ముఖేష్ అంబానీ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ.. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. అయితే వీరి వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు లెక్కకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ కారు రంగులు మార్చే 'రోల్స్ రాయిస్'.
రోల్స్ రాయిస్ కల్లినన్..
రంగులు మార్చే ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కనిపించింది. వీరి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైనదికి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీలైక్ఓమ్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లైతే పోర్స్చే 911 జీటీ3, టయోటా సుప్రా వంటి కార్లతో పాటు రోల్స్ రాయిస్ కారుని గమనించవచ్చు. ఇది దూరం నుంచి వైలెట్ కలర్ షేడ్‌లో కనిపిస్తుంది.. దగ్గరకు వచ్చే సరికి నీలం (బ్లూ) రంగులోకి మారింది. ఇలా అది దూరం వెళ్లే సరికి మళ్ళీ రంగు మారినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్‌లీ.. ధర తెలిస్తే షాకవుతారు!
సైకెడెలిక్ ర్యాప్..
నిజానికి వర్షం కురిసిన సమయంలో ఈ కారు కనిపించడంతో ఇలా కనిపించింది. అదే బాగా ఎండగా ఉన్న సమయంలో అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కలర్ మార్చే ర్యాప్.. కావున దానిపై పడే కాంతి పరిమాణం, మీరు కారును చూస్తున్న కోణాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ రకమైన ర్యాప్‌ను సైకెడెలిక్ ర్యాప్ అని కూడా పిలుస్తారు,
ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ కారు అని తెలుస్తోంది. కావున ఈ లగ్జరీ కారు 6.8 లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో గరిష్టంగా 580 బీహెచ్‌పీ పవర్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్‌లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జిటిబి, ఫెరారీ పోర్టోఫినో వంటి మరెన్నో కార్లు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ!
Comments
Please login to add a commentAdd a comment