
పారిస్: ఫార్ములావన్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.029 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసు మొదలుపెడతాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 75వ పోల్ పొజిషన్ కావడం విశేషం. వెటెల్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ 11, 13వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు.