Reuben Singh: భారతీయులకు సహనం, పట్టుదల వంటివి చాలా ఎక్కువ. అయితే కోపంలో కూడా ఏ మాత్రం తీసిపోరు. దీనికి నిదర్శనమే లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త 'రూబెన్ సింగ్'. తన తలపాగాను అవమానించిన వారికి సరైన గుణపాఠం చెప్పడానికి ఏకంగా 15 కంటే ఎక్కువ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. ఇన్ని రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇతడే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.
జీవితంలో ఒక్క రోల్స్ రాయిస్ కొంటే చాలు అనుకునే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, జీవితంలో ఒక్క సారైనా రోల్స్ రాయిస్ కార్లను ఎక్కాలి అని అందరికి ఉంటుంది. అలాంటిది ఎవరో హేళన చేసారని, తలపాగా విలువేంటో చూపించాలని ఇన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు రూబెన్ సింగ్.
ఒక ఇంగ్లాండ్ వ్యక్తి తన తలపాగాను అవమానిస్తూ బ్యాండేజ్ అని ఎగతాళి చేసేవాడని, దానికి విసుగు చెందిన సింగ్ నా తలపాగా పవర్ ఏంటో చూపిస్తా అని తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కొనేసాడు. దెబ్బతో ఎగతాళి చేసినవాడు నివ్వెరపోయాడు. ప్రస్తుతం అతని వద్ద 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం.
రూబెన్ సింగ్ ఎవరు?
బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ వ్యక్తికి తనకి జరిగిన ఒక పందెంలో ఎవరు ఓడిపోతే వారు స్వచ్చంద సంస్థకు విరాళంగా డబ్బు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. సిక్కు మతానికి చెందిన రూబెన్ వారానికి తాను ధరించే తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. రోల్స్ రాయిస్ కార్లతో వరం రోజులు తానూ ధరించే తలపాగా రంగుని బట్టి దిగిన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి.
(ఇదీ చదవండి: అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!)
తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment