ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.
ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్‌లు, స్కూటర్‌లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment