హీరోకు గాయాలు.. సర్జరీ! | John Abraham injured, undergoes surgery | Sakshi
Sakshi News home page

హీరోకు గాయాలు.. సర్జరీ!

Published Fri, Oct 9 2015 4:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హీరోకు గాయాలు..  సర్జరీ! - Sakshi

హీరోకు గాయాలు.. సర్జరీ!

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంకు షూటింగ్లో గాయాలయ్యాయి.  దీంతో ఓ చిన్నపాటి సర్జరీ కూడా చేయించుకున్న ఆయన ప్రస్తుతం బెడ్రెస్ట్ తీసుకుంటున్నారు. అభినయ్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫోర్స్-2'  షూటింగ్లో భాగంగా జాన్ అబ్రహం హంగేరిలోని బుడాపెస్ట్లో ఉన్నారు. 50 రోజుల షెడ్యూల్లో భాగంగా యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండగా ఆయన మోకాలుకు తీవ్రంగా దెబ్బతగిలింది.

దీంతో ఆయన వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించి.. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించారు. ఆ వెంటనే షూటింగ్లో పాల్గొనేందుకు జాన్ అబ్రహం ఉత్సాహం కనబర్చినప్పటికీ, దర్శకుడు మాత్రం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గాయం పూర్తిగా తగ్గిన తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభిద్దామని చెప్పారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. జాన్ అబ్రహం 2011లో నటించిన 'ఫోర్స్' సినిమాకు సీక్వెల్గా 'ఫోర్స్-2' తెరకెక్కుతున్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement