Sanju Samson Spotted Helping Ground Staff in Hamilton - Sakshi
Sakshi News home page

IND vs NZ: శభాష్‌ సంజూ.. గ్రౌండ్‌ స్టాఫ్‌కు సాయం! వీడియో వైరల్‌

Nov 27 2022 3:13 PM | Updated on Nov 27 2022 3:50 PM

Sanju Samson spotted helping groundstaff in Hamilton - Sakshi

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ భారత్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది. అయితే భారత ఇన్నింగ్స్‌ 4.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం వర్షం తగ్గు ముఖం పట్టడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. అయితే మళ్లీ భారత ఇన్నింగ్స్‌ 12.5 (89-1) వద్ద వర్షం తిరుగుముఖం పట్టింది. అనంతరం వర్షం జోరు మరింత పెరగడంతో ఆఖరికి అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

మంచి మనసు చాటుకున్న శాంసన్‌
తొలి వన్డేలో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. రెండో వన్డేకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే తొలుత వర్షం తగ్గుముఖం పట్టాక గ్రౌండ్‌ స్టాప్‌ మైదానం సిద్దం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సంజూ శాంసన్‌ గ్రౌండ్‌ సిబ్బందికి సహాయం చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌ అయినప్పటికీ గ్రౌండ్‌ స్టాప్‌కు చేసిన సంజాపై సర్వాత‍్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండిFIFA WC 2022: ఖతర్‌ను కలవరపెడుతున్న 'క్యామెల్‌ ప్లూ' వైరస్‌.. కరోనా కంటే డేంజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement