బాలీవుడ్‌లో ఫిట్‌గా కనిపించే నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ హీరో డైట్‌లో పెద్ద మార్పు తీసుకొచ్చారట. నాన్‌వెజ్ (మాంసాహారం)ని మానేసి పూర్తి స్థాయి వెజిటేరియన్‌గా మారిపోయారట. ఆరోగ్యంగా ఉండటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. నాలుగు నెలల నుంచి వెజిటేరియన్ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకున్నారట అక్షయ్ కుమార్. ఆల్రెడీ జాన్ అబ్రహామ్, అనుష్కశర్మ వెజిటేరియన్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ‘కేసరి’ అనే పీరియాడికల్ చిత్రంలో నటించారు అక్షయ్‌కుమార్. 21 మంది సిక్కు జవాన్లు 10వేల మంది ఆఫ్ఘాన్ సైనికులను దేశంలోకి రానివ్వకుండా ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
Comments
Please login to add a commentAdd a comment