హామిల్టన్ టైటిల్ ఆశలు సజీవం
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నెగ్గిన బ్రిటిష్ డ్రైవర్
రోస్‌బర్గ్‌కు రెండో స్థానం
నాలుగో స్థానంలో ఫోర్స్ ఇండియా
సావో పాలో: ఓ వైపు భోరున వర్షం.. పూర్తిగా నీటితో ప్రమాదకరంగా మారిన ట్రాక్.. అధిక వేగంతో నియంత్రణ కోల్పోరుు ఢీకొన్న కార్లు.. మధ్యలో రెండు సార్లు ఆగిన రేసు.. ఐదు సార్లు భద్రతా కార్ల ప్రవేశం.. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలో డిఫెండింగ్ చాంపియన్ లూరుుస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. ఫార్ములావన్‌లో భాగంగా ఆదివారం జరిగిన బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రిలో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ 71 ల్యాప్‌లను 3:01:01.335 సెకన్ల టైమింగ్‌తో ముగించి విజేతగా నిలిచాడు. అలాగే 2014, 15లో ఫార్ములావన్ చాంపియన్‌షిప్స్ సాధించిన తను హ్యాట్రిక్ టైటిల్ ఆశలను సజీవంగా నిలుపుకున్నాడు. అటు ఈ రేసు నెగ్గితే తొలిసారి చాంపియన్‌గా నిలిచే అవకాశం ఉన్న మరో మెర్సిడెజ్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండో స్థానం (+00:11.455)తో సరిపుచ్చుకున్నాడు.
దీంతో ఈనెల 27న అబుదాబిలో జరిగే సీజన్ చివరి రేసులో విజేత ఎవరో తేలనుంది. హామిల్టన్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా ఇందులోనూ విజేతగా నిలవాల్సిందే. అరుుతే రోస్‌బర్గ్ నాలుగు అంతకన్నా తక్కువ స్థానంలో నిలవాల్సి ఉంటుంది. అలా కాకుండా తను మూడో స్థానంలో నిలిచినా హామిల్టన్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికై తే డ్రైవర్స్ స్టాండింగ్‌సలో ఓవరాల్‌గా 12 పారుుంట్లతో రోస్‌బర్గ్ (367)ఆధిక్యంలో ఉన్నాడు. ఇక టైర్ల మార్పులో ఆలస్యం కారణంగా ఓ దశలో 16వ స్థానంలో ఉన్న రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపన్ ఫైనల్ లాప్స్‌లో సూపర్ షో కారణంగా మూడో స్థానం (00:21.481)లో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకు చెందిన సెర్గియో పెరేజ్ నాలుగో స్థానంలో.. నికో హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో నిలిచారు. ఇదిలావుండగా హామిల్టన్‌కు ఇది ఈ ఏడాదిలో తొమ్మిదో విజయం. అరుుతే బ్రెజిల్‌లో గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తొమ్మిది ప్రయత్నాల్లోనూ పరాజయాలే ఎదురయ్యారుు. అలాగే ఈ సీజన్ అనంతరం కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన ఫెలిప్ మసా తన సొంత గడ్డపై చివరి రేసును మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ట్రాక్ పూర్తిగా తడిగా మారడంతో తన కారుపై అదుపు తప్పిన మసా పక్కనున్న బారికేడ్లను ఢీకొని తప్పుకున్నాడు.
మరోవైపు కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌సషిప్స్‌లో ఫోర్స్ ఇండియా తొలిసారి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జట్టుకు 163 పారుుంట్లు ఉండగా సమీప ప్రత్యర్థి విలియమ్స్ 27 పారుుంట్లు తక్కువలో ఉంది. అబుదాబి రేసులోనూ మెరుగైన ప్రదర్శన చేస్తే ఈ స్థానానికి ఢోకా ఉండదు. గత సీజన్‌లో ఫోర్స్ ఇండియా ఐదో స్థానంలో నిలిచింది.