
ఎస్‍యూవీ, ఎంపీవీ, హ్యాచ్‌బ్యాక్, కూపే, సెడాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో ఆఫ్-రోడర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల 5 డోర్ థార్ (థార్ రాక్స్) లాంచ్ చేసింది. అయితే ఈ విభాగంలో ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా కూడా ఇప్పటికే అమ్మకానికి ఉంది. ఈ రెండు కార్లు ఒకే విభాగానికి చెందినవి కావడం వల్ల, కొనుగోలుదారులు ఏ కారు ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉందనే విషయంలో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కార్ల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..
ధరలు
మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన థార్ రాక్స్ ప్రారంభ ధరలు రూ.12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఫోర్స్ గూర్ఖా 5 డోర్ ప్రారంభ ధర రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ మీద, నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది.

డిజైన్
థార్ రాక్స్, ఫోర్స్ గూర్ఖా రెండూ కూడా ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ టాప్ ఆప్షన్స్ కలిగిన ఈ ఆఫ్-రోడర్స్ 5 డోర్స్ పొందుతాయి. థార్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. గూర్ఖా కఠినమైన లేదా దృఢమైన డిజైన్ పొందుతుంది. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ ఆకర్షణీయంగా ఉంటాయు.
ఫీచర్స్
మహీంద్రా థార్ రాక్స్ 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లేలను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, న్యావిగేషన్, హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.

ఫోర్స్ గూర్ఖా 5 డోర్ మోడల్ 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఏసీ వెంట్స్, వన్-టచ్ అప్/డౌన్ విండో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
ఇంజిన్ వివరాలు
మహీంద్రా థార్ రాక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ పొందుతుంది. ఫోర్స్ గూర్ఖా కేవలం ఒకే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?
మహీంద్రా థార్ రాక్స్ లాంగ్ జర్నీ చేయడానికి, నగర ప్రయాణానికి, కఠినమైన భూభాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఫోర్స్ గూర్ఖా కఠినమైన రహదారుల్లో కూడా హుందాగా ముందుకు వెళ్తుంది. ధర పరంగా గూర్ఖా 5 డోర్ కంటే కూడా థార్ రాక్స్ ధర చాలా తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment