
దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికీ 'ఇయర్ ఎండ్ 2023' ఆఫర్స్ కింది అద్భుతమైన డిస్కౌంట్స్ అందించాయి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా దాదాపు ఈ రోజుతో ముగియనున్నాయి. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో 2024 జనవరి 1 నుంచే వాహనాల ధరలు పెరుగుతాయని ఇప్పటికే చాలా సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఇందులో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు ఉన్నాయి.
ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే తెలిపాయి. దీని ప్రకారం ధరల పెరుగుదల 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలు లేదా కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు 0.8 శాతం ధరలను ఏప్రిల్ నెలలో పెంచాయి. కాగా ఇప్పుడు మరో సారి పెంచడానికి సన్నద్ధమైపోయాయి.
ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్
ప్యాసింజర్ కార్ల ధరలు మాత్రమే కాకుండా.. లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గుతాయా? లేదా కార్ల విక్రయాను పెంచడానికి కంపెనీలు ఏమైనా వారంటీలు వంటివి అందిస్తాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.