జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) 2023 ప్రారంభంలో ఎక్స్1 లగ్జరీ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన కేవలం మూడు నెలలకే కంపెనీ ఈ మోడల్ ధరలను భారీగా పెంచేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త ధరలు:
2023 బీఎండబ్ల్యూ ఎక్స్1 డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు డీజిల్ వేరియంట్ ధరలు రూ. 3 లక్షల వరకు పెంచింది. కావున X1 sDrive 18d M Sport ధర రూ. 50.90 లక్షలు. ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 47.50 లక్షలు. ఇక పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, sDrive 18i xLine ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. కావున ఇది రూ. 45.90 లక్షలకే అందుబాటులో ఉంది.
ఇప్పటికే ఈ కార్లను బుక్ చేసుకున్న వారికి కొద్ద ధరలు వర్తించవు. రానున్న రోజుల్లో బీఎండబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ మోడల్ కొనాలనుకునేవారు ఈ కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
డిజైన్:
దేశీయ మార్కెట్లో 2023 BMW X1 దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. ముందు భాగంలో గ్రిల్ కొంత పెద్దదిగా ఉంటుంది. బంపర్ బ్రష్డ్ సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అట్రాక్టివ్ హెడ్‌ల్యాంప్, ఇన్‌వర్టెడ్ ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక LED టెయిల్ ల్యాంప్ వంటివి ఉంటాయి.
(ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్‍ప్లస్ ట్యాబ్ ధరలు లీక్.. ఎంతో తెలుసా?)
ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్:
కొత్త ఎక్స్1 ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే చూడచక్కగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్‌లు, కొన్ని ఫిజికల్ బటన్స్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్ల వరకు ఉంటుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.70 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, ADAS టెక్నాలజీ ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..)
ఇంజిన్ & పర్ఫామెన్స్:
కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 136 హెచ్‌పి పవర్, 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 150 హెచ్‌పి పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.
BMW X1 పెట్రోల్ వెర్షన్ కేవలం 9.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, డీజిల్ ఇంజిన్ కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.03 కిమీ మైలేజ్ అందిస్తే, డీజిల్ ఇంజిన్ లీటరుకు 19.23 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ప్రత్యర్థులు:
కొత్త 2023 ఎక్స్1 దేశీయ విఫణిలో మెర్సిడెస్ బెంజ్ GLA, ఆడి క్యూ3, మినీ కంట్రీమ్యాన్, వోల్వో ఎక్స్‌సి 40 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment