
టెస్టు సిరీస్ గెలిచిన కివీస్
ఆల్‌రౌండ్ నైపుణ్యంలో అదరగొట్టిన న్యూజిలాండ్... దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
హామిల్టన్: ఆల్‌రౌండ్ నైపుణ్యంలో అదరగొట్టిన న్యూజిలాండ్... దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 6/0తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది.
ఫుల్టన్ (10) విఫలమైనా... రూథర్‌ఫోర్డ్ (117 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్), విలియమ్సన్ (83 బంతుల్లో 56; 9 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్ మ్యాజిక్ ప్రదర్శించిన నరైన్ తొలి సెషన్ మొత్తం ఏకధాటిగా బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. స్యామీ, పెరుమాల్‌కు చెరో వికెట్ దక్కింది. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టులో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో గెలిచింది. మార్చి 2006 తర్వాత టాప్-8 జట్లపై వరుస టెస్టుల్లో నెగ్గడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి.
సంక్షిప్త స్కోర్లు: వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 367; న్యూజి లాండ్ తొలి ఇన్నింగ్స్: 349; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 103; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124/2 (రూథర్‌ఫోర్డ్ 48, విలియమ్సన్ 56, స్యామీ 1/21, పెరుమాల్ 1/29).