
బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో.. 'సీ 400 జీటీ' స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్, దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25000 ఎక్కువ. దీంతో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో ఇది ఒకటిగా చేరింది.
బీఎండబ్ల్యూ సీ 400 జీటీ స్కూటర్.. సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని 350 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 rpm వద్ద 34 Bhp పవర్, 5750 rpm వద్ద 35 Nm టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్ట్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన ఏబీఎస్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లను పొందుతుంది.
సీ 400 జీటీ స్కూటర్.. పెద్ద విండ్‌షీల్డ్ పొందుతుంది. ఇది బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, డైమండ్ వైట్ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంది. ఇది హై రిజల్యూషన్ ఇంటర్‌ఫేస్‌తో నావిగేషన్, మీడియా అండ్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటిని మెరుగుపరుస్తుంది. అండర్ సీట్ కంపార్ట్‌మెంట్ 37.6 లీటర్లు. కాబట్టి ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment