ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌ | West Indies name Test Squad for Richards Botham series in England | Sakshi
Sakshi News home page

ENG vs WI: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌

Published Wed, Jun 5 2024 1:20 PM | Last Updated on Wed, Jun 5 2024 1:36 PM

West Indies name Test Squad for Richards Botham series in England

టీ20 వరల్డ్‌కప్‌-2024 ముగిసిన అనంతరం వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా విండీస్‌ ఆతిథ్య ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జులై 10న లార్డ్స్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. 

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు.

అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్‌-2024కు గాయం కారణంగా దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్.. ఇంగ్లండ్‌ సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న  మైకిల్ లూయిస్ తొలిసారి విండీస్‌ సెలక్టర్లు పిలుపునిచ్చారు.

వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా, జాసన్ హోల్డర్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్ (వైస్-కెప్టెన్), షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, జాచరీ మెక్‌కాస్కీ, మెక్‌కాస్కీ గుడాకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement