సోనాక్షి వచ్చిందోచ్! | Sonakshi came again | Sakshi
Sakshi News home page

సోనాక్షి వచ్చిందోచ్!

Published Sat, Jul 11 2015 11:37 PM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM

సోనాక్షి వచ్చిందోచ్! - Sakshi

సోనాక్షి వచ్చిందోచ్!

గాసిప్
నాలుగు సంవత్సరాల క్రితం జాన్ అబ్రహాం హీరోగా నటించిన ‘ఫోర్స్’ సినిమా  మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్  తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కాక్కా కాక్కా’ సినిమాకు రిమేక్. ‘ఫోర్స్’లో జెనీలియా డిసౌజా జాన్ సరసన నటించింది. ‘ఫోర్స్-2’కు మాత్రం డెరైక్టర్, హీరోయిన్‌లు మారారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
 
సినిమా కోసం  చాలామంది హీరోయిన్‌లను సంప్రదించారు దర్శక,నిర్మాతలు. రకరకాల కారణాలతో ఎవరూ ఒకే కాలేదు. ‘ఫోర్స్-2’లో  కత్రినా కైఫ్  నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని కత్రినా ఖండించారు. ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి పెంచడానికే ‘ఫోర్స్-2’ మేకర్స్ వ్యూహాత్మకంగా  కత్రినా కైఫ్ పేరును ప్రచారంలో పెట్టారని కొందరు అంటారు. మరికొందరి కథనం ప్రకారం... భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ‘ఫోర్-2’లో నటించడానికి కత్రినా ఒప్పుకుందట. తీరా స్క్రిప్ట్ పూర్తిగా విన్న తరువాత నీరుగారి పోయిందట.
 
దీనికి కారణం జాన్ అబ్రహం పాత్రతో పోల్చితే, తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనట.
స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడానికి దర్శక,నిర్మాతలు ఒప్పుకున్నా హీరోగారు మాత్రం ససేమిరా అన్నాడట. దీంతో కత్రినా ఆ సినిమా నుంచి తప్పుకుందట.

జాన్ సరసన జోడిగా ఇప్పుడు సోనాక్షి సిన్హా ‘ఫోర్స్-2’లో నటించనుంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. తాను  స్క్రిప్ట్‌లో సూచించిన  చిన్న చిన్న మార్పులకు ఒప్పుకున్న తరువాతే సోనాక్షి ‘ఫోర్స్-2’ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే మాట కూడా వినబడుతోంది. అంటే, కండల కథనాయకుడు జాన్‌లాగే సోనాక్షి కూడా డిష్యుం డిష్యుం ఫైట్లు ఏమైనా చేయనుందా? వేచి చూడాలి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement