expensive costs
-
తారక్ చేతికున్న వాచ్ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Jr NTR Patek Philippe Watch: తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'జూనియర్ ఎన్టీఆర్' గురించి పరిచయమే అవసరం లేదు. మంచి నటనా నైపుణ్యంతో ప్రేక్షులకు హృదయాలను దోచుకున్న ఈ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు. ఇటీవల ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరైన జూ. ఎన్టీఆర్ సుమారు రూ. 2.45 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది 'పాటక్ ఫిలిప్' అనే స్విజర్ల్యాండ్ బ్రాండ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో జూ. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా మరో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీని ధర రూ. 1.56 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంకా ఈయన వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ఇక కార్ల విషయానికి వస్తే.. ఈయన వద్ద లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్, రేంజ్ రోవర్ రోగ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే మూవీ చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Jr NTR Universe ™ (@ntr.universe) -
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో జీ–క్లాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది. -
అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్
Reuben Singh: భారతీయులకు సహనం, పట్టుదల వంటివి చాలా ఎక్కువ. అయితే కోపంలో కూడా ఏ మాత్రం తీసిపోరు. దీనికి నిదర్శనమే లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త 'రూబెన్ సింగ్'. తన తలపాగాను అవమానించిన వారికి సరైన గుణపాఠం చెప్పడానికి ఏకంగా 15 కంటే ఎక్కువ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. ఇన్ని రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇతడే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. జీవితంలో ఒక్క రోల్స్ రాయిస్ కొంటే చాలు అనుకునే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, జీవితంలో ఒక్క సారైనా రోల్స్ రాయిస్ కార్లను ఎక్కాలి అని అందరికి ఉంటుంది. అలాంటిది ఎవరో హేళన చేసారని, తలపాగా విలువేంటో చూపించాలని ఇన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు రూబెన్ సింగ్. ఒక ఇంగ్లాండ్ వ్యక్తి తన తలపాగాను అవమానిస్తూ బ్యాండేజ్ అని ఎగతాళి చేసేవాడని, దానికి విసుగు చెందిన సింగ్ నా తలపాగా పవర్ ఏంటో చూపిస్తా అని తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కొనేసాడు. దెబ్బతో ఎగతాళి చేసినవాడు నివ్వెరపోయాడు. ప్రస్తుతం అతని వద్ద 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. రూబెన్ సింగ్ ఎవరు? బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ వ్యక్తికి తనకి జరిగిన ఒక పందెంలో ఎవరు ఓడిపోతే వారు స్వచ్చంద సంస్థకు విరాళంగా డబ్బు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. సిక్కు మతానికి చెందిన రూబెన్ వారానికి తాను ధరించే తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. రోల్స్ రాయిస్ కార్లతో వరం రోజులు తానూ ధరించే తలపాగా రంగుని బట్టి దిగిన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు
BMW Z4 Facelift: భారతదేశంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఖరీదైన కొత్త 'జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' కారుని విడుదల చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఈ ఖరీదైన కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & డెలివరీ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' (BMW Z4 Roadster Facelift) ధర రూ. 89.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌తో ఇరువైపులా రీడిజైన్ చేసిన ట్రయాంగిల్ ఎయిర్ ఇన్టేక్స్, హెడ్‌ల్యాంప్, హనీకూంబ్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ వంటి వాటితో పాటి సైడ్ ప్రొఫైల్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, వెనుక వైపు దాదాపు దాని అవుట్గోయింగ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులోని ఫాబ్రిక్ రూఫ్-టాప్ కేవలం 10 సెకన్లలో ఓపెన్ అవుతుంది లేదా క్లోజ్ అవుతుంది. (ఇదీ చదవండి: ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ & డెలివరీ వివరాలు) ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఐడ్రైవ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ డ్రైవర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్, డ్యూయల్ జోన్ ఏసీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, M స్పోర్ట్స్ సీట్లు, స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇది 2 డోర్స్ మోడల్. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) ఇంజిన్ బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ ఇంజన్ 340 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది మార్కెట్లో 'పోర్స్చే 718 బాక్స్‌స్టర్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. This is sportiness turned up to the maximum. The ultimate embodiment of sheer driving pleasure, the new BMW Z4 lets you feel hallmark BMW sporting prowess as you make statements of undeniable athleticism at every moment behind the wheel.#BMW #TheNewZ4 #MaximumOfSportiness… pic.twitter.com/2iVrABywH7 — BMW India (@bmwindia) May 25, 2023 -
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
అనంత్ అంబానీ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే గుడ్లు తేలేస్తారు!
ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇటీవల 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ప్రారంభోత్సవ వేడుకలు ప్రారభించారు. ఇందులో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తనకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి కనిపించారు. ఈ వేడుకల్లో రాధిక మర్చంట్ ఖరీదైన హ్యాండ్ బ్యాగు మాత్రమే కాకుండా.. వారు ధరించిన ఖరీదైన దుస్తులు, ఇతర వస్తువులు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వీటితో పాటు అనంత్ అంబానీ ధరించిన వాచ్ (Watch) చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీని ధర సుమారు రూ. 18 కోట్లు వరకు ఉండటం గమనార్హం. ఇది అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. పాటెక్ ఫిలిప్ కంపెనీ తయారు చేసిన ఈ వాచ్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయని, ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన చేతి గడియారాల్లో ఇది చాలా ప్రత్యేకమైందని 'ద ఇండియన్ టెక్నాలజీ' ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించారు. ఈ వాచ్‌కి రివర్సిబుల్ మెకానిజం, రెండు ఇండిపెండెంట్ డయల్స్, ఎంచుకున్న సమయానికి ప్రత్యేక శబ్దంతో అలర్ట్ చేసే అలారం, డేట్ రిపీటర్, మాన్యువల్ ఆపరేటర్ వంటి దాదాపు ఇరవై కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని సమాచారం. వైట్ గోల్డ్ కలర్లో ఫ్రంట్, బ్యాక్ డయల్స్ కలిగిన ఈ ఖరీదైన వాచ్ ఎలిగేటర్ లెదర్, చేతితో కుట్టిన క్లాస్ప్‌తో గోల్డ్ డయల్ ప్లేట్లతో అలంకరించబడి చూడచక్కగా ఉంటుంది. ఈ ప్రారంభ కార్యక్రంలో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన
తెనాలి టౌన్: సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా నిత్యావసర ధరలు అధికంగా పెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించాలని చిరు వ్యాపారులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సీపీఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు తెలిపారు. అధిక ధరలకు నిరసనగా బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. సింగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.నాగేశ్వరరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, డాక్టర్ శశికిరణ్, సుభానీ,మస్తాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.