హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..? | genelia Reentry with force 2 | Sakshi
Sakshi News home page

హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..?

Published Sat, Nov 12 2016 10:50 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..? - Sakshi

హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..?

బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది.

2011లో రిలీజ్ అయిన ఫోర్స్ సినిమాతో ఆకట్టుకున్న జెనీలియా లాంగ్ గ్యాప్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ లో నటిస్తోంది. అయితే తొలి భాగం చివర్లో జెనీలియా పాత్ర చనిపోతుంది. మరి ఈ రెండు భాగంలో ఆమె పాత్రను ఎలా చూపిస్తారు. దెయ్యంగా వస్తుందా లేక.. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. సోనాక్షి సిన్మా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఫోర్స్ టు నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement