
తన తండ్రి మైకేల్ షుమాకర్ ఏ జట్టుకైతే ప్రాతినిధ్యం వహించాడో అదే జట్టు తరఫున వచ్చే ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో మిక్ షుమాకర్ బరిలోకి దిగనున్నాడు. 2023 సీజన్ కోసం మిక్ మెర్సిడెస్ జట్టు తరఫున రిజర్వ్ డ్రైవర్‌గా నియమితుడయ్యాడు.
రెగ్యులర్ డ్రైవర్లు హామిల్టన్, జార్జి రసెల్‌లలో ఒకరు అందుబాటులో లేకపోతే మిక్‌కు అవకాశం వస్తుంది. ఈ ఏడాది హాస్ జట్టు తరఫున మిక్ పోటీపడ్డాడు. మైకేల్ షుమాకర్ 2010–2012 వరకు మెర్సిడెస్ తరఫున బరిలోకి దిగాడు.
చదవండి: BBL 2022: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
Comments
Please login to add a commentAdd a comment