colour change
-
అద్భుతమైన ప్రకృతిని.. చిన్న ప్రదేశంలో చూపించే 'ఇకబెనా ఆర్ట్'.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్ హోటల్లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్ గౌరవనీయమైన కాన్సుల్ జనరల్ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ రేఖారెడ్డి, ప్రెసిడెంట్ నిర్మలా అగర్వాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి.. హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్ డెకరేషన్ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్.అరుదైన కళ.. పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి. – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్.ఏకాగ్రతతోనే సాధ్యం.. ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తికి కలర్ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్ -
ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
ముఖేష్ అంబానీ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ.. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. అయితే వీరి వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు లెక్కకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ కారు రంగులు మార్చే 'రోల్స్ రాయిస్'. రోల్స్ రాయిస్ కల్లినన్.. రంగులు మార్చే ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కనిపించింది. వీరి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైనదికి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీలైక్ఓమ్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లైతే పోర్స్చే 911 జీటీ3, టయోటా సుప్రా వంటి కార్లతో పాటు రోల్స్ రాయిస్ కారుని గమనించవచ్చు. ఇది దూరం నుంచి వైలెట్ కలర్ షేడ్‌లో కనిపిస్తుంది.. దగ్గరకు వచ్చే సరికి నీలం (బ్లూ) రంగులోకి మారింది. ఇలా అది దూరం వెళ్లే సరికి మళ్ళీ రంగు మారినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! సైకెడెలిక్ ర్యాప్.. నిజానికి వర్షం కురిసిన సమయంలో ఈ కారు కనిపించడంతో ఇలా కనిపించింది. అదే బాగా ఎండగా ఉన్న సమయంలో అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కలర్ మార్చే ర్యాప్.. కావున దానిపై పడే కాంతి పరిమాణం, మీరు కారును చూస్తున్న కోణాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ రకమైన ర్యాప్‌ను సైకెడెలిక్ ర్యాప్ అని కూడా పిలుస్తారు, ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ కారు అని తెలుస్తోంది. కావున ఈ లగ్జరీ కారు 6.8 లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో గరిష్టంగా 580 బీహెచ్పీ పవర్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జిటిబి, ఫెరారీ పోర్టోఫినో వంటి మరెన్నో కార్లు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ! -
రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై100 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ వెనుక భాగం రంగులు మారడం ఇందులో ప్రత్యేకత. ఇందుకోసం ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. 64 మెగాపిక్సల్ ఓఐఎస్ యాంటీ షేక్ కెమెరా ఏర్పాటు చేశారు. చూడ్డానికి ప్రీమియంగా, తక్కువ బరువుతో ఉంటుందని వివో తెలిపింది. పసిఫిక్ బ్లూ , ట్విలైట్ గోల్డ్ - మరియు మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం.181 గ్రాముల బరువుతో ఉంటుంది. వివో వై100 ఫీచర్లు 6.38 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 7.73 ఎంఎం స్లీక్ బాడీ Android 13, FunTouch OS 13 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ ఫ్లాష్ చార్జర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. లభ్యత, ఆఫర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్లతోపాటు, రిటైల్ అవుట్లెట్లలో లభిస్తుంది. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. When change is the only constant, why stick to one color? Stay tuned for the Color Changing Glass Finish of vivo Y100. Stay tuned! To know more, visit https://t.co/5bNAoMyRiK#vivoY100 #ItsMyStyle #ColorMyStyle#ComingSoon #5G pic.twitter.com/wmuhn2Wj5B — vivo India (@Vivo_India) February 8, 2023 -
భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్
కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనీయులు మరోసారి ఉలిక్కిపడ్డారు. షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్‌లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చైనీయులు ఆశ్చర్యంతో పాటుగా ఆందోళనకు గురయ్యారు. ఇలా ఆకాశం రంగు మారంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సెల్ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భయాందోళనకు సైతం గురయ్యారు. ఈ వీడియోపై కొందరు చైనీయులు స్పందిస్తూ.. ఇలా ఆకాశం ఎరుపు రంగులోకి మారడం అపశకుమని కామెంట్ చేశాడు. నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదు. ఆకాశం కూడా ఎర్రగా మారడం నన్ను ఆశ్చర్యపరుస్తుందని మరో నెటిజన్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఈ విచిత్ర ఘటనపై చైనాలోని టెలివిజన్, డిజిటల్ మీడియా మాత్రం ఈ వింత రంగు మానవ నిర్మితం కాదని, సహజ కాంతి వక్రీభవన ఫలితమని వివరించాయి. మరోవైపు వుహాన్‌లోని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన ఓ నిపుణుడు స్పందిస్తూ.. భూ అయస్కాంత కార్యకలాపాల ఫలితంగా ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు. 'Armageddon' Fear Spreads through Chinese City as sky turns Blood Red#China #Zhoushan #Zhejiang #Shanghai #Sky #RedSky #BloodSky #ViralVideo #Weather #Climate #Viral #ClimateChange #Armageddon pic.twitter.com/tnnGKAagMp — Doregama Viral (@DoregamaViral) May 9, 2022 -
బీఎండబ్ల్యూ సరికొత్త ఆవిష్కరణ..! క్షణాల్లో కారు కలర్ ఛేంజ్..!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును ఆవిష్కరించింది. బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రంగుల మార్చే కారును బీఎండబ్ల్యూ రూపొందించింది. క్షణాల్లో కలర్స్ ఛేంజ్.! బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో(BMW iX Flow) పేరుతో రూపొందించిన ఈ కారును అమెరికాలో లాస్ వేగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES- 2022)లో ఆవిష్కరించింది. ఈ కారులో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీ సహయంతో కారు కలర్‌ను క్షణాల్లో మారిపోతుందని కంపెనీ పేర్కొంది. ఈ-ఇంక్ కంపెనీ భాగస్వామ్యంతో కలర్ ఛేజింగ్ కారును బీఎండబ్య్లూ రూపొందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎండబ్ల్యూ ట్విటర్లో షేర్ చేసింది. బ్లాక్ టూ వైట్... బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో ఏర్పాటుచేసిన బటన్ సహాయంతో కారును క్షణాల్లో బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్‌కు; వైట్ కలర్ నుంచి బ్లాక్‌కు మారిపోనుంది. ఇక్కడ కారు కలర్ ఛేంజ్ అవ్వడం కోసం ఎలాంటి శక్తి వినియోగం జరగదని కంపెనీ వెల్లడించింది. ఈ కలర్ ఛేంజిగ్ సదుపాయంతో కారులో ఎయిర్ కండిషనింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తోందని కంపెనీ పేర్కొంది. Ready for the next step in innovation ⚡️ Join us as we unveil our future innovations around the CES 2022. #BMWCES #BMW #FromSoultoSoul #BornElectric https://t.co/tsUKqXf92g — BMW (@BMW) January 5, 2022 చదవండి: BMW iX M60: కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు..! ఒకటా...రెండా కారు నిండా సూపర్ ఫీచర్సే..! -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..?
ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి...? ఆశ్యర్యపోతున్నారా...మీరు చూసింది నిజమే... ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. తొలి కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్‌ఫోన్‌ను వివో భారత్‌లో బుధవారం రోజున లాంచ్ చేసింది. ఏరోస్పేస్ గ్రేడ్‌తో స్మార్ట్‌ఫోన్...! చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారత్‌లోకి సరికొత్త వివో వీ23 సిరీస్ స్మార్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ రంగులు మారడంతో పాటుగా భారతదేశపు మొట్టమొదటి 50ఎంపీ 'ఐ ఏఎఫ్(ఆటోఫోకస్) డ్యూయల్ సెల్ఫీ' కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా వివో వీ23 సిరీస్ నిలుస్తోంది. వివో వీ23 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ డిజైన్‌తో రానుంది. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 63 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. ఇండియన్ ఫస్ట్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాగా ఇది నిలుస్తోంది. వీ23 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇది మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌లో అద్భుతంగా సెట్ చేశారు.దీంతో స్మార్ట్‌ఫోన్ సన్నగా కేవలం 7.39 mm మందంతో ఉండనుంది. దీని బరువు కేవలం 179 గ్రాములు మాత్రమే. ధర ఎంతంటే..? న్యూ వివో వీ23, వీ23 ప్రొ అనే రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వీ23 ప్రో 8GB ర్యామ్+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,990, వీ23 ప్రో 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,990 గా ఉంది. వివో వీ23 8GB ర్యామ్+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,990 కాగా, 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,990గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లను జనవరి 13 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో, జనవరి 19 నుంచి అన్ని వివో ఇండియా రిటైల్ స్టోర్స్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. వివో వీ23 ప్రో ఫీచర్స్ 6.56-అంగుళాల ఫుల్హెచ్డీ AMOLED డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సీటీ 1200 చిప్ సెట్ ఫన్‌టచ్ ఒఎస్ 12 బేస్డ్ఆన్ ఆండ్రాయిడ్ 12 50ఎంపీ ఆటోఫోకస్డ్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా 108 ఎంపీ రియర్ కెమెరా 12జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5జీ సపోర్ట్ 4300mAh బ్యాటరీ 44W ఫాస్ట్ చార్జింగ్ చదవండి: బ్లాక్‌బెర్రీ.. ఒకప్పుడు ‘స్మార్ట్’ కింగ్.. మరి పతనానికి కారణాలు తెలుసా? ఇవే.. -
క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి: మరో షాకింగ్ వీడియో వైరల్
లక్నో: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో ఫుటేజ్ పరిశీలించగా ఆ యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని తేలింది. దీంతో ఆ యువతిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ యువతికి సంబంధించిన మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్) లక్నోలో ప్రియదర్శిని నారాయణ యాదవ్‌కు సంబంధించిన వీడియో ఆమె ప్రవర్తనా తీరును స్పష్టంగా చెబుతోంది. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఒకరు తమ ఇంటి గేటుకు నలుపు రంగు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుపు రంగు ఎందుకు వేశారంటూ ఆ ఇంటివారితో గొడవకు దిగింది. వెంటనే రంగు మార్చాలని గట్టిగా అరుస్తూ ఉంది. మీ వలన కాలనీ అంతా ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. డ్రోన్స్ ద్వారా దాడి జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తుండడంతో కాలనీలో కొంత గందరగోళం ఏర్పడింది. రాత్రిపూట వచ్చి ప్రియదర్శిని గొడవ చేయడంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. పోలీసులతోనూ ఆమె గేటుకు ఉన్న నలుపు రంగు గురించే మాట్లాడింది. ఆమెకు నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రెండేళ్ల కిందటి వీడియో అయినా ఇప్పుడు వైరలవుతోంది. క్యాబ్ డ్రైవర్‌పై దాడి నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ప్రియదర్శిని మానసిక పరిస్థితి బాగా లేదేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. గేటుకు నల్లరంగు ఉంటే ఏమిటి? నీ ఒంటిపై కూడా నలుపు రంగు దుస్తులు ఉన్నాయి కదా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. This is the 2 Year Old Video Of #PriyadarshiniYadav Arguing with Neighbours over the Black Colour of their Main Gate. Credits: ig@be_harami#ArrestLucknowGirl #PriyadarshiniNarayan pic.twitter.com/KMB5eR6IW0 — Fackt Checker (@FacktChecker) August 5, 2021 -
రాత్రికి రాత్రే గులాబీ రంగుకి..
ముంబై: దాదాపు 50 వేల సంవత్సరాల క్రితం మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల లోనార్ సరస్సు ఏర్పడింది. అయితే ఈ సరస్సులోని నీరు ఉన్నట్లుండి గులాబీ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన స్థానికులనే కాక శాస్త్రవేత్తలను, నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. ముంబయికి 500 కిలో మీటర్ల దూరంలో బుల్హంద జిల్లాలో ఉన్న లోనార్ సరస్సును చూసేందుకు పర్యాటకులతోపాటు శాస్త్రవేత్తలు కూడా ఎక్కువగా వస్తుంటారు. నిపుణులు చెబ్తున్న ప్రకారం రంగు మారడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి బాగా ఎక్కువగా మారింది అంటున్నారు. ఈ క్రమంలో లోనార్ సరస్సు సంరక్షణా కమిటీ సభ్యులు గజానన్ మాట్లాడుతూ ‘జాతీయ స్మారక చిహ్నంగా ఉన్న ఈ సరస్సులో 10.5 పిహెచ్తో ఉప్పునీరు ఉంది. నీటి లోపల ఆల్గేలు ఉన్నాయి. ఈ మార్పుకు లవణీయత, ఆల్గేలే కారణమవుతాయి’ అన్నారు. అంతేకాక గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే లోనార్ సరస్సులో నీటి మట్టం ప్రస్తుతం తక్కువగా ఉందని, అందులో మంచినీరు చేరడానికి వర్షం లేదని గజనన్ అన్నారు. తక్కువ స్థాయి నీరు, వాతావరణ మార్పుల వల్ల లవణీయత, ఆల్గే వల్ల నీరు రంగు మారిందని తెలిపారు. ఇరాన్‌లోని ఒక సరస్సు కూడా ఉప్పునీటి కారణంగా నీరంతా ఎర్రగా మారిపోయాయని తెలిపాడు. సరస్సు నీరు రంగు మారడంతో స్థానికులు గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు. -
ఈ టీషర్టుతో.. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
ఆఫీసులో ఉన్నప్పుడు మంచి బుద్ధిమంతుడైన బాలుడిలా ఉండాలి. అదే బయటకు వెళ్తే ‘యో.. యో’ అనుకుంటూ చురుకైన బడ్డీలా కనిపించాలి. కానీ అందుకోసం రెండు మూడు రకాల దుస్తులు తీసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. సరిగ్గా ఇలా ఆలోంచిచేవాళ్ల కోసమే గిర్గిట్ అనే కంపెనీ ఓ కొత్త రకం టీషర్టును విడుదల చేస్తోంది. ఇవి వేసుకెళ్తే.. సూర్యరశ్మి తగిలినప్పుడు ఒక రంగులో ఒక డిజైన్‌లో ఉండి.. అది తగలకుండా కేవలం ట్యూబులైట్ల కాంతిలో ఉంటే మరో రంగు, డిజైన్లోకి మారిపోవడం వీటి స్పెషాలిటీ. అంటే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు రాముడిలా, బయటకు వెళ్లినపుడు కొంటె కృష్ణుడిలా కనిపించాలని అనుకునేవాళ్లు ఈ రకం టీషర్టులు వేసుకుని వెళ్లొచ్చన్నమాట. కేవలం పురుషుల కోసం మాత్రమే తయారుచేసిన ఈ టీషర్టులను ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో రూపొందించారు. అన్ని ప్రధాన ఈ కామర్స్ పోర్టల్స్‌లోను ఇవి అందుబాటులో ఉన్నాయట. కొంతమంది యువ ఫ్యాషన్ డిజైనర్లు కలిసి వీటిని రూపొందించారు. ఇవి రూ. 855 నుంచి రూ. 1155 మధ్య ధరల్లో లభ్యమవుతున్నాయి. ఒక టీషర్టు ధరనే చెల్లించి, రెండింటిని కొనుక్కున్న ఆనందం కస్టమర్లకు మిగులుతుందని గిర్గిట్ వ్యవస్థాపకుడు హిమాన్షు ఠాకూర్ చెప్పాడు.