
వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో రూ. 1.02 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. అయితే ఇది కేవలం ఒక వేరియంట్‌లో.. పెట్రోల్ పవర్‌తో మాత్రమే లభిస్తుంది. డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.
కొత్త వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్.. ఆరు రంగులలో, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 11.3 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, పవర్డ్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.
వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 250 Bhp పవర్, 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ గ్రాండ్ చెరోకీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇదీ చదవండి: అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment