Force India
-
థార్ రాక్స్ Vs గూర్ఖా: ఆఫ్ రోడర్ కింగ్ ఏది?
ఎస్యూవీ, ఎంపీవీ, హ్యాచ్‌బ్యాక్, కూపే, సెడాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో ఆఫ్-రోడర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల 5 డోర్ థార్ (థార్ రాక్స్) లాంచ్ చేసింది. అయితే ఈ విభాగంలో ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా కూడా ఇప్పటికే అమ్మకానికి ఉంది. ఈ రెండు కార్లు ఒకే విభాగానికి చెందినవి కావడం వల్ల, కొనుగోలుదారులు ఏ కారు ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉందనే విషయంలో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కార్ల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..ధరలుమహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన థార్ రాక్స్ ప్రారంభ ధరలు రూ.12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఫోర్స్ గూర్ఖా 5 డోర్ ప్రారంభ ధర రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ మీద, నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది.డిజైన్థార్ రాక్స్, ఫోర్స్ గూర్ఖా రెండూ కూడా ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ టాప్ ఆప్షన్స్ కలిగిన ఈ ఆఫ్-రోడర్స్ 5 డోర్స్ పొందుతాయి. థార్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. గూర్ఖా కఠినమైన లేదా దృఢమైన డిజైన్ పొందుతుంది. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ ఆకర్షణీయంగా ఉంటాయు.ఫీచర్స్మహీంద్రా థార్ రాక్స్ 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లేలను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, న్యావిగేషన్, హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.ఫోర్స్ గూర్ఖా 5 డోర్ మోడల్ 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఏసీ వెంట్స్, వన్-టచ్ అప్/డౌన్ విండో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.ఇంజిన్ వివరాలుమహీంద్రా థార్ రాక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ పొందుతుంది. ఫోర్స్ గూర్ఖా కేవలం ఒకే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?మహీంద్రా థార్ రాక్స్ లాంగ్ జర్నీ చేయడానికి, నగర ప్రయాణానికి, కఠినమైన భూభాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఫోర్స్ గూర్ఖా కఠినమైన రహదారుల్లో కూడా హుందాగా ముందుకు వెళ్తుంది. ధర పరంగా గూర్ఖా 5 డోర్ కంటే కూడా థార్ రాక్స్ ధర చాలా తక్కువ. -
త్వరలో ఐదు డోర్ల ‘గూర్ఖా’..! వీడియో వైరల్
ఫోర్స్ మోటార్స్ ప్రతిష్టాత్మకంగా తయారుచేస్తున్న ‘గూర్ఖా’ 5 డోర్ల వెర్షన్ మోడల్‌ను తర్వలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌కారు తయారీకు కంపెనీ గత రెండేళ్లుగా పనిచేస్తోందని చెప్పింది. ఈ నెలాఖరులోగా దీన్ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈమేరకు ఫోర్స్ కంపెనీ సరికొత్త 5 డోర్ వెర్షన్‌తో పాటు, ఇప్పటికే ఉన్న 3 డోర్ వెర్షన్ ‘గూర్ఖా’లో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. 5 డోర్ గూర్ఖా మారుతి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి వాటితో పోటీపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారత్‌లో ప్రవేశించనున్న ఎలొన్‌మస్క్ మరో కంపెనీ ఫోర్స్ గూర్ఖా కొత్త 5 డోర్మోడల్లో 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందులోబాటులో ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. ముందు, వెనుక వచ్చే బంపర్‌ల్లో కూడా మార్పులు చేసినట్లు చెప్పింది. నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఇది రాబోతుంది. 90 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండబోతుందని కంపెనీ చెప్పింది. View this post on Instagram A post shared by Force Gurkha (@forcegurkha) -
‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు?
దాదాపు నాలుగు నెలలు గడిచినా మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మెయిటీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆందోళనలతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగింది. గత ఆగస్టు 27న ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇద్దరు విద్యార్థినుల హత్య దరిమిలా జనం ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, కొండ ప్రాంతాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్(ఏఎఫ్ఎల్పీఏ)ను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించే దిశగా ప్రభుత్వం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానం అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఒక జిల్లాలో శాంతిభద్రతలు నిర్వహించడం. అంటే ఈ విధానంలో ఒక జిల్లాలో భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఒక దళానికి అప్పగించనున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా దానికి ఆ దళం బాధ్యత వహిస్తుంది. ఇది హింసాయుత ఘటనలను నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు మణిపూర్‌లో హింసను అరికట్టడానికి పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివిధ బలగాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా నిర్ధారిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక దళం మోహరించినందున, ఆ దళం అధికారి అక్కడ అల్లర్లు జరగకుండా చూస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించడంలో వివిధ దళాలు తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నాయి. ఆర్పీఎఫ్లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని, వారిని అధికశాతం జిల్లాల్లో మోహరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. మణిపూర్‌లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. 2023 మే 3 నుండి హింస చెలరేగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీని మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 200 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ హింస ఆగడం లేదు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? -
ఈ మంటలు ఆర్పండి!
నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్‌లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది. మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి. అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్‌లో చేరినప్పటి నుంచి మణిపూర్‌లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం. మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది. విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే! గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి. 2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్‌లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది. మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు. అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి. మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా? -
ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్‌పివి లాంచ్ - ధర ఎంతంటే?
ఇప్పటి వరకు 5 సీటర్, 7 సీటర్ కార్లను గురించి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో 10 సీటర్ విడుదలైంది. ఫోర్స్ మోటార్స్ విడుదల చేసిన ఈ కారు ఏకంగా 13మంది ప్రయాణించడానికి అనుమతిస్తుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త MPV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర: భారతదేశంలో విడుదలైన కొత్త 'ఫోర్స్ సిటీలైన్' (Force Citiline) 10-సీటర్ ధర రూ. 15.93 లక్షలు. ఈ ఎంపివి మూడవ వరుసలో సైడ్-ఫేసింగ్ జంప్ సీట్లకు బదులుగా, ఫ్రంట్ ఫేసింగ్ సీట్లతో వస్తుంది. కావున సులభంగా 13 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. డిజైన్: ఫోర్స్ సిటీలైన్ కొత్త ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది, కొత్త గ్రిల్ పొందుతుంది. ఇది బాడీ కలర్ ప్యానల్ కలిగి డోర్ హ్యాండిల్స్, ORVM వంటివి బ్లాక్ కలర్లో పూర్తిచేసి ఉండటం గమనించవచ్చు. ఈ 10 సీటర్ మోడల్ 2+3+2+3 సీటింగ్ లేఅవుట్లో ఫ్రంట్ ఫేసింగ్ సీట్లను అందిస్తుంది. మూడు, నాలుగవ వరుసలోకి వెళ్ళడానికి, బయటకి రావడానికి అనుకూలంగా రెండవ-వరుసలో 60:40 స్ప్లిట్ బకెట్ సీట్లు లభిస్తాయి. ఫీచర్స్: భారతీయ మార్కెట్లో 10 సీటర్ కార్లు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి, కానీ పెద్ద ఫ్యామిలీలు ఒకేసారి జర్నీ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ ఎంపివి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పవర్ స్టీరింగ్, ముందు & వెనుక ప్రయాణీకులకు ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ఇంజిన్: ఫోర్స్ సిటీలైన్ 10 సీటర్ మెర్సిడెస్-బెంజ్-సోర్స్డ్ FM 2.6 CR టర్బో డీజిల్ ఇంజన్ కలిగి, 90 బిహెచ్పి పవర్ & 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో ఫోర్స్ అర్బానియా
హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ ఫోర్స్ మోటర్స్ తాజాగా తమ అర్బానియా వాహనాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ ఎండీ సుదీప్ మచా 7 వాహనాలను కొనుగోలుదారులకు అందజేశారు. దీని ధర శ్రేణి రూ. 28.99 లక్షల నుంచి రూ. 31.25 లక్షల వరకు ఉంటుంది. 10, 13, 17 సీటింగ్ సామర్థ్యాల వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. అర్బానియా వాహనాల ఉత్పత్తి కోసం అధునాత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, ఇందుకోసం రూ. 1,000 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. -
ఉదయ్‌పూర్ యువరాజు మనసు దోచిన వెహికల్ ఇదే! నెట్టింట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసినట్లు చదువుకున్నాం. అయితే ఇటీవల మన దేశంలో రాజవంశానికి చెందిన యువరాజు లగ్జరీ వ్యాన్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి సాధారణ ప్రజల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు 'లక్ష్యరాజ్ సింగ్ మేవార్' పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను, విదేశాల లగ్జరీ కార్లను సొతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వీరి గ్యారేజిలో రెండు 'ఫోర్స్ అర్బేనియా' లగ్జరీ వ్యాన్లు చేరాయి. ఫోర్స్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ప్రీమియం అర్బేనియా పరిచయం చేసింది. సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపల ఈ వాహనాలను లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా డెలివరీ తీసుకున్నారు. ఈ వ్యాన్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సీల్డ్ గ్లాస్ ప్యానెల్లు, ఇండియూజువల్ AC వెంట్లు , ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఫీచర్లున్నాయి. ఫోర్స్ అర్బేనియా వ్యాన్స్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లగ్జరీ వ్యాన్స్ ధరల గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వ్యాన్స్ గురించి స్వయంగా యువరాజు మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. లక్ష్యరాజ్ 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ చేసుకున్నారు. వీరి కుటుంబం తమ మొదటి రోల్స్ రాయిస్‌ను 1911లోనే కొనుగోలు చేసింది. 2020లో లక్ష్యరాజ్ మహీంద్రా థార్ కొనుగోలు చేశారు. -
దేశంలో తొలి మోడల్.. ఫోర్స్ మోటార్స్ అర్బేనియా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్స్ మోటార్స్ తయారీ అర్బేనియా కొద్ది రోజుల్లో రోడ్డెక్కనుంది. యాత్రలు, కార్యాలయ సిబ్బంది ప్రయాణానికి ఇది ఉపయుక్తం. మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌నుబట్టి డ్రైవర్‌తోసహా 18 మంది కూర్చునే వీలుంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది. 115 హెచ్‌పీ, 350 ఎన్ఎం పీక్ టార్క్‌తో మెర్సిడెస్ ఎఫ్ఎం 2.6 సీఆర్ ఈడీ టీసీఐసీ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. ఈ సెగ్మెంట్లో దేశంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రోల్ఓవర్ ప్రొటెక్షన్‌తో తయారైన తొలి మోడల్ ఇదే. మోనోకాక్ స్ట్రక్చర్, హిల్ హోల్డ్ అసిస్ట్, కొలాప్సిబుల్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీల్డ్ పనోరమిక్ విండోస్, 17.8 సెంటీమీటర్ల ఎల్సీడీ టచ్‌స్క్రీన్ వంటి హంగులు ఉన్నాయి. 15 రోజుల్లో డీలర్‌షిప్‌లకు అర్బేనియా వాహనాలు చేరనున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. రూ.1,000 కోట్లతో అర్బేనియా వాహనాల అభివృద్ధి, తయారీ ప్రాజెక్టును ఫోర్స్ మోటార్స్ చేపట్టింది. -
మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..!
ఆఫ్ రోడ్ కార్లలో మహీంద్రా థార్ అత్యంత ఆదరణను పొందింది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా థార్, మారుతి సుజుకీ జిమ్నీ కార్లకు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్యూవీను లాంచ్ చేసింది. తాజాగా గుర్ఖాను సరికొత్తగా తెచ్చేందుకు ఫోర్స్ సన్నాహాలను చేస్తోంది. 5 డోర్ వెర్షన్లో సరికొత్తగా..! గత ఏడాది ఫోర్స్ మోటార్స్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో గుర్ఖాను తీసుకొచ్చింది.తొలుత 3 డోర్ వెర్షన్ గుర్ఖాను ఫోర్స్ మోటార్స్ లాంచ్ చేసింది. దీనికి అదనంగా మరిన్నీ సీట్లను యాడ్ చేస్తూ 5 డోర్ వెర్షన్ గుర్ఖాను త్వరలోనే లాంచ్ చేస్తామని ఫోర్స్ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా 5 డోర్ వెర్షన్ గుర్ఖా టెస్టింగ్ మోడల్‌కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఈ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. నయా ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో 6-7 సీట్ల సదుపాయం ఉండనుంది. అదే డిజైన్..ఇంజిన్‌తో..! ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ 5-డోర్ వెర్షన్ కారు అదే డిజైన్ , ఇంజిన్‌తో వచ్చే అవకాశాలున్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్‌తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు. 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. చదవండి: అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..! -
మహీంద్రా థార్‌కు పోటీగా మార్కెట్లోకి గూర్ఖా...! లాంచ్ ఎప్పుడంటే..?
Force Gurkha SUV: స్పోర్ట్స్ యూటిలీటీ వెహికిల్(ఎస్యూవీ) శ్రేణిలో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లో మహీంద్రా థార్‌కు పోటీగా ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎస్యూవీను ఈ నెల 15న లాంచ్ చేయనుంది. గత సంవత్సరం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది. ఈవెంట్లో చూపించిన విధంగానే ఎటువంటి మార్పులు లేకుండా బహిరంగ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! ఫోర్స్ మోటార్స్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫోర్స్ గూర్ఖా వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఎస్యూవీ కారు ధరలు ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఫోర్స్ గూర్ఖా ధర రూ. 8లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండవచ్చునని ఆటో మొబైల్ రంగ నిపుణుల భావిస్తోన్నారు. ఫోర్స్ గూర్ఖాకు సింగిల్-స్లాట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రో ఎడ్జ్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు డే టైం రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బ్రాండింగ్‌తో కూడిన ఫెండర్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్, క్లామ్‌షెల్ బోనెట్, వెనుక డోర్‌కు మౌంటెడ్ స్పేర్ వీల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వర్టికల్ టెయిల్లైట్లు, హై-మౌంటెడ్ ఎల్ఈడీ లైట్లను గూర్ఖాకు అమర్చినట్లు తెలుస్తోంది. కారు ఇంటీరియర్స్ విషయానికి వస్తే మాట్టే బ్లాక్ డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో గూర్ఖా రానుంది. కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా అమర్చినట్లు తెలుస్తోంది. 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కారులో అమర్చారు. 89 బీహెచ్పీ సామర్థ్యంతో 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడవనుంది. It’s just you and your adventure. And our moulded floor mats, that ensure low NVH in the cabin, make sure of that! With this, we’ve designed the interiors of the All-New Gurkha to be as breath-taking as the view outside. . . .#TheallnewGurkha #ForceGurkha #Comingsoon #StayTuned pic.twitter.com/ksnAzyAzs7 — Force Gurkha (@ForceGurkha4x4) September 9, 2021 We're thrilled & excited to reveal the All-New Gurkha in its full glory on the 15th September'21. 5 days to go! Don't forget to #savethedate. . . .#TheallnewGurkha #ForceGurkha #Comingsoon #StayTuned #GetReady #Gurkha4x4x4 pic.twitter.com/W9jbJU74WT — Force Gurkha (@ForceGurkha4x4) September 10, 2021 చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
మాల్యా ఫోర్స్ ఇండియా వేలంలో గోల్మాల్!
లండన్: లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టుకోలేక తంటాలు పడుతున్న భారతీయ బ్యాంకులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మాల్యాకు చెందిన ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ ఫోర్స్ ఇండియా విక్రయంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రధాన బిడ్డర్లలో ఒకటైన రష్యా ఫెర్టిలైజర్ గ్రూప్ యురాల్కలి ఆరోపించింది. గతవారంలో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది. అయితే, వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనివల్ల మాల్యాకు రుణమిచ్చిన 13 భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు దాదాపు 4 కోట్ల పౌండ్ల (దాదాపు రూ. 375 కోట్లు)మేర నష్టం వాటిల్లినట్లు యురాల్కలి పేర్కొంది. ఫోర్స్ ఇండియాలో మాల్యాకు చెందిన ఆరంజ్ ఇండియా హోల్డింగ్స్‌కు 42.2 శాతం వాటా ఉంది. యూకే హైకోర్టు భారతీయ బ్యాంకులకు అనుకూలంగా మాల్యా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఫోర్స్ ఇండియా మొత్తం వ్యాపారం, ఆస్తులు, గుడ్‌విల్‌తో కలిపి తాము 10.15–12.2 కోట్ల పౌండ్ల మధ్యలో నగదు రూపంలో చెల్లించేందుకు బిడ్ వేశామని.. కానీ, వేలం నిర్వాహకులు మాత్రం తమ బిడ్‌ను నిరాకరించి ఇంకా తక్కువ బిడ్ వేసిన వారికి కట్టబెట్టారని యురాల్కలి వివరించింది. బిడ్డింగ్ ప్రక్రియలో అక్రమాలు, తమకు జరిగిన అన్యాయానికిగాను భారీ నష్టపరిహారం(కొన్ని కోట్ల డాలర్ల మేర) కోరుతూ లండన్ హైకోర్టులో యురాల్కలి వేలం నిర్వాహకులు ఎప్ఆర్పీ అడ్వయిజరీపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలకు లోబడి... వేలంలో ఫోర్స్ ఇడియాను కెనడా బిలియనీర్ లారెన్స్ స్ట్రాల్కు చెందిన రేసింగ్ పాయింట్ కన్సార్షియం దక్కించుకుంది. కాగా, బిడ్డింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా పూర్తయిందని ఎఫ్ఆర్పీ అడ్వయిజరీ స్పష్టం చేసింది. భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్ల మేర రుణాలను ఎగవేసిన మాల్యా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
ఫోర్స్ ఇండియాకు మాల్యా గుడ్‌బై
లండన్ : రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఫోర్స్ ఇండియా డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. న్యాయపరమైన వివాదాలను ఎదుర్కోవడంపై మరింత దృష్టిసారించేందుకే మాల్యా ఫోర్స్ ఇండియా నుంచి తప్పుకున్నారు. బ్రిటన్ కోర్టులో మాల్యా అప్పగింతను కోరుతూ భారత్ దాఖలు చేసిన అప్పీల్‌ను ఎదుర్కొంటున్న వివాదాస్పద పారిశ్రామికవేత్త ఫార్ములా 1 కార్యకలాపాల్లోనూ ఇప్పటివరకూ చురుకుగా పాల్గొన్నారు. కాగా మాల్యా తన స్ధానంలో బోర్డులో తన కుమారుడిని నియమించినట్టు పేర్కొన్నారు. తాను వైదొలిగేందుకు ఎలాంటి బలమైన కారణం లేకున్నా తన స్ధానంలో కుమారుడిని నియమించాలని భావించినట్టు ఆయన చెప్పారు. తాను న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్నందున కంపెనీపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఫోర్స్ ఇండియాలో మరో వివాదాస్పద పారిశ్రామికవేత్త సుబ్రతోరాయ్‌తో మాల్యా సహ భాగస్వామిగా ఉన్నారు. సహారా అధినేత సుబ్రతో రాయ్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. -
సూపర్ పెరెజ్
బాకు (అజర్బైజాన్): ఒకటా... రెండా... ఏకంగా 36 రేసుల తర్వాత భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఓ ఫార్ములావన్ రేసులో టాప్–3లో నిలిచాడు. ఆదివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి రేసులో ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని సంపాదించాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్ గంటా 43 నిమిషాల 48.315 సెకన్లలో పూర్తి చేశాడు. 2016లో బాకు వేదికగా జరిగిన యూరోపియన్ గ్రాండ్‌ప్రిలో చివరిసారి పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నాడు. హామిల్టన్ గంటా 43 నిమిషాల 44.291 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. -
‘ఎఫ్ 1’ కూడా వేరొకరి చేతుల్లోకి...
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఎఫ్1 జట్టు త్వరలోనే వేరొకరి హస్తగతం కానుంది. ఫోర్స్ ఇండియాను బ్రిటన్‌కు చెందిన ఓ శీతల పానీయాల తయారీ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూ.1,806 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ‘రిచ్ ఎనర్జీ’ అనే బ్రిటిష్ శీతల పానీయాల సంస్థ దాదాపు 200 మిలియన్ల డాలర్లకు ఫోర్స్ ఇండియాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. గతంలో ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఉన్న వాటాను కూడా తొలగించడంతో ఆ జట్టుతో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. -
హామిల్టన్‌కు పోల్ పొజిషన్
నేడు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి మెల్బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్లో మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌కు శుభారంభం లభించింది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.188 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. సీజన్లో తొలి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా నాలుగో ‘పోల్’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టెబన్ ఒకాన్ వరుసగా 11వ, 14వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెటెల్ (ఫెరారీ), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 6. గ్రోస్యెన్ (హాస్), 7. మసా (విలియమ్స్), 8. సెయింజ్ (ఎస్టీఆర్), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. రికియార్డో (రెడ్‌బుల్), 11. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 12. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 13. అలోన్సో (మెక్లారెన్), 14. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 15. ఎరిక్సన్ (సాబెర్), 16. జియోవినాజి (సాబెర్), 17. మాగ్నుసెన్ (హాస్), 18. వాన్డోర్నీ (మెక్లారెన్), 19. స్ట్రోల్ (విలియమ్స్), 20. పాల్మెర్ (రెనౌ). -
జగన్ యూత్ ఫోర్స్ ఆవిర్భావం
ఆచంట : ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేందుకు విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట ఆచంటలో జగన్ యూత్ ఫోర్స్ ఆవిర్భవించింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని యూత్ ఫోర్స్ సభ్యులను కోరారు. జగన్ యూత్ ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు వైట్ల కిషోర్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతను చైతన్యపర్చి ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని, సేవా కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కౌరు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర యువజన కార్యదర్శి కారుమంచి రమేష్ చౌదరి పాల్గొన్నారు. కమిటీ సభ్యులుగా ఆరుపల్లి అశోక్, పాలసత్తి రామిరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, చింతపల్లి గనిరాజు, పిల్లి రుద్రప్రసాదు, నంబూరి సుబ్రహ్మణ్యం, అరిగెల సురేష్‌బాబు, దొంగ శ్రీనివాసు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతలు వైట్ల కిషోర్‌కుమార్‌ను అభినందించారు. -
నేను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను
తాను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను అంటున్నారు నటి జెనీలియా. దక్షిణాదిలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ ఉత్తరాది భామ హింది నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను లవ్వాడి, పెళ్లాడిన తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే హిందీ చిత్రం ఫోర్స్-2లో గెస్ట్‌గా మెరిశారు కూడా. ఇక వార్తల్లో ఉండడానికి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక కార్యక్రమంలో పాల్గొన్న జెనీలియా తాను మునుపటి కన్నా చాలా తెలివి మీరానని తెలిపారు. అనుభవం కూడా గడించానని చెప్పారు. చాలా మంది హీరోరుున్లు పెళ్లి తరువాత పిల్లలను కనడానికి సంకోచిస్తున్నారన్నారు. కొందరైతే గర్భం ధరించడం ఇష్టం లేక విడాకులు తీసుకుంటున్నారన్నారు. నిజానికి మాతృత్వంతో చాలా పరిణితి కలుగుతుందని, నటనలోనూ మరింత మెరుగ్గా నటించగలుగుతాయమని అన్నారు.నటి ఐశ్వర్యారాయ్‌నే తీసుకుంటే తను తల్లి అరుున తరువాత మరింత పరిణితితో నటిస్తున్నారని పేర్కొన్నారు.అరుుతే ఆమె ఇటీవల నటించిన చిత్రంలో హీరో రణ్‌బీర్‌కపూర్‌తో ఘాటైన లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి పెద్ద చర్చకే దారి తీశారన్నారు. తాను అలా నటించలేనని అన్నారు. మొత్తం మీద నటి ఐశ్వర్యారాయ్ చుంబనాల దృశ్యాలను సాకుగా చూపి నటి జెనీలియా తాను ప్రచారం పొందాలని చూస్తున్నారా? అన్న సందేహం కలుగుతోంది కదూ. -
‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు
హైదరాబాద్: దివిసా హెర్బల్ కేర్ తాజాగా ఫోర్స్-2 సినిమాతో టైఅప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ తన అక్యుమస్ ప్రొడక్ట్ ద్వారా చిత్రం ప్రచారంలో పాలుపంచుకుంటుంది. చిత్రంలో హీరో హీరోరుున్లు వారికి ఎదురైన సమస్యలను ఎంతో విశ్వాసంతో ధైర్ఘంగా ఎదుర్కొన్నారని, ఇదే తరహాలో తమ అక్యుమస్ ఆయుర్వేదిక్ గ్రాన్యూల్స్ ప్రొడక్ట్ కూడా ప్రజలను తక్కువ బరువు, సన్నని శరీరం వంటి తదితర సమస్యల నుంచి కాపాడుతుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అక్యుమస్ ప్రొడక్ట్‌ను 18 అయుర్వేద మూలికలతో తయారు చేశామని, ఇది సహజసిద్ధంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని వివరించింది. -
హామిల్టన్ టైటిల్ ఆశలు సజీవం
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నెగ్గిన బ్రిటిష్ డ్రైవర్ రోస్బర్గ్కు రెండో స్థానం నాలుగో స్థానంలో ఫోర్స్ ఇండియా సావో పాలో: ఓ వైపు భోరున వర్షం.. పూర్తిగా నీటితో ప్రమాదకరంగా మారిన ట్రాక్.. అధిక వేగంతో నియంత్రణ కోల్పోరుు ఢీకొన్న కార్లు.. మధ్యలో రెండు సార్లు ఆగిన రేసు.. ఐదు సార్లు భద్రతా కార్ల ప్రవేశం.. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలో డిఫెండింగ్ చాంపియన్ లూరుుస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. ఫార్ములావన్‌లో భాగంగా ఆదివారం జరిగిన బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రిలో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ 71 ల్యాప్‌లను 3:01:01.335 సెకన్ల టైమింగ్‌తో ముగించి విజేతగా నిలిచాడు. అలాగే 2014, 15లో ఫార్ములావన్ చాంపియన్‌షిప్స్ సాధించిన తను హ్యాట్రిక్ టైటిల్ ఆశలను సజీవంగా నిలుపుకున్నాడు. అటు ఈ రేసు నెగ్గితే తొలిసారి చాంపియన్‌గా నిలిచే అవకాశం ఉన్న మరో మెర్సిడెజ్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండో స్థానం (+00:11.455)తో సరిపుచ్చుకున్నాడు. దీంతో ఈనెల 27న అబుదాబిలో జరిగే సీజన్ చివరి రేసులో విజేత ఎవరో తేలనుంది. హామిల్టన్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా ఇందులోనూ విజేతగా నిలవాల్సిందే. అరుుతే రోస్‌బర్గ్ నాలుగు అంతకన్నా తక్కువ స్థానంలో నిలవాల్సి ఉంటుంది. అలా కాకుండా తను మూడో స్థానంలో నిలిచినా హామిల్టన్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికై తే డ్రైవర్స్ స్టాండింగ్సలో ఓవరాల్‌గా 12 పారుుంట్లతో రోస్‌బర్గ్ (367)ఆధిక్యంలో ఉన్నాడు. ఇక టైర్ల మార్పులో ఆలస్యం కారణంగా ఓ దశలో 16వ స్థానంలో ఉన్న రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపన్ ఫైనల్ లాప్స్‌లో సూపర్ షో కారణంగా మూడో స్థానం (00:21.481)లో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకు చెందిన సెర్గియో పెరేజ్ నాలుగో స్థానంలో.. నికో హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో నిలిచారు. ఇదిలావుండగా హామిల్టన్‌కు ఇది ఈ ఏడాదిలో తొమ్మిదో విజయం. అరుుతే బ్రెజిల్లో గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తొమ్మిది ప్రయత్నాల్లోనూ పరాజయాలే ఎదురయ్యారుు. అలాగే ఈ సీజన్ అనంతరం కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన ఫెలిప్ మసా తన సొంత గడ్డపై చివరి రేసును మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ట్రాక్ పూర్తిగా తడిగా మారడంతో తన కారుపై అదుపు తప్పిన మసా పక్కనున్న బారికేడ్లను ఢీకొని తప్పుకున్నాడు. మరోవైపు కన్స్ట్రక్టర్స్ చాంపియన్సషిప్స్లో ఫోర్స్ ఇండియా తొలిసారి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జట్టుకు 163 పారుుంట్లు ఉండగా సమీప ప్రత్యర్థి విలియమ్స్ 27 పారుుంట్లు తక్కువలో ఉంది. అబుదాబి రేసులోనూ మెరుగైన ప్రదర్శన చేస్తే ఈ స్థానానికి ఢోకా ఉండదు. గత సీజన్లో ఫోర్స్ ఇండియా ఐదో స్థానంలో నిలిచింది. -
హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..?
బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. 2011లో రిలీజ్ అయిన ఫోర్స్ సినిమాతో ఆకట్టుకున్న జెనీలియా లాంగ్ గ్యాప్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ లో నటిస్తోంది. అయితే తొలి భాగం చివర్లో జెనీలియా పాత్ర చనిపోతుంది. మరి ఈ రెండు భాగంలో ఆమె పాత్రను ఎలా చూపిస్తారు. దెయ్యంగా వస్తుందా లేక.. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. సోనాక్షి సిన్మా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఫోర్స్ టు నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
హుల్కెన్‌బర్గ్ స్థానంలో ఒకాన్
సిల్వర్‌స్టోన్: భారత ఫార్ములావన్ జట్టు ఫోర్స్ ఇండియాలో కొత్తగా ఫ్రెంచ్ డ్రైవర్ ఈస్టెబన్ ఒకాన్‌ను తీసుకున్నారు. వచ్చే సీజన్లో నికో హుల్కెన్‌బర్గ్ స్థానంలో 20 ఏళ్ల ఒకాన్ బరిలోకి దిగుతాడు. ఈ మేరకు అతనితో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు ఫోర్స్ జట్టు వెల్లడించింది. తదుపరి సీజన్లో సెర్గియో పెరెజ్, ఒకాన్ ఫోర్స్ ఇండియాను నడిపించనున్నారు. హుల్కెన్‌బర్గ్ రినాల్ట్ జట్టుకు మారడంతో ఫ్రెంచ్ డ్రైవర్‌ను తీసుకున్నారు. -
‘ఫోర్స్-2’ స్టార్స్ హల్చల్
-
ఫోర్స్ ఇండియాకు హుల్కెన్‌బర్గ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టును డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ వీడనున్నాడు. వచ్చే ఏడాది నుంచి అతను రెనౌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2011లో ఫోర్స్ ఇండియాలో టెస్టు డ్రైవర్‌గా అడుగుపెట్టిన అతను 2012లో ప్రధాన డ్రైవర్‌గా వ్యవహరించాడు. జర్మనీకి చెందిన హుల్కెన్‌బర్గ్ 2013లో సాబెర్ జట్టుకు మారాడు. 2014లో మళ్లీ ఫోర్స్ ఇండియా జట్టులోకి వచ్చాడు. ఫోర్స్ ఇండియా జట్టు తరఫున 75 రేసుల్లో పాల్గొన్న హుల్కెన్‌బర్గ్ ఈ ఏడాది పాల్గొన్న 17 రేసుల్లో 11 సార్లు టాప్-10లో నిలిచాడు. ఈ సీజన్లో అతను మరో నాలుగు రేసుల్లో ఫోర్స్ ఇండియా తరఫున బరిలోకి దిగుతాడు. -
బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రేమలో ఉందని, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని కొన్ని రోజుల కిందట వదంతులు ప్రచారమయ్యాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ కు సోనాక్షి సిన్హా హాజరయింది. ఇదే ఈవెంట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డే కూడా పాల్గొన్నాడు. దీంతో అందరిదృష్టి వీరిపై పడింది. స్పోర్ట్ అండ్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి యజమాని అయిన బంటీతో బొద్దుగుమ్మ సోనాక్షికి కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. అయితే రెండు నెలల కిందట వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మరోసారి సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డేతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. సోనాక్షి బ్లూ బాడీవేర్ లో కనిపించగా, బంటీ గ్రే టీషర్ట్ ధరించినట్లు ఫొటోలో కనిపిస్తుంది. ప్రియుడు ఉంటే విదేశీ బీచ్ లలో హాయిగా సేదతీరాలని ఉందని గతంలో పలుమార్లు సోనాక్షినే ప్రస్తావించింది. దీంతో ఆమె ప్రేమలో ఉందని ఇండస్ట్రీ కోడై కూసింది. ఆగస్టులో ఇదే విషయంపై వదంతులు రావడంతో.. మా ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూనే అందులో నిజం లేదంటూ చమత్కరించిన విషయం తెలిసిందే. సోనాక్షి ప్రస్తుతం ఫోర్స్ 2 మూవీలో నటిస్తుంది. జాన్ అబ్రహాం, తాహిర్ షా, ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. -
'అమ్మాయిలు జడలు వేసుకుంటేనా రానిస్తారా?'
తిరువనంతపురం: అమ్మాయిలు జడలు వేసుకునే పాఠశాలలకు రావాలని ఒత్తిడి చేయొద్దని, అసలు ఆ విషయం అడగొద్దని కేరళ రాష్ట్ర చిన్నారుల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైయర్ సెకండరీ డైరెక్టర్ కు, జనరల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ కు ఆదేశాలిచ్చింది. కేరళలో కాసర్ గోడ్ కు చెందిన ఓ విద్యార్థిని తనను జడవేసుకోలేదని స్కూళ్లో నుంచి పంపించారని కమిషన్ ను ఆశ్రయించడంతో కమిషన్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తాము స్నానం చేసిన ప్రతిసారి రెండు జడలు వేసుకోవడం ఇబ్బందిగా మారిందని, జుట్టంతా చిక్కులుపడి దానిని సరిచేసే క్రమంలో అది బలహీనంగా తయారవుతుందని, అలాగని తలంటు స్నానం చేయకుంటే పక్కవారికి ఇబ్బందయ్యేలా వాసన వస్తుందని కానీ, తలంటు స్నానం చేశాక జుట్టు సరిచేసుకోవడం బాగా ఇబ్బందని వారు కమిషన్ ముందు వాపోయారు. రెండు జడలు తప్పకుండా వేసుకోవాల్సిందేనని స్కూళ్లలో వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిని విన్న కమిషన్ కావాలంటే జుట్టంతా కలిపి బ్యాండ్ వేసుకునే విధంగా ఆదేశించవచ్చని, జడలు వేసుకోవాల్సిందేనని ప్రత్యేకంగా నిబంధన పెట్టి వారిపై ఒత్తిడి తీసుకురావొద్దని పాఠశాలల యాజమాన్యాలకు చెప్పింది. -
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రామన్నపేట కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాల్వాయి భాస్కర్‌రావ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని జీఎంఆర్ ఫంక్షన్హాల్లో ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగే మోదీతోమనం సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత పాలనను అందించిన ఘనత దేశచరిత్రలో మోదీకే దక్కుతుందని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ అభివృద్ధికి అన్ని విధాల ప్రయత్నాలు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండలఅధ్యక్షుడు గర్దాసు సురేష్, ప్రధానకార్యదర్శి తాటిపాముల శివక్రిష్ణ, సర్పంచ్ నకిరేకంటి మొగులయ్య, ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, బట్టె క్రిష్ణమూర్తి, మామిళ్లపల్లి శంకరయ్య, బి.వెంకటేష్, ఆర్.ఎట్టయ్య, ఎ.భాస్కర్, టి.లింగస్వామి, ఆర్.రమేష్‌కుమార్, శోభన్‌బాబు, ధర్మరాజు, శశికృష్ణాచారి, అయిలయ్య, మల్లేశం పాల్గొన్నారు. -
జనం ముందుకు విజయ్ మాల్యా!
లండన్: భారత బ్యాంకులకు దాదాపు రూ.9 వేలకోట్లు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చాలా రోజుల తర్వాత అధికారిక సమావేశంలో కనిపించనున్నారు. గత మార్చి నెలలో యూకేకు పారిపోయిన తర్వాత మాల్యా అధికారిక ఈవెంట్లలో కనిపించలేదు. ప్రస్తుతం యూకేలోని లండన్‌లో నివాసం ఉంటున్న మాల్యా శుక్రవారం జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా.. ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా మాల్యా చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఫోర్స్ ఇండియా మాత్రం సీజన్లో మంచి ఫలితాలను రాబట్టింది. కాగా గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడిగా ముంబై కోర్టు ప్రకటించించిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకానందున, ఈడీ ఆస్తులను జప్తు చేయకముందే వాటిని అమ్మకాలు చేపట్టినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధిష్టానం ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో జులై 29న ఉదయం 11 గంటల లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది. -
డాలర్ ఇండస్ట్రీస్ నుంచి మెన్ ఇన్నర్‌వేర్ బ్రాండ్..‘ఫోర్స్ నెక్ట్స్’
బెంగళూరు: హోజరీ దిగ్గజం ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పురుషుల కోసం కొత్తగా ప్రీమియం ఇన్నర్‌వేర్ బ్రాండ్ ‘ఫోర్స్ నెక్ట్స్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫోర్స్ నెక్ట్స్ బ్రాండ్ ఫైన్జ్, రిలాక్స్జ్, ఫ్లెక్స్జ్ అనే మూడు కేటగిరిల్లో లభ్యమవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్‌ను అనుసరించే యువతను దృష్టిలో ఉంచుకొని ఫోర్స్ నెక్ట్స్ రూపకల్పన జరిగిందని, దీన్ని 2016-17 నాటికి రూ.100 కోట్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. తమ కొత్త బ్రాండ్ ప్రముఖ హోజరీ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, మాల్స్‌తోపాటు ఈ-కామర్స్ సంస్థల్లోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
హామిల్టన్ బోణీ
మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ‘ఫోర్స్’ పెరెజ్‌కు మూడో స్థానం మోంటెకార్లో: ఫార్ములావన్‌లో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 59 నిమిషాల 29.133 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 44వ విజయం కాగా... మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండో టైటిల్. చివరిసారి 2008లో హామిల్టన్ ఈ రేసులో విజేతగా నిలిచాడు. ‘ పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానాన్ని పొందగా... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 28 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకే చెందిన మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందడం విశేషం. ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది. -
ఇంకా దొరకని IAF పరేడ్ హిట్ అండ్ రన్ నిందితుడు
-
హామిల్టన్ @ 9
మెర్సిడెస్ డ్రైవర్ ఖాతాలో రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్ ఈ సీజన్లో తొమ్మిదో విజయం ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ పెరెజ్‌కు మూడో స్థానం సోచి (రష్యా): ఆద్యంతం నాటకీయంగా సాగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 11.024 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 42వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ ఏడు ల్యాప్‌ల తర్వాత కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వైదొలగగా... అతని వెనకాలే రెండో స్థానంలో ఉన్న హామిల్టన్ ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి వెనుదిరిగి చూడని హామిల్టన్ చివరి ల్యాప్ వరకూ ఆధిక్యంలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. 30 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ టాప్-3లో నిలువడం గమనార్హం. చివరి ల్యాప్‌లో పెరెజ్ ఐదో స్థానానికి పడిపోయే అవకాశం కనిపించింది. అయితే పెరెజ్‌ను ఓవర్టేక్ చేయబోయిన కిమీ రైకోనెన్, బొటాస్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పెరెజ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనై వైదొలిగారు. ఈ సీజన్లో 15 రేసులు పూర్తయ్యాక ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో హామిల్టన్ (302 పాయింట్లు), వెటెల్ (236 పాయింట్లు), రోస్‌బర్గ్ (229 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
హీరోకు గాయాలు.. సర్జరీ!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంకు షూటింగ్లో గాయాలయ్యాయి. దీంతో ఓ చిన్నపాటి సర్జరీ కూడా చేయించుకున్న ఆయన ప్రస్తుతం బెడ్‌రెస్ట్ తీసుకుంటున్నారు. అభినయ్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫోర్స్-2' షూటింగ్లో భాగంగా జాన్ అబ్రహం హంగేరిలోని బుడాపెస్ట్‌లో ఉన్నారు. 50 రోజుల షెడ్యూల్లో భాగంగా యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండగా ఆయన మోకాలుకు తీవ్రంగా దెబ్బతగిలింది. దీంతో ఆయన వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించి.. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించారు. ఆ వెంటనే షూటింగ్లో పాల్గొనేందుకు జాన్ అబ్రహం ఉత్సాహం కనబర్చినప్పటికీ, దర్శకుడు మాత్రం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గాయం పూర్తిగా తగ్గిన తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభిద్దామని చెప్పారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. జాన్ అబ్రహం 2011లో నటించిన 'ఫోర్స్' సినిమాకు సీక్వెల్‌గా 'ఫోర్స్-2' తెరకెక్కుతున్నది. -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్
సింగపూర్ : క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెటెల్ రెండు గంటల 1ని:22.118 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 32 ల్యాప్‌ల తర్వాత కారులో ఇబ్బంది తలెత్తడంతో రేసు నుంచి వైదొలిగాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లలో సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 12వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ (252 పాయింట్లు), రోస్‌బర్గ్ (211), వెటెల్ (203) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
మళ్లీ హామిల్టన్‌కే పోల్
♦ ఈ సీజన్లో 11వ సారి ♦ నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి మోంజా : సర్క్యూట్ మారినా... సహచరులు ఎంత గట్టిపోటీ నిచ్చినా... తన దూకుడు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ 11వసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 23.397 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు, ప్రపంచ మాజీ చాంపియన్స్ కిమీ రైకోనెన్, సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. హామిల్టన్ సహచరుడు, మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గతేడాది ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి తర్వాత ఇప్పటివరకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే పోల్ పొజిషన్స్ లభిస్తుండటం విశేషం. గతేడాది కూడా ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ విజేతగా నిలిచాడు. మరి ఈసారి కూడా అతనికి ఇటలీ గ్రాండ్‌ప్రి కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
డాలర్ ఇండస్ట్రీస్ ‘ఫోర్స్ ఎన్ఎక్స్టీ’ బ్రాండ్
హైదరాబాద్: ప్రముఖ హొజైరీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురుషుల కోసం ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ‘ఫోర్స్ ఎన్ఎక్స్టీ’ అనే కొత్త ఇన్నర్‌వేర్ బ్రాండ్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్రాండ్ ఉత్పత్తులు పలు రకాల రంగుల్లో ట్రెండీగా, ఫ్యాషనబుల్‌గా ఉంటాయని డాలర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ వినోద్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఫోర్స్ ఎన్ఎక్స్టీ బ్రాండ్ ఉత్పత్తులు ఫైన్జ్, రిలాక్జ్, ఫ్లెక్జ్ అనే మూడు కేటగిరిల్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఐరన్ మ్యాన్‌గా పేరున్న మిలింద్ సోమన్ ఈ ఫోర్స్ ఎన్ఎక్స్టీ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. -
రెండేళ్ల డీల్ పెంచుకున్న మాల్యా డ్రైవర్
విజయ్ మాల్యాకు చెందిన ఫార్ములా వన్ టీమ్ ఫోర్స్ ఇండియ జర్మన్ డ్రైవర్ నికో హల్కెన్ బర్గ్ ఒప్పందాన్ని పొడిగించింది. తమ జట్టు తరఫున హల్కెన్ బర్గ్ మరో రెండేళ్లు రేసుల్లో పాల్గొంటాడని టీమ్ ఓనర్ విజయ్ మాల్యా తెలిపాడు. 28ఏళ్ల హల్కెన్ బర్గ్ తన డీల్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఫోర్స్ ఇండియా స్వంత ఇంటి తో సమానమని అన్నాడు. గత రెండేళ్లలో టీమ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. మరో వైపు టీమ్ ప్రిన్సిపల్ విజయ్ మాల్యా నికొ పై ప్రశంసలు కురిపించాడు. నికో లో వేగం ఉందని.. అతడికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డాడు. మరో రెండేళ్లలో ఫార్ములా వన్ క్రీడల్లో ఫోర్స్ ఇండియా మరింత ప్రగతి సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత సీజన్ లో హల్కెన్ బర్గ్ 24 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. -
హామిల్టన్ పదోసారి...
స్పాఫ్రాంకోర్చాంప్స్: ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పదోసారి ‘పోల్ పొజి షన్’ సాధించాడు. శని వారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 47.197 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి, విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది వరుసగా ఆరో ‘పోల్’ కావడం విశేషం. 2000, 2001లలో మైకేల్ షుమాకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో డ్రైవర్ హామిల్టన్. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఐదో స్థానం నుంచి, హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. బొటాస్ (విలియమ్స్), 4. గ్రోస్యెన్ (లోటస్), 5. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. మసా (విలియమ్స్), 8. మల్డొనాడో (లోటస్), 9. వెటెల్ (ఫెరారీ), 10. సెయింజ్ (ఎస్టీఆర్), 11. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 12. క్వియాట్ (రెడ్‌బుల్), 13. ఎరిక్సన్ (సాబెర్), 14. రైకోనెన్ (ఫెరారీ), 15. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 16. నాసర్ (సాబెర్), 17. బటన్ (మెక్లారెన్), 18. అలోన్సో (మెక్లారెన్), 19. స్టీవెన్స్ (మనోర్), 20. మెర్హీ (మనోర్). -
హీరోలేనా..? నేనూ చేస్తా!
‘‘ఏం... సినిమాల్లో ఫైట్లు హీరోలే చేయాలా? నేనూ చేస్తా’’ అని అంటున్నారు కథానాయిక సోనాక్షీ సిన్హా. మొన్నటి వరకూ గ్లామర్ పాత్రల మీద దృష్టి పెట్టిన సోనాక్షి ఇప్పుడు యాక్షన్ చిత్రాలకు కూడా సై అంటున్నారు. వాటిలో ‘అకీరా’ ఒకటి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయట. దాని కోసం సోనాక్షీ సిన్హా ఓ పక్క మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటూనే, చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఇదిలా ఉండగానే, జాన్ అబ్రహమ్ హీరోగా నటించనున్న ‘ఫోర్స్-2’ చిత్రంలో కూడా ఎఫ్‌బీఐ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారామె. ఈ చిత్రంలో కూడా సోనాక్షీకి కొన్ని యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇలా వరుసగా యాక్షన్ పాత్రలు చేస్తున్నందుకు ఈ ముంబయ్ బ్యూటీ ఉబ్బితబ్బిబవుతున్నారు. -
‘రా’ ఏజెంట్...సోనాక్షీ సిన్హా
గూఢచారి పాత్రల్లో ఇంతవరకు ఎక్కువగా హీరోల హవానే కొనసాగింది. అయితే, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా గూఢచారి పాత్రలో త్వరలోనే తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం ‘అకిరా’ సినిమా షూటింగ్లో ఉన్న సోనాక్షి, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ‘ఫోర్స్-2’లో ‘రా’ ఏజెంట్‌గా నటించనున్నారు. ‘ఫోర్స్’ చిత్ర దర్శకుడు అభినయ్ దేవ్, దానికి సీక్వెల్‌గా ‘ఫోర్స్-2’ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఫోర్స్-2’లో ‘రా’ ఏజెంట్‌గా నటించనున్నాననీ, ఈ పాత్ర కోసం ఎదురుచూస్తున్నాననీ సోనాక్షి వెల్లడించారు. -
సోనాక్షి వచ్చిందోచ్!
గాసిప్ నాలుగు సంవత్సరాల క్రితం జాన్ అబ్రహాం హీరోగా నటించిన ‘ఫోర్స్’ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కాక్కా కాక్కా’ సినిమాకు రిమేక్. ‘ఫోర్స్’లో జెనీలియా డిసౌజా జాన్ సరసన నటించింది. ‘ఫోర్స్-2’కు మాత్రం డెరైక్టర్, హీరోయిన్లు మారారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కోసం చాలామంది హీరోయిన్లను సంప్రదించారు దర్శక,నిర్మాతలు. రకరకాల కారణాలతో ఎవరూ ఒకే కాలేదు. ‘ఫోర్స్-2’లో కత్రినా కైఫ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని కత్రినా ఖండించారు. ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి పెంచడానికే ‘ఫోర్స్-2’ మేకర్స్ వ్యూహాత్మకంగా కత్రినా కైఫ్ పేరును ప్రచారంలో పెట్టారని కొందరు అంటారు. మరికొందరి కథనం ప్రకారం... భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ‘ఫోర్-2’లో నటించడానికి కత్రినా ఒప్పుకుందట. తీరా స్క్రిప్ట్ పూర్తిగా విన్న తరువాత నీరుగారి పోయిందట. దీనికి కారణం జాన్ అబ్రహం పాత్రతో పోల్చితే, తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనట. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడానికి దర్శక,నిర్మాతలు ఒప్పుకున్నా హీరోగారు మాత్రం ససేమిరా అన్నాడట. దీంతో కత్రినా ఆ సినిమా నుంచి తప్పుకుందట. జాన్ సరసన జోడిగా ఇప్పుడు సోనాక్షి సిన్హా ‘ఫోర్స్-2’లో నటించనుంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. తాను స్క్రిప్ట్‌లో సూచించిన చిన్న చిన్న మార్పులకు ఒప్పుకున్న తరువాతే సోనాక్షి ‘ఫోర్స్-2’ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే మాట కూడా వినబడుతోంది. అంటే, కండల కథనాయకుడు జాన్‌లాగే సోనాక్షి కూడా డిష్యుం డిష్యుం ఫైట్లు ఏమైనా చేయనుందా? వేచి చూడాలి మరి! -
ఏజెన్సీలో అలజడి.!
- వాడుకలోకి వస్తున్న మరో కొత్ పేరు - ఏవోబీకి ప్రత్యామ్నాయం - కార్యదర్శిగా వేణు - ప్రశాంతంగా నిసరన, బంద్ సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పేర వినగానే ముందుగా గుర్తుకొచ్చేది మావోయిస్టులే..ఇప్పుడక్కడ కొత్తగా మల్కన్‌గిరి-విశాఖ-కోరాపుట్(ఎంవీకే) అనే మరో పేరుతో దళసభ్యుల అలజడి రేగుతోంది. వారి ప్రాబల్యం పెరుగుతోందనే సంకేతాలతో పోలీసు వర్గాల్లో కలకలం చోటుచేసుకుంటోంది. ఇటీవల వరుసగా మావోయిస్టు నేతలు, మిలీషియా సభ్యుల లొంగుబాట్లతో సంబరపడుతున్న అధికారులకు సరిహద్దులో కొత్త పేరు పుట్టుకురావడం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా, వారు పూర్తి ఆధిపత్యం సాధించిన కీలక ప్రదేశంగా పిలవబడే ఏవోబీకి ప్రత్యామ్నాయంగా ఇటీవల ఎంవీకే పేరు విశాఖ మన్యంలో వినిపిస్తోంది. ఈ ప్రాంతానికి ఎంవీకే కార్యదర్శిగా వేణు అనే ఉద్యమ నేతను కేంద్ర కమిటీ నియమించినట్లు సమాచారం. ఇటీవల అతని పేరుమీద ఏజెన్సీలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. దీంతో కొత్తగా ఏదో జరుగుతోందనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏజెన్సీలో మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి చురుగ్గా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు నంబల్ల కేశవరావు అలియాస్ గంగన్న ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లారు. మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియాస్ రవి, సరిత, ఆజాద్, ఆనంద్‌లు కొద్ది రోజుల క్రితమే వేసవి పండుగల్లో ఏజెన్సీ గిరిజనులతో సమావేశాలు నిర్వహించారనే సమాచారం పోలీసుల వద్ద ఉంది. తాజాగా వినిపిస్తున్న వేణుపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు గత నెల 20న ముంచంగిపుట్టు మండలంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందడండంతో ఆగ్రహం చెందిన దళసభ్యులు గత నెల 24న ఓ పొక్లెయిన్ర్ను తగులబెట్టారు. అంతటితో శాంతించకుండా మన్యంలో ఈ నెల ఒకటవ తేదీ నుంచి నిరసన వారాని, సోమ, మంగళవారాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. రెండు రోజుల బంద్ ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసింది. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ పలు సర్వీసులను నిలిపివేసింది. రెండు రోజుల క్రితం జీకే వీధి మండలం కుంకుంపూడిలో అమరవీరుల స్థూపాన్ని అన్నలు ఆవిష్కరించారు. తాజా పరిణామలతో పోలీసు ప్రత్యేక బలగాలు అడవిలో అణువణువూ జల్లెడపడుతున్నాయి. ఘాట్ రోడ్లపై విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నారు. మిలీషియా సభ్యుల కదలికలపై నిఘా ఉంచారు. పేరు మార్పుపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. -
బిగ్ బి...ద సూపర్‌హీరో!
‘పీకు’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు సూపర్ హీరో అవతారం ఎత్తారు. 72 ఏళ్ల వయసులో సూపర్‌హీరో పాత్ర ఏంటంటారా! బుల్లితెరపై రానున్న ఓ యానిమేటేడ్ సిరీస్ కోసం అమితాబ్ రూపురేఖల్లో సూపర్ హీరో పాత్ర ఉంటుంది. అంతరిక్షంలో జరిగిన యుద్ధంలో గాయపడి భూమ్మీదకు వచ్చేసిన అస్త్ర అనే సూపర్‌హీరో అది. ‘అస్త్ర ఫోర్స్’గా డిస్నీ చానల్లో 2017 నుంచి ఈ టీవీ సిరీస్ ప్రసారం కానుంది. -
హామిల్టన్ హవా
చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో విజయం ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ షాంఘై: ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో రెండో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 39 నిమిషాల 42.008 సెకన్లలో పూర్తి చేశాడు. ‘పోల్ పొజిషన్’తో రేసు మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ ఆద్యంతం ఆధిక్యంలో ఉన్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ ఎదురైంది. సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో నెగ్గిన హామిల్టన్, మలేసియా గ్రాండ్‌ప్రిలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో మూడుసార్లు చైనా గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గిన హామిల్టన్‌కు ఈ ఏడాదీ అం తగా పోటీ ఎదురుకాలేదు. తొలి ల్యాప్ నుంచే ఆధిక్యం లోకి వెళ్లిన అతనికి చివరి దశలో సహచరుడు రోస్‌బర్గ్ నుంచి సవాలు ఎదురైంది. అయితే 7 సెకన్ల ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా గమ్యానికి చేరాడు. -
కస్టమైజ్డ్ వాహనాలకు డిమాండ్..
- ఫోర్స్ మోటార్స్ ప్రెసిడెంట్ అశుతోష్ ఖోస్లా - హైదరాబాద్ మార్కెట్లోకి కొత్త మోడల్ బస్‌లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వాహనాల డిజైన్‌ను కస్టమైజ్ చేస్తున్నట్టు ఫోర్స్ మోటార్స్ తెలిపింది. వాహన కంపెనీలకు ఈ-సెల్లింగ్ కొత్త వేదికైందని ఫోర్స్ మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగం సేల్స్, మార్కెటింగ్ ప్రెసిడెంట్ అశుతోష్ ఖోస్లా తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం కొత్త బస్‌లను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫర్నిచర్, ఆహారోత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి విక్రయాల్లో ఉన్న ఆన్లైన్ కంపెనీలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు అవసరమవుతాయని చెప్పారు. కంపెనీ అమ్మకాల్లో ఈ విభాగం వాటా ప్రస్తుతం 5 శాతముందని, నూతన డిజైన్ల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. సైనిక దళాలకు అంబులెన్సులను కంపెనీ ఇప్పటికే సరఫరా చేస్తోంది. సైనికుల ప్రయాణానికి అనువైన వాహనాలనూ డిజైన్ చేయగలమన్నారు. చైల్డ్ బస్ ట్రాకర్.. ఫోర్స్ మోటార్స్ 13 సీట్ల ట్రాక్స్ క్రూయిజర్ నుంచి 26 సీట్ల ట్రావెలర్-26 మోడల్స్ వరకు చైల్డ్ బస్ ట్రాకర్ ఫీచర్‌ను పొందుపరిచింది. విద్యార్థి స్కూల్ వాహనంలో ఎక్కింది మొదలు ఇంటికి చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాక్ చేసి సమాచారాన్ని పాఠశాలకు, ఆపరేటర్‌కు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. నిర్దేశించినట్టు కాకుండా వేరే మార్గంలో బస్ వెళ్లినా అలర్ట్ చేస్తుంది. లైవ్ వీడియో చూసేందుకు కెమెరాలూ ఉంటాయి. ఎక్స్ షోరూంలో వాహనాల ధర రూ.6.34 లక్షల నుంచి ప్రారంభం. కాగా, 9-20 సీట్ల విభాగం వాహనాలు 3 శాతం వృద్ధితో ఏటా దేశంలో 18,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. 22 శాతం వృద్ధితో 61 శాతం వాటాను ఫోర్స్ దక్కించుకుంది. 26 సీట్ల వాహనాలు ఏటా 10 వేలు అమ్ముడవుతున్నాయి. కంపెనీ 61 శాతం వృద్ధితో 12 శాతం వాటా చేజిక్కించుకుంది. 2014-15లో మొత్తం 23,000 యూనిట్ల విక్రయాలు లక్ష్యంగా చేసుకుంది. -
తూర్పు కనుమల్లో ఎర్రదండు
- జైళ్లలో ఉన్న ఆదివాసీలను విడుదల చేయాలి - మావోయిస్టు పార్టీ డిమాండ్ - దుర్గం అటవీప్రాంతంలో భారీ బహిరంగసభ నిర్వహణ మల్కన్‌గిరి(ఒడిశా): ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లోని జైళ్లలో మగ్గుతున్న అమాయకులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ విశాఖ జిల్లా కోరుకొండ దళ కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల పోలీసులు మావోయిస్టులన్న సాకుతో ఆమాయక గిరిజనులను అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. జైళ్లలో బందీలుగా ఉన్న ఆదివాసీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13 నుంచి 19 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) జోన్ పరిధిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్‌గిరి జిల్లా కుడుముల గుమ్మ సమితి రల్లెగెడ్డ పంచాయతీ పరిధిలోని దుర్గం అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. అటవీ ప్రాంతంలో భారీ బ్యానర్లు కట్టారు. చుట్టుపక్కల అటవీ గ్రామాల నుంచి మావోయిస్టు సానుభూతిపరులతోపాటు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలివచ్చారు. జననాట్యమండలి కళాకారులు పలు ప్రదర్శనలు చేశారు. విప్లవ గీతాలను ఆలపించారు. ఈ సభలో మాట్లాడిన విజయలక్ష్మితోపాటు పలువురు నాయకులు రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల పేరుతో అమాయకులను అరెస్టు చేసి జైళ్లలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపుట్, గజపతి జిల్లాలకు చెందిన వందలాదిమంది ఆదివాసీలు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. సంపాదించే వ్యక్తి జైలు పాలు కావడంతో వారి కుటుంబాలన్నీ ఆకలితో అలమటిస్తున్నాయన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి కృష్ణబిలాల ఆధారం
విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి తరంగాలు విడుదలవుతుంటాయని సాపేక్ష సిద్ధాంతంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రతిపాదనకు బలం చేకూర్చే ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాంతితో సహా విశ్వంలోని అన్ని రకాల పదార్థాలనూ హాంఫట్ చేసేసే కృష్ణబిలాలు సాధారణంగా అన్ని గెలాక్సీల కేంద్రాల్లోనూ ఉన్నా.. చాలావరకూ ఒక భారీ కృష్ణబిలం(సూపర్ మ్యాసివ్ బ్లాక్‌హోల్) మాత్రమే ఉంటుందని ఇదివరకూ గుర్తించారు. కానీ.. 400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఓ గెలాక్సీ కేంద్రంలో మూడు భారీ కృష్ణబిలాలు అతిదగ్గరగా పరస్పరం బంధించబడి ఉన్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ కృష్ణబిలాలు మన సూర్యుడి కన్నా.. 10 లక్షల నుంచి 1,000 కోట్ల రె ట్ల ద్రవ్యరాశితో ఉండవచ్చట. వీటిలో రెండు కృష్ణబిలాలు చాలా దగ్గరగా 500 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉండటమే కాకుండా, అవి ఒకదాని చుట్టూ ఒకటి ధ్వనివేగానికి 300 రెట్ల వేగంతో తిరుగుతున్నాయట. అందువల్ల వీటి నుంచి వెలువడుతున్న గురుత్వాకర్షణ శక్తి అలల మాదిరిగా అంతరిక్షంలోకి విడుదలవుతోందట. అలాగే దూరంగా ఉండటం వల్ల మరో బ్లాక్‌హోల్ నుంచి సరళరేఖ మాదిరిగా శక్తి తరంగాలు వెలువడుతున్నాయట. ఐన్‌స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణకు ఈ కృష్ణబిలాలపై అధ్యయనం బాగా దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
మళ్లీ హామిల్టన్‌దే పోల్
* రెండో స్థానంలో రోస్‌బర్గ్ * నేడు స్పానిష్ గ్రాండ్ ప్రి బార్సిలోనా: ఈ సీజన్ ఫార్ములా వన్‌లో జోరు మీదున్న లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) స్పానిష్ గ్రాండ్ ప్రిలోనూ సత్తా చాటాడు. శనివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అతను మొదటి స్థానంలో నిలిచాడు. ఈ బ్రిటన్ డ్రైవర్ 1 నిమిషం 25.232 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేస్‌ను అతను ‘పోల్ పొజిషన్’నుంచి ప్రారంభిస్తాడు. ఈ ఏడాది ఐదు అర్హత రేస్‌లలో నాలుగో సారి తొలి స్థానంలో నిలిచిన హామిల్టన్ కెరీర్లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ రేస్‌లో హామిల్టన్ సహచర మెర్సిడెస్ డ్రైవర్, జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ (1 ని. 25.400 సె.) రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో (1 ని. 26.285 సె.)కు మూడో స్థానం నుంచి రేస్ ప్రారంభిస్తాడు. టాప్-10లో ‘ ఫోర్స్’కు దక్కని చోటు: ఈ ఏడాది తొలి నాలుగు అర్హత రేస్లలోనూ టాప్-10 నిలిచిన ఫోర్స్ ఇండియా స్పానిష్ రేసులో మాత్రం విఫలమైంది. సెకనులో పదో వంతు తేడాతో వెనుబడి ఫోర్స్ డ్రైవర్ హల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలవంగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానంతో సరి పెట్టుకున్నాడు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకు పేట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఉగ్రవాదుల కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు నడుం బిగించింది. నగర శివారు ప్రాంతమైన గోరేగావ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 94 ఎకరాల స్థలంలో ‘ప్రత్యేక కమాండో శిక్షణ కేంద్రం’ నెలకొల్పనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదన హోం శాఖ రూపొందిం చింది. మంజూరు కోసం త్వరలో కేబినెట్ ఎదుట ప్రవేశపెట్టనుంది. మొన్నటివరకు ఉగ్రవాదుల కార్యకలాపాలు కేవలం ముంబై, పుణే వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర నలుమూలలు, పల్లెలు, కుగ్రామాల్లో సైతం ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించాయి. వీటిని దీటుగా అడ్డుకోవాలంటే చురుకుగా పనిచేసే యువకులను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫోర్స్-వన్ కమాండో లు విధినిర్వాహణలో ఉన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి పోర్స్-వన్‌లోకి పంపిస్తున్నారు. కాని విస్తరించిన ఉగ్రవాదుల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని కమాండోల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ప్రత్యేకంగా కమాండోల శిక్షణ కేంద్రం నెలకొల్పాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ కమాండర్లను ఎంపిక చేసే ప్రక్రియను హోం శాఖ చేపట్టింది. ఈ శిక్షణ కేంద్రంలో సైన్యం, వాయు, నేవీ ఇలా త్రిదళాలతోపాటు నేషనల్ సెక్యురిటీ గార్డు (ఎన్ఎస్జీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఏ) నిపుణులు మార్గదర్శనం చేస్తారు. ఇదివరకు పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లతోపాటు కొత్తగా భర్తీ అయిన కమాండోలకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా ఉగ్రవాద సంస్థలు తమ దాడుల పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. వారి ఆలోచనా సరళిని ప్రస్తుతం విధినిర్వహణలో ఉన్న కమాండోలకు వాటిని ఎదుర్కోవడం కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కమాండోలకు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు నగరంపై దాడులు జరిపినప్పుడు వాటిని ఎదుర్కునేందుకు ముంబై పోలీసులు ఎన్ఎస్జీ సాయం తీసుకోవల్సి వచ్చింది. వారితో రెండు రోజులపాటు పోరాడి 10 మంది ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ మినహా మిగతా తొమ్మిది మందిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఉగ్రవాదులు అత్యధునిక ఆయుధాలు వినియోగించారు. ఊహించనిరీతిలో లేదా ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఆకస్మాత్తుగా జరిగే ఎలాంటి విపత్తులైన సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన శిక్షణను కమాండోలకు ఈ కేంద్రంలో ఇవ్వనున్నారు.