ కోర్స్ సర్క్యూట్ లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్ రికార్డును హామిల్టన్ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్లో 12 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) 255 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
Bahrain GP Qualifying: ఎఫ్1 సీజన్‌కు వేళాయె...
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. 23 రేసుల ఈ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఆదివారం జరుగుతుంది. అంతకుముందు శనివారం ప్రధాన రేసుకు సంబంధించిన గ్రిడ్ పొజిషన్‌ను తేల్చేందుకు క్వాలిఫయింగ్ సెషన్‌ను నిర్వహిస్తారు. క్వాలిఫయింగ్ సెషన్లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్ ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’ హోదాలో తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో కూడా డిఫెండింగ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్ జట్టు) తన జోరు కొనసాగించే అవకాశముంది. అతనికి హామిల్టన్ (మెర్సిడెస్), లెక్లెర్క్ (ఫెరారీ) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే చాన్స్ ఉంది. మొత్తం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు మొత్తం 23 రేసుల్లో పాల్గొంటారు. -
నాడు తండ్రి... నేడు తనయుడు...
తన తండ్రి మైకేల్ షుమాకర్ ఏ జట్టుకైతే ప్రాతినిధ్యం వహించాడో అదే జట్టు తరఫున వచ్చే ఏడాది ఫార్ములావన్ సీజన్లో మిక్ షుమాకర్ బరిలోకి దిగనున్నాడు. 2023 సీజన్ కోసం మిక్ మెర్సిడెస్ జట్టు తరఫున రిజర్వ్ డ్రైవర్‌గా నియమితుడయ్యాడు. రెగ్యులర్ డ్రైవర్లు హామిల్టన్, జార్జి రసెల్లలో ఒకరు అందుబాటులో లేకపోతే మిక్కు అవకాశం వస్తుంది. ఈ ఏడాది హాస్ జట్టు తరఫున మిక్ పోటీపడ్డాడు. మైకేల్ షుమాకర్ 2010–2012 వరకు మెర్సిడెస్ తరఫున బరిలోకి దిగాడు. చదవండి: BBL 2022: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే? -
శభాష్ సంజూ.. గ్రౌండ్ స్టాఫ్‌కు సాయం! వీడియో వైరల్
భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. అయితే భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం వర్షం తగ్గు ముఖం పట్టడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. అయితే మళ్లీ భారత ఇన్నింగ్స్ 12.5 (89-1) వద్ద వర్షం తిరుగుముఖం పట్టింది. అనంతరం వర్షం జోరు మరింత పెరగడంతో ఆఖరికి అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మంచి మనసు చాటుకున్న శాంసన్ తొలి వన్డేలో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. రెండో వన్డేకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే తొలుత వర్షం తగ్గుముఖం పట్టాక గ్రౌండ్ స్టాప్ మైదానం సిద్దం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సంజూ శాంసన్ గ్రౌండ్ సిబ్బందికి సహాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఒక అంతర్జాతీయ క్రికెటర్ అయినప్పటికీ గ్రౌండ్ స్టాప్‌కు చేసిన సంజాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Sanju Samson. 💗pic.twitter.com/QxtQMz4188 — Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022 చదవండి: FIFA WC 2022: ఖతర్‌ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్.. కరోనా కంటే డేంజర్ -
టీమిండియా బ్యాటింగ్.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం
న్యూజిలాండ్, టీమిండియా సిరీస్‌ను వరుణుడు విడవడం లేదు. టి20 సిరీస్‌లో ఎలాగైతే అడ్డుపడ్డాడో.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు అదే పరిస్థితి కలిగిస్తున్నాడు. ఆదివారం టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా 4.5 ఓవర్లలో 22 పరుగులు వద్ద ఉన్నప్పుడు వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. శిఖర్ ధావన్ 2, శుబ్‌మన్ గిల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి వన్డేలో పరాజయం పొందిన టీమిండియా సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. మరి వర్షం తెరిపినిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
మెక్సికో గ్రాండ్‌ప్రి విజేత వెర్స్టాపెన్..
Verstappen wins Formula 1 Mexican Grand Prix: ఫార్ములావన్ సీజన్లో భాగంగా జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ గంటా 38 నిమిషాల 39.086 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది తొమ్మిదో విజయం. 16.555 సెకన్ల తేడాతో హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని పెరెజ్ (రెడ్‌బుల్) దక్కించుకున్నాడు. చదవండి: Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్ కర్నేవార్ అరుదైన రికార్డు -
Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్
మోంటెకార్లో: తన కారులో తలెత్తిన సాంకేతిక లోపంతో ‘పోల్ పొజిషన్’ సాధించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) రేసు ఆరంభానికి ముందే తప్పుకోవడంతో... తొలి స్థానం నుంచి రేసును ఆరంభించిన మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మొనాకో గ్రాండ్‌ప్రిలో అదరగొట్టాడు. ఆదివారం జరిగిన 78 ల్యాప్‌ల ప్రధాన రేసులో ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేసిన వెర్స్టాపెన్... అందరికంటే ముందుగా గంటా 38 నిమిషాల 56.820 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఇక సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో తదుపరి గ్రాండ్‌ప్రి అజర్బైజాన్ వేదికగా జూన్ 6న జరగనుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం This way to the 🔝 of the standings ➡️🏆 #MonacoGP 🇲🇨pic.twitter.com/CEiSv1bK4o — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 No floating energy station this year but still plenty of 𝒕𝒉𝒊𝒔 ENERGY!!! 🙌 #MonacoGP 🇲🇨 #GivesYouWings pic.twitter.com/Rh8a5WGmKP — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 -
విజేత వెర్స్టాపెన్
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020–సీజన్ ముగింపు రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 55 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. గతవారం సాఖిర్ గ్రాండ్‌ప్రి విజేత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్–ఆర్పీ) ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా ఈ సీజన్లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు. 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది. -
ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్‌కు కరోనా
మనమ: కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిలను సైతం వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, బడా వ్యాపావేత్తలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆదివారం బహ్రెయిన్‌లో జరిగిన 11వ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న హామిల్టన్‌కు కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హామిల్టన్ ఆరోగ్యం బాగానే ఉందని మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీం తెలిపింది. అయితే త్వరలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రికి హామిల్టన్ దూరమవుతున్నట్లు టీమ్ వెల్లడించింది. కాగా 7 సార్లు ఫార్ములా వన్ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్ రేసింగ్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే ఆయనకు గత వారంలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి నెగెటివ్ వచ్చింది. ఈ తరుణంలో ఆదివారం కూడా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో హామిల్టన్ ప్రస్తుతం బహ్రెయిన్‌లోనే ఐసొలేషన్‌లో ఉన్నాడు. కాగా ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని టీమ్ సభ్యులు తెలిపారు. -
బొటాస్దే బోణీ
స్పీల్బర్గ్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన బొటాస్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 55.739 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ రేసులో తొమ్మిది మంది మధ్యలోనే వైదొలిగారు. డ్రైవర్ల అత్యుత్సాహంతో మూడుసార్లు ఈ రేసులో సేఫ్టీకారు రావాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో మెర్సిడెస్‌కే చెందిన మరో స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌పై మూడు స్థానాల గ్రిడ్ పెనాల్టీ విధించారు. అనంతరం ప్రధాన రేసులో ట్రాక్‌పై మరో డ్రైవర్‌ను ఢీకొట్టడంతో ఐదు సెకన్ల పెనాల్టీ వేశారు. దాంతో హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)కు రెండో స్థానం... బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం పొందారు. ఈ ప్రదర్శనతో నోరిస్ (20 ఏళ్ల 235 రోజులు) ఫార్ములావన్ చరిత్రలో పిన్న వయస్సులో పోడియం (టాప్–3)పై నిలిచిన మూడో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మాక్స్ వెర్స్టాపెన్ (18 ఏళ్ల 228 రోజులు), లాన్స్ స్ట్రోల్ (18 ఏళ్ల 240 రోజులు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రేసు ప్రారంభానికి ముందు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌తో కలిసి మరో 13 మంది డ్రైవర్లు మోకాలిపై నిల్చోని తమ సంఘీభావం తెలిపారు. సీజన్‌లోని రెండో రేసు ఇదే వేదికపై 10న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్–25 పాయింట్లు); 2. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ–18); 3. లాండో నోరిస్ (మెక్లారెన్–16); 4. హామిల్టన్ (మెర్సిడెస్–12); 5. కార్లోస్ సెయింజ్ జూనియర్ (మెక్లారెన్–10); 6. పెరెజ్ (రేసింగ్ పాయింట్–8); 7. పియరీ గాస్లీ (అల్ఫా టౌరీ–6), 8. ఒకాన్ (రెనౌ–4); 9. గియోవినాజి (అల్ఫా రోమియో–2 పాయింట్లు), 10. వెటెల్ (ఫెరారీ–1 పాయింట్). -
తొలి పోల్ బొటాస్దే
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): కెరీర్లో తొలి డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఎదురు చూస్తోన్న మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ 2020 ఫార్ములా వన్ (ఎఫ్1) సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. ఏడు నెలల సుధీర్ఘ విరామం అనంతరం సీజన్ ఆరంభ రేసు అయిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో బొటాస్ సత్తా చాటాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరి కంటే వేగంగా నిమిషం 2.939 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. జర్మనీ డ్రైవర్ మైఖేల్ షూమాకర్ పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్స్ (7) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న సహచర డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (6)... ల్యాప్‌ను 0.012 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్, మెక్లారెన్ డ్రైవర్ నోరిస్, మరో రెడ్‌బుల్ డ్రైవర్ ఆల్బన్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. గత ఏడాది టీం విభాగంలో రన్నరప్‌గా నిలిచిన ఫెరారీ... క్వాలిఫయింగ్ సెషన్లో పూర్తిగా నిరాశ పరిచింది. చార్లెస్ లెక్లెర్క్ ఏడు, నాలుగు సార్లు ఎఫ్1 ప్రపంచ డ్రైవర్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ 11వ స్థానంలో నిలిచారు. ప్రధాన రేసును ఆదివారం సాయంత్రం గం. 6.40 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, హెచ్డి 2, డిస్నీ ప్లస్ హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. 4 వేల మందికి ‘నెగెటివ్’ కరోనా నేపథ్యంలో ఫార్ములా వన్ (ఎఫ్1) తాజా సీజన్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆరంభమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గైడ్‌లైన్స్‌కు లోబడి ఎఫ్1 నిర్వాహకులు వారం వ్యవధిలో 10 జట్ల డ్రైవర్లు, సిబ్బందితో పాటు మొత్తం 4,032 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. ఈ పరీక్షలను జూన్ 26 నుంచి జూలై 2 మధ్య నిర్వహించారు. సీజన్ ముగిసే వరకు ప్రతి ఐదు రోజులకొకసారి కరోనా టెస్టులను చేయనున్నారు. -
'అందుకే బుమ్రాను తక్కువ అంచనా వేయద్దు'
హమిల్టన్ : టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ తీయలేదు. తన కెరీర్లో ఇదే అత్యంత చెత్త రికార్డుగా భావించొచ్చు. ' గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యార్కర్ల కింగ్ బౌలింగ్‌లో పదును తగ్గింది. మునుపటంతా పదును లేదని, అందుకే తరచూ విఫలమవుతున్నాడు. తన బౌలింగ్‌ను మార్చుకోవాలి.. అటాకింగ్ పెంచాలి. బుమ్రా వైఫల్యం వల్లనే భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది' అంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు సైతం బుమ్రాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు.అయితే న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చూసి ఈ మాట అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే : కివీస్ కెప్టెన్) న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ 30వ ఓవర్ బుమ్రా బౌలింగ్‌కు దిగాడు. అప్పటికే 82 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఫిన్ అలెన్, హెన్రీకూపర్ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బుమ్రా చక్కటి బంతితో ఫిన్ అలెన్(20)ను పెవిలియన్ చేర్చాడు. బంతి ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా వెళ్తుందని భావించిన అలెన్ బ్యాట్ పైకి ఎత్తి బంతిని వదిలేయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా బాల్ స్వింగ్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్‌కు గురైన అలెన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'వారెవ్వా! బుమ్రా.. నువ్వు నిజంగా తోపు బౌలర్‌వి. అందుకే అంటారు బుమ్రాను ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దని' అంటూ కామెంట్లు పెడుతున్నారు.(అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా) Jasprit Bumrah looking in his element.. absolute ripper to dismiss Allen. #NZX1vIND pic.twitter.com/mcrLF56qUI — Subhayan Chakraborty (@CricSubhayan) February 15, 2020 -
గిల్ గోల్డెన్ డక్.. విహారి సెంచరీ
హామిల్టన్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆడుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు నిరాశపరిస్తే, నాల్గో స్థానంలో దిగిన శుబ్‌మన్ గిల్ కూడా విఫలమయ్యాడు. పృథ్వీ షా నాలుగు బంతులు ఆడి డకౌటైతే, మయాంక్ అగర్వాల్ 13 బంతులు ఆడి పరుగు మాత్రమే చేశాడు. అటు తర్వాత గిల్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు. న్యూజిలాండ్ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత బ్యాటింగ్‌ను పృథ్వీషా- మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించగా ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు ఖాతా తెరవకుండానే పృథ్వీ షా పెవిలియన్ చేరితే, జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద ఉండగా మయాంక్, శుబ్మన్లు క్యూకట్టారు. ఆ తరుణంలో ఫస్ట్ డౌన్లో వచ్చిన చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కాగా, అజింక్యా రహానే(18) వైఫల్యం చెందడంతో 38 పరుగుల వద్ద భారత్ నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పుజారాకు జత కలిసిన హనుమ విహారి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 193 పరుగులు జత చేసిన తర్వాత పుజారా(93;211 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) ఔట్ కాగా, కాసేపటికి విహారి(101 రిటైర్డ్‌హర్ట్;182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అయితే విహారి శతకం సాధించిన తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆపై రిషభ్ పంత్(7) సింగిల్ డిజిట్‌కే పరిమితమైతే, సాహా, రవిచంద్రన్ అశ్విన్‌లు డకౌట్ అయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. భారత కోల్పోయిన వికెట్లలో కుగ్లీజిన్, ఇష్ సోథీలు తలో మూడు వికెట్లు సాధించగా, గిబ్సన్ రెండు వికెట్లు తీయగా, నీషమ్‌కు వికెట్ దక్కింది. -
దాదా కెప్టెన్సీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి
హామిల్టన్ : రికార్డులను బద్దలు కొట్టడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కొత్తేం కాదు.ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన 51 పరుగుల ద్వారా టీమిండియా సారధిగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని వెనెక్కి నెట్టాడు. కెప్టెన్‌గా గంగూలీ మొత్తం 142 ఇన్నింగ్సుల్లో 5082 పరుగులు చేయగా, విరాట్ కేవలం 83 ఇన్నింగ్స్‌ల్లోనే 5123 పరుగులు చేసి దాదాను అధిగమించాడు. కాగా టీమిండియా నుంచి మొదటి స్థానంలో ఎంఎస్ ధోని 6,641 పరుగులు(172 ఇన్నింగ్స్) ఉండగా, రెండో స్థానంలో మహ్మద్ అజారుద్దీన్ 5239 పరుగులు(162 ఇన్నింగ్స్)లతో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి ఆటతీరు చూస్తుంటే త్వరలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే మహీని అధిగమించడం ఖాయంగా కనపడుతుంది.(కోహ్లి మళ్లీ మలుపు తిప్పాడు..!) ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో విరాట్ 7వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. తర్వాత ఎంఎస్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్, అర్జున రణతుంగ, గ్రేమి స్మిత్, మహ్మద్ అజారుద్దీన్లు ఉన్నారు. అయితే వీరిలో ధోని తప్ప మిగతావారు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగానిగా కోహ్లి త్వరలోనే రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. టీమిండియా విధించిన 347 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 11 బంతులు ఉండగానే విజయం సాధించింది. (కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. మున్రో బ్యాడ్ లక్) -
భారత్‌తో తొలి వన్డే; న్యూజిలాండ్ ఫీల్డింగ్
హామిల్టన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ కాలిపిక్క కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఆపై రోహిత్‌ను బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, అతనికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఫిజియో సూచించారు. దాంతో మొత్తం న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్‘ఎ’తో సిరీస్‌లో భాగంగా అక్కడే ఉన్న మయాంక్‌కు సీనియర్ జట్టులో అవకాశం కల్పించారు. ఈ స్థానం కోసం శుబ్‌మన్ గిల్ పోటీపడినప్పటికీ మయాంక్‌కే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఓపెనర్లుగా పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరికీ ఇది అరంగేట్రపు వన్డే. ‘పొట్టి ఫార్మాట్’లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లి సేన ఆత్మవిశ్వాసం అంబరాన్ని చుంబిస్తుండగా, అటు న్యూజిలాండ్ టి20 గాయాలను మరచి కొత్తగా ఆటను మొదలు పెట్టాలని భావిస్తోంది. భారత్ సొంతగడ్డపై ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించగా... న్యూజిలాండ్‌కు ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ‘బౌండరీ పరాజయం’ తర్వాత ఇదే తొలి వన్డే కావడం విశేషం. -
హామిల్టన్ సిక్సర్
ఆస్టిన్ (అమెరికా): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ లాంఛనం పూర్తి చేశాడు. ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం అవ్వాలంటే టాప్–8లో నిలవాల్సిన రేసులో... అతను రెండో స్థానాన్ని సాధించి ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రి రేసులో ఐదో స్థానం నుంచి డ్రైవ్ చేసిన హామిల్టన్ చివరకు రెండో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ గంటా 33 నిమిషాల 55.653 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. 21 రేసుల ప్రస్తుత సీజన్లో 19 రేసులు ముగిశాక హామిల్టన్ 381 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో మరో రెండు రేసులు (బ్రెజిల్, అబుదాబి గ్రాండ్‌ప్రి) మిగిలి ఉన్నా హామిల్టన్‌కు, బొటాస్‌కు మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ రెండు రేసుల్లో బొటాస్ గెలిచినా హామిల్టన్‌ను అందుకునే పరిస్థితి లేదు. తాజా ప్రదర్శనతో ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో అత్యధిక ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ సాధించిన రెండో డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. జర్మనీ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఇదే జోరు కొనసాగిస్తే 34 ఏళ్ల హామిల్టన్ వచ్చే ఏడాది షుమాకర్ రికార్డును సమం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
22 రేసుల తర్వాత...
సింగపూర్: నాలుగుసార్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ అయిన సెబాస్టియన్ వెటెల్ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. ఏకంగా 22 రేసుల అనంతరం తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 61 ల్యాప్‌ల సింగపూర్ గ్రాండ్‌ప్రిని మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్... గంటా 58 నిమిషాల 33.667 సెకన్లలో అందరికంటే ముందుగా గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) రెండో స్థానాన్ని... రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానాన్ని పొందారు. పోల్ పొజిషన్ హీరో లెక్లెర్క్ను 21వ ల్యాప్‌లో అండర్కట్ ద్వారా అధిగమించిన వెటెల్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకొని రేసును నెగ్గాడు. లెక్లెర్క్కు హ్యాట్రిక్ విజయం దక్కకపోయినా... అతని జట్టు ఫెరారీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. పిట్ స్టాప్ వ్యూహంలో తడబడిన మెర్సిడెస్ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈ నెల 29న జరుగుతుంది. -
లెక్లెర్క్ హ్యాట్రిక్ పోల్స్
సింగపూర్: తాజా ఫార్ములావన్ సీజన్లో ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ హ్యాట్రిక్ పోల్స్‌తో అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ లో అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 36.217 సెకన్లలో చుట్టేసి పోల్ పొజిషన్‌ను సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ మొదటి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.191 సెకన్ల తేడాతో ల్యాప్‌ను ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీకే చెందిన మరో డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో, రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ నాలుగు, మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ ఐదు స్థానాల్లో నిలిచారు. తాజా పోల్ పొజిషన్‌తో లెక్లెర్క్ ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పోల్ పొజిషన్స్ (5) సాధించిన డ్రైవర్‌గా అవతరించాడు. హామిల్టన్ (4) రెండో స్థానంలో ఉన్నాడు. చివరి రెండు రేసులను పోల్ పొజిషన్ నుంచి ఆరంభించి విజేతగా నిలిచిన లెక్లెర్క్... సింగపూర్ గ్రాండ్‌ప్రిలో కూడా విజేతగా నిలుస్తాడో? లేదో?.. చూడాలి. ప్రధాన రేసు నేటి సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానుంది. -
వెల్డన్... వెర్స్టాపెన్
హాకెన్‌హీమ్ : జర్మనీ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఈ డచ్ యువ రేసర్ జర్మన్ ట్రాక్‌పై దుమ్మురేపాడు. రేసును అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 64 ల్యాపుల ఈ రేసులో అతనికి ఆదివారం బాగా కలిసొచ్చింది. మేటి రేసర్ల కార్లు ఢీకొనడం, వర్షం వల్ల గజిబిజిగా సాగిన ఈ రేసులో వెర్స్టాపెన్ చివరకు విజేతగా నిలిచాడు. అతను గంటా 44 నిమిషాల 31.275 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో రెండో టైటిల్ సాధించాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో ఇది ఏడో విజయం. నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్ దక్కించుకున్న ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు అందనంత వేగంగా కార్‌ను బుల్లెట్లా పరుగెత్తించాడు. దీంతో వెటెల్ 1గం:44ని:38.608 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టోరో రోసో డ్రైవర్ డానిల్ క్వియాట్ (1గం:44ని:39.580 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ రేసు తీవ్ర నిరాశను మిగిల్చింది. తన కెరీర్లో 200వ రేసు బరిలోకి దిగిన హామిల్టన్ కారు ప్రమాదానికి గురవడంతో చాలా ఆలస్యంగా 1గం:44ని:50.942 సెకన్లలో రేసును పూర్తిచేశాడు. ప్రమాదంతో పాటు అగచాట్లతో ఆరు సార్లు అతని కారుకు బ్రేకులు పడ్డాయి. దీంతో కనీసం ఒక్క పాయింటైనా అతను పొందలేకపోయాడు. గత 23 రేసుల్లో ఈ మెర్సిడెస్ డ్రైవర్ పాయింట్ కూడా గెలవలేకపోవడం ఇదే మొదటిసారి. ఈ రేసులో పలువురి కార్లు ఢీకొనడంతో హేమాహేమీలైన డ్రైవర్లు అసలు రేసునే పూర్తి చేయలేకపోయారు. బొటాస్ (మెర్సిడెస్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ), రికియార్డో (రెనౌ)లు రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆగస్టు 4న హంగేరి గ్రాండ్‌ప్రి జరుగుతుంది. -
హామిల్టన్‌కు ‘పోల్’
మొనాకో: ఈ సీజన్లో వరుసగా ఆరో రేసులోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనున్నారు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 10.166 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. హామిల్టన్ సహచరుడు వాల్తెరి బొటాస్ ఒక నిమిషం 10.252 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గత ఐదు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్స్ లభించాయి. ఆస్ట్రేలియా, అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలలో బొటాస్... బహ్రెయిన్, చైనా, స్పెయిన్ గ్రాండ్‌ప్రిలలో హామిల్టన్ విజేతలుగా నిలిచారు. -
భళా...బొటాస్
బాకు (అజర్బైజాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ బొటాస్ ఈ సీజన్లో రెండో టైటిల్ ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన బొటాస్ గంటా 31 నిమిషాల 52.942 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ ఏడాది జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే వచ్చాయి. ఫార్ములావన్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1992లో విలియమ్స్ జట్టు సీజన్‌లోని తొలి మూడు రేసుల్లో ఈ ఘనత సాధించింది. ఆదివారం జరిగిన రేసుతో మెర్సిడెస్ ఈ రికార్డును సవరించింది. -
బొటాస్‌కు ‘పోల్’
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ వరుసగా రెండో రేసులోనూ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.495 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన బొటాస్ గత చైనా గ్రాండ్‌ప్రి రేసులోనూ పోల్ పొజిషన్ సంపాదించాడు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ నేటి రేసులోనూ గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
షాంఘై: ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.547 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌కే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫార్ములావన్‌లో నేడు జరిగే చైనా గ్రాండ్‌ప్రి 1000వ రేసు కానుండటం విశేషం. -
హై..హై.. హామిల్టన్
మెక్సికో సిటీ: మిగతా డ్రైవర్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్–7లో నిలిస్తే ప్రపంచ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్నది సాధించాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో డ్రైవ్ చేసిన ఈ బ్రిటన్ డ్రైవర్ నాలుగో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ సీజన్లో మరో రెండు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రిలో 71 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 39 నిమిషాల 47.589 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానాన్ని పొందాడు. ఈ రేసులో 12 పాయింట్లు సంపాదించిన హామిల్టన్ మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్లో ఓవరాల్‌గా 358 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017లలో ప్రపంచ టైటిల్‌ను గెలిచాడు. తాజా విజయంతో హామిల్టన్ ఎఫ్1 టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న డ్రైవర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫాంగియో (అర్జెంటీనా) సరసన చేరాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ–7 సార్లు) ‘టాప్’లో ఉన్నాడు. మెక్సికో రేసులో రెండో స్థానాన్ని పొందిన నాలుగుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) 294 పాయింట్లతో ఈ సీజన్లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్స్టాపెన్ గంటా 38 నిమిషాల 28.851 సెకన్లలో గమ్యానికి చేరి మెక్సికో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెల్చుకున్నాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 11వ స్థానంలో నిలువగా... పెరెజ్ 38వ ల్యాప్‌లో నిష్క్రమించాడు. -
బొటాస్‌కు పోల్
సోచి: రష్యా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ ఆధిపత్యం కొనసాగింది. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ హోరాహోరీగా దూసుకెళ్లారు. చివరకు బొటాసే తన సహచరుడు, చాంపియన్ రేసర్ హామిల్టన్‌ను క్వాలిఫయింగ్ సెషన్లో అధిగమించి పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్ రేసులో బొటాస్ అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 ని.31.387 సెకన్లలో పూర్తిచేశాడు. హామిల్టన్ ల్యాప్‌ను 1 ని.31.532 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలువగా, ఫెరారీ జట్టుకు చెందిన వెటెల్ (1:31.943 సె.) మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ సెషన్లలో హామిల్టన్ హవానే సాగింది. కానీ చివరి సెషన్లో మాత్రం అతని జోరు తగ్గింది. సీజన్లో రెండో పోల్ పొజిషన్ సాధించిన బొటాస్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు.