Anant Ambani's Patek Philippe Luxury Watch Worth Rs 18 Crore - Sakshi
Sakshi News home page

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ స్పెషలేంటో తెలుసా? ఎన్ని ​కోట్లు ఉంటుందంటే?

Apr 6 2023 4:04 PM | Updated on Apr 6 2023 4:36 PM

Anant ambani rs 18 crore watch details - Sakshi

ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇటీవల 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ప్రారంభోత్సవ వేడుకలు ప్రారభించారు.  ఇందులో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తనకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి కనిపించారు.

ఈ వేడుకల్లో రాధిక మర్చంట్‌ ఖరీదైన హ్యాండ్ బ్యాగు మాత్రమే కాకుండా.. వారు ధరించిన ఖరీదైన దుస్తులు, ఇతర వస్తువులు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వీటితో పాటు అనంత్ అంబానీ ధరించిన వాచ్ (Watch) చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీని ధర సుమారు రూ. 18 కోట్లు వరకు ఉండటం గమనార్హం. ఇది అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది.

పాటెక్ ఫిలిప్ కంపెనీ తయారు చేసిన ఈ వాచ్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయని, ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన చేతి గడియారాల్లో ఇది చాలా ప్రత్యేకమైందని 'ద ఇండియన్ టెక్నాలజీ' ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వెల్లడించారు. ఈ వాచ్‌కి రివర్సిబుల్ మెకానిజం, రెండు ఇండిపెండెంట్ డయల్స్, ఎంచుకున్న సమయానికి ప్రత్యేక శబ్దంతో అలర్ట్ చేసే అలారం, డేట్ రిపీటర్, మాన్యువల్ ఆపరేటర్ వంటి దాదాపు ఇరవై కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని సమాచారం.

వైట్ గోల్డ్ కలర్‌లో ఫ్రంట్, బ్యాక్ డయల్స్ కలిగిన ఈ ఖరీదైన వాచ్‌ ఎలిగేటర్ లెదర్, చేతితో కుట్టిన క్లాస్ప్‌తో గోల్డ్ డయల్ ప్లేట్‌లతో అలంకరించబడి చూడచక్కగా ఉంటుంది. ఈ ప్రారంభ కార్యక్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement