BMW Z4 Facelift: భారతదేశంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఖరీదైన కొత్త 'జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' కారుని విడుదల చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఈ ఖరీదైన కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & డెలివరీ
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' (BMW Z4 Roadster Facelift) ధర రూ. 89.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిజైన్
బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌తో ఇరువైపులా రీడిజైన్ చేసిన ట్రయాంగిల్ ఎయిర్ ఇన్‌టేక్స్, హెడ్‌ల్యాంప్, హనీకూంబ్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ వంటి వాటితో పాటి సైడ్ ప్రొఫైల్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, వెనుక వైపు దాదాపు దాని అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులోని ఫాబ్రిక్ రూఫ్-టాప్ కేవలం 10 సెకన్లలో ఓపెన్ అవుతుంది లేదా క్లోజ్ అవుతుంది.
(ఇదీ చదవండి: ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ & డెలివరీ వివరాలు)
ఫీచర్స్
ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఐడ్రైవ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ డ్రైవర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్, డ్యూయల్ జోన్ ఏసీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, M స్పోర్ట్స్ సీట్లు, స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇది 2 డోర్స్ మోడల్.
(ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?)
ఇంజిన్
బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-సిక్స్ సిలిండర్ ఇంజన్ 340 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది మార్కెట్లో 'పోర్స్చే 718 బాక్స్‌స్టర్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
This is sportiness turned up to the maximum. The ultimate embodiment of sheer driving pleasure, the new BMW Z4 lets you feel hallmark BMW sporting prowess as you make statements of undeniable athleticism at every moment behind the wheel.#BMW #TheNewZ4 #MaximumOfSportiness… pic.twitter.com/2iVrABywH7
— BMW India (@bmwindia) May 25, 2023
Comments
Please login to add a commentAdd a comment