22 రేసుల తర్వాత... | Sebastian Vettel Ends Drought With Victory In Singapore | Sakshi
Sakshi News home page

22 రేసుల తర్వాత...

Sep 23 2019 3:29 AM | Updated on Sep 23 2019 3:29 AM

Sebastian Vettel Ends Drought With Victory In Singapore - Sakshi

సింగపూర్‌: నాలుగుసార్లు ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ అయిన సెబాస్టియన్‌ వెటెల్‌ టైటిల్‌ నిరీక్షణకు తెరపడింది. ఏకంగా 22 రేసుల అనంతరం తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 61 ల్యాప్‌ల సింగపూర్‌ గ్రాండ్‌ప్రిని మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్‌... గంటా 58 నిమిషాల 33.667 సెకన్లలో అందరికంటే ముందుగా గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) రెండో స్థానాన్ని... రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మూడో స్థానాన్ని పొందారు. పోల్‌ పొజిషన్‌ హీరో లెక్‌లెర్క్‌ను 21వ ల్యాప్‌లో అండర్‌కట్‌ ద్వారా అధిగమించిన వెటెల్‌ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకొని రేసును నెగ్గాడు. లెక్‌లెర్క్‌కు హ్యాట్రిక్‌ విజయం దక్కకపోయినా... అతని జట్టు ఫెరారీ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. పిట్‌ స్టాప్‌ వ్యూహంలో తడబడిన మెర్సిడెస్‌ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్‌లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈ నెల 29న జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement